Love & Romantic Entertainer ‘Commitment’ Movie Review

Cinemarangam.com
Review Rating.. 3/5
సినిమా : “కమిట్ మెంట్ ”.
చిత్రం విడుదల : ఆగష్టు 19 – 2022 .
నిర్మాణం: ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్
ప్రొడ్యూసర్స్ : నీలిమ తాడూరి, బల్దేవ్ సింగ్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.లక్ష్మీకాంత్ చెన్న
న‌టీనటులు: తేజస్వి మడివాడ, రమ్య పసుపులేటి ,సీమర్ సింగ్ ,అన్వేషి జైన్ ,తనిష్క్ రాజన్ ,అమిత్ తివారి ,సూర్య  శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ , అభయ్ రెడ్డి ,తన్కిష్క్ జైన్ , రాజా రవీంద్ర తదితరులు ,
మ్యూజిక్ డైరెక్టర్ : నరేష్ కుమారన్
డి.ఓ.పి: సాజీశ్ రాజేంద్రన్ , నరేష్ రాణా ,
ఎడిటర్: ప్రవీణ్ పూడి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్  : ద్వారకేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్ పోలకి
డైలాగ్స్ : సంతోష్ హర్ష ,కార్తీక్ , అర్జున్, కళ్లి కళ్యాణ్ ,
కొరియోగ్రఫీ : హరికిరణ్
కో- డైరెక్టర్ : మెహర్
కాన్సెప్ట్ : ఈశ్వర్ గాయం
ఆర్ట్ : సుప్రియ బత్తెపాటి
లిరిక్స్ : పూర్ణ చారి ,గాంధీ

రచన మీడియా వర్క్స్ సమర్పణలో , ఎఫ్ 3 ప్రొడక్షన్స్ మరియు ఫుట్ లూస్ ఎంటర్ టైన్మెంట్స్ పై వచ్చిన మూవీ కమిట్ మెంట్” ఈ మూవీ లో రవి బాబు లాంటి క్రియేటివ్ స్కూల్ నుంచి వచ్చిన అభయ్ సింహా రెడ్డి,అలాగే తేజస్వి మడివాడ, అన్వేషి జైన్, సీమర్ సింగ్ , తనిష్క్ రాజన్ , అమిత్ తివారి , సూర్య శ్రీనివాస్, నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బల్ దేవ్ సింగ్, నీలిమ.టి లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే రిలీజైన ఈ సినిమా టీజ‌ర్, సాంగ్స్ కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సెన్సార్ స‌భ్యుల ప్ర‌శంస‌లతో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “కమిట్మెంట్” సినిమాను ఆగష్టు 19 న గ్రాండ్ థియేటర్స్ లలో విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో చూద్దాం పదండి.

కథ
“కమిట్ మెంట్ “అనేది విభిన్న కలలు మరియు లక్ష్యాలతో స్థిరపడటానికి పోరాడుతున్న నలుగురు అమ్మాయిల జీవితాల గురించి తెలియజేసే కథ “కమిట్ మెంట్ “.
మెదటిది స్టూడెంట్ కథ..ఐ. ఏ. ఎస్ కు ప్రిపేర్ అవ్వడానికి వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చిన పల్లవి (రమ్య పసుపులేటి ) ఒక డేటింగ్ యాప్ ద్వారా కాలేజ్ స్టూడెంట్ అయిన అభయ్ సింహారెడ్డి ని కలుస్తుంది.దాంతో వారిద్దరూ కాలేజ్ హాలిడేస్ లో గోవా కు వెళ్లి కమిట్ అవుతారు. ఆ తరువాత పల్లవిని వదిలించుకోవాలని పల్లవి లేని టైమ్ లో తనతో చేసిన వాట్సాప్ చాటింగ్, ఫోన్ నెంబర్ డిలీట్ చేసి వెళ్ళిపోతాడు. చివరికి ఆ అమ్మాయి మళ్ళీ వారిద్దరూ కలుసుకుంటారా లేదా?
రెండవది సినిమా ఇండస్ట్రీ కథ..సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకునే నేహా తేజస్వి మది వాడ) ఇండస్ట్రీ లో ఎలాంటి ప్రాబ్లెమ్ ఎదుర్కొంది చివరికి తను హీరోయిన్ అయ్యిందా లేదా?.
మూడవది డాక్టర్ కథ.. నిరుపేద కుటుంబంలో పుట్టిన భారతి (తనిస్క రాజన్) ఎంతో కష్టపడి మంచి ర్యాంక్ తెచ్చుకొని డాక్టర్ అయిన భారతి చివరికి డాక్టర్ సర్టిఫికెట్ కావాలంటే కమిట్ మెంట్ అడిగుతాడు డీన్ రాజా రవీంద్ర .అయితే తను డాక్టర్ సర్టిఫికెట్ కొరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంది?
నాలుగవ కథ రాయలసీమ విలేజ్ స్టోరీ.. రాజు (అమిత్ తివారి)కి జ్యోతి (సీమర్ సింగ్) అంటే ఎంతో ఇష్టం దాంతో తనను పెళ్లిచేసుకొంటాడు. అయితే జ్యోతి మాత్రం తన క్లాస్ మేట్ నాకు (సూర్య శ్రీనివాస్ ) ను ఇష్టపడుతూ తనకు దగ్గర అవ్వాలని చూస్తుంది. అయితే భర్త ఉండగా జ్యోతి నాగు కు ఎలా దగ్గరైంది?

