Cinemarangam.Com
సినిమా : ఆదిపురుష్
రిలీజ్ డేట్ : 16.06.2023
రివ్యూ రేటింగ్ : 3.5/5
బ్యానర్స్ : టి సిరీస్, రెట్రో ఫైల్స్, యు.వి. క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టిరీ
నిర్మాతలు: భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్, వంశీ, ప్రమోద్
దర్శకుడు: ఓం రౌత్
నటీనటులు: ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ ఖాన్ తదితరులు
సంగీతం: సచేత్ – పరంపర
సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఫళణి
ఎడిటర్: అపూర్వ మోటివాలే, ఆశిష్ మహత్రే
పి .ఆర్. ఓ : జి. యస్. కె మీడియా

గుల్షన్ కుమార్, టి.సిరీస్ సమర్పణలో టి సిరీస్, రెట్రో ఫైల్స్, యు.వి. క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టిరీ బ్యానర్స్ పై గ్లోబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్, వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం “ఆదిపురుష్” ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటించడం విశేషం. చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ ఈ సినిమాను ప్రమోట్ చేశారు దర్శక నిర్మాతలు. రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఓం రౌత్. భారీ బడ్జెట్‌తో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడనటువంటి అత్యద్భుతమైన విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీతో ప్రపంచంలోని అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. జూన్ 16, 2023 న ప్రపంచ వ్యాప్తంగా 3డిలో గ్రాండ్ గా విడుదలైన “ఆదిపురుష్ ” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి…

కథ
దశరథ మహారాజు తన వృద్ధాప్యంలో రాజ్యం నుండి విముక్తి పొంది, తన పెద్ద కొడుకు రాముడిని (ప్రభాస్) అయోధ్య నగరానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని కోరుకుంటాడు. కానీ దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి రాఘవకు బదులుగా తన కొడుకు భరతుడికి పట్టాభిషేకం చేయాలని పట్టుబట్టింది. అంతే కాదు భరతుని పట్టాభిషేకంతో పాటు రాముడిని 14 సంవత్సరాలు వనవాసం చేయమని కోరుతుంది. తండ్రి ఆజ్ఞ ప్రకారం, రాముడు అతని భార్య సీత (కృతి సనన్) మరియు లక్ష్మణుడి తో సహా వనవాసానికి బయలుదేరుతాడు. వనవాసంలో ఉన్న రోజుల్లో రావణుడి చెల్లి శూర్పణఖ లక్ష్మణుడిని ఇష్టపడుతుంది. కానీ లక్ష్మణుడికి అది నచ్చకపోవడంతో శూర్పణఖ తన రాక్షస సైన్యంతో దాడి చేసింది, ఈ దాడిలో సీత గాయపడుతుంది. దాంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కొస్తాడు. అతను వెళ్లి తన అన్నయ్య రావణుడి (సైఫ్ అలీఖాన్)కి ఈ విషయం చెప్పడంతో, రావణుడు ఆగ్రహానికి గురవుతాడు మరియు సన్యాసి రూపంలో వచ్చి సీతని అపహరించి లంకకు తీసుకెళ్లి అశోక వనం లో బంధిస్తాడు. అపుడు రాముడు రావణాసురుడిని ఎలా ఓడించి సీతను తీసుకొచ్చాడు..? అందుకు వానరసైన్యం రాముడికి ఎలాంటి సహాయం చేసింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే వెండితెరపై “ఆదిపురుష్” సినిమా తప్పక చూడాల్సిందే..

