‘Neeku.. Naaku.. Rasunte’.. Movie Song Recording & Banner launched

యష్‌ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై యష్‌రాజ్‌ సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘నీకు… నాకు… రాసుంటే…’. కె.ఎస్‌. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి స్రవంతి పలగని నిర్మాత. హీరోలు ‘ఫోర్‌ లెటర్స్‌’ ఫేమ్‌ ఈశ్వర్‌, వర్మ, రుషి, సాయివిక్రాంత్‌. సత్యరాజ్‌, సుమన్‌, ఆలీ, రఘుబాబు, గౌతంరాజు, తనికెళ్ల భరణి ఇతర ప్రధాన తారాగణం. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రం సాంగ్‌ రికార్డింగ్‌ అండ్‌ బ్యానర్‌ లాంచింగ్‌ పూజా కార్యక్రమాలతో మొదలైంది.

ఈ సందర్భంగా ప్రముఖ గాయని సునీత మాట్లాడుతూ.. తెలుగులో యశ్‌రాజ్‌ పేరుతో బ్యానర్‌ స్థాపించడంతోనే సగం విజయం సాధించారు నిర్మాతలు. గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్‌ కోసం దర్శకులు వర్మ గారే 24 క్రాఫ్ట్స్‌ చేస్తున్నారు. ఈ ప్రయోగం ఒక మంచి ప్రయోగంగా మిగిలి పోవాలి. యూనిట్‌ అందరికీ నా బెస్ట్‌ విషెస్‌. నేను లైవ్‌లో ఓ సినిమాకు పాట పాడటం ఇదే తొలిసారి. ఇది కూడా ఓ రికార్డ్‌ అనుకుంటా. నాకు ఈ ప్రయోగాత్మక చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

నిర్మాత స్వాతి పలగాని మాట్లాడుతూ.. మే నెలలో ప్రారంభం కానున్న ఈ చిత్రం హైదరాబాద్‌, అరకు, వైజాగ్‌, మంగళూరు, ఊటీ, చెన్నై తదితర లొకేషన్స్‌లో షూటింగ్‌ జరుగుతుందని అన్నారు.

దర్శకుడు కె.ఎస్‌. వర్మ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకు చెందిన నటీనటులు పనిచేస్తున్నారు. ప్రపంచ రికార్డు కోసం 24 క్రాఫ్ట్స్‌ను నేనే నిర్వహిస్తున్నాను. దీన్ని లైవ్‌ రికార్డు కూడా చేస్తాం. తప్పకుండా మా కష్టానికి తగ్గట్టుగా ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్ముతున్నాను అన్నారు.

నిర్మాత స్రవంతి గారి భర్త అభిషేక్‌ మాట్లాడుతూ.. భారత దేశం గర్వించే సినిమాలు చేసిన యశ్‌రాజ్‌ ఫిలింస్‌ని దృష్టిలో పెట్టుకుని మా బ్యానర్‌కు ఈ పేరు పెట్టడం జరిగింది. ఇది మా అబ్బాయి పేరు కూడా కావడం మాకు లక్కీ. 2020లోనే సినిమా చేద్దామని అనుకున్నాం. కానీ సరైన కథలు దొరకలేదు. మా దర్శకుడు వర్మ గారు చెప్పిన లైన్‌ నచ్చి సినిమా సెట్స్‌కు మీదకు తీసుకెళ్తున్నాం. స్టోరీ బలంగా ఉందన్న నమ్మకంతో కొత్త వారితో వెళుతున్నాం. టాలెంటెడ్‌ టెక్నీషియన్స్‌ను ఎంచుకున్నాం అన్నారు.

హీరోలు రుషి, సాయి విక్రాంత్‌ మాట్లాడుతూ… మాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత స్రవంతి గారికి, దర్శకులు వర్మ గారికి మా ధన్యవాదాలు గత 6 నెలలుగా యూనిట్‌తో ట్రావెల్‌ చేస్తున్నాం. మా డైరెక్టర్‌ గారు మల్టీటాలెంటెడ్‌ అవడం వల్ల మేము కొత్త అయినా ఆ ఫీలింగ్‌ కలగడం లేదు. తప్పకుండా మాకు మంచి కెరీర్‌ దొరుకుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

మరో హీరోలు ఈశ్వర్‌, వర్మలు మాట్లాడుతూ.. మా సినిమాకు పని చేస్తున్న ది గ్రేట్‌ సునీత గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథ వినగానే ఎగ్జైట్‌ అయ్యాము. నిర్మాత ఎవరు అంటే.. నా లాగా సినమాపై ప్యాషన్‌ ఉన్న ప్రొడ్యూసర్‌ దొరకాలి అన్నారు దర్శకులు వర్మగారు. మా అదృష్టం స్రవంతి గారు నిర్మాతగా వచ్చారు. మా కెరీర్‌కు ఇది మంచి బూస్ట్‌ ఇచ్చే సినిమా అవుతుంది అన్నారు.

టెక్నీషియన్స్‌:
బ్యానర్‌: యష్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌.
సమర్పణ: యష్‌రాజ్‌.
నిర్మాత: స్రవంతి పలగాని
24 క్రాఫ్ట్స్‌ డైరెక్టర్‌ : కె.ఎస్‌. వర్మ.
మ్యూజిక్‌ ప్రోగ్రామర్‌ : టి.ఆర్‌. కృష్ణ చేతన్‌.
డి.ఓ.పి : హేమంత్‌ బి.ఎం.
యాక్షన్‌ : కనిష్క శర్మ షిఫు.
ఆర్ట్‌ డైరెక్టర్‌ : నాని.
ఎడిటర్‌ : ఆంటోని.
ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌ : సురేష్‌బాబు.
మేనేజర్‌ : మోహన్‌కుమార్‌ ఎం, మోషన్‌రాజ్‌.
కో`డైరెక్టర్‌ ఆర్‌.వి. సురేష్‌, పి. జగన్నాథ్‌రెడ్డి, కె. వీర.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here