Kcr Biopic ‘Telangana Devudu’ Movie Review

Cinemarangam.com
బ్యానర్ : మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్
సినిమా : ‘తెలంగాణ దేవుడు’.
రివ్యూ రేటింగ్ : 3/5
మూల కథ, నిర్మాత: మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్
లైన్ ప్రొడ్యూసర్: మహ్మద్ ఖాన్
రచన, దర్శకత్వం: వడత్యా హరీష్
నటీనటులు.. పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు
మ్యూజిక్: నందన్ బొబ్బిలి
సినిమాటోగ్రాఫర్: అడుసుమిల్లి విజయ్ కుమార్
ఎడిటర్: గౌతంరాజు
పీఆర్వో: బి. వీరబాబు

మ్యాక్ లాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సాగర్ శిష్యుడైన హరీష్ వడత్యా దర్శకత్వంలో మొహహ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మించిన చిత్రం ‘తెలంగాణ దేవుడు’. ఉద్యమనాయకుడి పాత్రలో పబ్లిక్ స్టార్‌ శ్రీకాంత్‌ నటించగా.. జిషాన్ ఉస్మాన్ హీరోగా పరిచయం అవుతున్నారు. సంగీత, బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృథ్వీ, రఘుబాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్యకృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం నవంబర్ 12న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎలా వుందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
1969 నాటి కాలంలో తెలంగాణలో సామాన్య ప్రజల జీవితాలు దోపిడీ దారుల దౌర్జన్యాల పాదాల కిందా నలిగిపోతూ ఉండేవి. నిధులు… నియామకాలు… నీళ్ల విషయంలో పాలకుల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తెలంగాణ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు.అవన్నీ చూస్తూ పెరిగిన విజయ్ దేవ్ (శ్రీకాంత్) తన చిన్నతనం నుంచే (చిన్ననాటి విజయ్ దేవ్ గా జిషాన్ ఉస్మాన్ నటించాడు) తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక ప్రేమను పెంచుకుంటాడు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే యువతకు ఉద్యోగాలు… తెలంగాణ సస్యశ్యామలం కావడానికి పుష్కలంగా నీళ్లు… ఈ ప్రాంతం అభివృద్ధికి కావాల్సిన నిధులను పుష్కలంగా తెలంగాణా ప్రాంతంలోనే ఉపయోగించుకుని… బంగారు తెలంగాణ కలను సాకారం చేసుకోవచ్చు అనుకోని
తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను బాధలను అర్ధం చేసుకుంటూ ఉద్యమం గొప్ప తనం గురించి ఓ అవగాహనకు వస్తాడు. ఈ మధ్యలో సుధ(సంగీత)తో విజయ్ దేవ్ కి వివాహం జరుగుతుంది. అలాగే కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఉద్యమ బాట నుంచి రాజకీయ బాట పడతాడు. ఏ రాజకీయ పార్టీ తెలంగాణకు న్యాయం చేయట్లేదని ఉద్యమ పార్టీని స్థాపించి ప్రత్యేక రాష్ట్రాన్ని ఎలా సాధించాడనేది తెరమీద చూడాల్సిందే.

 

నటీనటుల పనితీరు
ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీకాంత్ తన హావభావాలతో కేసీఆర్ పాత్రలో ఒదిగిపోయారు. కేసీఆర్ చిన్నప్పటి పాత్రలో ప్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్రలో కనిపించిన జిషాన్ ఉస్మాన్ కూడా బాగానే నటించాడు. ఈ సినిమాలో మంచి పాత్ర పోషించారు. కేసీఆర్ భార్య పాత్రలో సంగీత… కవిత పాత్రలో మధుమిత… హరీష్ రావు పాత్రలో అజయ్, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రలో సుమన్, రాజశేఖర్ రెడ్డి పాత్రలో కాశీ విశ్వనాథ్, జగన్ పాత్రలో సునీల్, జానారెడ్డి పాత్రలో పృథ్వి… తదితరులు నటించి మెప్పించారు

సాంకేతిక నిపుణుల పనితీరు :
అసలు నిజ జీవితాన్ని రెండు గంటల సినిమా కథగా చెప్పాలి అంటే.. ఆ జీవితంలోని మలుపులను, పరిస్థితులను, ఆ వ్యక్తి తాలూకు మొత్తం ఆలోచనా విధానాన్ని, ఆవేశాన్ని, మరియు ఆశయాన్ని ఇలా సమగ్రంగా అర్ధం చేసుకోవాలి. ఈ విషయంలో దర్శకుడు వడత్యా హరీష్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.కేసీఆర్‌ చిన్నతనం నుంచి… తన కాలేజ్ లైఫ్, ఉద్యయం, సీఎం వరకు సాగే కథను కమర్షియల్ ఫార్మాట్ లో కేసీఆర్‌ జీవితాన్ని చాలా ఫ్రెష్‌గా చూపించారు. దశాబ్దాల క్రితం తెలంగాణ ప్రజలు అనుభవించిన కన్నీటి గాధలను ఒంటబట్టించుకుని విప్లవోద్యమ రాజకీయ నాయకుడిగా ఎదిగిన సీఎం కేసీఆర్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కృతం చేయడానికి దర్శకుడు వడత్యా హరీష్ మంచి ప్రయత్నం చేశాడు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969 లో మళ్ళీ ఉద్యమం మొదలు కావడం… లాంటి ఘట్టాలను… మరోవైపు చూపిస్తూ… ఎక్కడా బోరింగ్ లేకుండా దర్శకుడు సినిమాను తెరపై ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీని వదిలి… తెలంగాణ సాధన కోసం.. ఉద్యమ పార్టీని స్థాపించి… ఆ తరువాత రాజకీయ పార్టీగా తెలంగాణలో ఇతర రాజకీయ పార్టీలను శాసించే స్థాయికి అంచెలంచె లుగా ఎదిగి… ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి.. రెండు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి… బంగారు తెలంగాణ సాకారం ఎలా ఆవిష్కరించారు అనేదాన్ని చాలా చక్కగా చూపించారు. ప్రేక్షకులకు నచ్చేవిధంగా కమర్షియల్ ఫార్మాట్ లో చక్కగా… బోరింగ్ లేకుండా.. ఎంతో ఎమోషనల్ గా వెండితెరపై ఆవిష్కరించి ప్రశంసలు అందుకున్నారు. ప్రజల కోసం అమలవుతున్న సంక్షేమ పథకాలు… రైతులకోసం కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు… తదితర వాటిని హైలైట్ చేస్తూ తెరకెక్కించిన సీన్స్ అన్నీ ఎంతో ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ కొంతవరకు ఆకట్టుకున్నాయి.ఈ చిత్రానికి సంగీతం బాగా కుదిరింది.కేసీఆర్ ఇప్పటి జీవితానికి అనుగుణంగా రాసుకొని పాటలు, డ్యూయెట్ లతో ఓ కమర్షియల్ బయోపిక్‌లా తెరకెక్కించారు ఎడిటింగ్ బాగుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. “తెలంగాణ దేవుడు” సినిమా చూసిన  ప్రేక్షకులందరికీ తప్పక నచ్చుతుంది.

Cinemarangam.com Review Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here