సినిమారంగం.కామ్
రివ్యూ రేటింగ్ : 3.5/5
సినిమా : వరుడు కావలెను
సమర్పణ: పి.డి.వి.ప్రసాద్
నిర్మాత: సూర్య దేవర నాగవంశీ
కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య
నటీనటులు..నాగశౌర్య, రీతువర్మ నాయకా,నాయికలు కాగా నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష తదితరులు.
మాటలు: గణేష్ కుమార్ రావూరి,
ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్
పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకం పై యువ హీరో నాగశౌర్య, బ్యూటీఫుల్ హీరోయిన్ రీతువర్మ జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ వరుడు కావలెను. ఈ చిత్రం ద్వారా లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా పోస్టర్ చూసినా.. టీజర్ అండ్ ట్రైలర్స్ ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభించింది. స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా ప్రే రిలీజ్ కు వచ్చి ప్రమోట్ చేయడంతో వరుడు కావలెను పై అంచనాలు అధిక మయ్యాయి. ఈరోజు (అక్టోబర్ 29)న వరుడు కావలెను చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.
కథ
ఆకాష్ (నాగ శౌర్య) ఓ ఆర్కిటిక్. భూమి (రీతు వర్మ) లైఫ్ పట్ల చాలా క్లారిటీ ఉన్న అమ్మాయి. జీవితం పై పూర్తి అవగాహన ఉన్న ఈ అమ్మాయికి పెళ్లి విషయంలో మాత్రం అంతగా ఆసక్తిగా ఉండదు. ఆమె రన్ చేసే ఓ కంపెనీలోకి ఆకాష్ ఎంటర్ అవుతాడు. ఇక అక్కడ నుంచి వీరిద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే.. పెళ్లంటే ఏమాత్రం ఇష్టం లేని భూమి ఆకాష్ ని లవ్ చేస్తుందా..? లవ్ చేసినా మ్యారేజ్ కి ఒప్పుకుంటుందా.? అసలు పెళ్లే చేసుకోకూడదు అనే బలమైన నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి..? చివరికి ఆకాష్, భూమిల కథ ఏమైంది అనేది తెలుసుకోవాలంటే స్క్రీన్ పై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు
నాగశౌర్య ఆకాష్ పాత్రలో నటన పరంగా పాత్రకు తగ్గట్టుగా నటించాడు. సినిమాలో రెండు షేడ్స్ లో లుక్స్ పరంగా.. చాలా నీట్ గా.. హ్యాండ్సమ్ గా కనిపించాడు. అలాగే నాగశౌర్య అద్భుతమైన పెర్ఫామెన్స్ ను కనబరిచాడు. కెరీర్ లో నాగశౌర్య ది బెస్ట్ పర్ ఫార్మెన్స్ అని చెప్పచ్చు. అలాగే హీరోయిన్ రీతు వర్మ కూడా భూమి పాత్రలో మెప్పించింది. ఆమె నటనకు ఎక్కడా వంక పెట్టడానికి లేదు. రీతు పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పచ్చు. సీనియర్ నటి నదియా ఇప్పటి వరకు ఆమె నటించిన చిత్రాలకు భిన్నంగా ఉన్న మిడిల్ క్లాస్ మదర్ గా చాలా బాగా నటించారు. ఇక సప్తగిరి, వెన్నెల కిషోర్, ప్రవీణ్ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించారు. క్లీన్ కామెడీ ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేసింది.
సాంకేతిక నిపుణుల పనితీరు
ఇక దర్శకురాలు లక్ష్మీ సౌజన్యకు ఇది మొదటి చిత్రమే అయినప్పటికీ.. ఏమాత్రం తడబడకుండా మంచి అనుభవం ఉన్న దర్శకురాలు వలే తను అనుకున్న కథను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. గణేష్ రావూరి రాసిన సంభాషణలు చాలా బాగున్నాయి. ఈ కథకు ఏం కావాలో అవన్నీ అందించారు. మొత్తానికి సినిమాలో పాటలు, స్క్రీన్ ప్రెజెన్స్, హీరో హీరోయిన్ ఫెయిర్ ఫ్రెష్ గా అనిపిస్తుంది.. సినిమా లో మ్యూజిక్, కొన్ని సీన్లు, ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలెట్ , అక్కడ వచ్చే 15 నిమిషాల సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషన్స్ తో కట్టిపడేస్తాయి . అలాగే వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, థమన్, విశాల్ చంద్రశేఖర్ ల సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించారు. వరుడు కావలెను చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ అండ్ మెచ్యూర్డ్ లవ్ స్టోరీ.
Cinemarangam.com. Rating..3.5/5









