Hero Pradeep Machiraju interview about ’30 Rojullo Preminchadam Ela?’

గత 10 సంవత్సరాలుగా మేల్ యాంకర్ గా బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకొని సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకొన్న ప్రముఖ వ్యాఖ్యాత ప్రదీప్ మాచిరాజు కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్న తొలి చిత్రం ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులతో తన తొలి సినిమా అనుభవాలను పంచుకున్నారు ప్రదీప్.

 ఈ కథతో మీ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది?

కెరీర్‌లో సినిమా కథానాయకుడిగా మారడానికి దర్శకుడు మున్నా చెప్పిన కథే కారణం.మున్నా గారు ఈ కథ వినిపించినప్పుడు ఈ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది.ఫుల్ నరేట్ చేశాడు.నేను కథ ఎలా అయితే ఉండాలని ఎదురు చూశానో అలా ఉంది.టెలివిజన్ లో ఉన్న ప్రదీప్ కు, 70 mm లో ఉండే ప్రదీప్ కు డిఫ్రెంట్ గా ఉండాలని ,నన్ను చూసే ఆడియన్స్ కు కొత్తగా కనపడుతూ.. ఎక్కడా యాంకర్ ప్రదీప్ ఛాయలు లేకుండా మున్నా గారు రాసుకున్న ఒక అబ్బాయి గారు క్యారెక్టర్ , ఒక అర్జున్ క్యారెక్టర్ కనిపించాయి.చాలా వెరీషన్స్,గెటప్స్,డిఫ్రెంట్ లుక్ ఉంది. ప్రతి 15 నిమిషాలకు కథ ఇంకొరకంగా ఆన్ ఫోల్డ్ అవుతుంటుంది.ఇంటర్వెల్ మాకు బిగ్గెస్ట్ లైఫ్ అక్కడనుండి కథ టర్న్ అవుతుంది.చూసే వారికి ఇలా కూడా జరుగుతుందా అనిపిస్తుంది. చందమామ కథల్లో జరిగే ఫాంటసీ లాగ క్లైమాక్స్ వరకు డిఫ్రెంట్ ఎమోషన్ రన్ అవుతుంది.

మీరు ముందు యాంకర్ అవుదామని అనుకున్నారా,యాక్టర్ అవుదామని అనుకున్నారా?

సగటు మిడిల్ క్లాస్ అబ్బాయిలాగ అందరికీ వచ్చినట్లే నాకు యాక్టర్ అవ్వాలనే థాట్ వచ్చింది.ప్రతి రోజు సినిమాలు చూస్తూ, క్రాస్ రోడ్డులో పోస్టర్లు చూస్తూ ,టివి లో వచ్చే పాటలకు డ్యాన్స్ చేస్తూ ఇలా అందరి అబ్బాయిల్లాగే గడిపాను.కాలేజ్ టైం కు వచ్చే సరికి రియాల్టీ చెక్ , అంటే సినిమా ఎలా ఉంటుంది. హీరో ఎలా వచ్చాడు, వారి జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఇలా ఆలోచించే వాన్ని అలా కాలేజ్ అయ్యిపోయి బయటికి వచ్చే టైంకు మా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చెక్ చేసుకొంటే ఇంట్లో ఇప్పటివరకు ఏవరికీ సినిమా బ్యాగ్రౌండ్ లేదు కాబట్టి క్రియేటివ్ ద్వారా జాబ్ చేద్దామని ఇక్కడకు వచ్చి రేడియోలో జాబ్ కొరకు ఆడిషన్స్ ఇవ్వడం జరిగింది అలా రేడియో లో చూసి టీవీ లో ఆఫర్ రావడం ఇప్పుడు మా డైరెక్టర్ గారు టీవీ లో చూసి సినిమాలో ఆఫర్ ఇవ్వడం జరిగింది.ఇదేమీ సింపుల్ ప్రాసెస్ కాదు ఇక్కడికి చేరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది

రేడియో జాకీ నుంచి ఇప్పుడు మీరు హీరో వరకు ఎదగడం
చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది ?

