యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో , హీరో రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ హీరోయిన్గా మల్లిక్ రామ్ దర్శకత్వంలో చంద్ర శేఖర్ మొగుళ్ళ నిర్మించిన రొమాంటిక్ ఎంటటైనర్ చిత్రం అద్భుతం. ప్రముఖ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో నవంబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచి ఈ సినిమా హ్యుజ్ రెస్పాన్స్ తో ఆదరణ దక్కించుకోవడమే కాక చిత్ర విమర్శకుల ప్రశంశలు సైతం పొందుతుంది. ఈ “అద్భుతం” సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ తో దూసుకు పోతున్న సందర్భంగా “చిత్ర యూనిట్ “అద్బుతం” సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దర్శకులు ప్రవీణ్ సత్తారు, సాయి రాజేష్ , జీవిత రాజశేఖర్ లు ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు..ఈ సందర్భంగా
చిత్ర నిర్మాత చంద్ర శేఖర్ మొగుళ్ళ మాట్లాడుతూ.. .హాట్ స్టార్ వారు మాకు ఫోన్ చేసి అద్భుతం సినిమా విడుదలైన 3 రోజుల్లోనే 100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ రావడం గ్రేట్ అన్నారు .వారు చెప్పిన మాటలు నాకు ఎంతో సంతోషాన్ని కలిగించాయి.ఈ సినిమాలో నటీనటులు అందరూ చాలా చక్కగా నటించారు. దర్శకుడు మల్లిక్ రామ్ చాలా చక్కటి కథతో అద్భుతమైన చిత్రాన్ని మాకు అందించారు. అలాగే జీవిత,రాజశేఖర్ ల ఫుల్ సపోర్ట్ ఇచ్చారు.ఓటిటి లో మా చిత్రం ఇంత పెద్ద విజయం సాదించినందుకు చాలా సంతోషంగా ఉంది.మా చిత్రాన్ని ఇంకా చూడని వారుంటే చూసి మమ్మల్ని, మచిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.
హీరో రాజశేఖర్ మాట్లాడుతూ .. శివాని హీరోయిన్ గా పరిచయం కావాల్సిన “టూ స్టేట్స్” సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది నేనే నిర్మాతగా సినిమా చేయాలను కున్నాను వీలు పడలేదు కానీ అద్భుతం లాంటి మంచి సినిమాతో శివాని హీరోయిన్ గా పరిచయం అయ్యిందని మెచ్చుకుంటూ నాకు చాలా ఫోన్ కాల్స్ మెసేజ్ లు వచ్చాయి. “అద్భుతం” సినిమాతో శివాని, “దొరసాని” చిత్రంతో శివాత్మిక గర్వపడేలా చేసినందుకు సంతోషంగా ఉంది అన్నారు
జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. మా పిల్లలిద్దరికీ సినిమా అంటే ప్రాణం.వారి ఇష్టాన్ని మేము ప్రోత్సహించాము.మనం పిల్లలను కని పెంచగలము కానీ వాళ్ళ డెస్టినేషన్ ను మనం కనలేము.కోట్ల డబ్బు ఉన్నా సక్సెస్ ను ఎవరూ కొనలేం కష్టపడుతూ సక్సెస్ సాధించుకోవాలి అప్పుడే వచ్చే సక్సెస్ వెలకట్టలేనిది.ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. హాట్ స్టార్ లో విడుదలైన ఈ చిత్రం హిట్ అయ్యిననందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు
కో ప్రొడ్యూసర్ సృజన్ మాట్లాడుతూ .. డీఫ్రెంట్ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా అనుకున్నాను.కానీ మంచి సినిమా తీస్తే ఆదరిస్తారని ఈ చిత్రం ప్రూవ్ చేసింది అన్నారు.
చిత్ర దర్శకుడు రామ్ మల్లిక్ మాట్లాడుతూ .. ప్రశాంత్ వర్మ దగ్గర తీసుకుని చేసిన ఈ కథను ప్రేక్షకులనుండి హ్యుజ్ రెస్పాన్స్ వస్తుంది. తేజ సజ్జా, శివాని రాజశేఖర్ లు చాలా చక్కగా నటించారు.కథకు స్కోప్ ఉన్న ఈ సినిమాకు నిర్మాతల దగ్గరనుండి ఫుల్ సపోర్టు లభించింది. హాట్ స్టార్ లో విడుదలైన అద్బుతం చిత్రానికి హ్యుజ్ రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.హాట్ స్టార్ట్ లో మా చిత్రాన్ని విడుదల చేసినందుకు వారికి మా ధన్యవాదాలు.
హీరోయిన్ శివాని రాజశేఖర్ మాట్లాడుతూ .. నేను హీరోయిన్ గా అంగీకరించిన టూ స్టేట్స్ సినిమా ఆగిపోయింది. తరువాత మా డాడీ సినిమాలో నేను స్టూడెంట్ గా నటిస్తే మా డాడీ లెక్చరర్ గా నటించాడు.ఇందులో యమ్.యస్.నారాయణ గారి రొల్ ఇందులో 50% ఉంటుంది.కొంత షూట్ చేశాము.ఆ తరువాత ఆయన చనిపోవడంతో సినిమాను రి షూట్ చేయాలని ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.ఇలా నేను చేస్తున్న సినిమాలు ఏదో ఒక కారణం చేత ఆగిపోతున్నాయి అద్భుతం సినిమాతో నా కల నిజమైంది నా తొలిసినిమా ఓటిటి లో విడుదల అయినప్పటికీ ప్రేక్షకులనుండి మంచి మంచి స్పందన వస్తుండటంతో చాలా ఆనందంగా ఉంది అన్నారు
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ మాట్లాడుతూ ..నా కంటే ముందు మా అక్క హీరోయిన్ అయ్యి సినిమాలు స్టార్ట్ చేసింది. కొన్ని కారణాల వలన తన సినిమాలు విడుదల కాలేదు.అక్క తరువాత హీరోయిన్ అవ్వాల్సిన నేను అక్క కన్నా ముందే “దొరసాని” చిత్రం ద్వారా హీరోయిన్ అయ్యాను.అక్క నటించిన “అద్భుతం” సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్ ఫామ్ లో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.ఈ చిత్రం విడుదలైన 3 రోజుల్లోనే 100 మిలియన్స్ మినిట్స్ వ్యూస్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
మాటల రచయిత లక్ష్మీ భూపాల్ మాట్లాడుతూ. . నా డైలాగ్స్ ప్రాణం పోసిన ప్రతి ఆర్టిస్టు కు నా ధన్యవాదాలు. నటీ,నటులు అందరూ చాలా బాగా నటించారు. హాట్ స్థార్ ద్వారా విడుదలైన మా చిత్రం ఇంత గొప్ప విజయం సాదించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం ఇంకా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము అన్నారు.









