Megastar Chiranjeevi and Minister Talsani Srinivas Yadav Distribute health Cards to film journalists

తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ తమ సభ్యుల కోసం ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ,సెక్రటరీ వై.జె.రాంబాబు, ట్రెజరర్ సురేందర్ నాయుడు, వంశీ కాక, వంశీ శేకర్ మొదలకు వారంతా ఎంతో కష్టపడి జర్నలిస్టుల కొరకు  హెల్త్ కార్డులు సాధించడం జరిగింది.ఈ సందర్భంగా వాటిని డిస్ట్రిబ్యూషన్  చేయడానికి మెగాస్టార్ చిరంజీవిని, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి లను ముఖ్య అతిధులుగా TFJA సభ్యులు  పిలిచారు.ఈ కార్యక్రమాన్ని చిరంజీవి చేతుల మీదుగా నిర్వహించాలని నిర్ణయించుకొని చిరంజీవి గారిని అడగగా తను ఎంతో సంతోషపడి జర్నలిస్టులు నా కుటుంబ సభ్యు లాంటి వారు మీ కార్యక్రమంలో నేను పాల్గొనకపోతే ఎలా అని  ఆనందాన్ని వ్యక్తం చేసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులందరికే హెల్త్ కార్డ్స్ పంపిణీ చేసిన అనంతరం

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఫిలిం జర్నలిస్టులు నాకు కుటుంబ సభ్యులతో సమానం వారికి ఈ రోజు హెల్త్ కార్డ్స్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు స్టార్టింగ్ స్టేజ్ లో కలిసిన కొంతమంది జర్నలిస్టుల పై నాకు  ఈ హెల్తీ ఫీలింగ్  కలగడానికి గల కారణాన్ని మీతో షేర్ చేయలనుకుంటున్నాను. నా స్టార్టింగ్ స్టేజ్ అంటే “ప్రాణం ఖరీదు” సినిమా చేసే టైం లో ఏ జర్నలిస్టు అయినా  నా గురించి ఒక ఆర్టికల్ గానీ ఫోటో గానీ పేపర్ లో వేస్తే బాగుండు అనుకున్న తరుణంలో  ఒక జర్నలిస్టు నా గురించి రాయడం జరిగింది చాలా ఆనంద పడి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. వెంటనే ఆ జర్నలిస్టును చెన్నై లోని టీ నగర్ ఆంధ్ర క్లబ్ దగ్గరకు పిలిచి వారికి థాంక్స్ చెపితే బాగోదు అని  అప్పట్లో నాకున్న అతి తక్కువ డబ్బుల్లో కొంత అమౌంట్ చేతిలో పెట్టబోయాను వెంటనే ఆయన  నేను డబ్బు కోసం రాయలేదు. మీలాంటి ఆర్టిస్టులకు ఎంకరేజ్ చెయ్యడానికి రాశాను అని చెప్పడం జరిగింది.అప్పుడు జర్నలిస్టుపై నాకు అపారమైన గౌరవం పెరిగింది. ఆ వ్యక్తి ఎవరో కాదు కీ.శే పసుపులేటి రామారావు గారు. ఆరోజు నుంచి ఆయన చనిపోయే వరకు కూడా తనతో నాకు స్ట్రాంగ్  అసోసియేషన్ కలిగి ఉన్నాను. జీవితాంతం పసుపులేటి రామారావు గారిని గుర్తుంచు కుంటాను

