‘Ooko Ooko’ lyrical song release in ‘Rajahmundry Rose Milk’ Movie

జై జాస్తి, అనంతిక, జంటగా  సన్నీల్ కుమార్, వెన్నెల కిషోర్, ప్రవీణ్,  ప్రణీత్ పట్నాయక్ ముఖ్యపాత్రల్లో రూపొందుతున్న చిత్రం రాజమండ్రి రోజ్ మిల్క్. నాని బండ్రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్, తో కలిసి ఇంట్రూప్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. డి.సురేష్‌బాబు, ప్రదీప్ ఉప్పలపాటి  నిర్మాతలు. ప్రస్తుతం రాజమండ్రిలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు నాని బండ్రెడ్డి తెలియజేస్తూ ఇటీవల ఈ చిత్రంలోని ఊకో ఊకో అనే లిరికల్ సాంగ్‌ను రాజమండ్రిలోని వర్ధమాన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రముఖ యువ దర్శకుడు బుచ్చిబాబు సానా విడుదల చేశారు. పూర్తి యూత్‌ఫుల్ కొనసాగే ఈ పాటకు మంచి స్పందన వస్తోంది. శ్రీమణి సాహిత్యం అందించన ఈ పాటను యశ్వంత్‌నాగ్  స్వరపరచి, ఆలపించాడు.  పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అందరికి  కాలేజీ రోజులను గుర్తుచేస్తుంది. కాలేజీ రోజుల్లో జరిగిన మరపురాని సంఘటనలను ఈ చిత్రం జ్ఞప్తికి తెస్తుంది అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ వర్గీస్, గోవింద్ వసంత్, అజయ్ అరసాడ, యశ్వంత్ నాగ్, భరత్-సౌరభ్, డీఓపీ: ముఖేష్.జి, సాహిత్యం: చంద్రబోస్, అనంత్‌శ్రీరామ్, శ్రీమణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here