చిత్రం : ‘మీకు మాత్రమే చెప్తా’
యాక్టర్స్: తరుణ్ భాస్కర్, అభినవ్, వాణి భోజన్ ,అనసూయ భరద్వాజ్, అవంతిక తదితరులు
సంగీతం: శివకుమార్
నిర్మాత: విజయ్ దేవరకొండ – వర్ధన్ దేవరకొండ
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: షమ్మీర్ సుల్తాన్
పెళ్లి చూపులు’ సినిమా కథను తనకు దగ్గరకు తీసుకుకొచ్చిన.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను మెయిన్ లీడ్‌గా.. ‘మీకు మాత్రమే చెప్తా’ ప్రొడ్యూస్ చేశాడు విజయ్. కాగా.. ఇందులో.. గోమఠం, అనసూయ, వాణి భోజన్, నవీన్ జార్జ్ థామస్, పావని గంగిరెడ్డి, అంతికా మిశ్రా నటించారు. షమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
కథ:
రాకేశ్ (తరుణ్ భాస్కర్), కామేశ్ (అభినవ్ గోమటం) ఇద్దరూ బెస్ట్ ప్రెండ్స్. ఒక టీవీ చానెల్లో ఇద్దరూ పనిచేస్తుంటారు. రాకేశ్, కామేశ్ ఇద్దరూ డాక్టర్లను ప్రేమిస్తారు. రాకేశ్ ప్రతి విషయంలో అబద్ధాలు చెప్తుంటాడని ప్రతి విషయంలోనూ అతని లవర్ స్టెఫీ అనుమానిస్తూ ఉంటుంది. పెద్దవాళ్లను ఒప్పించి రాకేశ్ స్టెఫీని పెళ్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ క్రమంలో పెళ్లికి రెండురోజుల ముందు రాకేశ్ ఫోన్‌కు ఒక వీడియో వస్తుంది. ఒక అమ్మాయితో హానీమూన్‌లో గడుపుతున్నట్టు ఆ వీడియో ఉంటుంది. అది ఇంటర్నెట్లో ప్రత్యక్షం కావడంతో రాకేష్ టెన్షన్ పడిపోతాడు. అప్పటికే పలుమార్లు స్టెఫీ దగ్గర అబద్ధాలు చెప్పి దొరికిపోయిన రాకేష్.. ఈ వీడియో సంగతి దాచి పెట్టే ప్రయత్నం చేస్తాడు. మరోవైపు స్టెఫీని లవ్ చేస్తున్న ఆమె బావ జాన్సన్ పెళ్లిని ఆపేందుకు ప్రయత్నిస్తుంటాడు. అసలు ఈ వీడియో ఎక్కడిది? నిజంగానే ఓ యువతితో రాకేశ్ గడిపాడా?.. దాన్ని ఇంటర్నెట్ నుంచి తొలగించడానికి అతను ఎలాంటి ప్రయత్నాలు చేశాడు.. ఈ లోపు వీడియో ఎలా వైరల్ అయింది.. చివరికి స్టెఫీకి నిజం తెలిసిందా లేదా.. తదుపరి పర్యవసానాలేంటి అన్నది మిగతా కథ.
విశ్లేషణ:
చిన్న అబద్ధం చెప్పడం దాన్ని కప్పి పుచ్చడానికి మరో అబద్ధం దాని కోసం పెద్ద రచ్చ చేయడం అనే లైన్ లో చాలా కథలు తెలుగులో వచ్చాయి. కానీ కాస్త కొత్తగా ఫ్రెష్ గా ఇప్పుడు ఇలాంటి కథతోనే వచ్చాడు కొత్త దర్శకుడు షమ్మీర్ సుల్తాన్. సింపుల్ లైన్ ని స్క్రీన్ ప్లేతో మాయ చేసే ప్రయత్నం చేసాడు ఈ దర్శకుడు. ముఖ్యంగా ఈ సినిమాను తాను అనుకున్నది అనుకున్నట్టుగా తెరపై చూపించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్ లోనే కథ అంతా బయట పెట్టేసినా కామెడీ సీన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ఫ్రెష్ ఫేసులు కావడంతో కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చాలా సన్నివేశాలను అద్భుతంగా రాసుకున్నాడు దర్శకుడు.
కానీ కథ చాలా చిన్నది కావడంతో ముక్కేది అంటే చుట్టూ తిప్పి చూపినట్టుంది. ఇంటర్వెల్ వరకు బాగానే లాక్కొచ్చినా ఆ తర్వాత అంతా బ్లాంక్ అనే ఫీలింగ్ తెప్పించాడు. తరుణ్ భాస్కర్, అతని ఫ్రెండ్స్ తో వచ్చే కామెడీ బాగానే వర్కవుట్ అయినా కథ లేకపోతే ఎంత కామెడీ చేసినా తేలిపోతుందనిపించింది. అనసూయ అంటూ ప్రచారం చేసి ఆమె పాత్రని కూడా తేల్చేయడంతో ఆమె ఫ్యాన్స్ ని నిరాశ పరిచాడు డైరెక్టర్. ఒక చిన్న వీడియో పెళ్లికి ముందు ఎన్ని తంటాలు తెచ్చిపెట్టిందనే అంశాన్ని ఆద్యంతం వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారు.