అది బ్యూటిఫుల్ మెమొరీ,చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలా అన్నీ జరగగా పోయి ఉంటే ఈ రోజు ఇది ఇలా జరగదు అందరూ కష్టపడతారు కానీ నేను ఇక్కడకు రావడానికి చాలా మంది సహకారం ఉంది . రేడియో ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఛానల్స్ లలో ప్రొడ్యూసర్లు, అన్నిటికంటే ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు, వాళ్లకు నేను ఏ ఫామ్ లో ఎంటర్టైన్ చేసినా తీసుకున్నారు. ఇప్పుడు నేను చేస్తున్నది ఓన్లీ తెర డిఫరెన్స్ మాత్రమే చిన్న స్క్రీన్ నుంచి పెద్ద స్క్రీన్ కు చేంజ్ అవుతున్నాను.నా అల్టిమేట్ గోల్. కూడా అదే, నేను ఏ ఫామ్ లో ఉన్నా , ఏ స్టైల్ లో ఎంటర్టైన్ చేసినా ప్రేక్షకుల ముఖంపై చిరునవ్వు ఉండేలా చూడాలను కుంటున్నదే నా గోల్.నా చివరి శ్వాస వరకు అందరికీ నవ్వించడమే నా డ్రీమ్,.

యాంకర్ ప్రదీప్ కి,సిల్వర్ స్క్రీన్ ప్రదీప్ కి తేడా ఉందని ఎందుకనిపిస్తుంది?

అంటే యాంకర్ ప్రదీప్ అనే వ్యక్తి నేను రోజు బయట ఎలా ఉంటానో.. నా ఫ్రెండ్స్ ఎలా ఉంటానో..స్క్రీన్ మీద కూడా అలాగే ఉంటాను.ఓన్లీ నవ్వడం,నవ్వించడం వరకే జరుగుతుంది అక్కడ. కానీ సినిమా వరకు వచ్చేటప్పటికి దాన్ని మించిన ఎమోషన్స్ చాలా ఉంటాయి నేను మాట్లాడినా,డైలాగ్ చెప్పినా,యాక్ట్ చేసినా, బాధ పడినా,స్క్రీన్ మీద ఏడ్చినా ఇలా ఎం జరిగినా నా ఎమోషన్స్ అన్నిటినీ యాక్సెప్ట్ చేసేలా ఉండాలనే నేను కోరుకున్నాను.

మీరనుకున్న ఎమోషన్స్ అన్నీ వచ్చాయి అనుకుంటున్నారా ?

నా నుండి వచ్చాయి కానీ..జనాలకు రావాలి. నేను డైరెక్టర్ చెప్పినంత వరకు చేసాను.నేను శాటిస్ఫైడ్ గా ఉన్నాను.ఎందుకంటే నా మొదటి ప్రయత్నం ఇది.రైటా, రాంగా అనేది చూడకుండా ప్రయత్నం అయితే చేశాను అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను.

ఇందులో గడ్డం గెటప్,పంచె గెటప్,తలపాగా చుట్టుకోవడం మీకెలా అనిపించింది ?

ఈ సినిమాకు అదే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఈ సినిమాలో నేను కథ విన్నప్పుడు ఆ పల్లెటూరి గెటప్,గడ్డం తలపాగా,దోతి ఇవన్నీ విన్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి.దాన్ని న్యాచురల్ గా తీసుకురావడానికి అందరం ప్రయత్నం చేశాం.30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ కథలో వేరియేషన్స్‌ నాకు బాగా నచ్చాయి.’నీలి నీలి ఆకాశం’ పాటలో గెటప్‌ కోసం మూడు నెలలు కష్టపడ్డా!లొకేషన్స్ వైజ్,స్విచివేషన్ వైజ్ కానీ సీన్స్ అన్నిటికీ ముందు సెకెండ్ ఆఫ్ షూట్ చేసుకున్నాక అందరం డిష్కర్షన్ చేసుకొని మూడు నెలలు గ్యాప్ తీసుకొని గడ్డం,జుట్టు అన్ని పెంచి గెటప్,లుక్ టెస్ట్ అన్ని చేసుకొని కేరళలో షూట్ చేద్దామనుకున్న టైం లో అక్కడ వరదలు వచ్చాయి అందుకని మూడు నెలలు టైం పట్టింది లొకేషన్ లో వాటర్ క్లియర్ అవ్వడానికి తరువాత ఎంతో ఎఫెక్ట్ పెట్టి చేయడం జరిగింది.సినిమాకు ఈ గెటప్స్ సినిమాకే సోల్ అక్కడనుండి కథ మొదలవుతుంది అదే కథంతా నడిపిస్తుంది.

