‘Shashtipoorthi’ Movie Review (Youthful Family Entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : మా ఆయి( MAA AAIE ) ప్రొడక్షన్స్
సినిమా : “షష్టిపూర్తి “
రివ్యూ రేటింగ్ : 2.75/5
విడుదల : మే 30,
నిర్మాత : రూపేష్,
కథ- స్క్రీన్ ప్లే- సంభాషణలు- దర్శకత్వం :  పవన్ ప్రభ,
నటీ నటులు : రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్షా సింగ్ ,  ‘కాంతార’ ఫేమ్ అచ్యుత్ కుమార్, సంజయ్ స్వరూప్, తెనాలి శకుంతల, ఆనంద చక్రపాణి, రాజ్ తిరందాసు, మురళీధర్ గౌడ్, ‘చలాకి’ చంటి, ‘బలగం’ సంజయ్, అనుపమ స్వాతి, రుహీనా, అనిల్, కెఏ పాల్ రాము, మహి రెడ్డి, శ్వేతా, లత, ప్రవీణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి, అంబరీష్ అప్పాజీ , ఫిరోజ్ షా  తదితరులు,
మ్యూజిక్ : మాస్ట్రో ఇళయరాజా
డి.ఓ.పి : రామ్,
ఎడిటర్ :  కార్తీక శ్రీనివాస్,
పీఆర్ఓ : పులగం చిన్నారాయణ


ప్రస్తుతం ఉన్న తరుణంలో ఓ ఫ్యామిలీ ఎమోషన్స్, కుటుంబ కథా చిత్రాలు, విలువలను చాటి చెప్పే కథల్ని నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఓ సందేశాత్మక చిత్రంగా ‘షష్టిపూర్తి’ సినిమాను రూపేశ్ నిర్మించారు. నిర్మాతగానే కాకుండా హీరోగానూ నటించారు.  నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, నటి అర్చన, ఆకాంక్ష సింగ్ ప్రధాన పాత్రల్లో ఈ చిత్రాన్ని పవన్ ప్రభ తెరకెక్కించారు. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం మే 30న విడుదల కాబోతోంది

కథ

దివాకరం (రాజేంద్రప్రసాద్), భువన(అర్చన)ల ముద్దుల కొడుకు రామ్ (రూపేష్) న్యాయం కోసం పోరాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిజాయితీగా ఉన్న తనకు ఎన్నో అడ్డంకులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండా తల్లి చెప్పిన నిజాయితీ అనే మాటకు కట్టుబడి ఉంటాడు. ఇలా సింగిల్ గా ఉన్న రామ్ కి అనుకోకుండా జానకి (ఆకాంక్ష సింగ్) అనే అమ్మాయి తన జీవితంలో కి అడుగుపెడుతుంది. ఆ అమ్మాయిని చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వారి ఊరికి వెళ్తాడు. అయితే ఆమె ఒక భూమి సమస్య ను ఎదుర్కొంటున్నట్లు చెపుతుంది. ఆమె భూమి సమస్య పరిష్కరించే క్రమంలో ఆమెకు దగ్గరైన రామ్ జానకి తో పెళ్లి ప్రపోజల్ తీసుకువస్తాడు.అయితే తనని పెళ్లిచేసుకోవడానికి కొన్ని కండిషన్స్ పెడుతుంది.అయితే అప్పటివరకు నిజాయితీగా ఉన్న రామ్ అవినీతిపరుడుగా మారడం మొదలుపెడతాడు. ఈ విషయం తెలుసుకొని కలత చెందిన తన తల్లి భువన, తండ్రి కొడుకులు  ఇద్దరు ఒకటయ్యారనే కోపంతో తమ 30 ఏళ్ల పెళ్లి బంధాన్ని కాదంటూ భర్త దివాకర్ కు విడాకులు నోటీసు పంపుతుంది. దీంతో తన తల్లి, తండ్రుల కేసు తనే వాదించే పరిస్థితి వస్తుంది. అయితే తల్లిదండ్రులు విడిపోవడానికి గల బలమైన కారణాలేమిటి ?జానకి పెట్టిన కండిషన్స్  ఏంటి? వాటివల్ల రామ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు?  విడాకుల వరకు వచ్చిన రామ్  తల్లి తండ్రుల  షష్టిపూర్తి వేడుకను ఎలా జరిపించాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా థియేటర్ కు వెళ్లి ‘షష్టిపూర్తి’ సినిమా చూడాల్సిందే..


