Emotional Acton Entertainer “Rathnam” Movie Review

Cinemarangam.Com
బ్యానర్స్  : జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, శ్రీ సిరి సాయి సినిమాస్
సినిమా : “రత్నం”
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 26.04.2024
నిర్మాతలు : కార్తికేయన్ సంతానం, సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్
దర్శకత్వం –  హరి
నటీనటులు: విశాల్, ప్రియ భవానీ శంకర్, సముద్రఖని, మురళీశర్మ,హరీష్ పేరడీ, యోగిబాబు తదితరులు
సినిమాటోగ్రఫీ : ఎం సుకుమార్ 
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
ఎడిటర్ : టీ ఎస్ జై
పీ ఆర్ ఓ : సాయిశతీష్, రాంబాబు

యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో  భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో హ్యాట్రిక్ కొట్టేందుకు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కార్తికేయన్ సంతానం నిర్మాతగా వ్యవహరించారు. తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న  ఈ  రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ విశాల్ కాంబోలో రత్నం మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ దృష్టి రత్నం మీద పడంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  ఏప్రిల్‌ 26న  గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..


కథ
ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు బోర్డర్స్‌ గొడవల ఆధారంగా నడిచే కథ..చిత్తూరులోని ఒక కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న రత్నం (విశాల్) చిన్నప్పుడే తల్లి, తండ్రి ని కోల్పోతాడు.అదే మార్కెట్‌లో ఉండే పన్నీర్ (సముద్రఖని) పై కొందరు వ్యక్తులు దాడి చేస్తే వారినుండి పన్నీర్ ను కాపాడతాడు రత్నం. దాంతో రత్నంను సొంత కొడుకులా చూసుకుంటుంటాడు.. ఆ తరువాత పన్నీర్ రాజకియంగా ఎదిగినా కూడా రత్నంపై అదే ప్రేమను చూపిస్తాడు. దాంతో తనను మావయ్యా అంటూ అభిమానిస్తూ.. ఆ ఊర్లో ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలబడతాడు. ఒకానొక నీట్ పరీక్ష రాయడానికి వచ్చిన రోడ్డుపై మల్లిక (ప్రియ భవానీ శంకర్)ను కొందరు రౌడీలు చంపబోతే వారినుండి కాపాడతాడు. అయితే ఆమెను చంపడానికి లింగం బ్రదర్స్ (మురళీ శర్మ, హరీష్ పేరడీ,) బ్యాచ్ ఎదురుచూస్తున్నారని తెలుసుకొని ఆమెను కాపాడడానికి వారి ఊరు వెళ్ళి మల్లికకు అండగా నిలబడతాడు.అసలు మల్లికను కాపాడడానికి రత్నం ఎందుకు అంత తాపత్రయం పడతాడు? మల్లికపై అంతటి ప్రేమను చూపించడానికి గల కారణం ఏమిటి? ఎంతో పలుకుబడి ఉన్న లింగం బ్రదర్స్ మల్లిక లాంటి  సాధారణ మైన అమ్మాయిని ఎందుకు చంపాలనుకుంటారు? వారందరినీ రత్నం ఎలా ఎదిరించాడు? వంటి మొదలగు ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే కచ్చితంగా “రత్నం” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
ఇప్పటి వరకు ఎన్నో యాక్షన్ సినిమాలు చేసిన విశాల్ ఇందులో యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ లలో చాలా చక్కగా నటించాడు. ఈ చిత్రంలో విశాల్‌కి జోడిగా ప్రియా భవాని శంకర్ నటించారు.హీరో కంటే హీరోయిన్ పాత్రలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. తన చుట్టూనే ఈ కథ నడుస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ తో పాటు ఎమోషనల్ సీన్స్ లలో కూడా ఆమె చాలా చక్కటి హావ భావాలు ప్రదర్శించింది. రత్నం కు మావయ్యగా సముద్రఖని నటన బాగుంది. విలన్స్ గా నటించిన మురళీశర్మ,హరీష్ పేరడీ తో పాటు ఇంకా ఈ సినిమాలో నటించిన వారందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
సింగం నుంచి మొదలు దర్శకులు హరి ఒక చిన్న పాయింట్ సెలెక్ట్ చేసుకొని దానికి చక్కటి స్క్రీన్ ప్లేతో యాక్షన్ సీన్స్ జోడించి కథను పరిగెత్తిస్తాడు.  ఏపీ, తమిళనాడు బార్డర్ గొడవల ఆధారంగా నడిచే ఈ కథన ప్రేక్షకులకు  కళ్ళకు కట్టినట్టు చూపించడంలో దర్శకుడుగా హరి సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు.  ఈ సినిమాకు  దేవీ శ్రీ ప్రసాద్  యాక్షన్, లవ్ సీన్లకు తగ్గట్టుగా మంచి సంగీతం, ఆర్ఆర్ ఇచ్చారు.  పాటల విషయానికి వస్తే, ఇందులో వచ్చే మెలోడియస్, ఎమోషనల్ సాంగ్ ‘చెబుతావా’ అనే పాటలు చూస్తున్నప్పుడు ప్రేక్షకులను తన్మయత్వానికి లోనవుతారు. ఈ పాటకు శ్రీమణి సాహిత్యం, సింధూరి విశాల్ గాత్రాన్ని అందించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఎం సుకుమార్  అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించారు.డైలాగ్ రైటర్ రాజేష్ వల్ల ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమాలా అనిపిస్తుంది..ఈ మూవీకి, టీ ఎస్ జై .ఎడిటింగ్ పనితీరు బాగుంది. జీ స్టూడియోస్‌, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్  బ్యానర్‌లపై  సంయుక్తంగా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. యాక్షన్‌తో పాటు చక్కని సందేశం ఉన్న ఈ సినిమాను నమ్మి థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకులకు మాత్రం  మీరు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తుంది . , కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని కచ్చితంగా చెప్పొచ్చు.

Cinemarangam. Com Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here