విలేజ్ బ్యాక్ డ్రాప్ లో అబ్బాయి గారి గెటప్ కు మీరేమైన స్పెషల్ వర్క్ చేసారా?

రాజమండ్రి,పోలవరం వెనకాల షూట్ చేశాం. అమ్మ,నాన్న పుట్టింది అమలాపురం కాబట్టి నాకు బాష కూడా ఆటోమిటిక్ గా వస్తుంది కాబట్టి చాలా ఈజీ అయ్యింది.అమ్మాయిగారు అని పిలవడం ఇలా అక్కడి వారితో గుడిసె లో ఉంటూ కలిసి భోజనం చేయడం అవన్నీ మరచిపోలేని థింగ్స్.

ఇది రెగ్యులర్ గా వస్తున్న లవ్ స్టోరీస్ లాగే ఉంటుందా?

లవ్ స్టొరీ అనేది ఎప్పుడూ ఒకటే ఉంటుంది,కానీ ట్రేట్మెంట్ కొత్తగా ఉంటుంది.ఇందులో వచ్చే ట్విస్ట్ & టర్న్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్ ను పెంచుతాయి.కోర్ పాయింట్ కొత్తగా వుంటుంది. ఇంటెర్వెల్ నుండి ఆ పాయింట్ హైలెట్ అవుతుంది.పాయింట్ హైలెట్ అయినప్పుడు వారిద్దరూ ఒక పరిస్థితుల్లో ఇరుక్కున్నపుడు వారికి 30 రోజులు మాత్రమే వారికి టైం ఉంటుంది ప్రేమించు కోవడానికి.

మీరు సినిమా చేస్తున్నా కూడా ఎవరికీ చెప్పకుండా సీక్రెట్ గా మెంటేన్ చేస్తూ సినిమా షూటింగ్ సైలెంట్ గా కంప్లీట్ చేయడానికి కారణమేంటి?

మా అందరి మొదటి ప్రయత్నంతో చిన్న సినిమాగా మొదలయింది.నేను మొదట్లోనే సినిమా చేస్తున్నా అని అందరికీ చెప్పుకుంటే కొంచెం లేట్ అయినా ఇంకా సినిమా రాలేదు,యాంకర్ గా బాగా సంపడిస్తున్నావ్ చాలుకదా, సినిమా అంటే ఈజీ కాదు ఇలా నెగిటివిటీ వస్తుందేమో అనే ఉద్దేశ్యం తో.. సినిమా పూర్తి అయ్యి ప్రాజెక్ట్ చేతికి వచ్చిన తరువాతే ఎవరికైనా చెప్పాలి అని షూట్ పూర్తి అయిన తరువాత పోస్టర్ తో సర్ప్రైజ్ చేస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం అనుకున్నాం. అంతే తప్ప దాచేసి సీక్రెట్ గా షూట్ కంప్లీట్ చేయాలని మాత్రం కాదు.

మొదటి సారి హీరోగా చేస్తున్నారు కదా.. మీ ఫీలింగ్ ఏంటి?

