Cinemarangam.com
Review Rating 3/5
సినిమా : కరణ్ అర్జున్
ప్రొడ్యూసర్స్ : డా.సోమేశ్వరరావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్;
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రవి మేకల;
కథ -మాటలు -స్క్రీన్ ప్లే- దర్శకత్వం : మోహన్ శ్రీవత్స.
నటీ నటులు : అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా , మాస్టర్ సునీత్ , అనితా చౌదరి, రఘు . జి, జగన్, ప్రవీణ్ పురోహిత్, మోహిత్, వినోద్ బాటి, ప్రసన్న తదితరులు
డి .ఓ .పి : మురళి కృష్ణ వర్మన్;
ఎడిటర్ : కిషోర్ బాబు;
మ్యూజిక్ : రోషన్ సాలూర్;
పాటలుః సురేష్ గంగుల;
ఫైట్స్ : రామ్ సుంకర;
కొరియోగ్రఫీ : రవి మేకల;
పిఆర్. ఓ : చందు రమేష్ (బాక్సాఫీస్);
డిజైనర్: వీవా పోస్టర్స్,
కాస్ట్యూమ్ డిజైనర్ : లతా మోహన్;
రెడ్ రోడ్ థ్రిల్లర్స్ పతాకంపై అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో డా.సోమేశ్వర రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `కరణ్ అర్జున్`.ఈ చిత్రానికి రవి మేకల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24 న గ్రాండ్ గా 186 థియేటర్స్ లలో విడుదల అయిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్ టైన్మెంట్ చేసిందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:
అనాదాశ్రమంలో పెరిగే కరణ్ (నిఖిల్ కుమార్) ను దత్తత తీసుకుందామని అనితా చౌదరి, రఘు అనాదాశ్రమానికి వచ్చి కరణ్ ను తీసుకెళ్లే టైంలో తమ్మునికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ కాల్ రావడంతో రిటర్న్ వెళతారు. అప్పటి నుండి అమ్మ (అనితా చౌదరి) కోసం ఎదురు చూస్తుంటాడు కరణ్..కానీ అనితా చౌదరి రాకుండా భర్త వచ్చి కరణ్ ను తీసుకెళ్ళి బాగా చదిస్తాడు. ఆ తరువాత వృషాలి (షిఫా)తో పెళ్లి ఫిక్స్ చేయడంతో తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్ లో వున్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. అక్కడ అర్జున్ (అభిమన్యు) వీళ్ళని ఇద్దరినీ వెంబడించి షూట్ చేసి చంపాలనుకుని బందిస్తాడు . అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో నానా పాట్లు పడతారు కరణ్, వృషాలి. ఈ క్రమంలో అర్జున్ కు తెలియకుండా అక్కడ స్థానికంగా ఉండే లారీ డ్రైవర్ హెల్ప్ అడుగుతుంది వృషాలి. ఈ క్రమంలో ఆ డ్రైవర్ అర్జున్ ను కొట్టి డ్రైవర్, క్లీనర్ కలసి వృషాలిని ఎత్తుకుపోయి రేప్ చేయాలి అనుకున్న టైంలో అర్జున్ వచ్చి వారి బారి నుంచి వృశాలిని కాపాడుతాడు.అప్పటి నుండి చంపాలనుకున్న వృషాలీని అర్జున్ ఎందుకు కాపాడాడు? వృషాలిని పెళ్లి చేసుకువాలను కున్న కరణ్ ను అర్జున్ ఎందుకు బందించాడు? అసలు వీరి ముగ్గురి మధ్య వున్న రిలేషన్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే థియేటర్ వెళ్లి సినిమా చూద్దాం పదండి..
నటీ నటుల పనితీరు
తల్లిని అమితంగా ప్రేమించే కరణ్ (నిఖిల్ కుమార్) రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో చక్కగా నటించాడు.అలాగే సోషియల్ కాజ్ కోసం పనిచేసే బాధ్యత గల యువకునిగాను ,తన ప్రియురాలిని గాఢంగా ప్రేమించే పత్రాలోనూ అర్జున్ (అభిమన్యు) కూడా రెండు షేడ్స్ లో చాలా చక్కగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. అలానే హీరోయిన్ షిఫా కూడా తన అందం అభినయంతో తన పాత్రకు న్యాయం చేసిందనే చెప్పాలి . తల్లి పాత్రలో నటించిన సునీత చౌదరి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించి తన పాత్ర పరిధి మేరకు నటించింది. మిగలిన పాత్రన్నీ తమ పరిది మేర చాలా చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు మోహన్ శ్రీవత్స మహాభారతం లోని కర్ణుడు , అర్జునుడి ఎమోషన్స్ లైన్ తీసుకొని సాంకేతికంగా ఇప్పుడున్న జనరేషన్ కు తగ్గట్టు మలుస్తూ ఈ చిత్రాన్ని చాలా చక్కగా తెరకేక్కించాడు. అలాగే ఈ చిత్రంలో గుప్పెడంత మనసుకి సముద్రమంత గాయం అయితే…. చివరకు ప్రాణాలు తీసే అంత క్రూరత్వం పనికి రాదు అని చెప్పిన నీతి సూత్రం బాగుంది.ఇందులో ఒకరు అమ్మ ప్రేమ కోసం అమితమైన ప్రేమతో….పరితపిస్తే… మరొకరు అమ్మాయి మీద వున్న ఘాడ ప్రేమతో… ప్రాణాలు తీసేదాకా వెళ్ళడం మంచిది కాదని దర్శకుడు చాలా థ్రిల్లంగ్ ఎలిమెంట్స్ తో దర్శకుడు చాలా కన్వినెన్స్ గా చెప్పడం బాగుంది. ఇంటర్వల్ తరువాత నుంచి క్లైమాక్స్ దాకా ఆసక్తికరమైన ట్విస్టులతో కథ… కథనాలను నడిపించాడు. .ఈ చిత్రం లోని ప్రతి సీన్ కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తుంది. మంచి లొకేషన్స్ కొరకు పాకిస్థాన్ బార్డర్ లో ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేశారు .ప్రతి సన్నివేశం ఎవరూ ఊహించని విధంగా చాలా కొత్తగా ఉంది..నేపథ్య సంగీతం బాగుంది. సురేష్ గంగుల రాసిన సాంగ్స్ బాగున్నాయి. రాజస్థాన్ లోకేషన్స్ ని సినిమాటోగ్రాఫర్ బాగా చూపించారు. ఎడారిలో చేజింగ్ సీక్వెన్స్ బాగా చిత్రీకరించారు. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా వుంది. నిర్మాతలు డా.సోమేశ్వరరావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల,సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్ లు ఖర్చుకు వెనుకడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.ఓవరాల్ గా…మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రోడ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కరణ్ అర్జున్… సినిమాను నమ్మి థియేటర్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని నిరుత్సాహపరచకుండా అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది అని చెప్పగలను.
Cinemarangam.com.. Rating 3/5









