ఇష్క్’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మనం’ 90 Ml, 30 రోజుల్లో ప్రేమిచడం ఎలా..వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు అనూప్ రూబెన్స్. హీరో సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్లో వస్తున్న “మంచి రోజులు వచ్చాయి” సినిమాను వి సెల్యులాయిడ్, SKN నిర్మిస్తున్నారు. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు వస్తున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడారు
మారుతి గారు సినిమాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో సినిమా చేయడం అంటే చాలా సంతోషంగా ఉంది. తన సినిమాలలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండడమే కాక సినిమాలో మంచి మెసేజ్ ఇస్తాడు. తన సినిమాలో ఓవర్ డోస్ ఉండకుండా ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు.
కోవిడ్ టైంలో మారుతి గారు ఫోన్ చేసి ఒక చిన్న సినిమా చేయాలని నాకు చెప్పడం జరిగింది. లాక్ డౌన్ టైం లో ఇంట్లోనే ఉన్న నేను నా ఫోన్ లోనే సాంగ్స్ ట్యూన్ ఇచ్చి కంపోజ్ చేయడం జరిగింది.సాంగ్స్ అన్నీ కూడా మూడు వారాల్లో కంప్లీట్ చేసి ఇవ్వడం జరిగింది. 30 డేస్ లో సినిమా కంప్లీట్ అయింది. అయితే ఈ సినిమాను ఓటిటి కాకుండా థియేటర్లోనే రిలీజ్ చేయాలని ఇప్పటివరకు ఆగడం జరిగింది. ఇప్పుడు థియేటర్ లో ఓపెన్ అవ్వడం వలన ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
చిన్న సినిమాగా మొదలైన ఈ సినిమా తరువాత సినిమాలో సాంగ్స్ బాగా రావడం ఆ సాంగ్స్ మారుతి గారికి నచ్చడం. అలాగే మూవీ కి స్పాన్ పెరగడంతో ఈ మూవీని తనే చేద్దామని ఈ మూవీ చేస్తున్నాడు
ఇది ఒక కాలనీలో జరిగే కథ ఇది .ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఎదో భయం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎదో ఒక విషయానికి
భయపడే వాళ్లు చాలామంది వుంటారు. ఈ కారణాల వల్లే చాలా మంది కోవిడ్ టైం లో రోగం కంటే భయంకరమైన భయంతో ఎక్కువ మంది చనిపోయారు.ఈ సినిమా న్యాచురల్ గా తీస్తూ ఇందులో ఎంటర్టైన్మెంట్ ను జోడించడం ప్రేక్షకులకు నచ్చే విధంగా తీయడం జరిగింది. అలా తీయడం మారుతి గొప్పతనం.ఇలాంటి ఫీల్ గుడ్ మూవీ కి మంచి పాటలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి ఈ సినిమాలకు ఎక్కువ మంది కనెక్ట్ అవ్వడమే కాక అందరికీ కచ్చితంగా రీచ్ అవుతుంది
ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయి.అన్నీ హిట్ అయ్యాయి. ఇందులో సో సో సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.ఈ సినిమా కు ఎక్కువగా నేను ఫోన్ లొనే జర్నీ చేయడం జరిగింది.ఈ సినిమాకు అనంత శ్రీరామ్.కే కే ,కాసర్ల శ్యామ్ ముగ్గురు పాటలు రాయడం జరిగింది.
ఇది డిఫరెంట్ సబ్జెక్టు ఇందులో ఫన్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. డైరెక్టర్ మాకు కాన్సెప్ట్ చెప్తే దానికి తగ్గట్టు నేను ట్యూన్స్ ఇస్తాను ట్యూన్స్ కి తగ్గట్టు లిరిసిస్ట్స్ లిరిక్స్ ఇస్తారు. ఇందులోని పాటలు చాలా బాగా వచ్చాయి.ఈ సినిమా ద్వారా కొత్త ఎక్స్పీరియన్స్ ప్రేక్షకులు చూస్తారు.
