India’s Biggest Horror-Fantasy Set—41,256 Sq Ft Haveli Built for Prabhas’ The RajaSaab

రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ “రాజా సాబ్”. ఈ సినిమా డిసెంబర్ 5న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం.. ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. “రాజా సాబ్” సినిమాకు వేసిన భారీ హవేలీ సెట్ ప్రధాన ఆకర్షణ కాబోతోంది. 41,256 స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంతో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ ఈ రికార్డ్ స్థాయి హవేలీ సెట్ ను రూపొందించారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో మరే హారర్ మూవీకి ఇంత భారీ సెట్ నిర్మించలేదు.

“రాజా సాబ్” హవేలీ సెట్ గురించి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ నంబియార్ స్పందిస్తూ – హవేలీలోని ప్రతి అడుగు ఒక ఎమోషన్ ను వ్యక్తీకరిస్తుంది. చూసేందుకు మాత్రమే హాంటెడ్ హౌస్ లా ఉండటం కాదు. హాంటెడ్ హౌస్ లో మనమంతా ఉన్న ఫీల్ కలిగిస్తుంది. ఈ హవేలీ చూస్తుంటే మీకు కథలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. అన్నారు.

జూన్ 16 సోమవారం “రాజా సాబ్” టీజర్ లాంఛ్ తో పాటు నేషనల్, స్టేట్ మీడియాకు ఈ హవేలీని ప్రత్యక్షంగా చూపించబోతున్నారు. హారర్ కామెడీ జానర్ లో ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచిపోయేలా “రాజా సాబ్” ను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మారుతి. ఈ సినిమాను భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అన్ కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ప్రభాస్ ఇప్పటిదాకా చేయని రొమాంటిక్ హారర్ జానర్ లో నటిస్తుండటంతో “రాజా సాబ్” సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here