“Mamangam” Trailer launch

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి. అలాంటి ఒక విభిన్నమైన కథ ‘మామాంగం’తోప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి. జమోరిన్ పాలనలో చావెరుక్కల్‌ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిసెంబర్12న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రీబ్యూట‌ర్స్ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌వుతుంది. తాజాగా డిసెంబ‌ర్ 3న హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగిన విలేఖ‌రుల స‌మావేశంలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ విడుదల చేశారు…

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ… చ‌రిత్రలో క‌నిపించ‌ని హీరోలు ఎంద‌రో ఉన్నారు. సైరా చిత్రం కూడా అలాంటి పోరాట యోధుడి జీవిత గాధే. ఇప్పుడు వ‌చ్చే `మామాంగం` కూడా అలాంటి ఒక పోరాట యోధుడి చ‌రిత్రే. ఆయ‌న పోరు కూడా ఒక స్వాతంత్య్ర పోరాటం లాంటిదే. నిర్మాత‌లు ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌లు కూర్చి ఇంత చ‌క్క‌టి చారిత్రాత్మ‌క చిత్రం చేయ‌డం చాలా గొప్ప‌విష‌యం. ఈ చిత్రం కోసం దాదాపుగా 50కోట్లు ఖ‌ర్చు చేశార‌ని నేనే విన్నాను. న‌న్ను ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌మ‌ని కోర‌గానే చాలా ఆనంద‌ప‌డ్డాను. మ‌మ్ముట్టి గురించి మీకొక విష‌యం చెప్పాలి. స్వాతి కిర‌ణం చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడుని తీసుకున్న‌ప్పుడు మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతాడు అనుకున్నాను. ఇలా తీసుకున్నారేంటి అని ఆశ్చ‌ర్య‌పోయాను. కానీ సినిమా విడుద‌ల‌య్యాక థియేట‌ర్‌లో క‌నీసం లేచి నిల‌బ‌డ‌లేక‌పోయాం అంత గొప్ప‌గా న‌టించారు. అంత గొప్ప న‌టుడాయ‌న‌. ఓ ప‌దేళ్ళ త‌ర్వాత నేను ఆయ‌న‌కు ఒక సంద‌ర్భంలో కాల్ చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం ఓ విల‌న్ పాత్ర ఉంది చేయ‌మ‌న్నాను దానికి ఆయ‌నఇదే మాట చిరంజీవిని అడుగుతావా అన్నారు. నేను అడ‌గ‌న‌న్నాను మ‌రి న‌న్నెందుకు అడుగుతున్నావ్ అన్నారు. ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తీశారు. ఇన్యా, ప్రాచీతెహ్లాన్ చాలా బాగా న‌టించారు. వండ‌ర్ బాయ్ అచ్యూత‌న్‌ ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా కేర‌ళ‌లోని క‌ల‌రీ అనే విద్య‌ను ప్ర‌త్యేకంగా నేర్చుకుని చాలా చ‌క్క‌గా చేశాడు. ఇంకా ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్“ అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌హి.వి. రాఘ‌వ‌ మాట్లాడుతూ – “ మ‌మ్ముట్టిగారు దాదాపు 400పైగా చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న చిత్రాల్లో ఆయ‌న క‌నిపించ‌డు కేవ‌లం ఆయ‌న పోషించిన పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఆయ‌న నాతో స‌హా దాదాపుగా 80-90 మంది కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. అందుకు వారంద‌రి త‌ర‌పున ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు ప‌ద్మాక‌ర్‌గారు ఈ చిత్రాన్ని చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు“అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వివేక్ మాట్లాడుతూ… కావ్య ఫిలిం కంపెని త‌ర‌పున నేనిక్క‌డికి రావ‌డం జ‌రిగింది. డిసెంబర్12న నాలుగు భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. కేర‌ళ చ‌రిత్ర అంటే మొత్తం భార‌త‌దేశానికి చ‌రిత్ర అన్న‌ట్లే. మా చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు వాసుగారికి, గీత ఆర్ట్స్‌కి నా ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రానికి కీర‌వాణి గారు చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా చ‌క్క‌టి సంగీతాన్ని స‌మ‌కూర్చారు“అన్నారు.

