కృతిశెట్టి మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ నాకు మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఈ సినిమాతో ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అయ్యాను. ఈ సినిమాలో నన్ను తీసుకున్నందుకు దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఇప్పటి వరకూ నా బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని ప్రేక్షకులు అంటున్నారు. చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. సుధీర్ బాబు గారు లాంటి మంచి యాక్టర్ తో నటించడం ఆనందంగా వుంది. ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి” అని కోరారు.
మోహనకృష్ణ ఇంద్రగంటి.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’కి హార్ట్ వార్మింగ్ సక్సెస్ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులకు వినోదం పంచడంతో పాటు ఒక కొత్త కోణాన్ని ప్రజంట్ చేయాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది. ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమా రీచ్ అవ్వాలనే కోరిక వుంది. యంగ్ స్టర్స్, ఫ్యామిలీని ద్రుష్టిలో పెట్టుకొని తీసిన సినిమా ఇది. యంగ్ స్టర్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరింత ఎక్కువ మంది ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాం. సుధీర్ బాబు కెరీర్ లోనే ఇది బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ అని సినిమా చుసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. మేము నమ్మిన అంశాలపై పట్ల విమర్శకులు కూడా ఏకీభవించడం మాకు ఆనందం కలిగించింది. కృతిశెట్టి చాలా కొత్తగా కనిపిస్తున్నారనే ప్రశంసలు వస్తున్నాయి. పీజీ విందా, సాహి సురేష్, వివేక్ సాగర్ ఇలా సాంకేతిక నిపుణులందరి వర్క్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రేక్షకులకు, మాకు సహకరించిన మీడియాకి మా యూనిట్ తరపున కృతజ్ఞతలు. మైత్రీ మూవీ మేకర్స్ కృతజ్ఞతలు. గొప్ప ఆత్మగౌరవంతో అరంగేట్రం చేసిన బెంచ్ మార్క్ స్టూడియోకి అభినందనలు. ఈ మంచి సినిమాని మరింత ముందుకు తీసుకెళ్లాలని ప్రేక్షకులు, మీడియాని కోరుతున్నాను”
సాహి సురేష్ మాట్లాడుతూ.. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వైబ్ తో ముందుకు వెళుతుంది. సుధీర్ బాబు, ఇంద్రగంటి, కృతిశెట్టి , సినిమా యూనిట్ అందరికీ అభినందనలు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు” తెలిపారు.
శ్రీనివాస్ వడ్లమాని మాట్లాడుతూ.. ఇంద్రగంటి గారు మలయమారుతం లాంటి సినిమా తీశారు. ఈ సినిమాని విజయవంతం చేయాల్సిన భాద్యత మనం తీసుకోవాలి. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలి” అని కోరారు.