నటీ నటుల పనితీరు..
ఇప్పటివరకు ప్రభాస్ ను ఇటువంటి పాత్రలో ఎప్పుడు చూడలేదు.కానీ తొలిసారిగా రాఘవగా రాముడు పాత్రలో కనిపించిన ప్రభాస్ అద్భుతంగా నటించాడు.తన ఎక్స్ప్రెషన్స్ తో కట్టిపడేశాడు.ఇక జానకి పాత్రలో నటించిన కృతి సనన్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. సైఫ్ అలీ ఖాన్ కూడా లంకేశ్వరుడు పాత్రలో అదరగొట్టాడు. శేషు పాత్రలో లక్ష్మణుడి గా నటించిన సన్నీ సింగ్, దేవదత్ నటించిన హనుమంతుడు పాత్రల కూడా ప్లస్ పాయింట్ గా నిలిచింది.మిగతా నటీనటులంతా పాత్రకు తగ్గట్టు న్యాయం చేశారని చెప్పవచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు…
రామాయణంను సినిమా లాగా చూపించాలి అంటే అది పెద్ద సవాల్ అని చెప్పాలి.ముఖ్యంగా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా రూపొందించాలి.ప్రభాస్ మరియు కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ లు నటించిన ఈ చిత్రం కేవలం వినోదం కోసం రూపొందించబడలేదు అని సులభంగా చెప్పవచ్చు.
భారతీయ పురాణాలలోని చాలా ముఖ్యమైన అంశాలను నేటి యువ తరాలకు తెలపడమే కాకుండా.. భారతీయ వారసత్వం యొక్క ముఖ్యాంశంమైన ప్రేమ, విధేయత మరియు భక్తి యొక్క మూలాలను హైలైట్ చేసే ఈ గొప్ప కథలో చాలా అంతర్లీన సందేశాలను కలిగించడమే కాకుండా చెడుపై మంచి గెలిచే యుద్ధం అంటూ దర్శకుడు ఓం రౌత్ చాలా అందంగా తెరకెక్కించాడని చెప్పవచ్చు. ముఖ్యంగా టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు యానిమేటెడ్ శ్రీ మహా విష్ణు విజువల్స్ అద్భుతంగా అనిపించాయి. ఇక ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. బంగారు జింక వెంట రాముడు పరుగెత్తే సీన్స్ , రావణాసురుడు సీతను అపహరించే సీన్, లంకాదహనం, వాలి సుగ్రీవుల యుద్ధం, వానరసైన్యంతో కలసి నిర్మించే సేతు నిర్మాణం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని ఎత్తుకురావడం ఇలా చెప్పుకుంటూ పొతే అనేక సీన్స్ కూడా చాలా బాగా కుదిరాయి.చివరకు వానర సైన్యంతో రావణుడితో యుద్ధం చేసే సీన్ ఈ సినిమాకు హైలెట్ అని చెప్పవచ్చు. కార్తీక్ ఫళణి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.విజువల్స్, త్రీడీ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. సచేత్ – పరంపరలు మంచి సంగీతం అందించారు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అపూర్వ మోటివాలే, ఆశిష్ మహత్రే ల ఎడిటింగ్ పనితీరు బాగుంది.

టి సిరీస్, రెట్రో ఫైల్స్, యు.వి. క్రియేషన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టిరీ బ్యానర్స్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నయ్యర్, వంశీ, ప్రమోద్ లు నిర్మించిన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. రామాయణం అందరికీ తెలిసిన కథే అయినా ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసే కమర్షియల్ వాల్యూస్ తో ఒక హిస్టారికల్ గా తీయడం జరిగింది. దాని వలన చూసిన వారంతా బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక హాలీవుడ్ సినిమా ఎలా ఉంటుందో అంతా గొప్పగా గ్రాఫిక్స్ తో ఈ సినిమాని తీశారు. మన రామాయణ కథ తర్వాత తరాల వారికి అలానే ఇప్పుడు జనరేషన్ కి చాలా సులభంగా అర్థమయ్యేలాగా తీసిన ఈ “ఆదిపురుష్” సినిమా చిన్న, పెద్ద అనే తేడాలేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. కాబట్టి “డోంట్ మిస్ గో వాచ్..
Cinemarangam.Com Review Rating.. 3.5/5









