Heroine Samyuktha Menon interview about ‘Bimbisara’ Movie

మలయాళం లో “పాప్ కార్న్” చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ,ఆ తరువాత తమిళ్,కన్నడ చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొన్న కేరళ కుట్టి సంయుక్త మీనన్. తెలుగు లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాలు నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కథకు తగ్గట్టు హోమ్లీ గా రానాకు వైఫ్ గా నటించి మంచి మార్కులే కొట్టేసింది అని చెప్పవచ్చు. తాజాగా కళ్యాణ్ రామ్ కు జోడీగా తను నటిస్తున్న సినిమా “బింబిసార”. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై వ‌శిష్ఠ్ మల్లిడి ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ హ‌రికృష్ణ‌.కె నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే బింబిసార భారీ బడ్జెట్ చిత్రం. అంతే కాకుండా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మగధ సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కనిపిస్తున్నారు.ఆయ‌న పాత్ర‌లోని వాడి, వేడిలో.. శ‌త్రు భ‌యంక‌రుడిగా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ ఎలా మెప్పించార‌నే విష‌యాన్ని ట్రైల‌ర్‌తో సింపుల్‌గా ట‌చ్ చేశారు. ఆయ‌న లుక్ డిఫ‌రెంట్ ఆద్యంతం ఆస‌క్తిని పెంచుతోంది. రీసెంట్‌గా రిలీజైన ట్రైల‌ర్, పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సోషియో ఫాంటసీగా తెరకెక్కిన ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ తో పాటు క్యాథరీన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 5న ఈ చిత్రం గ్రాండ్ లెవల్లో రిలీజ్ అవుతోంది.ఈ సందర్బంగా క‌థానాయిక సంయుక్త మీన‌న్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ..

మాది కేరళ స్టడీస్, జాబ్ చేస్తుండగా అనుకోకుండా సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం లభించింది.మలయాళంలో నేను చేసిన సినిమాలకు మంచి గుర్తింపు లభించింది .ఆ తరువాత తమిళ్, కన్నడ సినిమాల ద్వారా నాటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాకు తెలుగులో మాత్రం నా కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్, కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్ లాంటి పెద్ద స్టార్లతో నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా బావిస్తున్నాను.సినిమాకు ఇంత మంచి ల‌వ్‌, స‌పోర్ట్ మ‌రెక్క‌డా నేను చూడ‌లేదు. కేవ‌లం తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోనే క‌నిపిస్తోంది. తెలుగులో నేను యాక్ట్ చేసిన సినిమా ఇది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. సినిమాలో యాక్ట్ చేసే వారిని తెలుగు ప్రేక్ష‌కులు ఎంతగానో స‌పోర్ట్ చేస్తారు. అలాగే  చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటారు. సినిమాలను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా చూపెడ‌తారు. మాస్ సినిమాల్లో అరిచి గోల పెడుతారు. యాక్ట‌ర్స్‌ను ఓన్ చేసుకుంటారు. భీమ్లా నాయక్ లో నేను చేసిన పాత్రను అందరూ ఆదరించారు.మీ ప్రేమాభిమానాల‌కు ధ‌న్య‌వాదాలు’’ అన్నారు.

అయితే షూట్ సమయంలో నాకు భాష తెలియకపోయినా టీం అంతా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు. కానీ నటించేటప్పుడు కేవలం పెదాలు ఆడించి నటించడం నాకు నచ్చదు. అందుకే తెలుగు నేర్చుకోవాలి అనుకొని రోజు ఒక గంట సేపు తెలుగు ట్యూటర్ ను పెట్టుకొని తెలుగు నేర్చుకొన్నాను. దాంతో తెలుగులో ఆఫర్లు వచ్చాయి.కోవిడ్‌ సమయంలో బింబిసార నుంచి ఆఫర్ వచ్చింది. ఈ సినిమాను రెండు భాగాలుగా చేయ‌బోతున్నామ‌ని డైరెక్ట‌ర్ వ‌శిష్ట చెప్పారు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ 15వ చిత్రంలో అవకాశం వచ్చింది. తర్వాత భీమ్లా నాయక్ సినిమా ఛాన్స్ వచ్చింది. ఒకే రోజు రెండు సినిమాలు భీమ్లా నాయ‌క్‌, ధ‌నుష్ మూవీ సార్‌ సినిమా లకు సైన్ చేశాను. ఇలా  నాకు వరుసగా ఆఫర్స్ రావడంతో కంగారు పడ్డాను. ఇప్పటికి నా సినిమాలు రిలీజ్ కాలేదు. పెద్ద ప్రాజెక్టులో నటించగలనా అనే అనుమానం కలిగింది. ఆ తరువాత దర్శక, నిర్మాతల సపోర్ట్ తో ఆ సినిమా చేయగలిగాను.

