Cinemarangam.com
సినిమా : ‘నయీం డైరీస్’
రివ్యూ రేటింగ్ : 3.5/5
బ్యానర్–శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్
నిర్మాత – సీఏ వరదరాజు
రచన, దర్శకత్వం: దాము బాలాజీ.
నటీనటులు : వశిష్ట సింహ,సంయుక్త, యజ్ఞ శెట్టి, దివి, బాహుబలి నిఖిల్, శశి కుమార్,దేవి ప్రసాద్ జబర్దస్త్ ఫణి తదితరులు
సినిమాటోగ్రఫీ – సురేష్ భార్గవ్,
ఎడిటింగ్ – కిషోర్ మద్దాలి
సంగీతం – అరుణ్ ప్రభాకర్,
పి.ఆర్.ఓ : జి యస్ కె మీడియా
గ్యాంగ్ స్టర్ నయీం జీవిత కథతో తెరకెక్కుతున్న సినిమా ‘నయీం డైరీస్’.ఈ చిత్రంలో వశిష్ఠ సింహ నయీం క్యారెక్టర్ లో నటించారు. సీఏ వరదరాజు నిర్మాణంలో తన తొలి ప్రయత్నంగా నయీం డైరీస్ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు దాము బాలాజీ. ఈ నెల 10న ‘నయీం డైరీస్’ ఎంతో గ్రాండ్ గా థియేటర్స్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి
కథ
నవాజుద్దీన్ కొడుకైన నయీముద్దీన్( వశిష్ట సింహా) చిన్నతనంలో నక్సలైట్ ఉద్యమానికి ఆకర్షితుడై చేరిన కొద్దికాలంలోనే నక్సలైట్ ఉద్యమంలో కీలక వ్యక్తిగా మారిపోతాడు. స్పెషల్ గ్రేహౌండ్ డి.ఐ.జి శర్మ హత్య కేసులో జైలుకెళ్తాడు.అక్కడ జైల్లో ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్న మావోయిస్టు అన్నలు నయీం కు గ్రాండ్ వెల్కమ్ చెప్తారు.ఆ తరువాత తన ప్రాణం కంటే మిన్నగా ప్రేమించే సోదరి జరీనాను అత్యాచారం చేయబోయిన ఈదన్న ను తన తమ్ముడి వలి చేత చంపిస్తాడు.పార్టీ గీత దాటినందుకు జైల్లో ఉన్న కమ్యూన్ కమిటీ లీడర్ రవి నక్సల్ కమ్యూనిటీ బ్యారక్ నుండి నయీమ్ ను వేరే బ్యారక్ పంపిస్తారు.పోలీస్ కోవర్ట్ గా మారి అన్నలకు పట్టిస్తే జైలు నుండి విడిపిస్తాము. మాకు హెల్ప్ చేయకపోతే మీ అక్క జరీనాను జైలుకు పంపిస్తామని స్పెషల్ ఇంటేలిజెన్స్ చటర్జీ,,యస్.ఐ శశి కుమార్ లు నయీం పై ఫోర్స్ చేస్తారు .దీంతో తను ఎంతో ఇష్టపడే ప్రియురాలు బెల్లి లత (సంయుక్త) ను ఒక నక్సలైట్ అన్నను పట్టిస్తే నేను జైలునుండి విడుదలైతే మనం హ్యాపీ గా ఉందామని లత సహకారం కోరతాడు. లత ఒప్పుకోక పోవడంతో నయీమ్ అక్క,అమ్మ ల చేత లతను చంపేపిస్తాడు.ఆ తరువాత నయీం సోదరుడు వలిని వీరన్న దలంచేత హత్య గావింపబడతాడు. సోదరుడు వలీ మరణం తరువాత నయీం ఆలోచనా విధానంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకొన్నాయి. ఆ తరువాత నయీం తీవ్రమైన నిర్ణయాలు ఎందుకు తీసుకొన్నాడు? జైలులో నయీం ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? పోలీసుల చేతిలో నయీం అసాంఘీక శక్తిగా ఎందుకు మారిపోయాడు అనే ప్రశ్నలకు సమాధానం దోరకాలంటే నయీం డైరీస్ సినిమా చూడవలసిందే.
నటీనటుల పనితీరు
నయీం పాత్రలో ( వశిష్ట సింహా) అద్భుతంగా చేశాడు. మావోయిస్టు అగ్రనేతలుగా నటించిన సోమన్న, మోహన్‌రెడ్డి, సాగరన్న, గణేష్, సాంబా శివుడి పాత్రలలో ఒడిగిపోయారు. నయీమ్ లో ఉన్న ఆవేశం, కోపం, రొమాన్స్, రియలైజేషన్ ఇలా అన్ని ఎమోషన్స్ చాలా బాగా పలికించారు. ఆయన సోదరి జరీనా పాత్రలో (యజ్ఞశెట్టి) తన పాత్ర మేరకు బాగా చేసింది. ఆయన లవర్‌గా, మావోయిస్టు కోవర్ట్ గా లత పాత్రలో సంయుక్త , నయీం టీనేజ్ పాత్రలో నిఖిల్, గణేషన్న పాత్రలో దేవి ప్రసాద్, తన భార్య పాత్రలో బిగ్‌బాస్ దివి తదితరులు తమ పాత్రల మేరకు మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఈ సినిమాలో రాజకీయ, పోలీస్ వ్యవస్థలు నయీం అనే అసాంఘిక శక్తిని తమ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించుకున్నారు అన్నది దర్శకుడు దాము బాలాజీ ధైర్యంగా చెప్పాడు.అలాగే నయీంకు కుటుంబం గురించి. తన జీవితంలో ఉన్న ఎమోషన్స్, సెంటిమెంట్స్ , ప్రేమ, పెళ్లి లాంటి సందర్భాలను మరియు ఒక విప్లవకారుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు. అడవిలో వారు ఎలాంటి ప్లాన్స్ చేస్తారు, వారిలైఫ్ ఎలా ఉంటుంది. నయీం మాజీ నక్సలైట్ నుంచి రౌడీషీటర్‌గా, గ్యాంగ్‌స్టర్ గా ఎదగడానికి దోహదపడిన అంశాలనే కాక పోలీసులు నయీంని తమకి కోవర్ట్ గా మలుచుకుని అడవుల్లో మావోలను మట్టు పెట్టడం, ఆ తర్వాత నయీంకి స్వేచ్చ ఇచ్చి వ్యాపారాలు చేయించడం, దందాలు, కబ్జాలు, దోచుకోవడాలు, సెటిల్మెంట్లు లాంటి అనేక అంశాలను అన్నింటిని టచ్ చేస్తూ సినిమాను చాలా చక్కగా డ్రమటిక్‌గా చూపించాడు. ఇందులో ఎక్కువ డైలాగులు వున్నా ఎక్కడా బోరింగ్‌గా అనిపించవు. సురేష్ భార్గవ్ సినిమాటోగ్రఫీ ప్రతి సీన్ ను ఎలివేట్ చేసింది.విజువల్స్ బాగున్నాయి. అరుణ్ ప్రభాకర్ సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది.కిషోర్ మద్దాలి ఎడిటింగ్ పర్వాలేదని పిస్తుంది.శ్రీ లక్ష్మీ నరసింహా ఎంటర్‌ప్రైజెస్ లో సీఏ వరదరాజు గారు ఈ సినిమాను ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో తీసిన నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి.ఈ సినిమా చూసిన ప్రేక్షకులందరికీ “నయీం డైరీస్” తప్పకుండా నచ్చుతుంది.
Cinemarangam.com Rating 3.5/5









