అన్ని వర్గాల వారిని అలరించే పర్ఫెక్ట్ సినిమా ఈ “లెహరాయి ” ఒక్క మాటలో చెప్పా లంటే “ఈ “లెహరాయి”అంటే..ఓ”ప్రేమతరంగం”
ప్రేమ అనే సున్నితమైన అంశానికి
చిన్న “మెసేజీని జోడించిన మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ ఈ లెహరాయి.
“దేవుడు వర మందిస్తే…”
“అందమైన కుందనాల బొమ్మరా”
“రివ్వున ఎగిరే గువ్వా”
“పండు వెన్నెల్లో ఈ వేణుగానం”
“ప్యాంటేస్తే గాని తెలియ లేదురా మావో”
లాంటి పాటల్తో యువతరాన్ని గిలిగింతలు పెట్టిన” ఘంటాడి కృష్ణ ”
తనలో వాడీ, వేడీ, ఏ మాత్రం తగ్గ లేదని కసితో చేశాడో, ఏమో గానీ దాదాపు ఇందులో ఉన్న ఏడు డిఫరెంట్ పాటలతో ప్రేక్షకులను తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి ఈ నెల 9న రిలీజ్ కాబోతున్న సినిమా “లెహరాయి”. ఈ సినిమాలో 6.. డిఫరెంట్ పాటలూ మిలియన్లలోనికి దూసుకెళ్ళేలా ఎంతో వైవిధ్యంగా చేశాడు. ఈ పాటలు వినగానే తన సంపంగిని గుర్తుకు తెస్తూ దాన్ని మించిన”ఆడియో గా చెబుతున్నారు. రేపు 9 న రాబోయే “లెహరాయి” విడుదల సందర్భంగా విలేకరులతో ముచ్చటిస్తూ…


లెహరాయి సినిమా పాటలు మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
చాలా సంతోషంగా ఉంది.అలాగే ఈ సినిమా కు ఒక ప్రత్యేకత ఉంది. సంపంగి సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంత పేరు వచ్చిందో ఈ లెహరాయి సినిమా మ్యూజిక్ కు అంతే పేరును వస్తుంది. అయితే ఈ సినిమా కొరకు బిగినింగ్ నుంచి స్టోరీ విని ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని టీంతో ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ అన్ని రకాలుగా సెట్ అయిన సినిమానే “లెహరాయి”.అయితే ఈ సినిమా సంపంగి సినిమాని గుర్తుకు తెచ్చేలా అద్భుతమైన పాటలు m కుదిరాయి, పాటలతో పాటు మంచి కథ కూడా కుదరడంతో ప్రేక్షకులు ఈ సినిమాకు కచ్చితంగా కనెక్ట్ అవుతారు.
ఒక టైమ్ లో మీ పాటలు యూత్ కు మంచి కిక్ ఇచ్చేవి,అయితే మధ్యలో చాలా గ్యాప్ తీసుకున్నారు ఎందుకు?
“విరామం” కూడా కెరీర్ లోని భాగమేనని వివరిస్తూ..నేను ఎన్నో సినిమాలు చేశాను కానీ ఒక హిట్ వస్తే రెండు సినిమాలు ఫెయిల్ కావడం జరిగేది దాంతో నా కెరీర్ గ్రాఫ్ పెరగలేదు. ఏదైనా ఒక సినిమాకు మ్యూజిక్ చేస్తే ప్రేక్షకులకు ఆ పాటలు ఎప్పుడూ గుర్తుండి పోవాలని కోరుకునేవాన్ని దాంతో కెరీర్ గ్రాఫ్ పెంచే చిత్రాల ఎంపిక కోసమే ఈ “గ్యాప్ అని వివరించారు.
అలాగే పెద్ద హీరోల సినిమాలు చెయ్యక పోవడానికి కారణం ఆడగ్గా..
చేసిన సినిమాలు వరస విజయాలు సాధించినప్పుడే మంచి గుర్తింపు లభించి పెద్దహీరోల దృష్టికి వెళతాం.పెద్దహీరోల సినిమా అవకాశాలు వస్తాయి. ఇక నా విషయంలో ఓ..విజయం, రెండు పరాజయాల వల్ల అనుకున్న స్థాయికి వెళ్ళేలేకపోయిన్నట్లు” వాపోయాడు.
“లేహరాయి” పక్క కమ్ బ్యాక్ సినిమాగా ఫీలేతున్నారా?
