‘Subham’ Movie Review (Horror-Comedy Entertainer)

Cinemarangam.Com
బ్యానర్ : ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్
సినిమా : ‘శుభం’
రివ్యూ రేటింగ్ : 3/5
విడుదల తేదీ : 09.05.2025
నిర్మాత : సమంత
దర్శకత్వం : ప్రవీణ్ కండ్రేగుల
రైటర్ : వసంత్ మారింగంటి
నటీనటులు : హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు.
సినిమాటోగ్రాఫర్ : మృదుల
మ్యూజిక్ & బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ : క్లింటన్ సెరెజో, వివేక్ సాగర్
సహ నిర్మాత : హిమాంక్ దువ్వూరు
క్రియేటివ్ ప్రొడ్యూసర్ : రాజ్ నిధి మోరు
పీఆర్వో: వంశీ కాకా

ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు.ఈ చిత్రంలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి, వంశీధర్ గౌడ్ తదితరులు న‌టించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “‘శుభం’. సినిమా ఎలా ఉందొ రివ్యూ లో చూద్దాం పదండి.

కథ
ఈ సినిమా మొత్తం వైజాగ్ పరిసర ప్రాంతంలో జరుగుతుంది. టీవీ సీరియల్స్ పట్ల ఉన్న వ్యామోహం కారణంగా ఇబ్బందుల్లో పడే మూడు జంటల ఫన్నీ హర్రర్ కథే “శుభం”. ..హర్షిత్, చరణ్ పెరి, శ్రీనివాస్ గవిరెడ్డి లు మంచి ఫ్రెండ్స్. అయితే హర్షిత్ మాత్రం మన కేబుల్ టీవీ ఛానల్ రన్ చేస్తూ తమ ఊరి ప్రజలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో తన ఛానల్ లో రోజుకో కొత్త ప్రోగ్రాం పెట్టి తన యాంకరింగ్ ద్వారా ఊరి ప్రజలను ఎంటర్టైన్మెంట్ చేస్తుంటాడు. ఒకరోజు హర్షిత్ కు బ్యాంక్ లో జాబ్ చేస్తున్న శ్రియ కొంతం తో మ్యారేజ్ అవుతుంది.

మ్యారేజ్ తరువాత జరిగే మొదటి రాత్రి తన భార్యతో వింత అనుభవం ఎదుర్కొంటాడు.ఈ విషయం తన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొంటాడు. కానీ ఇది తనే కాకుండా తన ఫ్రెండ్స్ కూడా ఎదుర్కొంటున్నారని తెలుసుకొంటాడు. అయితే మొదట ఇవన్నీ వారి వ్యక్తిగత సమస్యలు అని అనుకుంటారు. కానీ ఆ తరువాత కొన్ని రోజులకు తాము మాత్రమే కాదు. ఆ ఊరిలో ఉన్న మగ వాళ్లంతా కూడా ఇదేవిధమైన భయానక గందరగోళం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుంటాడు. ఈ రహస్యాన్ని ఎలా ఛేదించాలో తెలియక ఒక మాతా దగ్గరకు వెళతారు. ఆ మాతా ఎవరు? ఆ మాతా సహాయంతో వారు చేదించిన రహస్యం ఏంటి ? ఆ రహష్యం ద్వారా వారు ఎదుర్కొంటున్న సమస్యనుండి ఎలా బయటపడ్డారు అనేది తెలుసుకోవాలి అంటే కచ్చితంగా థియేటర్ కు వెళ్లి “శుభం” సినిమా చూడాల్సిందే

నటీనటుల పనితీరు
హర్షిత్ తన పాత్రలో ఎంతో సహజంగా నటించాడు ,శ్రీనివాస్ గవిరెడ్డి. చరణ్ లు క‌థ‌కు త‌గిన‌ట్టుగా త‌మ యాక్టింగ్ ప్ర‌ద‌ర్శ‌న చూపించారు.శ్రియ కొణతం, శ్రావణి లక్ష్మి, షాలిని కొండేపూడి లు కొత్తవారైనా గ్లామ‌ర్ ఆండ్ ఫ‌ర్మార్మెన్స్‌తో పాటు హార్రర్ సీన్స్ లలో అద్భుతంగా నటించాడు. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. కీలక పాత్రలో మాతా గా నటించిన (సమంతా రూత్ ప్రభు) అతిధి పాత్ర అయినప్పటికీ ఈ పాత్ర సినిమాకు టర్నింగ్ పాయింట్ అవుతుంది . ఇంకా ఇందులో నటించిన వంశీధర్ గౌడ్ తదితరులంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పచ్చు.

సాంకేతిక నిపుణుల పనితీరు :
‘శుభం’ అనేది ఒక రిఫ్రెషింగ్ మరియు వినోదాత్మక హర్రర్ కామెడీ. ఇంత వరకు తెలుగులో ఇలాంటి హారర్, కామెడీ జానర్‌లో కొత్త కంటెంట్ ఉన్న చిత్రాలు రాలేదని చెప్ప‌వ‌చ్చు .రైటర్ వసంత్ ఇచ్చిన అద్భుతమైన కథను  దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఆక‌ట్టుకునే రీతిలో ఈ త‌రం ప్రేక్షకులకు న‌చ్చే విధంగా నవ్వు, భయం ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ తో తెరపై ఆవిష్కరించారని చెప్ప‌వ‌చ్చు. వివేక్ సాగర్ అందించిన ఆకర్షణీయమైన నేపథ్య సంగీతం తో పాటు క్లింటన్ సెరెజో పాటలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తాయి. సినిమాటోగ్రాఫర్ మృదుల అందించిన విజువల్స్ బాగున్నాయి .ఎడిటర్ పనితీరు బాగుంది. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మించిన నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉన్నాయి. మొత్తం మీద “శుభం” సినిమా గురించి చెప్పాలి అంటే సెన్సిబుల్, హ్యూమర్‌తో వచ్చిన ఈ చిత్రం అందరినీ పాత కాలానికి తీసుకు వెళ్లేలా ఉంది. చిన్న ,పెద్దా అనే తేడా లేకుండా ఫ్యామిలీతో థియేటర్‌ కు వెళ్లి చూడదగిన సినిమా ‘శుభం’ అని కచ్చితంగా చెప్పచ్చు.

Cinemarangam.com   Review Rating… 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here