Cinemarangam. Com
సినిమా : ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’.
విడుదల : 11.11.2022
రివ్యూ రేటింగ్ : 3/5
సమర్పణ : అట్లూరి ఆర్ సౌజన్య
బ్యానర్ : శ్రీరామ్ ఆర్ట్స్
నిర్మాత : అట్లూరి నారాయణ రావు,
దర్శకత్వం : గురు పవన్
సినిమాటోగ్రఫీ : సిద్దం మనోహార్,
మ్యూజిక్: గిఫ్టన్,
ఎడిటర్: ఉడగండ్ల సాగర్,
ఆర్ట్: దొలూరి నారాయణ,
పి.ఆర్.ఓ: జియస్ కె మీడియా,
ఆటగదరా శివ’, ‘మిస్ మ్యాచ్’, ‘క్షణ క్షణం’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకో ప్రత్యేకత తెచ్చుకున్నారు ఉదయ్ శంకర్. స్టాక్ మార్కెట్ కుంభకోణం నేపథ్యంలో వన్ డే లో జరిగే ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన థ్రిల్లర్, లవ్ స్టోరి ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ చిత్రాన్ని శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మించారు. దర్శకుడు గురు పవన్ దర్శకత్వం వహించారు.. ఈ నెల 11న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా వుందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:
ఈ సినిమాలో ఇఫ్ ఐ డై అనే ఒక యాప్ గురించి చర్చించడం విశేషం.యుద్ధ సమయంలో సైనికులు తాము చనిపోతున్న పరిస్థితుల్లో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలని లేదా ముఖ్య విషయాలను ఉన్నతాధి కారులకు, నాయకులు పంపించేలా ఒక వాచ్ డిజైన్ చేశారు. ఆ వాచ్‌లో ఈ యాప్ ఉంటుంది. ఇది నిజంగానే ప్రయోగ దశలో ఉన్న యాప్. మరో రెండు మూడేళ్లలో ఇది అందుబాటులోకి రానొచ్చు. ఈ యాప్ నేపథ్యంగానే కథ సాగుతుంటుంది.
రాజా (ఉదయ్ శంకర్) బీకామ్‌తోనే చదువు ఆపేసి… షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ ఉంటాడు. అయితే రాజా శాండీ (జెన్నీఫర్) చూసి ప్రేమిస్తున్నానని ఆమె వెంట పడతాడు.ఆ తరువాత ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ప్రేమించుకుంటారు. వీళ్ల ప్రేమ కథ ఇలా సాగుతుంటే.. శాండీ పుట్టిన రోజు శాండీకి ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఓ సందేశం వస్తుంది. నువ్వు ఎవరితో మాట్లాడితే వారిని చంపేస్తాను అంటూ ఓ సందేశం వస్తుంది.వారు చెప్పినట్లే శాండీ మనుషులను చంపేస్తుంటారు.ఒక రోజు శాండీ కొరకు ఎదురు చూస్తున్న రాజాకు శాండీ, రాహుల్ తో ముద్దు పెట్టుకొనే సీన్ చూసి షాక్ అవుతాడు.ఆ తరువాత నీలాంటి పనీ పాట లేని వాన్ని ఎలా ప్రేమిస్తాను అనుకున్నావ్ రా ఫూల్ అంటూ రాజాని ఎగతాళి చేసి తన బాయ్ ఫ్రెండ్ రాహుల్ తో వెళ్ళిపోతుంది. ఆ తరువాత అనుకోకుండా రాజా పై ఆటాక్ చేసి చంపాలని చూస్తారు కొందరు దుండగులు. అయితే రాజా వెంట పడుతున్న అపరిచత వ్యక్తులు ఎవరు? శాండీ మనుషులనే ఎందుకు చంపుతుంటారు? శాండీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? రాజా వెంటపడుతున్న అపరిచిత వ్యక్తులకు రాజా ఎలాంటి గుణపాఠం చెప్పాడు? చివరకు శాండీ ప్రేమను దక్కించుకున్నాడా.. లేదా? అనేది తెలుసుకోవాలంటే తప్పకుండా ఈ సినిమా చూడాల్సిందే..

