Fiction and Action Entertainer ‘Darja’ Movie Review

Cinemarangam.Com
Review Rating..3.5/5
సినిమా : “దర్జా”
సమర్పణ : కామినేని శ్రీనివాస్
బ్యానర్ : పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాత: శివశంకర్ పైడిపాటి,
Co & ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,
స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.
నటీనటులు : సునీల్, అనసూయ, ఆమని, అక్సాఖాన్, షమ్ము, అరుణ్ వర్మ ,శిరీష, షకలక శంకర్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్ , రామ్ సర్కార్ తదితరులు
కెమెరా: దర్శన్,
సంగీతం: రాప్ రాక్ షకీల్,
ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,
కథ: నజీర్,
మాటలు: పి. రాజేంద్రకుమార్, నజీర్, భవానీ ప్రసాద్,
ప్రొడక్షన్ డిజైనేర్ : బందర్ బాబీ,
స్ర్కిఫ్ట్ కో ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,
పీఆర్ఓ: బి. వీరబాబు,

కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూలై 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండీ

కథ

ఇది ఒక పూర్తి స్థాయి లేడీ ఓరియంటెడ్ చిత్రం. బందరు పట్టణంలో అనేక ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసిన యువతి రాణి కనకం (అనసూయ భారద్వాజ్) పెద్ద అయిన తర్వాత సారా, అక్రమ వ్యాపారం చేస్తూ అక్కడున్న పోర్ట్ ను తన గుప్పిట్లో పెట్టుకొని ఆ పోర్ట్ కొరకు ఎవరు టెండర్ వేసినా వారిని చంపుతూ ఇక్కడున్న సామ్రాజ్యనికి రాణి కనకం తప్ప వేరే వారు ఉండకూడదనే ఆర్డర్ వేసి ఎదురొచ్చిన వారిని చంపించి వేయడం.ఇదేమి దౌర్జన్యం అని ఎదురు తిరిగిన సామాన్యులను, ప్రశ్నించే పోలీస్ ఆఫిసర్స్ ను చంపి దాన్ని ఆత్మహత్య గా చిత్రీకరిస్తూ… ప్రజలకు పెద్ద ప్రాబ్లమ్‌గా మారుతుంది. ఆమెకు తోడుగా తమ్ముడు బళ్లారి (సమీర్) కూడా అమ్మాయిలపై మానభంగాలకు పాల్పడుతుంటాడు. అయితే జ్యోతిష్యుడు చెప్పిన సెంటిమెంట్ తో పుష్ప అను అమ్మాయిని తమ్ముడు బళ్లారితో బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటుంది. అయితే పుష్ప అప్పటికే గణేష్ అనే అబ్బాయికి మనసిచ్చాను అతన్నే పెళ్లి చేసుకుంటాను అని బళ్లారితో పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో పుష్ప ను కిడ్నాప్ చేస్తారు..మరో వైపు ఆమని తన ఇద్దరు కొడుకులు గణేష్ (అరుణ్ వర్మ ) మూగబ్బాయి, రంగ ( షమ్ము ) లతో హ్యాపీగా జీవిస్తుంటుంది. అయితే ఆమని పెద్దకొడుకు కు మాటలు రానందున మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి అనుకున్న టైమ్ లో అనూహ్యంగా గణేష్ హత్యకు గురవుతాడు. ఇలాంటి పరిస్తుతుల్లో స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరుగాంచిన శంకర్ (సునీల్) రాణి కనకం ఆగడాలకు చెక్ పెట్టేందుకు స్పెషల్ గా బందర్ కు పోస్టింగ్ వేయించుకొని వచ్చి హత్యకు గురైన గణేష్ కేస్ ను టేకప్ చేస్తాడు. అన్నను చంపిన వారిని నరికేయ్యాలని ఆవేశంతో తిరుగుతున్న రంగాను జైల్లో పెడతాడు శంకర్.అలాగే గతంలో కనకం అగడాలని ఎదిరించిన పోలీస్ ఆఫీసర్ రవి (రవి పైడి పాటి) కేస్ ను కూడా స్పెషల్ కేర్ తీసుకుని రంగంలోకి దిగుతాడు శంకర్? అసలు గణేష్ ను ఎవరు, ఎందుకు చంపారు? చంపిన వారిపై రంగా పగ తీర్చుకున్నాడా? పోలీస్ ఆఫీసర్ శంకర్ బందర్ కు స్పెషల్ గా పోస్టింగ్ వేయించుకొని రావడానికి కారణమేమి? చివరికి దర్జాగా బతికే రాణి కనకంకు, తమ్ముడు బళ్లారిలు చేసే ఆగడాలకు శంకర్ చెక్ పెట్టాడా.. లేదా.. రంగా చెక్ పెట్టాడా అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడవలసిందే…

