If Megastar Chiranjeevi gives opportunity to act with him Iam ready for it -Mr perfectionist Amir Khan

మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లాల్ సింగ్ చెడ్డా”. హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు .ఇప్పటికే బాలీవుడ్ లో విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి, ఆక్కినేని నాగచైతన్య లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా

 

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ..అమీర్ ఖాన్ అంటే నాకెంతో ఇష్టం. మాములుగా ప్రతి ఆర్టిస్ట్ వచ్చామా మనకిచ్చిన క్యారెక్టర్ చేశామా వెల్లిపోయామా అన్నట్టు ఉంటుంది కానీ తను మాత్రం ఫుల్ ఇండెప్త్ గా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా చెప్పాలంటే ఇండల్ కర్త, కర్మ తనే అయ్యి చేయడమనే యూనిక్ స్టైల్ అనేది ఎ ఇండియన్ యాక్టర్ కు లేదు. నాకు ఇలాంటి సినిమాలు చెయ్యాలనే కోరిక ఉన్నా మాకున్న బౌండరీలు లిమిటెషన్స్ వలన లిమిటెడ్ గా ఇన్వాల్వ్ అవ్వడం వలన అది సాధ్యపడడం లేదు. వీరంతా సెట్ కు వెళ్లకముందే ఎంతో మందితో వర్క్ షాప్ నిర్వహిస్తారు.కొన్ని వారాలపాటు డైలాగ్స్ హియరింగ్ చేస్తారు..ఇలాంటివి అన్నీ ముందే చేసుకొని సెట్ కు వెళతారు. సెట్ కు వెళ్లిన తరువాత నా డైలాగ్ ఏంటి అనేది ఉండదు. తను బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వాలి అనేదే మైండ్ లో ఉంటుంది.ఇలా చాలా తక్కువమంది చేస్తారు.అందుకే ఇలా చేయడంతో అమీర్ నుండి ద బెస్ట్ సినిమాలు వస్తాయి. కాబట్టి అమీర్ సినీ ఇండస్ట్రీ కి తను ఒక ఖజానా లాంటి యాక్టర్ మాత్రమే కాదు భారత దేశంలో ఒక గర్వించదగ్గ నటుడు అయ్యాడు. అలాంటి తను నన్ను ఆడగడంతో నేను హనర్ గా ఫీల్ అయ్యి ఇది నా బాధ్యత, లేదా నాకు ఇచ్చిన గిఫ్ట్ గా భావించి తెలుగులో రిలీజ్ చేస్తున్నాము. అమీర్ ఈ సినిమా ప్రీమియర్ చూడమంటే సుకుమార్, రాజమౌళి, నాగార్జున, నాగచైతన్య లతో కలసి చూశాను. చూసిన తరువాత తేరుకోవడానికి నాకు కొంత సమయం పట్టింది. అమీర్ ఖాన్ పెర్ఫార్మన్స్ ఎక్సట్రార్ధినరీ గా ఉంది. అమీర్ ఖాన్ పాత్రతో పాటు ..చైతన్య పాత్ర కు బాగా ఎమోషనల్ అయ్యాను. ఇలాంటి సినిమాలు ఎక్స్పరమెంటల్ తో పూర్తి డెడికేటెడ్ సినిమాలు తియ్యాలి అంటే అమీర్ ఖాన్ వల్లే అవ్వాలి. సినిమా చూసిన తరువాత నా నుండి రెస్పాన్స్ రాలేదని అమీర్ ఖాన్ కంగారు పడ్డాడు.సినిమా బాగుందని తనకు చెప్పడంతో హ్యాపీ ఫిల్ అయ్యాడు. ఆగష్టు 11 న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరికీ నచ్చుతుంది అన్నారు .

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ మాట్లాడుతూ…ఈ సినిమాలో నా పాత్రకు చిన్న, పెద్ద లేకుండా అందరూ ఎంతో ఎమోషనల్ అవుతారు అని నమ్ముతున్నాను. ఇదివరకు తెలుగు డబ్బింగ్ సినిమాలకు తక్కువ మార్కెట్ ఉండేది. అయితే ఇప్పుడు తెలుగు సినిమాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. నాకు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి యాక్టింగ్ అన్నా , డ్యాన్స్ అన్నా ఎంతో ఇష్టం. అందుకే తెలుగులో మా సినిమాను రిలీజ్ చెయ్యడానికి చిరంజీవిని అప్రోచ్ అవ్వడం జరిగింది. తనకోసం షో వెయ్యడం జరిగింది. సినిమా తనకు నచ్చడంతో తెలుగు లో రిలీజ్ చెయ్యడానికి ముందుకు వచ్చారు. అందుకు చిరంజీవికి ధన్యవాదాలు. చిరంజీవి గారు సల్మాన్ ఖాన్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే తను నాకు కూడా అవకాశం ఇస్తే నేను తనతో కలసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు.

 

అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ..చిన్నప్పటివనుండి అమీర్ ఖాన్ సినిమాలు చూసేవాన్ని. ఇప్పుడు అమీర్ ఖాన్ లాంటి వారితో నటించడం గ్రేట్ గా ఫీల్ అవుతున్నాను. ఆయనతో నటించడం ద్వారా నేను ఎంతో నేర్చుకొన్నాను. కొన్ని సినిమాలు చేసిన తరువాత అందులో చేసిన ఎక్సపీరియన్స్ , మూమెంట్స్ లైఫ్ లాంగ్ మనకు నేర్పిస్తుంటాయి అలాంటిదే ఈ సినిమా. నా కేరెర్ కు హెల్ప్ అవుతుందనే లెక్కలతో ఈ సినిమా చెయ్యలేదు. ఇందులో నా పాత్ర నిడివి 30 నిముషాలు ఉంటుంది. ఈ సినిమా విడుదల అయిన తరువాత నా పాత్రను బాలీవుడ్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి అన్నారు.

 

న‌టీన‌టులు –
ఆమిర్ ఖాన్, క‌రీనా కుమార్, నాగ చైత‌న్య త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
స‌మ‌ర్ప‌ణ – మెగాస్టార్ చిరంజీవి
బ్యాన‌ర్లు – వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చ‌ర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడ‌క్ష‌న్స్
నిర్మాత‌లు – ఆమిర్ ఖాన్, కిర‌ణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
ద‌ర్శ‌క‌త్వం – అద్వైత్ చంద‌న్
సంగీతం – ప్రీతిమ్
భార‌తీయ చిత్రానుక‌ర‌ణ – అతుల్ కుల్ క‌ర్ణి
పి.. ఆర్. ఓ : ఏలూరు శ్రీను, మేఘా శ్యామ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here