Kalakonda Films “Mana Kutumbam” Audio Release grandly

కలకొండ ఫిలిమ్స్ బ్యానర్ పై కలకొండ హేమలత ఆకుల రాఘవ దర్శకత్వంలో “మన కుటుంబం” అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో సుమన్, మురళి గౌడు అన్నపూర్ణ, మరియు రవి వర్మ, లాస్య, మీనా చౌదరి మొదలగు వారు నటించారు. ఈ సినిమా ఈరోజు ఆడియో విడుదల జరిగింది. ఈ ఆడియో విడుదలను సుమన్, అన్నపూర్ణమ్మ, సంగీత దర్శకుడు, భానుప్రసాద్, దర్శకుడు ఆకుల రాఘవ ,కలకొండ నరసింహ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాట అద్భుతంగా ఉంది అని వచ్చిన అతిధులు చూసి అభినందించారు.

నిర్మాత హేమలత మాట్లాడుతూ..ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో అనుబంధాలు అనురాగాలు తెలంగాణ సాంప్రదాయాలు కలబోసి రూపుదిద్దుకున్న చిత్రమిది.ఈ చిత్రానికి సంగీతం జే భాను ప్రసాద్, సింగర్స్ వందేమాతరం శ్రీనివాస్, నల్లగొండ గద్దర్, రోహిణి, సింధుజ శ్రీనివాస్, మారుతి అద్భుతంగా గానం చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

దర్శకుడు ఆకుల రాఘవ మాట్లాడుతూ..ఈ పాటలు 12:30 కు యూట్యూబ్ ఛానల్ ఉదయ్ కిరణ్ యుట్యూబ్ ఛానల్ లో వస్తుంది. కాబట్టి ఆ పాట చూసి మీ అందరూ మమ్మల్ని అభినందించాలని, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ ఉన్నాను.త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదల చేస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here