‘O Bhama Ayyoo Rama’ Movie Review(Beautiful Romantic Entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : వి ఆర్ట్స్
సినిమా : ‘ ఓ భామ అయ్యో రామ’
రివ్యూ రేటింగ్ : ️⭐️⭐️1/2(2.5/5)️
విడుదల తేదీ : జూలై 11
నిర్మాత : హరీష్ నల్ల
రచన, దర్శకత్వం : రామ్ గోదల
నటీనటులు – సుహాస్, మాళవిక మనోజ్, అనిత హసానందిని, ఆలీ, రవీందర్ విజయ్, బబ్లు పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని తదితరులు.
సినిమాటోగ్రాఫర్ : ఎస్ మణికందన్
సంగీత దర్శకుడు :  రథన్
ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి
ఎడిటర్ : భవిన్ ఎం షా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : అశ్వత్, ప్రతిభ
ప్రొడక్షన్ మేనేజర్ : సంతోష్ గౌడ్
పి. ఆర్. ఓ : ఏలూరు శ్రీను, మడూరి మధు 


సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘ఓ భామ అయ్యో రామ’. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న  నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో  కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ పతాకంపై హరీష్‌ నల్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి  స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.  ఈ చిత్రాన్ని జూలై11న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్‌  రిలీజ్ అయిన  ‘ఓ భామ అయ్యో రామ’ చిత్రం ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి..

కథ :
రామ్ (సుహాస్) తన చిన్న తనంలోనే తల్లి మీనాక్షి నువ్వు-నేను హీరోయిన్ (అనిత హసానందిని) చనిపోవడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. క్లాసికల్ డ్యాన్సరైన అనితను పెళ్లికాలేదని నమ్మించి రెండో పెళ్లి చేసుకుంటాడు డైరెక్టర్ విజయ్(విజయ్ రవీందర్). ఈ విషయం తెలిసేలోపే రామ్ కి జన్మ నిస్తుంది. రామ్ లోని ఒంటరి తనాన్ని పొగట్టటానికి తన తల్లి వీలు కుదిరినప్పుడల్లా సినిమాలకు తీసుకెళ్ళేది.దాంతో సినిమా అంటే ఇష్టం ఏర్పడంతో స్కూల్ డేస్ లోనే కథలు రాసి స్టేజ్ షో చేయడంతో స్కూల్ లో మంచి గుర్తింపు తెచ్చుకొంటాడు. పేరెంట్స్ మీటింగ్ లో నీ తండ్రి పేరు చెప్పమని అడగ్గా డైరెక్టర్ విజయ్ అని గర్వంగా చెప్పుకుంటాడు.ఇది తెలుసుకొన్న రామ్ తండ్రి సమాజంలో తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని రామ్ ను చంపే ప్రయత్నం చేస్తాడు. ఇది చూసిన మీనాక్షి మోసం చేసి పెళ్లిచేసుకోవడమే కాకుండా కన్న కొడుకునే చంపాలని చూస్తావా అని భర్తను వదిలేసి బయటకు వచ్చి స్టూడెంట్స్ కు క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తుంటుంది. రామ్ లో ఉన్న టాలెంట్ ను గుర్తించిన తల్లి రామ్ ను పెద్ద డైరెక్టర్ ని చేయాలనుకుంటుంది.కానీ తన తండ్రి కారణంగా సినిమాలపై అయిష్టం పెంచుకుంటాడు. అయితే అనుకోకుండా రామ్ తల్లి చనిపోవడంతో తన మామయ్య బాల (ఆలీ)పెంచి పెద్ద చేస్తాడు. పెరుగుతాడు.

యు.యస్ వెళ్లి మాస్టర్స్ చెయ్యాలనుకున్న రామ్ కు యాక్సిడెంట్ గురై అపస్మారక మైన స్థితిలో ఉన్న సత్య భామను సేఫ్ గా ఆమె ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత తనను రక్షించిన రామ్ అరెస్ట్ అయ్యాడని తెలుసుకొని పోలీస్ స్టేషన్ కు వస్తుంది.అప్పటికే వెళ్ళిపోయిన రామ్ గురించి తెలుసుకొని రామ్ కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత రామ్ ను ఒక శ్మశానం కు తీసుకెళ్లి తను పెద్ద డైరెక్టర్ అవ్వాలనుంది అని కథలు చెప్తుంది.సినిమాలంటే ఇష్టం ఉండని తనని పెద్ద డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ చేపిస్తుంది .మరో వైపు బిజినెస్ టైకూన్ అయిన బబ్లు పృద్విరాజ్ తన కూతురు సత్యభామకు యు.యస్ లో ఉండే అబ్బాయితో పెళ్లిసంబంధం చూస్తాడు. కానీ పెళ్లి కొడుకు కాల్ చేస్తే తనంటే ఇష్టం లేనట్టు బ్రో అని మాట్లాడుతుంది. ఒక రోజు తన బర్త్ డే కి రామ్ ను షాపింగ్ కు తీసుకెళ్తుంది. ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో రామ్ ఒక వ్యక్తిని చూసి రోడ్ పై కళ్ళు తిరిగి కిందపడిపోతాడు. తనను కాపాడే ప్రయత్నంలో సత్యభామ యాక్సిడెంట్ కు గురవుతుంది. యాక్సిడెంట్ నుంది కోలుకున్న తర్వాత తన ఇంట్లో వారికి రామ్ ను పరిచయం చేసి ఇతనిని ప్రేమించాను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను అని పేరెంట్స్ కు షాక్ ఇస్తుంది.ఆలా వీరిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా డీప్ లవ్ లో వుంటారు. అయితే రామ్ తో డీప్ లవ్ లో ఉన్న సత్యభామ ఒకరోజు సడన్ గా మనం మూడేళ్లు దూరంగా ఉండాలి మనిద్దరి మధ్య ఎటువంటి కాంటాక్ట్స్ కూడా ఉండకూడదని, ప్రామిస్ చేయించుకుని వెళ్ళిపోతుంది. తనెందుకు ఆలా చేసింది?ఈ మూడు సంవత్సరాలలో వీరిద్దరిలో జరిగిన మార్పులు ఏంటి? చివరికి వారిద్దరూ ఒక్కటయ్యారా? పెద్ద డైరెక్టర్ అవ్వాలనే తల్లి కలను నిజం చేశాడా లేదా? అనే విషయాలు తెలుసుకోవాలి అంటే కచ్చితంగా “ఓ భామ అయ్యో రామ” సినిమా చూడాల్సిందే..


