KR creations, Director Santhosh Jagarlapudi, Sumanth New movie

హీరో సుమంత్ ఓ కొత్త చిత్రానికి అంగీకరించారు. “సుబ్రహ్మణ్యపురం”, “లక్ష్య” చిత్రాలతో ప్రతిభ గల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతంలో విడుదలైన “సుబ్రహ్మణ్యపురం” సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్ని కేఆర్ క్రియేషన్స్ పతాకంపై కే ప్రదీప్ నిర్మిస్తున్నారు. హిట్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాను ఆదివారం ప్రకటించారు.

పురాతన దేవాలయం నేపథ్యంతో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఆద్యంతం ఆసక్తికరమైన, థ్రిల్ కు  గురిచేసే అంశాలతో సినిమాను రూపొందించబోతున్నారు దర్శకుడు సంతోష్ జాగర్లపూడి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈచిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర నిర్మాత కే ప్రదీప్ తెలిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here