ఆ తర్వాత సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు గుడిపూడి శ్రీవారి,వి.ఎస్‌.ఆర్‌. ఆంజ‌నేయులు నందగోపాల్ మొదలగు చాలా మంది జర్నలిస్టులు నటనలో స్పీడు ఉండాలి గానీ మాటల్లో స్పీడ్ ఉండ కూడదు అని చెప్పిన మాట నాలో ఆలోచనలను రేకెత్తించింది ఇలా వారిచ్చిన ఎన్నో టిప్స్ తో పాటు నా మాటల్లో, నటనలోని లోపాలను తెలిపడంతో .నేను జీవితంలో ఎదగడానికి అవి చాలా ఉపయోగ పడ్డాయి.వారి నుంచే హెల్తీ జర్నలిజం ఏమిటనేది  నేర్చుకున్నాను. అప్పటి నుంచి జర్నలిస్టుల అందరి తోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి.ఆ గౌరవం ఇప్పటికీ ప్రతి ఒక్క జర్నలిస్టు మీద గౌరవం ఉండడానికి అది నాకు నాంది పలికింది.ఈ రోజు  జర్నలిస్టులు మా ఇంటికి వచ్చి  ఈ కార్యక్రమం గురించి వివరించి పిలిచిన వెంటనే నేను రావడానికి ఒప్పుకున్నాను.CCC  పెట్టినప్పుడు కూడా 24 క్రాఫ్ట్స్ కు మాత్రమే కాకుండా ఫిలిం జర్నలిస్టులు కూడా ఇందులో కలపాలని వారిని కలవడం జరిగింది. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేను జర్నలిస్టుల మిత్రులకు  నేను అండగా ఉంటాను.

ఈ రోజున మీకు మీరుగా అసోసియేషన్ ను స్ట్రాంగ్ గా చేసుకొని హెల్త్ కార్డ్ ఇన్సూరెన్స్ సంబంధించి ఏర్పడటం చాలా సంతోషం. మేము ఇంత వరకు  మీకు చేసింది చాలా తక్కువ.ఏదైనా  అవసరం ఉన్నచోట మేమున్నామని మేము సపోర్ట్ చేయడమే తప్ప మేము చేసింది చాలా తక్కువ, చేయాల్సింది చాలా ఉంది.  తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు చేసే సినిమా నుండి ఒక్కొక్క సినిమాకు ఒక లక్ష రూపాయలు జర్నలిస్టుల అసోసియేషన్ కు ఇస్తే బాగుంటుందని చెప్పడం నాకు బాగా నచ్చింది. ఆ విషయం నేను నిర్మాతలతో మాట్లాడి సహాయం చేయడానికి ముందు ఉంటాను.

తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నటీనటులు అవార్డుల విషయంలో నిరాదరణకు గురవుతున్నారు. ఈ విషయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు పునరాలోచించాలని కోరుతున్నాను. టి.ఎఫ్‌.జె.ఏ ఒకడుగు ముందుకువేసి రాబోయే రోజుల్లో  జర్నలిస్టులకు ఫిలిం అవార్డ్స్ ఇవ్వాలనే  వారికోరిక నాకు నచ్చింది. ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు. ఒక్క తెలుగు సినిమాలు కాకుండా సౌత్ ఇండియా, ఉత్తర లాంగ్వేజ్ లను కలుపుకొని చేయడం కోసం ఆయా లాంగ్వేజెస్ జర్నలిస్టులను వాళ్ళతో మాట్లాడి వారి సహాయ సహకారాలతో ఈ నవంబర్ లో అవార్డ్స్ ఇచ్చేందుకు  ప్రయత్నిస్తున్నాం. సౌత్ ఇండియా స్థాయిలో సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్ ఇవ్వాలని నిర్ణయించడం ఇది చాలా శుభ పరిణామం. దీనికి  నా వంతు సపోర్ట్ గా నేను ఎప్పుడూ  నీ వెనకాల ఉంటానని మీకందరికీ  తెలియజేస్తున్నాను అన్నారు.

మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్  మాట్లాడుతూ..TFJA టీం కు చిరంజీవి గారి చేతుల మీదుగా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ తీసుకున్న జర్నలిస్టుల కు ధన్యవాదాలు. ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టులు అంటే ఫోర్త్ పిల్లర్ లాంటి వారు..ఈ రోజు ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ లో గాని ఏదైనా ప్రతి అంశాన్ని రాజకీయం చేసే జర్నలిజాన్ని  మనం చూస్తున్నాం.కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు జర్నలిస్టులే పెద్ద అస్సెట్ అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే డే వన్ నుండి చివరి వరకు ఆ సినిమాకు ఎంత ప్రమోట్ చెయ్యాలో అంత ప్రమోట్ చేస్తారు తప్ప ఏ రోజు రాజకీయాలు చెయ్యకుండా డిసిప్లిన్ గా వుండే జర్నలిస్టులు ఎక్కడైనా దొరుకుతారా..అంటే ..అది తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దొరుకుతుంది అని కచ్చితంగా చెప్తాను. కరోనా టైం లో అందరి జీవితాలు అతలా కుతలం అయితే మీ అందరికీ చేదోడు వాదోడు గా ఉండాలని చిరంజీవి గారు ముందుకు వచ్చారు.దేశ వ్యాప్తంగా ఎంతో మంది ఉన్నప్పటికీ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడమనేది హర్శించదగ్గ విషయం.ఈ రోజు దేశ వ్యాప్తంగా తెలుగు చిత్రం పేరు ప్రఖ్యాతలు పొందుతుంది అంటే దానికి ప్రధాన కారణం తెలుగు ఫిల్మ్ జర్నలిస్టుల. కాబట్టి జర్నలిస్టుల పక్షాన చిరంజీవి గారికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ప్రస్తుతం ఎన్నో సినిమాలు వస్తున్న తరుణంలో ప్రతి సీనిమాకు లక్ష రూపాయలు జర్నలిజం ఫండ్ కింద ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమ కు సింగిల్ విండో, ఐదవ షో ఇవ్వడం, రేట్ ఫ్లెక్సిబుల్ ఇవ్వడం ఇలా చాలా విషయాల్లో సపోర్ట్ గా నిలుస్తుంది. రెండోది జర్నలిస్టులకు అక్రిడేషన్ విషయంలో కూడా I & PR  తో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యే ఏర్పాటు చేస్తాను. తెలంగాణ ప్రభుత్వం ద్వారా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు లలో మీకు ఉపయోగపడేలా మీ అందరికీ కో ఆపరేట్ చెయ్యడానికి ముందు ఉంటాను..అనిల్ రావిపూడి, దిల్ రాజు, చినబాబు లు  ఈ యూనియన్ కు సపోర్ట్ గా నిలిచారు.అలాగే జర్నలిస్టులకు నా వంతుగా 5 లక్షల రూపాయలు ఇస్తాను.మంచి కార్యక్రమం చేయడానికి వచ్చిన TFJA కు ఇస్తే మిస్ యూజ్ అయ్యే డబ్బు కాదు కాబట్టి తప్పకుండా అందరితో మాట్లాడి 177 మందికి ఇన్సూరెన్స్ వచ్చేవరకు నేను మీతో ఉంటాను అన్నారు.

యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..ఏ చ‌రిత్ర అయినా జ‌ర్న‌లిస్టు రాసిన సిరాతోనే మొద‌ల‌వుతుంది. అందుకే వారంటే గౌర‌వం. నేను ఈ రోజు ఈ ఈవెంట్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది..TFJA ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తూ..ఈ అసోసియేషన్ ద్వారా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం గొప్ప విషయం.ఈ అసోసియేషన్ మెంబెర్ కు హెల్త్ కార్డ్ చాలా ముఖ్యం. ఈ అసోసియేషన్ ముందుండి నడిపిస్తున్న టీం అంతా మరింత ముందుకు వెళ్లాలని కోరుతున్నాను.సినిమా రంగంలో చిరంజీవి అంటేనే  అంద‌రికీ ధైర్యంగా వుంటుంది. జ‌ర్న‌లిస్టుకు ఆ భ‌రోసా ఆయ‌న వ‌ల్లే వ‌స్తుంది. ఈ సంద‌ర్భంగా “ఆచార్య” సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఈ అసోసియేషన్ కు సపోర్ట్ గా నిలిచిన చిరంజీవి గారికి, తలసాని గారికి ధన్యవాదాలు అన్నారు.

ఎథిక ఇన్సూరెన్స్ సి.ఈ.ఓ రాజేందర్ మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాల క్రితం జర్నలిస్టు మిత్రులు మమ్మల్ని కలిశారు.చాలా మందికి తెలుసు అసోసియేషన్స్ కు మెడికల్ ఇన్సూరెన్స్ దొరకడం కష్టం.వీరు చేస్తున్న కృషికి  మేము వారికి అండగా నిలబడాలని ముందుకు వచ్చాము.గత 4 సంవత్సరాలుగా 70 మేడికల్ క్లెయిమ్స్, 70 మెడికల్ క్లెయిమ్స్, ఒక యాక్సిడెంటల్ క్లెయిమ్ & ఒక డెత్ క్లెయిమ్స్ చెయ్యడం జరిగింది. ఎవరికి మెడికల్ క్లెయిమ్ చేసుకొనే అవకాశం రాకూడదు ఒక వేళ వస్తే  మేము ఎప్పుడూ  మీడియా మిత్రులకు అండగా నిలబడదానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