చాలా సంతోషంగా ఉంది.నేను ఇప్పటి వరకు చిన్న చిన్న పాత్రలు సరదాగా నా పరిచయాలు కొద్దీ చేసాను.తరువాత రెండు,మూడు సంవత్సరాలుగా ఏ మూవీస్ చేయకుండా టెలివిజన్ సైడే ఓన్ షోస్ ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉన్నాను.రేడియో జాకీగా ఉన్నప్పుడు హీరోలను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నాకు సినిమాలపై మరింత ఆసక్తి పెరిగింది.అలా అప్పుడప్పుడూ కథలు విన్నా వాటిలో ప్రదీప్ తప్ప ఎవరూ చేసినా పర్లేదు అనే కథలే వచ్చినట్లు అనిపించేవి.మొదటి సారి మున్నా గారు కథ చెప్పినపుడు ఇది నేను చేస్తే బాగుంటుందని పించింది.అలాగే మున్నా కూడా మీరు తప్ప ఈ క్యారెక్టర్ కు నేను ఎవరినీ ఊహించుకోలేను.మీరే చెయ్యాలని అడగడంతో.నన్నే సెలెక్ట్ చేసుకోవాలని ఎందుకు అనిపించిందని అడిగాను.దానికి వారు ఆడవారికి సంబంధించిన లైన్ తో అండర్ కరెంట్ తో ఫాలో అవుతుంది.ఇందులో ఆడపిల్ల జీవితం కనెక్ట్ అయ్యి ఉంటుంది.అమ్మ – కొడుకు,తండ్రి – కూతురు,ఇద్దరు అక్క చెల్లెల్లు రిలేషన్స్ ఉంది.ఇంతమంది ఫ్యామిలీస్ కు సంబంధించిన కథ ఉంది కాబట్టి అలాంటి ఫ్యామిలీస్ ఇష్టపడే వ్యక్తి దగ్గరకు రావాలని ఈ క్యారెక్టర్ ప్రదీప్ ఎందుకు చేయకూడదని నీ దగ్గరకు వచ్చానని చెప్పడంతో మేము యస్. వి బాబు ను కలిశాం. ఆయన ఫ్యామిలీస్ అందరూ ఇష్టపడే ప్రదీప్ చెయ్యడం చాలా సంతోషమని చెప్పారు.తరువాత మా అమ్మ నాన్న నా కాలేజ్ అయిపోయిన తరువాత నా కొడుకు ఏమైపోతాడో అనుకున్న వారు ఏదోఒకటి అయ్యాడు అనుకునే వరకు వచ్చాను.ప్రస్తుతం మా పేరెంట్స్ హ్యాపీ.

గత సంవత్సరం మార్చి 25 న విడుదల అవ్వాల్సిన సినిమా కరోనా తో ఆగిపోవడంతో మీరెలా స్ట్రెస్ ఫీల్ అయ్యారు?

నాకు,డైరెక్టరుకు, హీరోయిన్ కు మొదటి సినిమా
మొదటిసారిగా మాకు వచ్చిన సినిమా ఆఫర్ తో ఎంతో కష్టపడి, ఇష్టంగా చేసిన మా సినిమా రిలీజ్ కు మూడు రోజులు ఉందనుకోనే టైం లో లాక్ డౌన్ అనౌన్స్ చేయడంతో మొదటి రెండు రోజులు మా కేమీ అర్థంకాలేదు.తరువాత ప్రపంచ వ్యాప్తంగా మన పక్కవారికీ,తెలిసిన వారికీ కరోనా వలన వారందరూ బాధ పడుతున్న విషయం చూస్తే మా బాధ చాలా చిన్నదిగా అనిపించింది.దీన్ని మేమందరం అర్థం చేసుకున్నాము. అలాగే మా యూనిట్ లో ఆర్ట్ డైరెక్టర్ ఒకరు కరోనా వల్ల చనిపోవడం మకెంతో బాధనిపించింది.తరువాత ఓ.టి.టి లు రావడంతో అందులో విడుదల చేద్దాం అనుకొని అంతా ప్లాన్ చేసుకొన్న టైంలో నిర్మాత మీరు చేస్తున్న ఈ సినిమా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలి, దేని కోసమైతే ఇన్నాళ్లు పరిగెత్తి ప్రయాణం చేశారో (70 mm లో చూడడానికి) థియేటర్స్ లొనే విడుదల చేద్దామని చెప్పిన మరుసటి రోజే గవర్నమెంట్ నుండి థియేటర్స్ ఓపెన్ చేసుకోవచ్చని అనౌన్సమెంట్ వచ్చింది.మా అందరికీ చాలా ఆనందకరమైన విషయం.అయితే పండగకు పెద్ద సినిమాలు ఉన్నందున పండుగ తరువాత థియేటర్స్ కాళీ చూసుకొని విడుదల చేద్దామని జనవరి 29 న విడుదల చేస్తున్నాము.