నటీ నటుల పనితీరు
రాణి కనకం పాత్రలో అనసూయ ఫుల్ లెన్త్ రోల్ లో అద్భుతంగా నటించింది అని చెప్పవచ్చు. రంగస్థలం లో రంగమ్మత్త గా పుష్పలో దాక్షాయనిగా నటించి ప్రేక్షకులను మెప్పించిన అనసూయ రాణి కనకం పాత్రలో ఒదిగిపోయింది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో శంకర్ గా నటించిన సునీల్ చాలా చక్కటి నటనను ప్రదర్శించాడు యాక్షన్ సీన్స్ లలో కూడా చెలరేగిపోయాడు. పుష్ప తరువాత తనకు మంచి పవర్ ఫుల్ పాత్ర లభించింది.సునీల్‌, అనసూయ ఇద్దరూ కూడా పోటీ పడి అద్భుతంగా నటించారు.పోలీస్ పాత్రలో నటించిన రవి చక్కటి నటనను ప్రదర్శించాడు. బళ్లారి పాత్రలో నటించిన సమీర్ విలన్ గా నటించి మెప్పించాడు. మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ తమ్ముడు షమ్ము రంగా పాత్రలో చాలా బాగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు .సీనియర్ నటి ఆమని తల్లి పాత్రలో ఒదిగిపోయింది. సినీ ఇండస్ట్రీ లో జర్నలిస్ట్ గా పి. ఆర్. ఓ గా రాణిస్తున్న వీరబాబు ఈ సినిమాలో జక్కా పాత్రలో అనసూసూయ సహాయకుడిగా చాలా చక్కగా నటించాడు. శఖలక శంకర్, పుష్ప, శిరీష, కానిస్టేబుల్ గా షేకింగ్ శేషు, ఇన్స్పెక్టర్ గా షఫీ, బిల్డప్ బాబాయ్ గా పృద్వి, గీతగా అక్షా ఖాన్, మూగబ్బాయి గా అరుణ్, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, నాగ మహేష్, జబర్దస్త్ నాగిరెడ్డి, రామ్ సర్కార్ ఇలా ప్రతి ఒక్కరూ వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు అని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
నజీర్‌గారు చాలా కొత్త కాన్సెప్ట్ తో స్ర్కీన్‌ప్లే బేస్డ్ స్టోరీ గా మలచిన “దర్జా” స్టోరీ ని దర్శకుడు సలీమ్ మాలిక్ “దర్జా” అంటే రాయల్టీ అన్నట్టు అంతే దర్జాగా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. సెంటిమెంట్, యాక్షన్ అంశాలు ఇందులో పుష్కళంగా ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరూ చూయించని విధంగా రాణి కనకం గా అనసూయను, శంకర్ గా పోలీస్ ఆఫీసర్ పాత్రలో సునీల్ ను చాలా కొత్తగా చూయించాడు. వీరిద్దరు తప్ప మిగిలిన వారు దాదాపు అంతా కొత్త వారైనా వారందరితోనూ చక్కటి నటనను రాబట్టుకొని సక్సెస్ అయ్యాడు దర్శకుడు సలీం మాలిక్ .మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన భార్య నేహా ఇందులో ఓ పాటని చాలా చక్కగా పాడారు. భీమవరం చిన్నదాన్ని రామలింగో అనే ఐటమ్ సాంగ్ ఆడియన్స్ లో మంచి ఊపు తెప్పిస్తుంది. సినిమాటోగ్రాఫర్ దర్శన్‌ కెమెరా పనితనం అద్భుతంగా ఉంది..ఎమ్.ఆర్. వర్మ ఎడిటింగ్ పనితీరు బాగుంది. .ఫైట్ మాస్టర్ అంజి సమాకూరుర్చిన ఫైట్స్ చాలా డిఫరెంట్‌ గా ఉన్నాయి.కామినేని శ్రీనివాస్ సమర్పణలో పిఎస్ఎస్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి లు పెట్టిన ప్రతి పైసా తెరమీద కనిపిస్తుంది సినిమా బాగా రావాలని ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాని చాలా రిచ్ గా నిర్మించారు. మాస్ ఎలిమెంట్స్ తో పాటు సెంటిమెంట్, యాక్షన్ తో ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే..ఈ సినిమాను నమ్మి థియేట‌ర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహ పరచకుండా అందరినీ “దర్జా” కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేస్తుంది.

Cinemarangam.Com Rating 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here