“కార్తికేయ 2”.వంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్ నటించిన తాజా చిత్రం “18 పేజెస్”. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమాను మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 23న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదల అవుతున్న సందర్బంగా చిత్ర హీరో నిఖిల్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ
కార్తికేయ వంటి అడ్వెంచర్ సినిమా తరువాత చేస్తున్న 18 పేజెస్ సినిమా చాలా ఇంటెన్సివ్ క్రేజీ లవ్ స్టోరీ చేయడం చాలా హ్యాపీ గా ఉంది..నాకు క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అంటే చాలా ఇష్టం.అయితే నేను మొదటి సారి ఎమోషనల్ ఫిలిం చేశాను. సుకుమార్ గారి రైటింగ్స్ కాబట్టి బాగా ఇన్వాల్వ్ అయ్యి నా క్యారెక్టర్ ను చాలా బాగా డిజైన్ చేశారు.అలాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది.ఈ సినిమాలో ఉన్న నా క్యారెక్టర్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగా ఉన్నందున పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు అని అనుకుంటున్నాను.
ఈ సినిమా చేసే టప్పుడు మొదట తెలుగు మాత్రమే చేద్దాం అనుకున్నాము కానీ పాన్ ఇండియా సినిమా చేద్దాం అనుకోలేదు.ఇప్పుడు ఈ రషెష్ చూసిన తరువాత హిందీ కి వెళ్లాలా లేదా అనేది ప్రొడ్యూసర్స్ డిసైడ్ చేస్తారు.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
మొన్న జరిగిన 18 పేజెస్ ప్రమోషన్ టూర్ లో భాగంగా 18 సిటీస్ కు వెళ్ళాలి అనుకున్నాము. అయితే 14 సిటీస్ మాత్రమే కవర్ చేశాము. ఇంకా 4 సిటీస్ కు వెళ్లాల్సి ఉంది. అయితే మేము వెళ్లిన ప్రతిచోట మేము అనుకున్న దానికంటే ఎక్కువగా కొన్ని వేల మంది రావడం జరిగింది.ఈ టూర్ కార్తికేయ థాంక్స్ మీట్ లాగా పనికొచ్చింది. అలాగే 18 పేజెస్ ప్రమోషన్స్ కు కూడా బాగా కలిసొచ్చింది. కాబట్టి ప్రేక్షకులందరూ కార్తికేయ 2 సినిమాను ఎలా లవ్ చేసి సొంతం చేసుకొని ఆదరించారో ఈ సినిమాను అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
18 పేజెస్ సినిమా ఇది ప్యూర్ లవ్ స్టోరీ.స్టూడెంట్స్ కి యూత్ కు బాగా కనెక్ట్ అవుతుంది. బ్రేకప్ అయిన సరే మళ్లీ కలుసుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఎందుకు బ్రేకప్ ఎందుకు అయ్యాము ఎలా అయ్యాము వారు రీ కనెక్ట్ ఎలా అయ్యారు అనే విధంగా చాలా ఏమోషనల్ గా వుంటుంది. ఇది సోషల్ మెసేజ్ కాదు కానీ ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.ఒక్క యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అవుతారు
సుకుమార్ గారు మార్క్ లవ్ స్టోరీ కాబట్టి ఆయన మార్క్ కు తగ్గట్టే రాసిన లవ్ స్టోరీ ఉంటుంది. సుకుమార్ గారి రైటింగ్ లో ఒక క్రెజీ లవ్ స్టోరీ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.ఇందులో నేను సిద్దు పాత్రలో నటిస్తున్నాను. దర్శకులు సూర్యప్రతాప్ పల్నాటి చాలా బాగా తీశాడుగోపి గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. మంచి కథతో వస్తున్న ఈ సినిమాకు అందరూ ఓపెన్ మైండ్ తో రండి. సినిమా చూసిన తరువాత అందరూ కచ్చితంగా ఫ్రెష్ ఫీల్ తో బయటకు వస్తారు
అనుపమ తో కార్తికేయ సినిమా చేసే టైమ్ లో ఆ సినిమాకు చాలా రోడ్ జర్నీ చేశాము. అప్పుడే తనతో మంచి బాండింగ్ ఏర్పడింది. మళ్ళీ తనతో రెండో సినిమా కూడా చేయడం చాలా హ్యాపీ గా ఉంది..ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా ఉంటుంది. తను నందిని క్యారెక్టర్ కోసం చాలా కష్టపడింది.
నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా కార్తికేయ 2 తర్వాత నాకు ఐడియా వచ్చింది. దాని ప్రకారంగా ఇక ముందు సెలెక్షన్ చేసే ప్రతి కథ లో నేషనల్ వైడ్ కు టచ్ ఉండేలా చూసుకుంటూ అన్ని భాషల ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకుంటాం. నెక్స్ట్ చేసే సినిమాలు కూడా అలాగే చేస్తాను. ఈ సినిమా తరువాత వచ్చే స్పై తరువాత వచ్చేరెండు సినిమాలు కూడా అన్ని భాషల ఉపయోగపడే విధంగా ఉంటాయని అన్నారు.