బింబిసార సినిమా విషయానికి వస్తే.. ఇది టైమ్ ట్రావెల్ మూవీ. ప్రస్తుతం కాలంలో, అలాగే చాలా ఏళ్ల క్రితం జరిగిన కథతో సినిమా నడుస్తుంది. ప్రజెంట్ డేలో జరిగే కథలో మోడరన్ యువతిగా నటిస్తున్నాను. సింపుల్ పాత్ర కావడంతో ఎక్కువ కష్డపడాల్సిన అవసరం లేకుండా పోయింది. నాకు పిరియాడిక్ కాన్సెప్ట్‌తో సాగే ఎపిసోడ్‌లో నడిస్తే బాగుండేదని పించింది. ఎందుకంటే..నాకు బాహుబలి, బాజీరావు మస్తానీ లాంటి సినిమాలు అంటే ఇష్టం. క‌ల్యాణ్ రామ్ చాలా ఎమోషనల్ యాక్టర్. ఆయన కళ్లతోనే భావాలను పలికిస్తారు.  మొదటి రోజు నా వద్దకు వచ్చి..మీరు మా ప్రాజెక్టులో ఉండటం గర్వంగా భావిస్తున్నామని చెప్పడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నా కెరీర్‌లో ఎవరూ కూడా అలా చెప్పలేదు. అది ఆయన మంచితనానికి నిదర్శనం.

మలయాళం మేకింగ్ వేరు..తెలుగు సినిమాల మేకింగ్ డిఫరెంట్ అనే వ్యత్యాసం గ్రహించాను.ఈ చిత్ర ట్రైల‌ర్‌ను చూసిన అంద‌రూ చాలా ఎంజాయ్ చేస్తారు.. క‌ళ్యాణ్ రామ్ నుండి నేను చాలా నేర్చుకున్నాను. ఆయ‌న స‌పోర్ట్‌కి థాంక్స్‌. ద‌ర్శ‌కుడు వ‌శిష్ట్ తొలి చిత్ర‌మే అయినా అద్భుత‌మైన విజ‌న్ ఉన్న వ్య‌క్తి. అద్భుతంగా సినిమాను తెర‌కెక్కించాడు. అన్ని వ‌య‌సుల వారు సినిమాను చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు’’.

మ‌ల‌యాళంలో సినిమాల‌ను చ‌క‌చ‌కా పూర్తి చేసేస్తుంటారు. ఈ ఏడాది నేను చేసిన భీమ్లా నాయ‌క్‌, బింబిసార, క‌డువా, సార్‌.. నాలుగు చిత్రాల్లో 20 రోజుల చొప్పున వ‌ర్క్ చేశాను. నాకు ఖాళీగా ఉండ‌టం ఇష్టం ఉండ‌దు. సినిమాలు చూస్తాను. లేదా పెద్ద స్టార్స్ ఇంట‌ర్వ్యూలు చూస్తుంటాను. స‌క్సెస్‌ఫుల్ ఎలా అయ్యార‌ని ఆలోచిస్తుంటాను. సినిమాలంటే అంత ప్యాష‌న్ నాకు. ఇలాంటి పాత్ర‌లే చేయాల‌ని ముందుగా ఆలోచించ‌లేదు. న‌టిగా మంచి పాత్ర‌ల‌తో గుర్తుండిపోవాల‌ని  అనుకుంటున్నాను. మ‌ల‌యాళంలో ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్నాను. ఆ వివ‌రాల‌ను ఇప్పుడే చెప్ప‌లేను. తెలుగులో సార్ సినిమా చేస్తున్నాను. ఓ సాంగ్ మిన‌హా నా పాత్ర‌కు సంబంధించిన చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది.

అంద‌మైన సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. అలాంటి అంద‌మైన గొప్ప చంద‌మామ క‌థ‌ను ఆగ‌స్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. అదే బింబిసార‌. ఆ సినిమాల‌ను ఆద‌రించిన‌ట్లే ఈ సినిమాను ఆద‌రిస్తార‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆశిస్తున్నాను అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here