ప్రామిసింగ్ హీరో శ్రీవిష్ణు ప్రతిష్టాత్మక చిత్రం ‘అల్లూరి’. ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. శ్రీవిష్ణు భార్యగా కయదు లోహర్ నటిస్తుంది.సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా వచ్చారు.ఇంకా ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు
అతిధిగా వచ్చిన ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ..నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను,అందరికీ ఫ్యాన్స్ ఉంటే నాకు ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఆర్మీ ఉన్నారని ఇక్కడకు వచ్చిన శ్రీ విష్ణు ఫాన్స్ కు నా ఫాన్స్ కు థాంక్స్. అల్లూరి సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవు తున్న హీరోయిన్ కయదు లోహర్ కు వెల్కమ్ చెబుతున్నాను. నిర్మాత బెక్కం వేణుగోపాల్ గారి “ప్రేమ ఇష్క్ కాదల్” సినిమా నుండి హుషారు వరకు ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా తను ఎన్నో మంచి మంచి సినిమాలు తీసి తెలుగు సినిమా స్థాయిని పెంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన వ్యక్తి శ్రీ విష్ణు గారు. తన ప్రతి సినిమా నేను ఫాలో అవుతుంటాను. ‘ప్రేమ ఇష్క్ కాదల్” సినిమాలో ముగ్గురు హీరోలు అందులో తన పాత్ర చిన్నదైనా చాలా బాగా చేశాడు. అప్పటినుంచి ఆయన మీద నాకు ప్రత్యేకమైన ఇష్టం ఏర్పడింది. ఆ తర్వాత తను చేసే ప్రతి సినిమాను నేను ఫాలో అవుతుంటాను.తను ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్న అందులో నావెల్టీ ఉంటుంది. హిట్, ఫ్లాప్ అనేది మనచేతుల్లో లేకపోయినా ఒక యాక్టర్ డెడీకేటెడ్ పని చేస్తే ఆ వ్యక్తిపై రెస్పెక్ట్ పెరుగుతుంది. ప్రతి సినిమాకు తను డెడికేటెడ్ గా వర్క్ చేస్తాడు.పుష్ప 2 లో నేను బిజీగా ఉన్నా తన కోసం ఈ ఫంక్షన్ కు రావడం జరిగింది. సెప్టెంబర్ 23 న వస్తున్న అల్లూరి సినిమాను అందరు చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ….బన్నీ గారి అభిమానులందరికీ
ధన్యవాదాలు.అల్లూరి అనే స్టొరీ ని నేను గత ఐదు సంవత్సరాలుగా నమ్మి ఇక్కడ వరకు తీసుకు వచ్చాము దర్శకుడు ప్రదీప్ వర్మ చెప్పిన కథ అద్భుతంగా ఉంది. నాకోసం తను ఐదు సంవత్సరాలు వెయిట్ చేశాడు. ఒక అప్ కమింగ్ హీరో కోసం ఐదు సంవత్సరాలు ఎవరు వెయిట్ చేయరు. కానీ తను నా కోసం వెయిట్ చేసినందుకు తనకు థాంక్స్ చెపితే సరిపోదు. ఇప్పటి వరకు పోలీస్ స్టోరీ లు మనం చాలా చూశాం. కానీ ఇరవై సంవత్సరాల లైఫ్ ని ఈ సినిమాలో చూపించబోతున్నాము. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. సినిమాపై ఉన్న మక్కువతో ఇండస్ట్రీకి వచ్చిన ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటున్న నాకు బెక్కం వేణుగోపాల్ గారు ప్రేమ ఇస్క్ కాదల్ సినిమాలో అవకాశం ఇవ్వడం జరిగింది.ఆ సినిమాలో చిన్న పాత్ర చేశాను.ఆ తర్వాత బన్నీ గారి నుంచి ఫోనొచ్చింది. అప్పుడు బన్నీ గారిది రేసుగుర్రం సినిమా జరుగుతుంది.అయితే ఫ్రెండ్స్ ఆట పట్టిస్తారు అనుకున్నా తీరా అక్కడికెళ్లి కలిసే వరకు నాకు నమ్మకం కలగలేదు బన్నీ గారు చాలా బాగా చేశావు అని ఏప్రిసియేట్ చేయడం జరిగింది. తను నాతో చాలా సినిమాలు వస్తాయి తొందరపడి ఏది చేయొద్దు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, డిఫరెంట్ సినిమాలు వస్తే నటించు ఇండస్ట్రీలో నాకు ఏ సపోర్టు లేదని అనుకోవద్దు మీకు ఏ అవసరం ఉన్నా మా ఇంటి తలుపు తట్టచ్చు అని అన్నారు. అందరూ మాటలు చెపుతారు. కానీ మాట నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అది మన బన్నీ గారికి టన్నులు టన్నులు ఉంది.ఆ తర్వాత తను చెప్పిన మాటలకి నేను కంటెంట్ ఉన్న సినిమాల చేస్తూ వస్తున్నాను. బన్నీ గారు సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక పాత్ర ఇచ్చారు ఆ పాత్ర నాకు వెలకట్టలేనిది.ఆరోజు తను చెప్పిన మాటలను గుర్తు పెట్టుకొని అయనమీద ఉన్న అభిమానం తో నేను చేసే ప్రతి సినిమా టైటిల్ లో a”ఏ ఏ” అనే రెండు అక్షరాలు మిస్ అవకుండా పెట్టుకుంటూ వచ్చాను.
