‘No Rama Ravans Only’ movie ready for release.

పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి” అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “నో రామా రావన్స్ ఓన్లీ”.డైరెక్టర్ కట్ సినిమా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తుంది.  వీరబ్రహ్మం స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని డిటెక్టీవ్ యఫ్ ఫుల్ వీడియో సాంగ్ ను ఉగాది సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా

చిత్ర దర్శక,నిర్మాత వీర బ్రహ్మం మాట్లాడుతూ..సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించాము. “పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి” అనే సెంటిమెంట్ పాయింట్ తో తెరకెక్కించిన “నో రామా రావన్స్ ఓన్లీ” చిత్రం లోని పాటను ఉగాది సందర్భంగా ర్యాప్ వేర్షన్ లో చిత్రీకరించిన  డిటెక్టీవ్ యఫ్ ఫుల్ వీడియో సాంగ్  ని యూట్యూబ్ లో  డైరెక్టర్ కట్ సినిమా యూట్యూబ్ ఛానెల్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధిస్తుందని అన్నారు.

నటీనటులు

అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం తదితరులు

సాంకేతిక నిపుణులు

స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్- ప్రొడ్యూసర్ & మ్యూజిక్.. వీరబద్రం నక్కా
కెమెరామెన్ : అశోక్ కుమార్ మట్టపూడి
కొరియోగ్రఫీ : కృష్ణ, అంజ గౌడ్,అర్జున్
ప్రొడక్షన్ డిజైనర్ పాపారాయుడు
పి.ఆర్.ఓ : బాబునాయక్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here