‘Richi gadi Pelli’ Movie Title First look launched by Heroin Aiswarya Rajesh

కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ పతాకంపై నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ నటీనటులు గా కె ఎస్ హేమరాజ్ దర్శకత్వంలో కె ఏస్ ఫిల్మ్ వర్క్స్ నిర్మిస్తున్న “రిచి గాడి పెళ్లి ” చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ ను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విడుదల చేశారు.తను విడుదల చేసిన టైటిల్ ఫస్ట్ లుక్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా

“రిచి గాడి పెళ్లి ” పేరుతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న దర్శకుడు కె.ఎస్.హేమరాజ్ మాట్లాడుతూ…*“జీవితం అంటే విభిన్న భావాల సమాహారం. వాటి వ్యక్తీకరణే మన జీవితపు దశాదిశా గమనాన్ని నిర్ణయిస్తుంది. ఈ చిత్రం మన దైనందిన జీవితాలలో భావవ్యక్తీకరణ యొక్క ప్రాముఖ్యతని నొక్కి చెప్తుంది. నటి ఐశ్వర్య రాజేష్ ఈ రోజు టైటిల్ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెకు మా కృతజ్ఞతలు. మోలీవుడ్ మరియు కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఎంతో పేరుగాంచిన సినిమాటోగ్రాఫర్ విజయ్ ఉళఘనాథ్ మరియు ఎడిటర్ అండ్ టెక్ హెడ్ అరుణ్ ఇఎమ్ ఆధ్వర్యంలో ఈ చిత్రాన్ని ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించాము. ఈ చిత్రం యొక్క మరిన్ని వివరాలను ఒక మధురమైన లవ్ బల్లాడ్ యొక్క లిరికల్ వీడియోతో పాటు ఒక్కొక్కటిగా విడుదల చేస్తాం” అని అన్నారు.

నటీనటులు
నవీన్ నేని, ప్రణీత పట్నాయక్, సత్య sk, కిషోర్ మర్రి శెట్టి, ప్రవీణ్ రెడ్డి, సతీష్ శెట్టి, బన్నీ వోక్స్, చందనరాజ్, కియారా నాయుడు, మాస్టర్ రాకేశ్ తమోఘ్నా

సాంకేతిక నిపుణులు
బ్యానర్.. కె ఏస్ ఫిల్మ్ వర్క్స్
చిత్రం – రిచి గాడి పెళ్లి
నిర్మాత – కె ఏస్ ఫిల్మ్ వర్క్స్
స్క్రీన్ ప్లే & డైరెక్షన్ కెఎస్ హేమరాజ్
సినిమాటోగ్రఫీ – విజయ్ ఉలగానాథ్
సంగీతం – సత్యన్
ఎడిటర్ – అరుణ్ EM
కథ – రాజేంద్ర వైట్ల & నాగరాజు మడూరి
సాహిత్యం – అనంత శ్రీరామ్ & శ్రీ మణి
సంభాషణలు – రాజేంద్ర వైట్ల
కళ – హరివర్మ
కొరియోగ్రాఫర్ – సతీష్ శెట్టి
డిజైన్స్ – రెడ్‌డాట్ పవన్
కాస్ట్యూమ్ డిజైనర్ – సంధ్య సబ్బవరపు
మేకప్ – అంజలి సంఘ్వీ
స్టిల్స్ – ఎంఎస్ ఆనంద్
కార్య నిర్వాహక నిర్మాతలు – రామ్ మహంద్ర & శ్రీ
సహ నిర్మాత- సూర్య మెహర్
డిజిటల్ – మనోజ్
పి.ఆర్.ఓ – మధు వి.ఆర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here