మిస్సయిన ఒకే ఒక్క సినిమా “అల్లూరి “అందుకే తనని రమ్మని అడిగాను తను రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రతీ పాత్ర పేరులో కూడా ఏ ఏ వచ్చేలా ఉంటుంది. అది నేను బన్నీ గారికి ఇచ్చుకునే గౌరవం. మా అల్లూరి 23 తారీకు రిలీజ్ అవుతుంది ప్రేక్షకులందరూ ఈ సినిమాను చూసి ఆదరించి ఆస్వాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
చిత్ర దర్శకుడు ప్రదీప్ వర్మ మాట్లాడుతూ..బన్ని గారు మా ఈవెంట్ కు రావడంతో మా సినిమా స్థాయి పెరిగింది.పోలీస్ అంటే ఒక వ్యక్తి కాదు పోలీస్ అంటే ఒక వ్యవస్థ అనే అనే డైలాగ్ ను బేస్ చేసుకుని ఈ స్క్రిప్ట్ రాశాను. ఫస్టాఫ్ అంతా పోలీస్ అనే వ్యక్తిని పరిచయం చేసి తన కెరియర్ ని, ట్రావెల్ ను చూపిస్తూ పోలీసు అనే వ్యవస్థ ఏం చేయగలుగుతుంది నిజాయితీగా ఉండే పోలీసు వ్యవస్థ ఏం చేసింది అనేది ఇందులో చూయించడం జరిగింది. ఇవన్నీ జరిగిన సంఘటనలను తీసుకుని పోలీస్ బయోపిక్ లాగా చెప్పడం జరిగింది.
నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ప్రొడక్షన్ మేనేజర్ గా కెమెరా అసిస్టెంట్ గా చేస్తూ సినిమా మీద ఉన్న ఫ్యాషన్ తో మా ఫ్రెండ్ శివాజీ సపోర్టుతో సినిమాలు చేయడం మొదలు పెట్టి ఎదుగుతూ వచ్చాను.మొదటి సినిమా నుంచి అన్ని సక్సెస్ఫుల్ సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను. ప్రస్తుత సమయంలో మేము ఈ సినిమా కోసం చాలా టెన్షన్ పడ్డాం ఎందుకంటే మంచి కంటెంట్ తో తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చేరువ కావాలని ప్రయత్నాలు చేస్తున్న మాకు బన్ని గారు రావడంతో మా అందరికీ 100 ఏనుగుల బలం వచ్చినట్లు అనిపించింది. ఈ ఫంక్షన్ కి వచ్చినందుకు బన్నీ గారికి మా ధన్యవాదాలు.ఈ సినిమాను అందరి సపోర్ట్ తో ఎక్కడ రాజీ పడకుండా తీశాము.ఈ నెల 23 న వస్తున్న అల్లూరి సినిమాను అందరు చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ నెల,23 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న అల్లూరి సినిమా బిగ్ హిట్ అవ్వాలి అన్నారు.
తారాగణం: శ్రీవిష్ణు, కయ్యదు లోహర్, తనికెళ్ల భరణి, సుమన్, మధుసూధన్ రావు, ప్రమోదిని, రాజా రవీంద్ర, పృధ్వీ రాజ్, రవివర్మ, జయ వాణి, వాసు ఇంటూరి, వెన్నెల రామారావు, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు.
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ప్రదీప్ వర్మ
నిర్మాత: బెక్కెం వేణుగోపాల్
బ్యానర్: లక్కీ మీడియా
సమర్పణ: బెక్కెం బబిత
ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డే
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్
డీవోపీ: రాజ్ తోట
ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల
ఆర్ట్ డైరెక్టర్: విఠల్
ఫైట్స్: రామ్ క్రిషన్
సాహిత్యం: రాంబాబు గోసాల
సౌండ్ ఎఫెక్ట్స్: కె రఘునాథ్
పీఆర్వో: వంశీ-శేఖర్