ఇలా ఈ నలుగురు కూడా వారి జీవితంలో ఒకే సమస్యను ఎదుర్కొంటారు, వీరి సమస్యలను ఆసరాగా చేసుకొని కమిట్మెంట్ ఇవ్వాలని అడుగుతారు.ఆలా కమిట్ మెంట్ కొరకు వెళ్ళినపుడు సొసైటీ లో వీరంతా ఎటువంటి ప్రాబ్లమ్ ను ఎదుర్కొన్నారు? అనే ట్విస్ట్ &టర్న్స్ తో ఈ సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.. అసలు ఇందులో ఉన్న ఈ పాత్రలకి “కమిట్ మెంట్” కు ఉన్న సంబంధం ఏంటి? వీళ్ళు ఆ సమస్యని ఎలా ఎదుర్కున్నారు? అనేది తెలుసుకోవాలంటే థియేటర్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే…

నటీ నటుల పనితీరు
ఈ సినిమాలో ఉన్న నాలుగు స్టోరీస్ లలో అభయ్ సింహారెడ్డి ది క్యూట్ లవ్ స్టోరీ.“ క్రష్” సినిమాతో హీరోగా రంగ ప్రవేశం చేసి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న అభయ్ సింహా రెడ్డి ఇందులో ప్రజెంట్ యూత్ అంతా మెచ్చే పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు.స్టూడెంట్స్, రిలేషన్ షిప్ లో ఉన్న వారు కావచ్చు, ఇలా యూత్ అందరూ అభయ్ సింహారెడ్డి పాత్రకు అట్రాక్టు అవుతారు. ఇంకొకటి సినిమా ఇండస్ట్రీ లో హీరోయిన్ గా సెటిల్ అవ్వాలనుకునే పాత్రలో హీరోయిన్ తేజస్వి మదివాడ చాలా చక్కని నటనను ప్రదర్శించింది.డాక్టర్ పాత్రలో రమ్య పసుపులేటి మంచి నటనను కనబరచింది .అలాగే ఇందులో నటించిన రాజా రవీంద్ర చేసిన నెగిటివ్ పాత్ర బాగుంది ,రాయలసీమ యువకుడుగా అమిత్ తివారీ చాలా చక్కగా నటించి మెప్పించాడు . అతనికి జోడీగా పల్లెటూరు అమ్మాయిగా సీమర్ సింగ్ బాగా నటించింది , జిమ్ ట్రైనర్ గా అన్వేషి జైన్ , సూర్య శ్రీనివాస్, మాగంటి శ్రీనాథ్ వంటి తదితర నటీనటులు అందరూ వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పని తీరు:
నాలుగు కథలతో కొత్త కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమాలో ప్రస్తుతం ఆడవాళ్లు వర్క్ లో కానీ కాలేజ్ లోగానీ, ప్రొఫెషన్ లో గానీ ఇలా ఎందులోనైనా కానీ ప్రస్తుత సొసైటీ లో ఆడవారు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు వాటిని ఎలా ఓవర్ కమ్ ఎలా చేసుకోవాలనే దానిని కథగా మలచి చాలా చక్కగా తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ చెన్నా.ప్రతి ఒక్క ఇండస్ట్రీ లో ఆడవారు ఎలాంటి ప్రాబ్లెమ్స్ ఎదుర్కొంటున్నారు అని తెలుపుతూ ప్రాబ్లమ్ అనేది ఒక్క దగ్గరే కాదు ప్రతి చోటా మంచి చెడు అనేవి రెండు ఉంటాయి. వాటిని ఓవర్ కమ్ చేసుకోవాలని ఇందులో చూపించడం జరిగింది.. ప్రతి ఒక్క గర్ల్ కు ఉమెన్స్ కు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.అలాగే ఇందులోని డైలాగ్స్ ఎంతో జోవియల్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.కథ, కథనం, సంభాషణలు, గీత రచన ఇవన్నీ చక్కగా కుదిరేలా బాగా రాసుకున్నాడు. ఈ సినిమాకు నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణ. ‘కమిట్ మెంట్ ర్యాపో సాంగ్ ‘బాగుంది..నాతో ఇలా చలో చలో సాతియా. నాతో ఇలా ఉండిపో సాంగ్    సంగీతం కూడా వైవిధ్యంగా ఉండెలా నరేష్ కుమారన్ చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీని సజీష్ రాజేంద్రన్ , నరేష్ రానాల సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. ప్రవీణ్ పూడి తన ఎడిటింగ్ ను చాలా చక్కగా హ్యాండిల్ చేసారు.ఎఫ్ 3 ప్రొడక్షన్స్ , ఫుట్ లూస్ నిర్మాణంలో బల్దేవ్ సింగ్, నీలిమ తాడూరి లు సంయుక్తంగా నిర్మించిన నిర్మాతలు నేటి యువత‌ను ఆలోచింప జేసే ప్రయత్నం చేశారు. ”కమిట్ మెంట్ ” సినిమాకు కు వెళ్లిన ప్రేక్షకుడికి కచ్చితంగా ఎంట‌ర్ టైన్ చేసే పక్కా పైసా వసూల్ సినిమా అవుతుంది.

Cinemarangam.com Rating..3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here