‘Oka Brundavanam’ Movie Review (Feel good family entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : సీర్ స్టూడియోస్
సినిమా : “ఒక బృందావనం “,
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల : మే 23,
నిర్మాతలు : కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు,
డైరెక్టర్ : బొత్స సత్య
నటీ నటులు : బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ తదితరులు,
మ్యూజిక్ : సన్నీ మరియు సాకేత్
డి.ఓ.పి : రాజ్ కె. నల్లి
ఎడిటర్ : తమ్మి రాజు, సంతోష్ కామిరెడ్డి
పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మాడూరి మధు


కంటెంట్‌ బాగుంటే చిన్న సినిమా, పెద్ద సినిమా నూతన తారలు, క్రేజ్‌ ఉన్న తారలు అనే తారతమ్యాలు ఉండవు. ఈ మధ్య కాలంలో కేవలం కంటెంట్‌తోనే సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలు చాలా ఉన్నాయి. తాజాగా ఆ కోవలోకి చేరే చిత్రమే ”ఒక బృందావనం”. నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీనివాస్ మరియు ఇతర సీనియర్‌ నటీనటులు ఈ చిత్రంలో నటించారు! బొత్స సత్య దర్శకత్వంలో కిషోర్‌ తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు ఈ చిత్రాన్ని నిర్మించారు. మైత్రీ మూవీస్‌ ద్వారా ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం పదండి


కథ
శివాజీ రాజా, రూపా లక్ష్మి ల కొడుకు రాజా విక్రమ్ (బాలు ) ఒక ఈవెంట్ కంపెనీ లో కెమెరామెన్ గా పని చేస్తుంటాడు.ఇంట్లో అన్ని కష్టాలే ఉండడంతో ఎలాగైనా అమెరికా వెళ్లి  బాగా డబ్బులు సంపాదించాలని ట్రై చేస్తుంటాడు.అయితే విక్రమ్, నందు అనే అమ్మాయిని ప్రేమించింటాడు. నందుని కలసిన ప్రతి సారి పెళ్లి టాపిక్ తీసుకు వస్తుంది.త్వరలో  అమెరికా వెళ్ళడానికి వీసా వస్తుంది. అమెరికా వెళ్ళగానే నిన్ను పెళ్లి చేసుకుంటానంటాడు విక్రమ్. ప్రతి సారి ఇలాగే చెప్తున్నావ్ అంటుందినందు  . అయితే ఒకరోజు విక్రమ్ గర్ల్ ఫ్రెండ్ నందు వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది.దాంతో చాలా డిప్రెషన్ లో ఉంటాడు బాలు.

అనాధాశ్రమంలో వుండే  నైనిక సాన్విత అనే అమ్మాయికి  ప్రతి సంవత్సరం జోసెఫ్ (శుభలేఖ సుధాకర్) పేరు మీద ప్రతి క్రిస్మస్ కి గిఫ్ట్స్ వస్తూ ఉంటాయి. దాంతో ఎప్పటికైనా జోసెఫ్ ని కలవాలని తన తల్లి తండ్రులు ఎవరో కనుక్కోవాలని అనుకుంటుంది.జోసఫ్ ఎవరో తెలుసుకోవడానికి ఆశ్రమం నుంచి పారిపోవడం కూడా ప్రయత్నిస్తుంది.


 
మరోవైపు మహి తండ్రి వంశీ నెక్కంటి  తన కూతురుకి త్వరగా పెళ్లి చేయాలని సంబంధాలు తీసుకొని వస్తుంటాడు. తన తల్లి  తీయాలనుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయకుండానే  చనిపోయిందని. ఇప్పుడు అమ్మ కల నెరవేర్చిన తరువాతే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి బయటకు వస్తుంది.ఆలా వచ్చిన మహికి విక్రమ్ తీసిన కెమెరా స్టిల్స్, అమ్మ దగ్గర ఉన్న కెమెరా స్టిల్స్ కు మ్యాచ్ అవ్వడంతో.. విక్రమ్  దగ్గరకు  వచ్చి డ్యాక్యుమెంటరీ కెమెరామెన్ గా చేయమని మహి అడుగుతుంది. లవ్ ఫెయిల్యూర్ అయ్యి డిప్రెషన్ లో ఉన్న విక్రమ్ చేయనని మహి ని అవాయిడ్ చేస్తాడు, ఇంతలో వీసా రెడీ అవుతుంది అందుకు డబ్బు రెడీ చేసుకోమని విక్రమ్ కు ఫోన్ రావడం తో తప్పని పరిస్థితుల్లో డాక్యుమెంటరీ కెమెరామెన్ గా చేయడానికి ఒప్పుకుంటాడు. దీంతో విక్రమ్, మహి ల  డాక్యుమెంటరీ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈ క్రమంలో నైనికాన్ని కలుస్తారు. నైనిక తనని జోసెఫ్ వద్దకు తీసుకెళ్తామని చెప్పడంతో నైనిక డాక్యుమెంటరీ వీడియో కి ఒప్పుకుంటుంది.

