icon star allu arjun’s “PUSHPA 2” The Rule Movie Review

Cinemarangam.Com
బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్
సినిమా : “పుష్ప 2’”
రివ్యూ రేటింగ్ : 3.5 / 5
విడుదల తేదీ : 05.12.2024
ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై
డైరెక్టర్: సుకుమార్
సహ నిర్మాత – ముత్తంశెట్టి మీడియా
నటీనటులు : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న,ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావురమేష్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు
మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్
సి.ఈ. ఓ: చెర్రీ
లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రమణ్యం కె.వి.వి
కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్
ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్
ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు


క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా  పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో  ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం “పుష్ప 2”. 2021లో విడుదల అయిన “పుష్ప 1” చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న చిత్రమిది. సునీల్, ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్, అనసూయ భరద్వాజ్, ధనుంజయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, రవిశంకర్ యెలమంచిలి  నిర్మించారు.ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన నాలుగు పాటలు , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రపంచం వ్యాప్తంగా ఈ నెల 5న  ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ‘పుష్ప 2 ’ చిత్రం ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

కథ
పుష్ప రాజ్ (అల్లు అర్జున్) తన ఎర్రచందనంతో జపాన్ కి వెళ్తాడు. జపాన్ పోర్ట్ లో అక్కడి మాఫియాతో ఫైట్ చేస్తాడు. కట్ చేస్తే చిత్తూరు శేషచలం అడవుల్లో పుష్పరాజ్ ఎర్రచందనంతో అడ్డు లేకుండా ఎదుగుతాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో నేషనల్ దాటి ఇంటర్నేషనల్ డీల్ సెట్ చేస్తుంటాడు .దాంతో  ఎర్రచందనం స్మగ్లింగ్ గ్రూప్ సిండికేట్ కు లీడర్ గా మారతాడు  పుష్ప రాజ్ . మరోవైపు  పుష్పని అడ్డుకోవాలని ఎస్పీ బన్వర్సింగ్ షెకావత్ (ఫహద్ ఫాజిల్) ఓ కూలివాడిగా అడవుల్లోకి వెళ్లి ఎర్రచందనం చెట్లు నరికి లోడేసే టైంలో అందరిని చితక్కోట్టి అరెస్ట్ చేస్తాడు. తన మనసులను విడిపించ డానికి వచ్చిన పుష్పతో పోలీసులు అతి చేయడంతో పోలీసులు అందరిని కొనేస్తాడు. దాంతో పోలీస్ స్టేషన్ మొత్తం ఖాళీ అవుతుంది. స్టేషన్ కు వచ్చిన షెకావత్ కు అరెస్ట్ చేసిన పుష్ప మనుషులతో పాటు పోలీసులు కూడా లేకపోవడంతో షాక్ అవుతాడు. దీంతో జరిగిన విషయం తెలుసుకొని రెచ్చిపోయిన శెకావత్ పుష్ప చేసే స్మగ్లింగ్ ను పట్టుకునేందుకు ప్లాన్ చేస్తాడు ఆయన ఎత్తులు వేస్తే పుష్ప రాజ్ పై ఎత్తులు వేసి సరుకులు పంపిస్తుంటాడు.ఇలా వారిద్దరి మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ జరుగుతుంటుంది. ఓ రోజు ఎంపీ సిద్ధప్ప (రావు రమేష్)తో కలసి ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తున్నానని తన భార్య శ్రీవల్లి(రష్మిక మందన)కు చెప్తాడు. అయితే ముఖ్యమంత్రి తో ఫోటో దిగిరా హాల్లో పెద్ద ఫ్రెమ్ చేసి పెడదాము అంటుంది. అక్కడకు వెళ్లిన తరువాత స్మగ్లర్ తో ఫోటో దిగితే తనకు సమస్య వస్తుందని, నా పరువు పోతుందని ఫోటో  దిగనని పుష్పరాజు ను అవమానిస్తాడు ముఖ్యమంత్రి. దీంతో  పుష్ప రాజ్ ఈగో దెబ్బతింటుంది. దాంతో ఒక కఠిన మైన నిర్ణయం తీసుకుంటాడు పుష్పరాజ్. పుష్పరాజ్ తీసుకున్న కఠినమైన నిర్ణయం ఏమిటి, దాని కారణంగా ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, షెకావత్ ను ఎలా ఎదుర్కొన్నాడు. తన జన్మ హక్కు అయిన ఇంటి పేరుని ఎలా సాధించుకున్నాడు వంటి సమాధానాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి “‘పుష్ప 2 ’సినిమా చూడాల్సిందే..   