ఇప్పటివరకు నేను ఫ్యామిలీ ఎమోషనల్ టూన్స్ ఇచ్చాను. అన్నిటికంటే ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గా టోన్స్ ఇవ్వడం జరిగింది.ఇప్పటి వరకు మారుతి గారితో ఫోన్ లో జర్నీ చేసినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మారుతి గారితో కలసి పని చేయడం జరిగింది.
నేను చాలా మంది డైరెక్టర్లు తో కలిసి పనిచేశాను.మారుతి గారితో నాకు చాలా కంఫర్ట్ గా అనిపించింది.ఫైనల్ గా తను ఈ సినిమా మ్యూజిక్ విన్న మారుతి గారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు చాలా బాగుంది అన్నారు.
నిర్మాత యస్ కె.యన్ చాలా ప్యాసినెట్ ఉన్న ప్రొడ్యూసర్ తన ద్వారానే నేను మారుతి గారిని కలవడం జరిగింది. తద్వారా ఈ సినిమా కు వర్క్ చేసే అవకాశం రావడం జరిగింది. నిర్మాత యస్ కె.యన్ వారికి ధన్యవాదాలు.
ఒక సాంగ్ జనాలకు రీచ్ అయితే సినిమా ఎవరు చేశారు, కొత్త వాళ్లా..పెద్ద స్టార్సా అని చూడకుండా స్పోర్టివ్ గా తీసుకుని కొత్త, పాత అని తేడా చూపకుండా తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేసి ఆదరిస్తారు. ఇది తెలుగులోనే ఇలా ఎక్కువ జరుగుతుంది.ఒక సినిమాలో సాంగ్స్ ని హిట్ చేసి జనాదరణ పొందడమంటే చాలా కష్టం. పాటలు బాగుంటే సినిమా కు మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఉదాహరణకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా పాటలే నిదర్శనం.ఈ సినిమాపాటలు హిట్ అవ్వడంతో పెద్ద సినిమాలకు వచ్చిన ఓపెనింగ్స్ ఈ సినిమాకు వచ్చాయి.
ఈ సినిమాలోని పాటలకు కూడా ప్రేక్షకుల దగ్గర నుండి పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చింది. పాటలతో పాటు ఇది ఒక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. చూసిన వారంతా చాలా హ్యాపీ ఫీలవుతారు. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఈ సినిమా రీచ్ అవుతుంది.ఇలాంటి మంచి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది
ప్రతి ఒక్కరికి ఒక టైం రావాలి. ఏ టైం కి ఏం జరగాలో అదే జరుగుతుంది.నాకు గ్యాప్ రావడం వలన నేనేమి ఫీల్ అవ్వను. నాకు ఏ సినిమాలో అవకాశం వచ్చినా దాన్ని నేను ఒకేలా చూస్తాను. చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకైనా నేను ఒకటే వర్క్ చేస్తాను.ప్రతి సినిమాను నేను రెస్పాన్సిబిలిటీ గా ఫీల్ అయ్యి వర్క్ చేస్తాను. అంతేకానీ నేను ఎక్కువ సినిమాలు చెయ్యాలనే ఆశ నాకు లేదు.
సోగ్గాడే చిన్ని నాయనా తర్వాత బంగార్రాజు లాంటి పెద్ద ప్రాజెక్టు రావడం చాలా సంతోషంగా ఉంది.ఈ సినిమాపై నాకు చాలా రెస్పాన్సిబులిటీ పెరిగింది. ఈ సినిమా కూడా చాలా బాగా వస్తుంది. ఆ సినిమాను క్యారీ చేస్తూ ఈ సినిమాని నెక్ట్స్ లెవల్ తీసుకెళ్తున్నాము. అలాగే శేఖర్ తో ఒక సినిమా ఉంది. ఇంకా నేను చెయబోయే సినిమాల గురించి త్వరలో తెలియజేస్తాను అని ముగించారు.









