Cinemarangam.Com
సమర్పణ – రవి అండ్ నరసింహా,
బ్యానర్ – వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్,
సినిమా : ‘గ్యాంగ్ స్టర్.
’రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 25.10.2024
ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత దర్శకత్వం– చంద్రశేఖర్ రాథోడ్
నటీనటులు – చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంఛన్, అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులు
కెమెరామెన్ : జి. యల్ .బాబు
కో డైరెక్టర్.. విజయ్ సారధి
పీఆర్ఓ – శ్రీపాల్ చొల్లేటి
చంద్రశేఖర్ రాథోడ్, కాశ్వీ కాంచన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “గ్యాంగ్ స్టర్”. ఈ చిత్రంలో అభినవ్ జనక్, అడ్ల సతీష్ కుమార్, సూర్య నారాయణ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ లో రవి, నరసింహా సమర్పణలో చంద్రశేఖర్ రాథోడ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ గ్యాంగ్ స్టర్ ‘.ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. టీజర్, పోస్టర్‌లు, గ్లింప్స్, సాంగ్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అక్టోబర్ 25 న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “గ్యాంగ్ స్టర్’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ
గోవా బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న కథే ‘ గ్యాంగ్ స్టర్’.ఫ్రెండ్స్ గా ఉన్న డేవిడ్(సూర్యనారాయణ), జేమ్స్ (అడ్ల సతీష్ ) లు సిటీ లో పెద్ద గ్యాంగ్ స్టర్స్. సిటీని తమ కంట్రోల్ లోకి తెచ్చుకొని సిటీకి కింగ్ మేకర్ అవ్వాలని ఒకరికొకరు పోటీ పడుతుంటారు.ఈ క్రమంలో వీరిద్దరూ బద్ద శత్రువులుగా మారతారు. కానీ వీళ్ళందరికీ ఎక్కడలేని రూల్స్ ఉంటాయి వీళ్ళు సమాజంలో ఉండే రూల్స్ ఫాలో కాకుండా వాళ్ళ మధ్యలో డిఫరెంట్ రూల్స్ పెట్టుకుంటారు.ఆ రూల్స్ ను చచ్చేంత వరకు అదే రూల్స్ పాటిస్తారు. ఆ రూల్స్ ని ఎవరు బ్రేక్ చేస్తే..అది కొడుకైనా, కూతురైనా, భార్య అయినా ఇంకెవరైనా వాళ్ళని చంపేస్తారు.
మరోవైపు హీరో మైఖేల్ (చంద్రశేఖర్ రాథోడ్) తల్లి తండ్రులు చిన్నప్పుడే చనిపోతారు. అయితే జేమ్స్ ఒక పెద్ద గ్యాంగ్ స్టర్ అయినా తనలో ఉన్న మానవీయ కోణంతో మైకేల్ ను దగ్గర తీసుకొని రూల్స్ గురించి వివరించి పెంచి పెద్ద చేస్తాడు. బ్రతకడానికి ఏం చేసినా చంపడమే దారి అనుకోని జేమ్స్ దగ్గర సీక్రెట్ వెపన్ (కిల్లర్ )గా మారతాడు. అయితే మైక్ కు ప్రేమ,బాధ, కోపం,వంటి ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. తనకు తెలిందల్లా ఒక్కటే ఇచ్చిన ప్రామిస్ కు ఎంత దూరమైనా వెళ్లాడం అలాగే తనకొచ్చిన డీల్ ను ఫినిష్ చేయడం ఇవే తెలుసు.
చాలా రోజుల తరువాత ఒక బార్ కి వెళ్లిన చోట జెస్సిక (కాస్వీ కాంచన్) పరిచయం అవుతుంది. అప్పటినుండి మైక్ ను జెస్సీ ఇష్టపడుతుంది. అయితే జెస్సీ ఒకరోజు తన ఫాదర్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కు రావాలని మైక్ ను ఇన్వైట్ చేస్తుంది.ఈ సెలెబ్రేషన్స్ లో మైక్ పై ఇష్టమున్నా తన ప్రేమను వ్యక్తం చేయదు..

జేమ్స్ నుండి మరో డీల్ వస్తుంది. అది డ్రగ్ డీలర్ విలియం (డి. యస్. రావు) ని, తన కూతురుని చంపాలని డీల్ వస్తుంది. విలియంను చంపిన తరువాత జెస్సీ విలియం కూతురని తెలుసుకుంటాడు.దాంతో మైక్ కు కూడా జెస్సీ పై ఇష్టాన్ని పెంచుకుంటాడు.
ఇదిలా ఉండగా జేమ్స్ ఉంటే సిటీ కి కింగ్ అవ్వలేమని భావించిన జార్జ్ తన గ్యాంగ్ తో జేమ్స్ పై అటాక్ చేయడం జరుగుతుంది ఆ అటాక్ నుండి తప్పించుకున్న జేమ్స్. రూల్స్ ని బ్రేక్ చేసిన డేవిడ్ కొడుకు జార్జ్ ను మైక్ హెల్ప్ ద్వారా చంపేస్తాడు. దీంతో తన కొడుకు చావుకు కారణమైన జేమ్స్ గ్యాంగ్ బతకకూడదని సిటీ లో ఉన్న గ్యాంగ్ స్టర్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి జేమ్స్ గ్యాంగ్ ను ఎవరైతే ఫినిష్ చేస్తారో వారికి నా బిజినెస్ లో వాటా ఇస్తాను అని చెప్తాడు.
