Cinemarangam.Com
సినిమా : “రణస్థలి”
విడుదల : 26.11.2022
రివ్యూ రేటింగ్ : 3.5/5
సమర్పణ : సూరెడ్డి విష్ణుగారి
బ్యానర్ : A J ప్రొడక్షన్స్ బ్యానర్
నిర్మాత : అనుపమ సూరెడ్డి
కో ప్రొడ్యూసర్ : లక్ష్మీ జ్యోతి శ్రీనివాస్
దర్శకుడు : పరశురాం శ్రీనివాస్
నటీ నటులు : ధర్మ (హీరో) చాందిని రావు(హీరోయిన్), ప్రశాంత్, శివ,అశోక్ సంగా తదితరులు
మ్యూజిక్ : కేశవ్ కిరణ్
కెమెరామెన్ : జాస్టి బాలాజీ,
ఎడిటర్ : భువనచంద్ర.ఎమ్
అసిస్టెంట్ డైరెక్టర్ : మూర్తి,
కెమెరా అసిస్టెంట్ : సాయి
పీ. ఆర్ ఓ : హరీష్, దినేష్
ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై ధర్మ(హీరో)చాందిని రావు (హీరోయిన్ )ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం నటీనటులుగా పరశురాం శ్రీనివాస్ దర్శకత్వములో అనుపమ సూరెడ్డి నిర్మించిన చిత్రం “రణస్థలి”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 26 న గ్రాండ్ గా థియేటర్స్ లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి

కథ :
బసవ( ధర్మ) అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు.. బసవ ఇంట్లోనే పెరుగుతుంది. ధర్మ తండ్రి మున్నియ్య(సమ్మెట గాంధీ) వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఆరు నెలల్లో ప్రభుత్వ ఉద్యోగంలో చేరాల్సిన బసవ.. అప్పటి వరకు ఖాళీగా ఉండకుండా.. చేసిన అప్పు తీర్చడం కోసం ఏదో ఒక పని చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతను చక్రవర్తి(బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పనికి చేరతాడు. అయితే ఒకరోజు చక్రవర్తి తోటలో పనిచేయడం కోసం నలుగురు పనివాళ్ళు వస్తారు. వీళ్ళకు బస ఏర్పాటు చేయమని చక్రవర్తి.. బసవ,అమ్ములకి చెబుతాడు. అయితే వచ్చింది పని వాళ్ళు కాదు మర్డర్లు చేసే కిరాయి గుండాలు. వాళ్ళ గురించి బసవకి తెలిసేలోపే.. చక్రవర్తిని, అమ్ములుని చంపేస్తారు? అసలు ఆ గుండాలు ఎందుకు చక్రవర్తిని, అమ్ముని చంపేశారు. వాళ్ళను ఎవరు పంపించారు. అసలు చక్రవర్తి ఎవరు? అనేది తెర పై చూడాల్సిన కథ.

నటీనటుల పనితీరు :
బసవ పాత్రలో ధర్మ గా చాలా చక్కటి అభినయాన్ని ప్రదర్శించాడు.పెద్ద హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా
తను చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.అమ్ములు పాత్ర చేసిన చాందినీ రావు చక్కటి నటనతో మెప్పించింది. అమ్ము అభిరామి కూడా తన హావ భావాలతో చాలా చక్కగా నటించింది .హీరోకి ఫాదర్ నటించిన సమ్మెట గాంధీ తండ్రి పాత్రలో జీవించేశాడు. విలన్ గా చేసిన శివ కూడా టెరిఫిక్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పండు వంటి వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.ఈ సినిమాలో నటీనటులు అందరూ కొత్తవారే అయినా వారంతా అద్భుతంగా నటించారు.ప్రతి క్యారెక్టర్ లో కూడా క్యారెక్టర్ కనిపిస్తుంది తప్ప ఆర్టిస్టులు కనిపించరు

సాంకేతిక నిపుణుల పనితీరు :
రొటీన్ గా వచ్చే కథలకు భిన్నంగా కొత్త నటీ నటులతో దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ తాను అనుకున్న పాయింట్ ను ట్విస్ట్ & టర్న్స్ తో ఎంతో ఎంగేజింగ్ గా తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్, హీరో ఫ్రెండ్ కిడ్నాప్ ఎపిసోడ్ తో పాటు క్లైమాక్స్ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసేలా తీర్చిదిద్దిన విధానం చూస్తుంటే దర్శకత్వ ప్రతిభ ఏంటనేది అర్ధమవుతుంది, ఇలాంటి సినిమాను ప్రేక్షకులకు కన్ఫీజన్ లేకుండా అర్థమయ్యే విదంగా చెప్పడంలో దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు.
జాస్టి బాలాజీ కెమెరాపనితనం అద్భుతం అని చెప్పవచ్చు
ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మెప్పిస్తాయి.కేశవ్ కిరణ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పరశురాం శ్రీనివాస్ వ్రాసిన పాటలు, ఫైట్లు, డ్యాన్సులు, డైలాగులతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం అనే చెప్పాలి. భువనచంద్ర.ఎమ్ ఎడిటింగ్ పనితీరు బాగుంది. ధర్మ,బసవ & సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై నిర్మాతలు విష్ణు, జ్యోతి లు ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.మాస్ & యాక్షన్ ప్రియులకే కాకుండా ఫ్యామిలీ అడియన్స్ ను కూడా సర్ప్రైజ్ చేస్తూ అలరించే రా అండ్ రస్టిక్ మూవీ ఇది. ఇలాంటి సినిమాను ఫోన్, లాప్టాప్ లలో చూసే సినిమా కాదు. థియేటర్స్ లలో చూస్తే వచ్చే ఎక్స్పీరియన్స్ వేరు ఈ సినిమాను చూసిన తరువాత ప్రేక్షకులకు కొత్త వారితో తీసినా సినిమాలా అనిపించదు. థియేటర్స్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకులందరూ కచ్చితంగా కొత్త అనుభూతితో బయటకు వచ్చేలా ఈ సినిమా ఉంటుంది .కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు తప్పకుండా చూడదగ్గ సినిమా అని చెప్పవచ్చు.
Cinemarangam.Com Review Rating : 3.5/5