TFJA ప్రెసిడెంట్ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ.. ఆచార్య రిలీజ్  లో బిజీ గా వున్నా వచ్చిన చిరంజీవి గారికి, పార్టీ ప్లీనరీ లో ఎంతో బిజీగా ఉన్నా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, దర్శకుడు అనిల్ రావిపూడి గార్లకు ధన్యవాదాలు.జర్నలిస్టులు అంటే అందరికి అందరితో ఆప్యాయంగా ఉంటూ అందరి దగ్గరకు వెళ్ళే వాళ్ళు. వారికి ఏదైనా సమస్య వచ్చినపుడు ఎవరి సపోర్ట్  లేనందున 2004 లో ఈ సంస్థ స్టార్ట్ అయినా కొంతమంది సభ్యులతో ముందుకు వెళ్లడం జరిగింది.2015 నుండి యాక్టీవ్ గా ఉంది.2019 లో జర్నలిస్టులందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని ఎన్నో హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలకు తిరిగాము. చాలా మంది జర్నలిస్టుల యూనియన్ అంటే ఇవ్వడానికి ముందుకు రాలేదు. దానికోసం చాలా కష్టపడిన తరువాత కొన్ని సంస్థలు ముందుకు వచ్చాయి.వారికి అనుగుణంగా ఎలాంటి ఇన్సూరెన్స్ చేస్తే బాగుంటుందని అందరి మిత్రుల దగ్గర, కొర్పొరేట్ హాస్పిటల్స్ దగ్గర తీసుకున్న సమీకరణాల తరువాత వారు పాటించే పాలసీలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి.అవి మనకు ఏ రకంగా ఉపయోగ పడతాయి.
వాటిని ఎలా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది అని  చివరకు 3 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే వారికి భరోసా ఉంటుంది.అలాగే అందరికీ ఎలాంటి ఇబ్బంది ఉండకుండా  ఉంటుందని భావించి అందరి సలహాలు తీసుకున్న పిదప ఇందులో వుండే 170 మంది సబ్యులకే కాక వారి కుటుంబాలకు అండగా నిలబడాలని ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యక్రమం చేపట్టడం  జరిగింది.మొదటి సంవత్సర ఇన్సూరెన్స్ కు హెల్ప్ చేసిన దిల్ రాజు కు ధన్యవాదాలు. గత సంవత్సరమే చిరంజీవి చేతులమీదుగా హెల్త్ కార్డ్స్ ఇవ్వవలసి ఉండింది. అది ఈ సంవత్సరం లో కుదిరింది.మేము చేస్తున్న ఈ కార్యక్రమానికి హీరోలు, నిర్మాతలు,దర్శకులు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. హెల్త్ కార్డ్స్ విషయం గురించి చిరంజీవి గారిని అడిగిన వెంటనే నేను మీ అసోసియేషన్ గురించి విన్నాను నేను జర్నలిస్టులకు అన్ని విధాలా సహాయం చేయడానికి ఎప్పుడూ అండగా  ఉంటానని మాకు భరోసా కల్పించారు.వారికి మా ధన్యవాదాలు. భవిష్యత్ లో మేము కొన్ని కార్యక్రమాలు చేయాలి అనుకుంటున్నాము. దీనిలో భాగంగా ఈ సంవత్సరం నవంబర్ లో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ చెయాలని కమిటీ నిర్ణయం తీసుకున్నాము.దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేది మెగాస్టార్ చిరంజీవి,మరియు ప్రభుత్వ సహాయాన్ని తీసుకుంటాం అన్నారు.