మరోవైపు మైక్ విలియం డీల్, జార్జ్ డీల్ ఫినిష్ చేసుకొని వచ్చేలోపే జెస్సీ.. జేమ్స్ భార్యగా మారి ఉంటుంది. ఎటువంటి ప్రేమ, ఎమోషన్స్ లేని మైక్ జెస్సీని ను ఎందుకు ఇష్టపడ్డాడు..తను ఇష్టపడిన జెస్సీ.. జేమ్స్ భార్యగా ఎలా మారింది. జెస్సీ ని చంపాలని డీల్ కుదుర్చుకున్న మైక్ మొదటి సారి రూల్స్ ను బ్రేక్ చేసనందున ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటాడు?. వార్ ప్రకటించిన డేవిడ్ గ్యాంగ్ తో ఫైట్ చేసే క్రమంలో మైక్ చనిపోయాడా..లేక ఈ వార్ ఫినిష్ చేసి పెంచి పెద్ద చేసిన జేమ్స్ నే ఎదిరించి జెస్సి ని దక్కించుకున్నాడా ? అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “గ్యాంగ్ స్టర్” సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు
మైఖేల్ పాత్రలో నటించిన హీరో చంద్రశేఖర్ రాథోడ్ కిది మొదటి సినిమా అయినా హలీవుడ్ స్టైల్ లో మాటలు తక్కువ ఉన్న తన బాడీ లాంగ్వేజ్ తో, హావ భావాలతో చాలా చక్కగా నటించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో కూడా డూప్ లేకుండా చాలా అద్భుతంగా నటించాడు. జెస్సిక పాత్రలో నటించిన హీరోయిన్ కాశ్వీ కాంఛన్ తన పాత్రకు పర్‌ఫెక్ట్‌గా సెట్ అయింది. మన తెలుగు అమ్మాయి కాకున్నా తెలుగుతనాన్ని ఉట్టిపడేలా లుక్స్ పరంగానూ తెరపై అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే అడ్ల సతీష్ కుమార్, సూర్యనారాయణ, అభినవ్ జనక్, లు గ్యాంగ్ స్టర్స్ గా అద్భుతంగా నటించారు.డి. యస్. రావు, గిరి పోతురాజు, నవీన్ ఆర్యాన్ తదితరులందరూ వారికిచ్చిన పాత్రల పరిధి మేరకు చాలా చక్కగా నటించి మెప్పించారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
రెండు గ్యాంగ్స్ మధ్య వార్ ను ఆకట్టుకునేలా డిజైన్ చేసి “ గ్యాంగ్ స్టర్ ” అనే కొత్త కాన్సెప్ట్‌తో హీరోగా దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించకునేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇంతవరకు ఎన్నో గ్యాంగ్ వార్స్ పైన సినిమాలు చూసి ఉంటాము. కానీ ఈ సినిమా ఒక వినూత్నంగా కొత్తగా ఉంది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. తనకిది మొదటి సినిమా అయినా డైరెక్టర్ చంద్రశేఖర్ రాథోడ్ రాసుకున్న కథ చాలా గ్రిప్పింగ్ ఉంది. హాలీవుడ్ స్టాండర్డ్ లో లైటింగ్సు ,సౌండ్ ఎఫెక్ట్స్, ఎడిటింగ్ పర్ఫెక్ట్ గా వచ్చింది. ఒక అనిమల్, కిల్ బిల్ సినిమాలలో ఎటువంటి ఫైట్స్ ఉంటాయో అలాంటి ఫైట్స్ ఈ సినిమాలో వున్నాయి. యాక్షన్ సీన్లను చాలా బాగా హ్యండిల్ చేశాడు.భవిష్యత్తులో మంచి సినిమాలు చేసే అవకాశం ఉంది. ఇందులో లవ్, యాక్షన్, సెటిల్డ్ ఎమోషన్ ఇలా అన్ని రకాల అంశాలతో తెరకెక్కిన ఈ సినిమాను చూస్తున్న ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ నెలకొనేలా అద్భుతంగా తెరకెక్కించడంలో దర్శకుడుగా, నటుడుగా చంద్రశేఖర్ రాథోడ్ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. టెక్నికల్ గా ఈ చిత్రం చాలా బ్రిల్లియంట్ గా కనిపిస్తుంది. ప్రతి సీన్ రిచ్ గా ఉంటుంది. ఫైట్స్, కొరియోగ్రఫీ, ఎడిటింగ్, రచన, నిర్మాత, దర్శకత్వం..ఇవన్నీ ఒక్కరే చేయడం ఈజీ కాదు.దీనికి ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉండాలి. ఇలాంటి యాక్షన్ సినిమాకు ప్రాణం పోసింది మ్యూజిక్ అని చెప్పచ్చు, ఆర్ఆర్ మ్యాజిక్‌ను థియేటర్లో చూడాల్సిందే. జతగా నీ తలపే అనే సాంగ్ డీసెంట్ గా వుంది. ఇందులో 6 నిమిషాలు యాక్షన్ సీక్వెన్స్ వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇక సినిమాటో గ్రాఫర్ జి. యల్. బాబు తనకు ఉన్నంతలో బాగాచేశారు .వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి.ఓవరాల్‌గా చెప్పాలంటే యాక్షన్ ,ఎమోషన్ సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం “గ్యాంగ్ స్టర్ “ సినిమా తప్పకుండా నచ్చుతుందని కచ్చితంగా చెప్పవచ్చు.
http://cinemarangam.com/ Review Rating 3/5