నటీనటుల పనితీరు 
పుష్ప రాజ్ పాత్రలో (అల్లు అర్జున్) తన నటనతో నట విశ్వరూపం చూపించేశాడు. జాతర సీన్ లో అమ్మోరు గెటప్ లో అయితే పుష్ప రాజ్ నటించిన తీరు యాంటీ ఫ్యాన్స్ కు సైతం పూనకాలు తెప్పిస్తుంది యాక్షన్ సీన్స్ , డ్యాన్స్ సీన్స్ లలోను అదరగొట్టడమే కాకుండా తనని తానే కొత్తగా ఆవిష్కరించుకుంటూ పుష్పరాజ్ గా మరోసారి దుమ్ము లేపాడు. అలాగే సినిమా మొత్తం తన భుజాలపై మోసాడు అని చెప్పవచ్చు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఫహద్ ఫాజిల్ చాలా చక్కగా నటించడమే కాకుండా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు..పుష్ప రాజ్ భార్య గా శ్రీవల్లి( రష్మిక మందన) అద్భుతంగా నటించింది. రావు రమేష్ మరో బలమైన పాత్ర పడింది ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కేశవ పాత్రలో జగదీష్ మరోసారి మెప్పించారు. సెంట్రల్ మినిస్టర్ మైనింగ్ కింగ్ ప్రతాప్ రెడ్డి గా (జగపతిబాబు), సిండికెట్ లీడర్ గా మంగళం (సునీల్), అనసూయ తదితరులంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు
పుష్ప తరువాత వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. అయితే అల్లు అర్జున్ లోని నటున్ని పూర్తిస్థాయిలో పరిచయం చేసిన ఘనత ఒక్క సుకుమార్ కే దక్కుతుందనడంలో సందేహమే లేదు.పుష్ప తరువాత వస్తున్న ఈ సినిమా లో పుష్ప వర్సెస్ షెకావత్ ను ఎగ్జిక్యూటివ్ చేస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ డీల్ పై సరికొత్తగా కథను రాసుకొని అంతే కొత్తగా ఆవిష్కరిస్తూ తీసిన విధానం చూస్తుంటే సుకుమార్ బ్రిలియన్స్ కు పరాకాష్టగా నిలుస్తాయి. ఒక బడా మాస్ హీరో చేత కన్నీళ్లు పెట్టుకునేలా చేయడం ఆ బాధను అడియన్స్ కూడా అనుభవించేలా డ్రామాను క్రియేట్ చేయడంలో దర్శకుడుగా రచయితగా సుకుమార్ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు .

సెకండాఫ్ లో జాతర ఎపిసోడ్ హైలెట్ అని చెప్పవచ్చు అందులో అమ్మోరుగా వేశం వేసి పుష్ప చేసిన డ్యాన్స్ నిజంగా పూనకాలు తెప్పించేలా ఉంటుంది ఆ తర్వాత వెంటనే ఫైట్ సీన్స్ చూస్తే గూస్ బమ్స్ పక్కా.. దాన్ని కొనసాగింపుగా రష్మిక సైతం రెచ్చిపోయి మాట్లాడిన తీరు చూస్తే ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ లో పిండేసింది. అన్న కూతుర్ని కిడ్నాప్ సందర్భంగా వచ్చే క్లైమాక్స్ ఫైట్ విరోచితంగా ఉంది.ఆ సీన్లు చూస్తుంటే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడిచే  విధంగా ఉంది.ఆ తర్వాత కాస్త రొమాన్స్ చిన్న, చిన్న కామెడీ మళ్లీ యాక్షన్ సీన్స్ ఎలివేషన్స్, షెకావత్ తో ఛాలెంజ్, సీఎంతో ఛాలెంజ్ ఇలా హై ఇచ్చే సీన్లతో కథను నడిపించాడు. శ్రీ లీలా స్పెషల్ సాంగ్ బాగుంది. ఇలా ఎప్పటికప్పుడు మ్యాజిక్ చేస్తూ బోర్ లేకుండా చేసే ప్రయత్నం చేశాడు ఈ సినిమాలో పుష్ప చేసే శివతాండవాన్ని ఎవరూ ఆపలేరు అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది ఫోర్ట్ ఫైట్ సీక్వెన్స్ సెకండ్ హాఫ్ మొదట్లో వచ్చే లారీ చేజింగ్ సీక్వెన్స్ చాలా బాగా ఎగ్జిక్యూటివ్ చేశాడు. ఫైట్ సీన్స్ విషయంలో డ్రాగన్ ప్రకాష్ చాలా బాగా చేశాడు.సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాటలు ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా “పుష్ప 2” గురించి చెప్పాలి అంటే అల్లుఅర్జున్ నట విశ్వరూపంతో పాటు సినిమాలో వచ్చే జాతర సీన్ చూడటానికి ప్రేక్షకులు మళ్లీమళ్లీ థియేటర్స్ కు రావడం ఖాయం. అలాగే సినిమా చూసే ప్రతి ఒక్కరికి పూనకాల రావడం గ్యారెంటీ అని కచ్చితంగా చెప్పొచ్చు

Cinemarangam.Com Review Rating 3.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here