వండ‌ర్ బాయ్ అచ్యూత‌న్ మాట్లాడుతూ… నేను ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా క‌ల‌రి అనే విద్య‌ను నేర్చుకున్నాను. ఈ చిత్ర షూటింగ్ కోసం దాదాపుగా నేను రెండు సంవ‌త్స‌రాలు స్కుల్‌కి కూడా వెళ్ళ‌లేదు. కేవ‌లం ఎగ్జామ్స్ టైం లో మాత్ర‌మే వెళ్లి ఎగ్జామ్స్ రాసి వ‌చ్చేవాడిని. ఇది నా మొద‌టి చిత్రం. నా మొద‌టి చిత్ర‌మే మ‌మ్ముట్టి గారి లాంటి లెజెండ‌రి యాక్ట‌ర్ తో చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో స‌పోర్ట్‌ని అందించిన మ‌మ్ముట్టిగారికి ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు న‌న్ను ఒక త‌మ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు“అన్నారు.

నటుడు ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ – ” నా కెరీర్ మమ్ముట్టి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ‘జనతా గ్యారేజ్’ ‘భాగమతి’ చిత్రాల్లో నటించాను. ఈ సినిమాతో మరోసారి మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీ గా ఉంది” అన్నారు.

న‌టి ప్రాచి తెహ్లాన్ మాట్లాడుతూ – “ నా డెబ్యూ మూవీ నాలుగు భాషలలో విడుదలవడం సంతోషంగా ఉంది. అలాగే మొదటి సినిమాలోనే మమ్ముట్టి గారితో నటించడం నా అదృష్టం. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. కానీ ఈ సినిమా కోసం నేర్చుకొని చేయడం జరిగింది. ఈ సినిమా మొత్తం ఒక బ్యూటిఫుల్ జర్నీ” అన్నారు.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి మాట్లాడుతూ… ఈ చిత్రం నాకు మాట‌ల్లో చెప్ప‌లేని అనుభ‌వం. ఇదొక మ్యాజిక్‌లా జ‌రిగిపోయింది. అంద‌రం చాలా ఫ‌న్నీగా షూట్ చేశాం. అంద‌రం చాలా స‌ర‌దాగా ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి అనుభ‌వం. మామాంగం కేవ‌లం కేర‌ళకే మ‌హోత్స‌వం మాత్ర‌మే కాదు. మ‌న దేశం మొత్తానికి మ‌హోత్స‌వం లాంటిది. 16, 18శ‌తాబ్ధాల్లోదీన్ని ఒక పెద్ద ఉత్స‌వంలా జ‌రిపేవారు. ఎన్నో భావోద్యేగాల‌తో నిండిన‌ క‌థ ఇది. చ‌రిత్ర‌ను ఎంతో వాస్త‌వికంగా క‌ళ్ళ‌ముందు క‌ట్టిన‌ట్టు తీసుకొచ్చారు. సీజీ చాలా త‌క్కువ ఉంటుంది. ఎక్కువ‌గా సెట్ ల పైనే దీన్ని తీశారు. ఇది ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవ‌ల‌సిన క‌థ‌. ఈ చిత్రంలోని వేసిన సెట్‌లు ఏవీ మీకు ఎక్క‌డా కూడా ఆర్టిఫిష‌య‌ల్ అనిపించ‌వు. వాస్త‌వికానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి అన్నారు.

మమ్ముట్టి, ప్రాచి తెహ్లాన్‌,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్, డైలాగ్స్ : కిరణ్, డి.ఓ.పి: మనోజ్ పిళ్ళై, యాక్షన్: శామ్ కౌశల్, వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్, ఎడిటర్: రాజా మొహమ్మద్, మ్యూజిక్: ఎం. జయచంద్రన్, బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ, ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి, డైరెక్టర్: ఎం. పద్మకుమార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here