On the occasion of Dasari Jayanti Pan India Directors Felicitated

దాసరి జయంతిని పురస్కరించుకొని పాన్ ఇండియా దర్శకులకు దాసరి కల్చరల్ ఫౌండేషన్ ఆద్వర్యంలో తెలుగు సినిమా వేదిక-ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ సమన్వయంతో ఎఫ్.ఎన్.సి సి క్లబ్ లో అంగరంగ వైభవంగా సత్కారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చెందిన బాలీవుడ్ దర్శకులు, నటీమణులు తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిని అందుకుందని కితాబునిచ్చారు.

దర్శకదిగ్గజం దాసరి నారాయణరావు బయోపిక్ ను “దర్శకరత్న” పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తాడివాక రమేష్ నాయుడు స్థాపించిన దాసరి కల్చరల్ ఫౌండేషన్… తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, ఎఫ్ టి పి సి అధ్యక్షులు చైతన్య జంగా సంయుక్త సారధ్యంలో దాసరి సంస్మరణ వేడుక హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు తరుణ్ భట్టాచార్య, ప్రముఖ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి, ధవళ సత్యం, రేలంగి నరసింహారావు బి.గోపాల్, వీరశంకర్, ముప్పలనేని శివ, ఆర్.నారాయణమూర్తి, చంద్రమహేష్, రాజా వన్నెంరెడ్డి, బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభారణం కృష్ణమోహన్ రావు, సాంస్కృతిక బంధు సారిపల్లి కొండలరావు, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, దర్శకుల సంఘం అధ్యక్షులు కాశీ విశ్వనాధ్, మాదాల రవి, మోహన్ గౌడ్, బాబ్జి, “పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్, సీనియర్ జర్నలిస్టులు విజయ్ బాబు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.
ఈసందర్బంగా దేశవ్యాప్తంగా 16 భాషలకు చెందిన దర్శకులకు సన్మానం చేశారు. అనంతరం సీనియర్ దర్శకులు ధవళ సత్యం సారధ్యంలో తాడివాక రమేష్ నాయుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న బహుభాషా బయోపిక్ “దర్శకరత్న” పోస్టర్ ను ఆవిష్కరించారు. వచ్చే ఏడాది దాసరి జయంతిని మరింత ఘనంగా నిర్వహించనున్నామని… సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ స్టార్ జితేంద్ర వంటి లెజెండ్స్ ను ఈసందర్భంగా సత్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నామని… రజనీకాంత్, జితేంద్రలను ఇప్పటికే నేరుగా సంప్రదించగా వారు సంతోషంగా సమ్మతించారని రమేష్ నాయుడు తెలిపారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పండిట్ తరుణ్ భట్టాచార్య ఈ వేడుకలో పాల్గొనడం పట్ల కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ రచయిత సి.శ్రీకాంత్ కుమార్-అంకిత బ్రహ్మ ఈ వేడుకకు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here