‘Kalinga Patnam Jeeva’ Motion Poster Launched by Producer Rahul Yadav

డి.యల్ ప్రొడక్షన్ పతాకంపై రిత్విక్ చిల్లికేశాల, చిత్ర శుక్ల, బిందు నటీనటులుగా  నాని బాబు దర్శకత్వంలో రిత్విక్ చిల్లి కేశాల నిర్మిస్తున్న “కలింగ పట్నం జీవా” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకున్న  సందర్భంగా చిత్ర యూనిట్  హైదరాబాద్ లో  మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, ‘మళ్లీ రావా’ చిత్రాల నిర్మాత రాహుల్ యాదవ్, లక్ష్య దర్శకుడు సంతోష్ జాగర్లపూడి ముఖ్య అతిధులుగా వచ్చి చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ముఖ్య అతిథిగా వచ్చిన

నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ ..రిత్విక్ చిల్లి కేశాల కొత్త కాన్సెప్ట్ ఉన్న కథను తనే రాసుకొని, హీరోగా నటిస్తూ కొత్త టీంతో సెలెక్ట్ చేసుకొని నిర్మిస్తూ సినిమాను ఇక్కడ దాక తీసుకురావడం చాలా గ్రేట్. ఇక్కడ  ప్రతి సినిమాకి కొత్త కష్టాలు ఉంటాయి.వాటిని ఎదుర్కోవాలి. తను చెప్పినట్లు లూజర్ గా సినిమాను మధ్యలో వదిలేయకుండా ఫైటర్ గా వినిమాను కంప్లీట్ చేయాలనే తన తపన నాకు నచ్చింది.ఎంతో ఇష్టంగా చేసిన చిత్ర యూనిట్ అందరికీ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు

దర్శకుడు సంతోష్ జాగర్లపూడి మాట్లాడుతూ.. మోషన్ పోస్టర్ చాలా బాగుంది.ఇలాంటివి కోవిడ్ టైంలో కూడా సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వరకు వచ్చి  సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకునే తన తపన నాకు  చాలా నచ్చింది.టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశారు.ఈ సినిమా అందరికీ గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను  అన్నారు.

చిత్ర  హీరో, నిర్మాత రిత్విక్ చిల్లికేశాల మాట్లాడుతూ.. మమ్మల్ని ఆశీర్వదించఫానికి వచ్చిన నిర్మాత రాహుల్ యాదవ్ గారికి, దర్శకుడు సంతోష్ జాగర్ల మూడి గారికి నా ధన్యవాదాలు. చిన్నప్పటి నుండి నాకు సినిమా అంటే ఎంతో ఇష్టం.అందుకే నా ఇంజనీరింగ్ ఫైనలియర్ లోనే సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసి ఎవరి హెల్ప్ లేకుండా నేను సంపాదించిన డబ్బు మొత్తంతో ‘కళింగ పట్నం జీవా” సినిమా తీసాను.ఈ సినిమాకు నేనే కథ రాసుకుని, హీరోగా నటిస్తూ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాను.రీరికార్డింగ్ వర్క్ కూడా నేనే చేశాను.బేసిక్ గా నేను డ్యాన్సర్ ను, అయినా. ఇందులో ఒక్క పాట కూడా ఉండదు. డిఫరెంట్ కంటెంట్ తో సినిమా తీయాలని ఈ సినిమా చేస్తున్నాము.ఇది రెగ్యులర్ ఫిల్మ్ లా ఉండదు. ఇందులో నేను వన్ ఐ బ్లైండ్(ఒక్క కన్ను) క్యారెక్టర్ లో నటించాను.ఈ సినిమా కోసం కోవిడ్ తోనే కాకుండా ఎన్నో కష్టాలు పడ్డాను,అయినా ఈ సినిమా ను ఒక లూజర్ గా మధ్యలో వదిలేయకుండా ఫైటర్ గా కంప్లీట్ చేయాలనుకుని ఎంతో కష్టపడి సినిమాను పూర్తి చేశాము. నటీనటులు, టెక్నిసిషన్స్ అందరూ కూడా నాకు ఫుల్ సపోర్ట్  చేశారు. నా మేనేజర్ రవి గారు నన్ను తన సొంత బ్రదర్ లా చూసుకున్నాడు. వీరందరికీ నా ధన్యవాదాలు. షూటింగ్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఒక కమర్షియల్ ఫిల్మ్ లా , కాకుండా డీఫ్రెంట్ కాన్సెప్టుతో   ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం. సినిమా చూసిన ప్రేక్షకులందరూ మంచి అనుభూతిని పొందుతారని ఖచ్చితంగా చెప్పగలను.ఈ సినిమాను అందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు

చిత్ర దర్శకుడు నాని బాబు మాట్లాడుతూ.. ఇదొక డీఫ్రెంట్ కథ.సినిమా బాగా వచ్చింది.రిత్విక్ చాలా హార్డ్ వర్కర్,నటీ,నటులు అందరూ చాలా బాగా నటించారు. టెక్నిసిషన్స్ అందరూ బాగా సపోర్ట్ చేశారు.సంగీత దర్శకుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు.ఇలాంటి మంచి చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన రిత్విక్ కు ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ బిందు మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ ఉన్న కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు చాలా ఎగ్సైటీ గా ఉంది. ఈ టీమ్ తో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది.ఇలాంటి మంచి అవకాశం కల్పించిన దర్శక, నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు

నటీనటులు
రిత్విక్ చిల్లికేశాల, చిత్ర శుక్ల, బిందు,ఉమా మహేశ్వర్, అంబటి శ్రీనివాస్, జబర్దస్త్ ఇమ్మానుయేల్ తదితరులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్ : డి.యల్ ప్రొడక్షన్
నిర్మాత : రిత్విక్ చిల్లికేశాల,
డైరెక్టర్ : నాని బాబు
కో.డైరెక్టర్ : ప్రశాంత్
డి.ఓ.పి : నానాజి & బన్నీ
సంగీతం : శుభంకర్
ఎడిటర్ : శ్రీరామ్
ప్రొడక్షన్ మేనేజర్ : రవి కుమార్
పి.ఆర్.ఓ : వీరబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here