‘No Rama Ravans Only’ Movie Trailer Launch

పసివయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి” అనే సెంటిమెంట్ పాయింట్ తో సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన చిత్రం “నో రామా రావన్స్ ఓన్లీ”.డైరెక్టర్ కట్ సినిమా బ్యానర్ పై అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం నటీనటులుగా వీరబ్రహ్మం స్వీయదర్శకత్వంలో తెరకెక్కిన ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం “నో రామా రావన్స్ ఓన్లీ” ..డైరెక్టర్స్ డే సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను  నటులు తిరుపతి, ఫణి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా

చిత్ర దర్శక,నిర్మాత వీర బ్రహ్మం మాట్లాడుతూ..”పసి వయస్సులో గుండెలపై అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి” అనే సెంటిమెంట్ పాయింట్ ను తీసుకుని ప్రస్తుత సమాజంలో రాముడి గుణాలు చాలా తక్కువ మందికి వున్నా రావణుని గుణాలే ఎక్కువ మందికి ఉన్నాయని తెలుపుతూ సొసైటీ కి ఈ సినిమా ఎంతో అవసరం అని తెరకెక్కించిన సైకాలజికల్ థ్రిల్లర్ “నో రామా రావన్స్ ఓన్లీ”. టైటిల్ ఎంత వైవిధ్యంగా ఉందో.. సినిమా కూడా అంతే వైవిధ్యభరితంగా ఉంటుంది. ముఖ్యంగా తల్లి దండ్రులందరూ చూడాల్సిన సినిమా ఇది. తమ పిల్లలను పెంచాల్సిన టైమ్‌లో సరిగా పెంచకపోతే ఎటువంటి పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందనేది.. మంచి మెసేజ్‌తో ఈ చిత్రంలో చూపించాము. తల్లిదండ్రులనే కాదు.. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుంది.

నటుడు అంకిత్ నాయుడు మాట్లాడుతూ.. దర్శక,నిర్మాత వీర బ్రహ్మం గారు అన్ని తానే చూసుకుంటూ వన్ మ్యాన్ షో లా చూసుకున్నాడు.

నటుడు ఫణి మాట్లాడుతూ.. సినిమా కోసం చాలా కష్టపడే వ్యక్తి బ్రహ్మం. ఈ టైటిల్ చాలా బాగుంది. సమాజంలో ఎం జరుగుతుంది అనేది ప్రేక్షకులకు తెలపడానికి సైకాలజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.

దర్శకుడు, నటుడు తిరుపతి మాట్లాడుతూ.. ఈ సినిమాకు తనే దర్శకత్వం, ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాత ఇలా 24 క్రాఫ్ట్స్ లలో 18 క్రాఫ్ట్స్ వర్క్ తనొక్కడే చేశాడు.కొత్త ఇన్నివేటివ్ కాన్సెప్ట్ తో  సైకాలజికల్ థ్రిల్లర్  గా అద్భుతంగా తెరకెక్కించాడు అన్నారు.

నటుడు నాగేశ్వర రావు, మాట్లాడుతూ.. సమాజంలో ఎం జరుగుతుంది అనేది సినిమాలో చాలా చక్కగా చూయించారు.

శ్రీనివాస్, శివ బలరాం, రిషి అందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

నటీనటులు

అనూష శర్మా, అంకిత్ నాయుడు, శ్రీజ, శ్రీనివాస్, రమణ, తిరుపతి,అనిత, కార్తిక్ దేవల్రాజు, నందిని, బలరాం తదితరులు

సాంకేతిక నిపుణులు

స్టోరీ- స్క్రీన్ ప్లే- డైరెక్షన్- ప్రొడ్యూసర్ & మ్యూజిక్.. వీరబద్రం నక్కా
కెమెరామెన్ : అశోక్ కుమార్ మట్టపూడి
కొరియోగ్రఫీ : కృష్ణ, అంజ గౌడ్,అర్జున్
ప్రొడక్షన్ డిజైనర్ పాపారాయుడు
పి.ఆర్.ఓ : వీరబాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here