ఔనండి, ఇదీ నా జోనర్ సినిమా, మంచి మ్యూజికల్ ఆల్బమ్ గా మలిచే అవకాశం వున్నసినిమా, ఇందులో మంచి కంటెంట్ తో పాటు చిన్న మెసేజ్ ఇస్తూ ఇంటిల్లిపాది చూడదగ్గ ఫీల్ గుడ్ మూవీ లెహరాయి. ఇంతకంటే మంచి కమ్ బ్యాక్ సినిమా ఏముంటుందండీ…..
ఒకప్పుడు సంపంగి వంటి పాటలు యూత్ ను మంచి క్రేజ్ ను తీసుకొచ్చాయి మళ్ళీ ఆ తరహా పాటలు మీ ద్వారా చూడచ్చా?
తప్పకుండా చూడవచ్చు ఇప్పుడు వస్తున్న “లెహరాయి” పాటలు మంచి క్రేజ్ ను తెచ్చుకున్నాయి. ఈ సినిమాతో పాటు నెక్స్ట్ రాబోయే నా సినిమాలు కూడా మంచి మ్యూజికల్ హిట్స్ అవుతాయి. అయితే “సంపంగి” సినిమా హిందూ ముస్లింల మధ్య సాగే ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయితే , ఆ సినిమా లాగే ఇందులో కూడా ప్రస్తుతం లవ్ చేసుకుంటున్న వారిలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఆలా ఎందుకు జరుగుతుంది అనేది తెలుపుతూ లవ్ తో పాటు ఇంటర్నల్ గా ఒక చిన్న మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది.కాబట్టి “లెహరాయి” పాటలు సంపంగి సినిమా పాటల కంటే ఒక మెట్టు పైన ఉండేలా ఈ సినిమా పాటలు ఉంటాయి
చిత్ర దర్శకుడు రామకృష్ణ పరమహంస గురించి చెప్పండి?
ఈ సినిమాకు “రామ కృష్ణ పరమ హంస” కొత్త దర్శకుడైనా ఎంతో పరిణితి చెందిన వాడిగా పక్కా కన్ఫర్మేషన్ తో ప్రతి విభాగం వారి నుండి మంచి వర్క్ ను రాబట్టాడు.సాధారణంగా సీనియర్ యాక్టర్స్ ను డీల్ చేయడం అంటే చాలా కష్టం. రావు రమేష్, సీనియర్ నరేష్, ఆలీ, సత్యం రాజేష్ ఇలా పెద్ద ఆర్టిస్టులను డీల్ చేయడం అంటే ఈజీ కాదు. కానీ దర్శకుడు ఇది కావాలి అనేది చెప్పకనే చెప్తూ అందరితో కలసిపోయి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా అందరితో చాలా బాగా చేయించు కున్నాడు. దాంతో నాకు చాలా ఈజీ అయింది. ఈ పాట ఇలానే ఉండాలని కన్ఫర్మేషన్ తీసుకొని కరెక్ట్ గా కథనం ప్రకారం గా ప్రతి సన్నివేశానికి దగ్గరగా ఉండేలా చేయించు కున్నాడు.మంచి ఫ్యూచర్ వున్న నిర్మాతకు దర్శకుడికీ వున్న నమ్మకం అభిరుచేనంటూ తెలిపారు.
చిత్ర నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ గురించి చెప్పండి?
‘ఇంతకు ముందు నిర్మాతగా పెద్దగా సినిమాలు చెయ్యకపోయిన ఈ సినిమాను డీల్ చేసిన విధానం సూపర్. ఈ సినిమా. నిర్మాత మద్దిరెడ్డి శ్రీనివాస్ ఎంతో ఆవగాహనతో ఎవరిని నొప్పించకుండా అన్ని అంశాలలో క్వాలిటీ ని తగ్గకుండా మంచి అవుట్ పుట్ ను రప్పించారు.
నో డౌట్ మంచి నిర్మాతగా పేరు తెచ్చుకొంటారు. అలాగే ఖర్చుకు వెనకాడకుండా వెన్నంటుండి,,, ప్రోత్సహించారు.,
ప్రతి ఒక్కరూ సిద్ శ్రీ రాం తో పాడించి హిట్ కొడుతున్నారు ఈ సినిమాలో సిద్ శ్రీ రాం పాడిన పాటకు రెస్పాన్స్ ఎలా ఉంది?
