“‘Itlu Arjun’ has dramatically raised expectations with its fresh content!”

టాలీవుడ్‌లో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల పేరు వినగానే యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్లు గుర్తొస్తాయి. ‘ఛలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్లతో పాటు ‘రాబిన్ హుడ్’తో కూడా ప్రేక్షకులను అలరించిన వెంకీ… ఇప్పుడు నిర్మాతగా అవతారమెత్తారు. తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’పై మొదటి చిత్రంగా ‘ఇట్లు అర్జున’ను రెడీ చేస్తున్నారు. ఈ సినిమా రొటీన్ సినిమాలాగా కాకుండా ఎన్నో బిగ్ సర్ప్రైజ్‌లతో వస్తోంది.

ఈ చిత్రానికి కొత్త దర్శకుడు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త.. ఏఎంఆర్ ఇండియా చైర్మన్ మహేశ్ రెడ్డి కుమారుడు, అనీశ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది అనీశ్‌కు తొలి సినిమానే అయినా అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడి పని చేశాడు. అందుకే వెంకీ కుడుముల ఈ కొత్త టాలెంట్‌ పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అందుకే ఈ యంగ్ & టాలెంటెడ్ హీరోని పరిచయం చేస్తూ గ్రాండ్ లాంచ్ ఇస్తున్నారు. హీరోయిన్‌గా మలయాళ స్టార్ బ్యూటీ అనస్వర రాజన్ నటిస్తోంది. ఆమెకు సోషల్ మీడియాలో అపారమైన క్రేజ్ ఉంది. ‘ఛాంపియన్’ సినిమాతో టాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వబోతుంది.

అయితే తాజాగా ‘ఇట్లు అర్జున’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అయింది. కింగ్ నాగార్జున వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఈ గ్లింప్స్… ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్, డ్రామా ఎలిమెంట్స్‌ను టీజ్ చేస్తోంది. అర్జున పాత్రలో అనీశ్ సైలెంట్ బట్ స్ట్రాంగ్ హీరోగా కనిపిస్తున్నాడు. తన మొదటి సినిమాతోనే భారీ ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాలో మూగవాడిగా వికలాంగుడి పాత్రలో నటించబోతున్నాడు. మాటలు లేకుండానే భావాలు వ్యక్తం చేసే సైలెంట్ హీరో కాన్సెప్ట్‌తో సినిమా ఆకట్టుకుంటోంది.

నాగార్జున డైలాగ్స్ గ్లింప్స్‌కు ఎక్స్‌ట్రా గ్రావిటీని జోడించాయి.ఈ సినిమా టెక్నికల్ టీమ్ కూడా టాప్ టీం అనే చెప్పాలి. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్. థమన్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ రాజా మహదేవన్, ఎడిటింగ్ కోటి కె. వంటి నిపుణులు అందిస్తున్నారు. గ్లింప్స్ లో సంగీతం, విజువల్స్ హాలీవుడ్ రేంజిలో ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి ఈ చిత్రం… కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ, రిఫ్రెషింగ్ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. గ్లింప్స్ చూసిన నెటిజన్లు ఇప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారు.

గతంలో మహేశ్ రెడ్డి.. దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో కింగ్ నాగార్జున హీరోగా ‘శిరిడీ సాయి’, ‘ఓం నమో వెంకటేశ్వరాయ’ వంటి భక్తి చిత్రాలను నిర్మించి, ప్రేక్షకుల మెప్పు పొందారు. ఇప్పుడు తన కుమారుడిని హీరోగా లాంచ్ చేస్తూ కొత్త అడుగు వేస్తున్నారు. ప్రేక్షకులకు రొటీన్ గా కాకుండా కొత్తగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కంకణం కట్టుకున్నారు. తాజా గ్లింప్స్ చూశాక కచ్చితంగా ‘ఇట్లు అర్జున’ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు పెరిగిపోయాయి. మరి అనీశ్ కొత్త జర్నీ ఎలా ఉంటుందో చూడాలి.

