“Malikapuram” released by Geetha Film Distribution received great response from the first show like “Kanthara”.

ఒక గొప్ప సినిమాను, ఒక మంచి సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకులకు అందించాలి అనే ఉద్దేశ్యంతో “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ఎప్పుడు ముందంజలోనే ఉంటుంది. ఇతర భాషల్లో హిట్ అయినా సూపర్ హిట్ సినిమాలను డబ్ చేసి ఆహా ప్లాట్ఫ్రామ్ లో అందించడమే కాకుండా థియేటర్ రిలీజ్ కు కూడా ఒక మంచి సినిమాను అందించడం గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ప్రత్యేకత.

సెప్టెంబర్ 30 న కన్నడలో రిలీజైన కాంతార చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రం తెలుగులో అక్టోబర్ 15 న రిలీజై ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగులో మెగా నిర్మాత అల్లు అరవింద్ “గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్” ద్వారా రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన మొదటిరోజునుంచే ఈ చిత్రం ఊపందుకుంది.

ఇప్పుడే అదే తరహాలో ఉన్ని ముకుందన్ నటించిన మలయాళ చిత్రం ‘మలికాపురం’ సినిమాను నేడు (జనవరి 26) ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.ఇప్పుడు ఈ సినిమాకి కూడా కాంతార మాదిరిగా మొదటి షో నుండే విశేష ఆదరణ లభిస్తుంది. ప్రేక్షకులు ఈ సినిమాకు ఇప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడలో వచ్చిన కాంతార మాదిరిగా ఇదొక మలయాళీ కాంతార అని ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు.

తన సూపర్‌హీరో అయ్యప్పన్‌ని కలవడానికి వేచి ఉన్న ఒక చిన్న అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఉన్ని ముకుందన్ కథానాయకుడిగా నూతన దర్శకుడు విష్ణు శశి శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.కాంతార మాదిరిగానే ఈ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా జనవరి 26 విడుదలై మంచి టాక్ తో దూసుకుపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here