 

ట్రెజరర్ నాయుడు సురేందర్ కుమార్ మాట్లాడుతూ.…ఇప్పటి వరకు ఇండస్ట్రీ నుండి అసోసియేషన్ కు వచ్చిన ఫండ్  75 లక్షల రూపాయలు.ఇట్టి అమౌంట్ ను మన అసోసియేషన్ లో వుండే అందరి సభ్యుల మెడికల్ కోసం స్పెండ్ చేసింది 70 లక్షల రూపాయలు .ఇప్పటి వరకు ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి కావలసిన ఫెసిలిటీస్ కల్పిస్తూ వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది.ఈ సంవత్సరం మెడికల్ పాలసీలు యుటిలైజ్ చేసుకున్న వారు 110 మంది.ఈ 110 మంది ఫ్యామిలీస్ అందరూ కలసి 334 మంది ఉన్నారు.ఈ  సంవత్సరం టోటల్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాము…ఫ్యామిలీ మెంబెర్స్ కు 3 లక్షలు, టర్మ్ పాలసీ 15 లక్షలు (ఓన్లీ మెంబెర్),  యాక్సిడెంట్ పాలసీ 25 లక్షల ఇవ్వడా జరుగుతుంది. బి.ఎ రాజుకు 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ట్రేడ్ గైడ్ లక్ష్మి నారాయణ కు ఇవ్వాల్సిన ప్రాసెస్ జరుగుతుంది. అలాగే యాక్సిడెంట్ పాలసీలో ఎవరికైనా యాక్సిడెంట్ జరిగి ఆఫిస్ కు వెళ్లలేని స్థితిలో ఉంటే వారి శాలరీని బట్టి  వారికి శాలరీ వెళుతుంది. మేము ఇకముందు అందరి శ్రేయస్సు కోరుతూ.. ప్రతి జర్నలిస్టులకు హెల్త్ ప్రోబ్లేమ్స్ రాకుండా ఉండాలని కోరుతున్నాను అన్నారు.

జనరల్ సెక్రటరీ వై.జె.రాంబాబు మాట్లాడుతూ..కోవిడ్ టైం లో అనిల్ రావిపూడి,గారు అండగా ఉంటూ తన పెరు కూడా చెప్పద్దు అని చాలా హెల్ప్ చేశారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రభుత్వం నుండి హెల్ప్  చేస్తాను అన్నారు వారికి మా ధన్యవాదాలు. చిరంజీవి గారితో మాకు బ్లడ్ సంబందం ఉంది.తనను కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఉత్తేజాన్ని కల్పించాయి. వారు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే చిరంజీవిగారు సినిమా పరిశ్రమ వారికి అందులో జర్నలిస్టులు కూడా ఇలా అందరి కొరకు   ఒక హాస్పిటల్ పెట్టాలని ప్లానింగ్ వున్నారు.దాంట్లో ఫిల్మ్ జర్నలిస్టులను అసోసియేట్ చేస్తానన్నారు వారికి మా ధన్యవాదాలు. మా జర్నలిస్టుల కు అక్రిడేషన్ కార్డ్స్ లేక ఇబ్బంది పడుతున్నాము.ఈ విషయంపై మేము కె.టి.ఆర్ ను కలవాలి అనుకుంటున్నాం. అలాగే కరోనా టైమ్ లో అందరూ ఇంట్లో ఉంటే ఏలూరు శ్రీను, నివాస్ లు బయటికి వచ్చి జర్నలిస్టులకు చాలా హెల్ప్ చేశారు.అది మేము టీం స్పిరిట్ గా బావించాము.మా అసోసియేషన్ నవంబర్ లో సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలని అనుకున్నాము.ఆ విషయాలను చిరంజీవిగారు తెలియజేస్తారు. మేము అడిగిన వెంటనే వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు అన్నారు

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్(TFJA) కొత్తగా ఎన్నికైన బాడీ లిస్ట్

ప్రెసిడెంట్ 
వి లక్ష్మీనారాయణ

ఉపాధ్యక్షులు
1. ఎం చంద్ర శేఖర్
2. జి శ్రీనివాస్ కుమార్

జనరల్ సెక్రటరీ
వై జె రాంబాబు

జాయింట్ సెక్రటరీలు
1.జి వి రమణ
2. వంశీ కాకా

కోశాధికారి
నాయుడు సురేంద్ర కుమార్

కార్య నిర్వాహక కమిటీ
1. పి రఘు
2. వై రవిచంద్ర
3. జి జలపతి
4. కె ఫణి
5. కె సతీష్
6. రెంటాల జయదేవ్
7. వడ్డి ఓం ప్రకాష్
8. సురేష్ కొండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here