 నటీనటుల పనితీరు
 లెజెండరి నటులైన రాజేంద్రప్రసాద్ మరియు అర్చనల ఇద్దరు ఒకరికొకరు పోటీపడి చాలా చక్కగా నటించారు. ఎమోషన్స్ సీన్స్ లలో అర్చన నటన అలరిస్తుంది. న్యాయం కోసం పోరాడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా రామ్ పాత్రలో రూపేష్ ఎంతో సహజమైన నటనతో చాలా చక్కగా నటించాడు.ఈ సినిమా ద్వారా  నటుడుగా తెలుగు తెరకు పరిచయమైన రూపేష్  కొన్ని సన్నివేశాల్లో తడబడ్డా నటనలో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా ద్వారా రూపేష్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. జానకి పాత్రలో ఆకాంక్ష సింగ్ తన గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్‌తో  అద్భుతంగా  నటించింది. ఇంకా ఇందులో నటించిన వారందరూ కూడా వారికి ఇచ్చిన పాత్రల మేరకు నటించి మెప్పించారని చెప్పచ్చు.


సాంకేతిక నిపుణుల పనితీరు
షష్టిపూర్తి అనేది తెలుగు ప్రజల సంప్రదాయం. తల్లిదండ్రులకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత జరుపుకునే వేడుకే “షష్ఠి పూర్తి”. ఇది కేవలం ఒక కుటుంబ కథ గా చూయించడమే కాకుండా తెలుగు సంస్కృతి, విలువలు కుటుంబ బంధాలను చాటి చెపుతూ తల్లిదండ్రుల ప్రేమను ను కూడా తెలియపరుస్తూ దర్శకుడు పవన్ ప్రభ చాలా చక్కగా తెర కెక్కించాడు చెప్పొచ్చు.ఇందులో కుటుంబ అంశాలతో పాటుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించారు. ఇళయరాజా గారి మ్యూజిక్‌తో సినిమా స్థాయి పెరిగింది. తండ్రి ఇళయరాజా బాటలో నడిచి సంగీత దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకున్న యువన్ శంకర్ రాజా గాయకునిగా తెలుగులో తొలిసారిగా ‘ షష్టి పూర్తి ‘ సినిమా కోసం  రాత్రంతా రచ్చే – మరి నువ్వంటే పిచ్చే , నీ మాటే నచ్చే – మది మరుమల్లై విచ్చే  పాట పాడారు. మరియు షష్ఠి పూర్తి పాట ఇలా ఇందులోని పాటలన్నీ బాగున్నాయి. మనం ఎవరో తెలియకుండానే ప్రేమించేది తల్లి,  తనకు తెలియని ప్రపంచాన్ని కూడా భుజాలపై ఎక్కించుకుని మరీ మనకు చూపించేది తండ్రి’.. అంటూ హీరో చెప్పే డైలాగ్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ రామ్ తీసిన విజువల్స్‌ బ్యూటిఫుల్‌ గా ఉన్నాయి. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్  పనితీరు బాగుంది. మా ఆయి (MAA AAIE) ప్రొడక్షన్స్ పతాకంపై   రూపేష్ నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. ఎలాంటి అహింస తావు లేకుండా మంచి ఎమోషన్స్ తో మెప్పించే  ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌  ‘షష్టిపూర్తి’. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యాపీగా చూసే సినిమా అని ఖచ్చితంగా చెప్పవచ్చు

Cinemarangam.Com    Review Rating 2.75/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here