Star Maa Super Singer Junior Grand Finale on August 28(Sunday)!

గాత్రం మీది… వేదిక మాది… వయసుతో పనేముంది ? ప్రతిభే కదా ఉండాల్సింది ! వందమందిలో అయినా ఆత్మవిశ్వాసంతో పాడగలననే ధైర్యం… శాస్త్రీయమైనా, సమకాలీనమైనా శృతి తప్పకుండా వినపించనగలననే నమ్మకం… వెరసి , మీరే సూపర్‌ సింగర్‌ !!

ఔత్సాహిక గాయనీగాయకులకు అపూర్వ అవకాశమందిస్తున్న స్టార్‌మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ పోటీలు ముగింపు దశకు వచ్చాయి. గత 13 వారాలుగా బుల్లి తెర ప్రేక్షకులను తమ అపూర్వ గాన ప్రతిభతో కట్టిపడేసిన బుల్లి గాయనీగాయకులు ఇప్పుడు టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యారు. తెలుగు టెలివిజన్‌ రంగ చరిత్రలో ఎంతోమంది సూపర్‌ సింగర్స్‌ను వెలుగులోకి తీసుకువచ్చిన స్టార్‌ మా తమ స్టార్‌ మా సూపర్‌ సింగర్‌ జూనియర్‌ పోటీల ఫైనల్స్‌ను ఈ ఆదివారం (ఆగస్టు 28)న నిర్వహించబోతుంది. పదమూడు వారాలు… 14 మంది అపూర్వ గాయనీ గాయకులతో రసవత్తరంగా జరిగిన పోటీల ఫైనల్స్‌లో ఐదుగురు పోటీపడబోతున్నారు.
ఈ ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు స్టార్‌ మా తో పాటుగా డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోయే ఫైనల్స్‌కు న్యాయనిర్ణేతలుగా విఖ్యాత గాయకులు చిత్ర, మనో, హేమచంద్రతో పాటుగా రనీనా రెడ్డి వ్యవహరించనున్నారు.

ఈ ఫైనల్స్‌కు హోస్ట్‌లుగా అనసూయ, సుధీర్‌ వ్యవహరిస్తుండగా, వెండితెర మన్మథుడు అక్కినేని నాగార్జున, హాస్య నటుడు పద్మశ్రీ బ్రహ్మానందం తో పాటుగా అమ్మ గురించి మీకు చెప్పాలి చిత్ర బృందం– కృతిశెట్టి, సుధీర్‌ బాబు, ఇంద్రగంటి మోషన కృష్ణ పాల్గొననున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here