Cinemarangam.com
రివ్యూ రేటింగ్..3.5/5
సినిమా : ‘డిజె టిల్లు
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
బ్యానర్స్ : సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
దర్శకత్వం: విమల్ కృష్ణ
నటీనటులు : సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి, ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ తదితరులు
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
నేపథ్య సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన “డిజె టిల్లు” చిత్రం ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్జిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఎంటర్టైన్ చేసిందో చుద్దాం పదండి.
కథ
డి.జె.టిల్లు(సిద్ధు జొన్నలగడ్డ) లోకల్ డీజే గా మంచి ఫేమస్. అతనికి పబ్బుల్లో సింగర్ గా పనిచేసే రాధిక(నేహా శెట్టి)తో పరిచయం ఏర్పడి… అది ప్రేమగా మారుతుంది.. అయితే రాధిక అనుకోకుండా తన మాజీ ప్రియుడు రోహిత్ (బిగ్ బాస్ ఫేమ్ కిరీటి)ని హత్య చేస్తుంది. దాన్నుంచి బయట పడటానికి టిల్లుని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి… శవాన్ని మాయం చేయాలనుకుంటారు. ఇలా మాయం చేసే క్రమంలో ఓ డిటెక్టివ్(నర్రా శ్రీను) కంట్లో పడతారు. ఈ శవం తాలూకు విషయాలు బయటకు రాకుండా ఉండాలంటే పాతిక లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. మరి డీజే టిల్లు, రాధిక అతను డిమాండ్ చేసిన డబ్బును ఇచ్చారా? ఆ డబ్బు కోసం ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? మర్డర్ కేసు నుంచి ఎలా బయటపడ్డారు అనేదే మిగతా కథ.
నటీనటుల పనితీరు
సిద్దూ జొన్నలగడ్డ నట ఆడియన్స్ ని అలరించారు. ఈ చిత్రానికి తనే కథ రాసుకివడంతో కొన్ని సీన్స్ నటనతో టాప్ లో నిలబెట్టాయి. తెలంగాణ స్లాంగ్ బాగా పేలింది. అమ్మాయిల లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో… దాన్ని హీరోయిన్ నేహా శెట్టి కొంచెం నెగిటివ్ టచ్ ఉన్న రొమాంటిక్ గర్ల్ గా మెప్పించింది. రావ్ పాత్రలో బ్రహ్మాజీ పోలీస్ ఆఫీసర్ గా అలరించారు. నటుడు ప్రిన్స్ పబ్ ఓనర్ గా మంచి ఫన్ పంచాడు. డిటెక్టివ్ పాత్రలో నర్రా శీను బాగా నటించారు. సిద్దు తల్లి,తండ్రులు చక్కటి నటనతో మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు విమల్ కృష్ణ మంచి ఫన్ ఉన్న డైరెక్టర్. ఎంచుకున్న కథ… కథనాలను బాగా ఎగ్జిక్యూట్ చేసాడు. ఎక్కడా బోరింగ్ లేకుండా… ఎంతో గ్రిప్పింగ్ గా డీజే టిల్లులో ఫన్ చూపించారు. తమన్ సంగీతం హైలెట్. పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఎడిటింగ్ గ్రిప్పింగ్ గా ఉంది.ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మించిన నిర్మాణ విలువలు క్వాలిటీ గా.. రిచ్ గా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు.చూసిన వారందరికీ డిజె టిల్లు సినిమా కచ్చితంగా నచ్చుతుంది.
Cinemarangam.com. Review Rating. 3.5/5









