Showrunner & writer Ravikiran Kola interview about ‘Ashoka Vanam Lo Arjuna Kalyanam’

‘రాజావారు రాణిగారు’ సినిమా ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు రవి కిరణ్ కోలా..ఈ సినిమాకు కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ పతాకంపై విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ జంటగా విద్యా సాగ‌ర్ చింతా దర్శకత్వంలో బాపినీడు, సుధీర్ ఈద‌ర‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్ చిత్రం “అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’.ఈ సినిమాకు జై క్రిష్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని మే6 విడుద‌ల చేస్తున్న‌ సందర్భంగా రవికిరణ్ కోలా పాత్రికేయ మిత్రులతో  మాట్లాడుతూ…

నేను దర్శకత్వం వహించిన “రాజా వారు రాణి గారు” సినిమాకు విద్యా సాగర్ నాతో డిఓపి గా ట్రావెల్ చేసినప్పుడు నాకు తనలో మంచి దర్శకుడు ఉన్నాడనుకొన్నాను.అందుకే నేను మ్యాట్నీ ఏంటర్ టైన్మెంట్స్ లో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ కథలో బిజీగా ఉన్నందున నేను ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ సినిమాకు కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తూ ఈ సినిమాకు  షో రన్నర్ గా ఉన్నాను.

సాధారణంగా నేషనల్ ,ఇంటర్ నేషనల్ వెబ్ సిరీస్ కు మాత్రమే షో రన్నర్స్ ఉంటారు.షో రన్నర్ అనేది మన సినిమాలకు కొత్త, ఫస్ట్ టైం షో రన్నింగ్ కాన్సెప్ట్ ను యస్.వి.సి.సి డిజిటల్ వారు తీసుకొద్దాం అనుకోని  సినిమాకు కూడా షో రన్నర్ అంటే  దర్శకత్వ పర్యవేక్షణ లాంటిది.సినిమాకి సంబంధించిన పూర్తి క్రియేటివిటీ రెస్పాన్స్ బిలిటీ ని తీసుకోవడం.

ఈ కథ విశ్వక్ సేన్ అనుకోని కథ రాయలేదు.కథ పూర్తి అయిన తరువాత కొంతమంది హీరోలతో చేద్దాం అనుకున్నా..ఆల్రెడీ వీరిని ఇలా చూద్దాం అనుకునే వారికంటే అస్సలు ఊహించని వారైతే బాగుంటుంది అని సాగర్ విశ్వక్ పెరు చెప్పడంతో ఈ క్యారెక్టర్ లో తనైతే బాగుంటాడనుకొని ఒకే చేశాము.

అల్లం కుమార్ అనే అబ్బాయికి 30 ఏళ్ళు వచ్చినా పెళ్లి కాలేదని అందరూ అంటుండడంతో సడన్ గా తన కులం కానీ, రాష్ట్రం కానీ అమ్మాయి అర్జున్ జీవితంలో ఎంట్రీ అయిన తరువాత వీరిద్దరి జీవితాల్లో ఎం జరిగింది అనేదే ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ కథ.

తెలంగాణ అబ్బాయి, ఆంధ్ర అమ్మాయి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉంటుంది..లవ్, లైఫ్ మ్యారేజ్  ఏంటర్టైనింగ్ లోనే వున్నా వేరే  ప్రాస్పెక్టివ్ లో చూయించాలని చాలా పాయింట్స్ ను టచ్ చేసుకుంటూ చాలా  సెన్సిటివ్ పాయింట్స్ ను చాలా లేయర్స్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సినిమా లో లవ్ & మ్యారేజ్ అనేది కొత్తగా చూయించాము.

ఇప్పటి వరకు లవ్ ,పెళ్లి లమీద ఇప్పటివరకు ఎన్నో వందల సినిమాలు వచ్చాయి.కానీ ఈ సినిమా అర్జున్ కుమార్ అల్లం అనే క్యారెక్టర్ ను కొత్తగా డిజైన్ చేశాము.తన  నడక, మాట,అతని తీరు, ఎమోషన్స్ ఇలా 100% ప్రతి పాయింట్ చాలా కొత్తగా చూయించాము.

ఈ మధ్య తెలంగాణ స్లాంగ్ తో సినిమాలు వస్తున్నాయి. ఇది మంచి విషయమే.. ఎందుకంటే.. ఒకే స్లాంగ్ తో సినిమా తీస్తే ప్రేక్షకులకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి అన్ని ప్రాంతాల స్లాంగ్స్ తో సినిమా తియ్యడం అనేది మంచి కల్చర్.ఇలా తియ్యడం వలన ప్రేక్షకులకు కొత్తగా ఉంటుంది.

చాలా డిఫ్రెన్స్ గా చేసిన ప్రమోషన్స్ కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము చేసిన ఫ్రాంక్ వీడియోకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే దాని వలన ఎవరికైనా ఇబ్బంది కలగలేదు.ఒక వేళ ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే సారి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము. విశ్వక్ సేన్ చాలా కూల్ పర్సన్ తనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది

చాలా హిలేరియ‌స్‌గా క్లీన్ ఫ్యామిలీ ఏంటర్ టైనర్ గా మే 6 న  ప్రేక్షకుల ముందుకు వస్తున్న ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’’. సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది.ఈ సినిమా విజయం సాధించిన తరువాత ఇది నా ఒక్కడి విజయంగా బావించను.ఈ విజయం టోటల్ టీం టీం అందరికీ చెందుతుంది.

నెక్స్ట్ మ్యాట్నీ ఏంటర్ టైన్మెంట్స్ లో పోలిటికల్ బ్యాక్ డ్రాప్ లో  చేస్తున్న సినిమాను త్వరలో షూటింగ్ స్టార్ట్ చేస్తాము., అలాగే ఓ అడ్వెంచర్స్ డ్రామా కథ కూడా ఉంది. ఇవి కాకుండా మరి కొన్ని  కథలు ఉన్నాయి.వాటి  వివరాలు త్వరలో తెలియజేస్తాను అని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here