నటీ నటుల పని తీరు
ఉద్యోగం లేకుండా తిరిగే రాజారాం పాత్రలో ఉదయ్ శంకర్ తన నటనతో ఆకట్టుకున్నాడు. తనకు జాబ్ లేకపోయినా మార్కెట్ షేర్స్ తో , ఆన్ లైన్ ట్రేడింగ్ పేరుతో బడా కంపెనీలు మధ్య తరగతి ప్రజలను ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని అందరికీ వివరించిన తీరు అద్భుతం అని చెప్పవచ్చు.శాండీ పాత్రలో నటించిన హీరోయిన్ జెన్నీఫర్ తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది అని చెప్పచ్చు. హీరో ఫ్రెండ్ గా నటించిన మధు నందన్ ఇటు ఫ్రెండ్ ను దూరం చేసుకోలేక, అటు సెలెక్ట్ అయిన ఉద్యోగానికి దగ్గర కాలేక తన కామెడీతో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే కమెడియన్ పృథ్వీ పేటీఎం ప్రసాద్‌గా నవ్వులు పూయిస్తాడు. మార్కెట్ షేర్ అనలిస్ట్ పాత్రల్లో శ్రీకాంత్ అయ్యంగార్, వీకే గ్రూప్ అధినేత విక్రమ్ రాయ్ పాత్రలో చక్కటి విలనిజం చూయించాడు , యం.జి గ్రూప్ అధినేత గా మోహన్ గౌరవ్ పాత్రలో సుమన్ ఇలా అందరూ కూడా వారికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
మధ్య తరగతి వాళ్ల నుండి ఆన్ లైన్ ట్రేడింగ్,షేర్ మార్కెట్ల పేరుతో పెట్టుబడి పెట్టించి వారిని ఎలా మోసం చేస్తున్నారు
ఈ ఇష్యూ వలన దేశ భద్రతకు ఎలాంటి నష్టం జరుగుతుందనే ఒక సోషల్ ఇష్యూ లాంటి డిఫరెంట్ కథను చాలా గ్రిప్పింగ్ గా అందరికీ ఆర్థమయ్యే రీతిలో దర్శకుడు గురుపవన్ చాలా చక్కగా రాసుకొన్నాడు.సూర్యోదయం మొదలు కొని సూర్యాస్తమయం మధ్య అంటే ఉదయం ఆరు గంటలకు మొదలై…సాయంత్రం ఆరు గంటలకు 12 గంటల్లో జరిగే కథను అద్భుతంగా తెరకేక్కించాడని చెప్పవచ్చు. మొదటి భాగం అంతా హీరో, హీరోయిన్ పై జరిగే లవ్ ట్రాక్ సాగుతున్న సమయంలో సడన్ గా హీరోయిన్ జెన్నీఫర్ ప్రేమించడం లేదని హీరో రాజా కు షాక్ ఇవ్వడం ఆ తరువాత నుండి ట్విస్ట్ & టర్న్స్ తో చూస్తున్న ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా చక్కగా తెరకెక్కించాడు. ఈ సినిమాకు గిఫ్టన్ మ్యూజిక్ ప్రధాన ఆకర్షణ గోవాలో షూట్ చేసిన ఫాంటసీ సాంగ్ తో పాటు ప్రతీ పాట ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. సినిమాటోగ్రాఫర్ సిద్దం మనోహార్ కెమెరా పనితనం బాగుంది. వైజాగ్‌లోని అందాలన్నీ చాలా బాగా చూపించారు. ఉడగండ్ల సాగర్ ఎడిటింగ్ పని తీరు బాగుంది. అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో శ్రీరామ్ ఆర్ట్స్ పతాకంపై అట్లూరి నారాయణరావు ఖర్చుకు వెనుకడకుండా నిర్మించిన ‘నచ్చింది గాళ్ ఫ్రెండూ’..సినిమా ఫ్యామిలీ అందరూ వచ్చి చూసే విధంగా చాలా చక్కగా తెరకెక్కించారు. మంచి మెసేజ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అన్ని వయస్సుల వారిని కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పవచ్చు
Cinemarangam. Com Review Rating.. 3/5









