Hero Nandanuri Kalyan Ram interview about ‘Amigos’ Movie

డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. “బింబిసార” విజయం తర్వాత త్రిపాత్రిభిన‌యంలో న‌టిస్తూ “ఆమిగోస్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్ నహీరోయిన్ గా నటించింది. రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ‘అమిగోస్’ మూవీ టీజ‌ర్‌, సాంగ్స్‌కి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మీడియాతో మాట్లాడుతూ

“బింబిసార” సినిమా సక్సెస్ తర్వాత నేను చేసే సినిమాలపై ఇంకా బాధ్యత పెరిగింది. .నేను బింబి సార, అమిగోస్, డెవిల్ ఈ మూడు చిత్రాలకు కథలను మూడేళ్ళ క్రితమే అంగీకరించాను. బింబిసార ఫలితం చూశారు. ఈసారి కూడా ధైర్యంగా కొత్తగా ప్రయత్నించవచ్చు అనే నమ్మకం వచ్చింది.

నేను “ఆమిగోస్” కథ వినగానే నాకు కొత్తగా అనిపించింది సహజంగా మూడు పాత్రలంటే అందరూ ఊహించే దానికి భిన్నంగా ఉంటుంది. అయితే ఇందులో కేవలం ఒక హీరోయిన్ మాత్రమే ఉంటుంది.ఇంకా విలన్ కూడా ఉండడు. అమిగోస్ అంటే ఫ్రెండ్స్ అని అర్థం. ఒకే పోలికతో మూడు వేర్వేరు ప్రాంతాల్లోని వ్యక్తులు ఒక‌చోట క‌లిసిన‌ప్పుడు ఏం జ‌రిగింది అనే కథ ఆసక్తికరంగా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది ఈ సినిమా కథ . ఫ‌స్టాఫ్ చాలా బావుంది. సెకండాఫ్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. సినిమాను చూస్తున్న వారంతా ఆసాంతం ఆస్వాదిస్తారు

ఆమిగోస్ చేసేటప్పుడు ఆలోచించి ఈ కథను సెలెక్ట్ చేసుకున్నాం. ఈ సినిమాలో నేను మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్ మూడు పాత్రలు చేశాను. ఈ మూడు పాత్రలు కూడా కీలకమైనవే అని చెప్పవచ్చు. అయితే ఒకరికి సంబంధించిన పేరు బావుండదనిపించింది. దాంతో స్నేహానికి సంబంధించి టైటిల్ అనుకున్నాం. అలా కొత్తగా ఉంటుందని సోషల్ మీడియాలో అమిగోస్ అనే హాస్ ట్యాగ్ చూసి నచ్చడంతో ఈ టైటిల్ పెట్టాం.ఈ టైటిల్ కు అర్థం తెలియదు అని అనుకోవద్దు. కాంతారా సినిమా వచ్చే వరకు ఆ పేరు అర్థం ఎవరికీ తెలియదు కదా..

నా సినిమాలు కమర్షియల్ గా తీసినవే బింబిసారుడు కూడా పాత కథనే కానీ వాటిని చూపించే విధానంలోనే కొత్తగా ఉంటుంది. ఇంతకుముందు చాలా మంది హీరోలు త్రిపాత్రాభినయం చేశారు. తాత‌గారు రాముడు భీముడు చేశాడు. తర్వాత బాబాయ్ చేశాడు. త‌ర్వాత  త‌మ్ముడు జై ల‌వ‌కుశ చేశాడు. ఇవ‌న్నీ అన్న‌ద‌మ్ముల మ‌ధ్య క‌థ‌.మా కుటుంబం హీరోలకు ఇలాంటి కథలు రావడం అదృష్టం
అయితే అమిగోస్ మ‌నుషుల‌ను పోలిన మ‌నుషులు ఏడుగురుంటార‌ని తెలుసు. అలాంటి ముగ్గురు మ‌ధ్య జ‌రిగే క‌థ‌. థియేట‌ర్‌లో మీరు డిస‌ప్పాయింట్ కారు

అమిగోస్ లో ప్రతి సన్నివేశాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం ద్వితీయార్థంలో కథకు బ్రేక్ పడకుండా పాట ఉంటే బాగుంటుందని బాబాయి బాలకృష్ణ సినిమాలోని పాటలు రీమేక్ చేశాము. డెవిల్ సినిమా ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. మరో మూడు నెలల్లో పూర్తి అవుతుంది ఇక “బింబిసార 2” ఈ ఏడాది చివర్లో ప్రారంబిస్తాం అని ముగించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here