నటీ నటుల పనితీరు
రామ్‌ పాత్రలో హీరోగా నటించిన సుహాస్‌ తన డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. సత్యభామ పాత్రలో  హీరోయిన్‌ గా నటించిన మలయాళం బ్యూటీ మాళవిక మనోజ్‌ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. తెలుగులో తనకిది మొదటి సినిమా అయినా చాలా చక్కగా మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పచ్చు. క్లాసికల్ డ్యాన్సర్ గా రామ్ తల్లి పాత్రలో మీనాక్షి గా నటించిన అనిత చాలా సంవత్సరాల తరువాత మళ్ళీ నటనతో ఆకట్టుకోవడమే కాకుండా ప్రేక్షకుల కళ్ళల్లో కన్నీళ్లు తెప్పిస్తుంది .రామ్ మామయ్య పాత్రలో ఆలీ అలరించాడు. గెస్ట్ రోల్స్ లో నటించిన హరీష్ శంకర్ నటన బాగుంది’.డైరెక్టర్ మారుతి ఒక సన్ని వేషంలో మెరుస్తాడు. ఇంకా ఇందులో ,రామ్ తండ్రి గా రవీందర్ విజయ్,సత్యభామ తండ్రి గా బబ్లు పృథ్వీరాజ్, లెక్చరర్ పాత్రలో ప్రభాస్ శ్రీనుల నటన బాగుంది. ఇంకా ఇందులో రఘు కరుమంచి, మొయిన్, సాత్విక్ ఆనంద్, నయని పావని  తదితరులందరూ వారికిచ్చిన పరిధి మేరకు నటించి మెప్పించారాని చెప్పచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
ఇదొక క్యూట్‌ అండ్‌ ఎంటర్‌టైనింగ్‌ లవ్‌స్టోరీ. డైరెక్టర్ గా చూడాలనే తల్లి కలను నెరవేర్చే క్రమంలో రామ్ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథను రాసుకొని దానికి తగ్గట్టు చక్కటి ఎమోషన్స్, లవ్ స్టోరీ ను
రాసుకున్నాడు. అయితే ఫస్టాఫ్ అంతా సినిమా ఎటువైపు వెళుతుంది అనే విధంగా చూస్తున్న ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతారు. సెకండాఫ్ లో సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ వైపు ప్రేక్షకులను తీసుకెళ్లడంలో దర్శకుడుగా రామ్ గోధల సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. హీరోయిన్‌ మాళవిక, హీరో సుహాస్‌ మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతో వినోదాన్ని పంచుతాయి. సంగీత దర్శకుడు రథన్ అందించిన సంగీతం మరియు ‘ఓ మెరుపులా చిందులే వేయారా,  రంగుల రాట్నం తిప్పినట్టే వుందే, గల్లీ స్టెప్, పాటలు బాగున్నాయి. డిఓపి ఎస్ మణికందన్  సినిమాటోగ్రఫీ విజువల్ ట్రీట్‌గా ఉంది. సినిమాలోని ప్రతి ఫేమ్‌ కలర్‌ఫుల్‌గా ఉంది.భవిన్ ఎం షా ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది.వి ఆర్ట్స్ బ్యానర్ పై హరీష్ నల్ల  నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడా కూడా కాంప్రమైజ్‌ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించాడు.  ఫైనల్ గా ‘ ఓ భామ అయ్యో రామ’ సినిమా గురించి చెప్పాలి అంటే ఇదొక బ్యూటిఫుల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్ .చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఫ్యామిలీ తో వచ్చి హ్యాపీ గా ఎంజాయ్ చేయచ్చని కచ్చితంగా చెప్పచ్చు.

Cinemarangam.Com Review Rating..⭐️⭐️1/2(2.5/5)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here