2. ఓ వికలాంగుడి ఎమోషనల్ లవ్ స్టోరీ… ఇట్లు అర్జున సంచలనం!

టాలీవుడ్‌లో కొత్త హీరోల ఎంట్రీలు ఎప్పుడూ సంచలనమే అని చెప్పాలి. ఇప్పుడు మరో యంగ్ హీరో అనీష్ డెబ్యూ చేస్తున్న ‘ఇట్లు అర్జున’ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్‌తో భారీ బజ్ క్రియేట్ చేసింది. పాపులర్ డైరెక్టర్ వెంకీ కుడుముల కొత్త ప్రొడక్షన్ బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నుంచి వస్తున్న ఈ మూవీకి డెబ్యూ డైరెక్టర్ మహేష్ ఉప్పల దర్శకత్వం వహిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, మలయాళ స్టార్ హీరోయిన్, యూత్ ని తన క్యూట్నెస్తో ఫిదా చేసిన అనశ్వర రాజన్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తోంది.

‘సోల్ ఆఫ్ అర్జున’ అనే పేరుతో ఈ గ్లింప్స్.. కింగ్ అక్కినేని నాగార్జున వాయిస్ ఓవర్‌తో స్టార్ట్ అవుతుంది. “ప్రేమ అది ఎంత దూరమైనా పరిగెత్తిస్తుంది.. కానీ ఎంత ఇష్టమో చెప్పనివ్వదు” అంటూ నాగ్ పలికిన డైలాగ్స్ ఎమోషనల్ డెప్త్ జోడించాయి. ఇందులో హీరో మాటలు రాని ఓ అందమైన వికలాంగ యువకుడిగా నటించబోతున్నాడు. మాటలు రాకున్నా, హృదయంతో ప్రేమను, ధైర్యాన్ని చాటే క్యారెక్టర్‌గా అనీష్ ఇంప్రెస్ చేశాడు. అతని సైలెంట్ ఎక్స్‌ప్రెషన్స్, ఫ్లెక్సిబుల్ బాడీ లాంగ్వేజ్, హ్యాండ్‌సమ్ లుక్స్.. డెబ్యూ హీరోగా అతనికి మంచి మార్క్ లను పడేశాయి.

హీరోయిన్ అనశ్వర రాజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె మరింత ఆకట్టుకుంది. మలయాళంలో వరుస హిట్లతో సూపర్ స్టార్‌డమ్ సంపాదించిన ఆమె, తెలుగులో కూడా ఫ్రెష్ ఛార్మ్‌తో మెరిసిపోతోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఆర్గానిక్‌గా, హార్ట్ టచింగ్‌గా అనిపించింది. గ్లింప్స్‌లో రొమాన్స్‌తో పాటు ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కూడా టీజ్ చేశారు. మాటలు రాని హీరోకు ప్రత్యేక గిఫ్ట్స్ ఉన్నట్టు హింట్ ఇవ్వడం.. సూపర్ హీరో టచ్ జోడించింది.

ఇక టెక్నికల్‌గా ఈ గ్లింప్స్ టాప్ నాచ్ అనే చెప్పాలి. రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ అద్భుత విజువల్స్ అందించింది. థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎమోషన్స్‌ను మరింత డీప్ చేసింది. డెబ్యూ హీరో సినిమాకు ఇంత రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్.. వెంకీ కుడుముల విజన్‌కు నిదర్శనం. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు యాక్షన్, డ్రామా మిక్స్ చేసి కొత్త టేస్ట్ ఆఫర్ చేయబోతున్నట్టు కనిపిస్తోంది.2026లో రిలీజ్ కానున్న ‘ఇట్లు అర్జున’.. ఇప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. కొత్త తరం టాలెంట్‌ను ప్రమోట్ చేస్తూ వెంకీ కుడుముల మరో హిట్ ఇవ్వబోతున్నాడని అనిపిస్తోంది. ఈ గ్లింప్స్ చూస్తే.. టాలీవుడ్‌లో మరో ఫ్రెష్ లవ్ స్టోరీ వచ్చేసిందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here