స్టార్ హీరోల సినిమాలకు వచ్చినంత మైలేజ్ ఈ సినిమాలో  పాటలకు లభించడం మీ కెలా అనిపించింది?

ఆడియన్స్ కు మా సాంగ్ ఎంత రీచ్ అయిందంటే మా సినిమాకు (పాటంత బాగుంటుంది మా సినిమా) అదే ట్యాగ్ అయ్యింది.సినిమాకు ఈ పాటే సోల్. నీలి,నీలి ఆకాశంతోనే మొదలవుతుంది.అనూప్ గారు బ్యూటీఫుల్ ట్యూన్స్ క్రీయేట్ చేశారు.మేమంతా ఆ పాటకు కనెక్ట్ అయ్యాము.తరువాత చంద్ర బోస్ గారు అద్భుతమైన లైన్స్ ఇవ్వడం,తరువాత సిద్ద్ శ్రీరామ్,సునీత ల వాయిస్ ఇవ్వడం తరువాత మా మొదటి పాటను సూపర్ స్టార్ మహేష్ బాబుకు చూపడం తో ఆయన పాట చాలా బాగుంది, ఫ్రెష్ గా,లుక్ వైజ్,లిరిక్స్,లోకేషన్స్ ఇలా అన్ని చాలా బాగున్నాయి ప్రేక్షకులకు ఇదే చూయించండి కొత్తగా ఉందని చెప్పారు.తరువాత చిరంజీవి గారికి చూపిస్తే ఆయన కూడా నాకు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇలా అందరి కలయికతో ఈ మూవీ ఒక బ్యూటీఫుల్ మ్యూజికల్ ఫిల్మ్ అయ్యింది.

బయటి వారికి ఈ సినిమా ప్రివ్యూ వేసి చూయించారు ఈ సినిమా పై వారి స్పందన ఎలా ఉంది?

సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని పదిమందికి సినిమా చూపించాం. వాళ్లందరూ భావోద్వేగానికి గురయ్యారు. సినిమా బాగుందని మెచ్చుకున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని భావిస్తున్నా. ఒక పాటకు 300 మిలియన్‌ వ్యూస్‌ రావటం మామూలు విషయం కాదు. ఆటంకాలు ఎన్ని ఎదురైనా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం.

టెలివిజన్ షోస్ కు రెమ్యూనరేషన్ ఎక్కువ తీసుకున్నారా సినిమాలో యాక్టింగ్ కు ఎక్కువ తీసుకున్నారా?

టెలివిజన్ అనేది ప్రాసెస్, అది ఒక ఉద్యోగం లాంటిది చాలా ఎపిసోడ్స్ ఉంటాయి,షూట్ జరుగుతుంటాయి..ప్రొడక్షన్స్ హౌసెస్,ఛానెల్స్ తో టై అప్ ఉంటుంది.కానీ సినిమాకు వచ్చేటప్పటికి దాని గురించి తెలియదు కానీ.. 70 mm మీద నేను కొత్త అబ్బాయిని నాకు ఇన్వెస్ట్ చేసే దానికంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ని,పెద్ద లిరిసిస్ట్ ని,పెద్ద సింగర్లను, పెద్ద టెక్నీషియన్స్ ను,అన్నపూర్ణ స్టూడియోస్ లో అన్ని రకాల టెక్నికల్ వర్క్స్,ఇలా ప్రాజెక్టు క్వాలిటీ కోసం నాకొచ్చే దాంట్లో దేనికైనా ఉపయోగపడితే బాగుంటుందని వద్దన్నాను.సినిమా సక్సెస్ అయ్యిన తరువాత మీ దగ్గర డబ్బులు తీసుకుంటానని చెప్పాను.బిగ్ బ్యానర్ లో ఈ నెల 29 న విడుదల అవుతున్న ప్రేక్షకులందరు మా మొదటి సినిమాను చూసి ఆదరించి,ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here