అసలు మహి తీసే డాక్యుమెంటరీ ఏమిటీ ? విక్రమ్  అమెరికాకు వెళ్లాలనే కలను నెరవేర్చుకొన్నాడా? ఇంతకీ జోసెఫ్ ఎవరు, పాపకు ఎందుకు గిఫ్ట్స్ పంపిస్తున్నాడు ? చివరికి డాక్యుమెంటరీ తరువాత పెళ్లి చేసుకుంటానని చెప్పిన మహి పెళ్లి చేసుకుందా ?  విక్రమ్,మహి లు సపోర్ట్ తో నైనిక  జోసెఫ్ ను కలసి తన పేరెంట్స్ ఎవరో  తెలుకుందా? ఇలా ఇవన్నీ తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి ఒక బృందావనం సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
రాజా విక్రమ్ పాత్రలో బాలు ఎంతో సహజంగా నటించాడు.  కెమెరామెన్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.మహి పాత్రలో  షిన్నోవా గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్‌తో  అద్భుతంగా  నటించింది.ఈ సినిమా ద్వారా హీరో, హీరోయిన్స్ ఇద్దరూ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ సాన్విత కూడా క్యూట్ గా నటించింది . మహేందర్ మహబూబ్ బాషా అక్కడక్కడ నవ్విస్తారు శుభలేఖ సుధాకర్ ఫాదర్ పాత్రలో చక్కగా నటించాడు వంశీ నెక్కంటి హీరోయిన్ తండ్రి పాత్రలో సింపుల్ గా కనిపించి మెప్పిస్తారు రూపా లక్ష్మి శివాజీ రాజా  మిగిలిన నటీనటులందరూ  వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు :
ఇదొక ఇంట్రెస్టింగ్‌ అండ్ ఫీల్‌గుడ్‌ ఫిల్మ్‌. ఎటువంటి సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు ఒక పాప కోసం ప్రయాణం చేయడం అనే ఎమోషన్ బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఫ్రీ క్లైమాక్స్ లో వచ్చే లవ్ సీన్స్, లవ్ ఎమోషన్స్ మధ్యలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా  ఒక మంచి ఫీల్ ఇచ్చేలా కొత్త కథాంశంతో, మంచి డైలాగ్స్ తో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు బొత్స సత్య. చూస్తున్న ప్రేక్షకులకు మధ్య మధ్యలో వచ్చే సీన్స్ కంటతడి పెట్టిస్తాయి, అలాగే నవ్విస్తాయి. ఆర్టిస్ట్‌లు, టెక్నిషియన్స్‌ ఎంతో ఎఫర్ట్‌ పెట్టారు. సినిమా మీద పాషన్‌తో యూఎస్‌లో జాబ్‌ చేస్తూ ఈ సినిమా నిర్మించారు. సినిమా పట్ల ఎంతో పాషన్‌తో ఉన్న హీరో బాలు పర్‌ఫార్మెన్స్‌ అందర్ని అలరిస్తుంది.

 

నిర్మాతలు తాటికొండ, వెంకట్‌ రేగట్టే, ప్రహ్లాద్‌ బొమ్మినేని, మనోజ్‌ ఇందుపూరు ఎంతో నిజాయితీగా ఓ మంచి అటెంప్ట్‌ చేశారు. సంగీత దర్శకులు సన్నీ మరియు సాకేత్ ల మ్యూజిక్ కూడా సింపుల్ గా కథకు తగ్గట్టు బాగుంది.చంద్రబోస్, రామజోగై శాస్త్రి, శ్యామ్ కాసర్ల, శ్రీనివాస మౌళి మరియు కళ్యాణ్ చక్రవర్తి రాసిన సాహిత్యంతో,ఈ పాటలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రాఫర్ రాజ్ కె నల్లి  తీసిన విజువల్స్‌ బ్యూటిఫుల్‌ గా ఉన్నాయి. తమ్మిరాజు మరియు సంతోష్ కామిరెడ్డి ల ఎడిటింగ్  పనితీరు బాగుంది  ఎలాంటి అహింస తావు లేకుండా సినిమా టైటిల్ తగ్గట్టు మనసుకు హాయినిస్తూ మంచి ఎమోషన్స్ తో మెప్పించే  ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. చూసిన వారందరూ  ఓ మంచి బ్యూటిఫుల్‌ సినిమాను చూశామన్న అనుభూతి కలుగుతుంది. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూసే సినిమా ‘ఒక బృందావనం” అని ఖచ్చితంగా చెప్పవచ్చు

Cinemarangam.Com   Review Rating 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here