లెహరాయి అంటే గాలి కెరటం, సిద్ శ్రీ రాం కూడా కెరటంలా తన పాటలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ప్రతి ఒక్కరూ కోటి రూపాయలతో సినిమా తీసినా హిట్ కోసమే,100 కోట్లు పెట్టిన హిట్ కోసమే కాబట్టి ప్రతి ఒక్కరూ సినిమాలో కథ తో పాటు మ్యూజిక్ కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు.అయితే సిద్ శ్రీ రాం చేసిన వరుస 10 సినిమాలు హిట్ సినిమాలే.ఈ సినిమాలో కూడా కథ తో పాటు పాటలు అన్ని చక్కగా కుదిరాయి.
ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ కు ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది అయితే మీ స్ట్రెంత్ వచ్చేసి లవ్ సాంగ్స్ బాగా చేస్తారు అని ఉంది.ఈ లెహరాయి మీకు పర్ఫెక్ట్ ఆల్బమ్ అనుకోవచ్చా?
ఒక ఇంద్రధనస్సు కున్న ఏడు రంగులులాగే ఈ సినిమాలో ఏడు పాటలు ఉన్నాయి. లవ్, సెంటిమెంటు, మాస్ ఇలా ఏడు రకాలుగా ఈ సినిమాలో పాటలు ఉంటాయి.ఈ సినిమాకు ఇంత మంచి ఆల్బం రావడానికి ముఖ్య కారణం నిర్మాతలు. సినిమాకు తగ్గట్టు మ్యూజిక్ ఉండాలని ఖర్చుకు వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించారు.అలాగే
సిద్ శ్రీరాం జావెద్ అలీ, హరిచరణీ జస్సీగిప్ట్, రేవంత్, సాకేత్, సన్నీ ఇందుస్థానీ లాంటి పెద్ద గాయకులు -గాత్రాన్ని ఇచ్చారు. రామజోగయ్య శాస్త్రీ, శ్రీమణి, కాసర్ల శ్యాం. లాంటి పెద్ద రచయితలతో పాటు మంచి మంచి టెక్నీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాకు ఇంత మంచి ఆల్బం వచ్చిందంటే దీనికంతటికీ దర్శక, నిర్మాతలే కారణం కాబట్టి ఈ “లెహరాయి” సినిమా నాకు ఫర్ ఫెక్ట్ ఆల్బమ్ అనుకోవచ్చు.
పరభాష గాయకులు గురించి చెపుండి….?
డిమాండ్ అండ్ సప్లై అండీ అంటే వాళ్ళు పాడిన పాటలు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాబట్టే వాళ్ళ చేత పాడిస్తున్నాం.అంతేగాని వాళ్ళ మీద ప్రత్యేకంగా ప్రేమ ఏమంటుందండీ
కాలం మారే కొద్ది మ్యూజిక్ కూడా మారుతుంది కాబట్టి మీరు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అప్పటికి ఇప్పటికీ సంగీతంలో మీరు గమనించిన తేడాలు ఏంటి ?
మ్యూజిక్ లో ఎలాంటి తేడా ఉండదు కానీ కాకపొతే బీట్ ఓరియెంటెడ్ అయ్యారు అంటే రిధం ను ఎక్కువ మింగిలి చేస్తూ చిన్న చిన్న టెక్నిక్స్ తో ఆటో ట్యూన్ కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తూ మిక్సింగ్ లో కూడా క్రిస్టల్ క్లియర్ ఉండేలా చేయడం జరుగుతుంది. అప్పట్లో సాహిత్యం బాగా వినపడేది అయితే మధ్యలో మ్యూజిక్ హోరు ఎక్కువై సాహిత్యం బాగా డిస్టర్బ్ అయింది. అయితే ఇప్పుడు మంచి మంచి సింగర్స్ రావడం వలన ఇప్పుడు పాత తరం సాహిత్యం వచ్చింది అనుకోవచ్చు.. అందుకే ఇప్పుడు ప్రేక్షకులు సాహిత్యానికి పెద్ద పీట వేస్తున్నారని చెప్పవచ్చు..
ప్రస్తుతం ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు….?
దీని తరువాత ” ఇంకా ఏదో కావాలీ అంటు నా 6టీన్స్ జోనర్ సిని మా చేస్తున్నా..అలాగే పేరు పెట్టని మరో 2 చిత్రాలు సైన్ చేశా..
చివరికా “లెహరాయి” గురించి ఏం చెబుతారు…..?
చాలా రోజుల తరువాత ఓ..మంచి చిత్రం చూసామనే “అనుభూతితో ప్రేక్షకుడు ధియేటర్ నుండి బయటకు వస్తాడు .. అందులో సందేహం లేదు. అన్ని వర్గాల వారికి అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులందరి హృదయాలను కచ్చితంగా తాకుతుంది అని ముగించారు .









