Home Blog Page 827

Karthikeya “90 ml” Releasing on December 6th

హీరో కార్తికేయకి `RX100` వంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త దర్శకుడు శేఖ‌ర్ రెడ్డి యర్ర తో నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ నిర్మించిన  `90 ml` ని ఈ నెల 6న విడుదల చేయనున్నారు.నేహా సోలంకిని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా ఇప్పటికే విడుదలైన పాటలకి, ప్రమోషనల్ టూర్లకి మరియు ప్రీ రిలీజ్ ఈవెంటుకి అనూహ్య స్పందన వచ్చింది.ఇక కథ విషయానికి వస్తే ఇందులో హీరో కార్తికేయ పోషిస్తున్న పాత్ర పేరు `దేవ‌దాస్‌`, ఎంబీఏ గోల్డ్ మెడ‌లిస్ట్. అంత‌టి విద్యావంతుడు ‘ఆథ‌రైజ్డ్ డ్రింక‌ర్‌’ గా ఎందుకు అయ్యాడన్న కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుంది. యూత్ కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు, కార్తికేయ డాన్సులు, డైలాగులు, ఫైట్స్ ట్రైలర్ లో కనిపించడంతో ప్రేక్షకుల్లో చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి.ఈచిత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ థియేట్రిక‌ల్ రైట్స్ ని శ్రీ వైష్ణ‌వి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థఫ్యాన్సీ ఆఫ‌ర్‌కి సొంతం చేసుకుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సర్టిఫికెట్ లభించింది. 

ఈ సందర్భంగా నిర్మాత అశోక్ రెడ్డి గుమ్మ‌కొండ మాట్లాడుతూ “90ml ని మొదట డిసెంబరు 5 న  విడుదల చేద్దాం అనుకున్నాము   కానీ , కొన్ని అనివార్య కారణాల వల్ల డిసెంబర్ 6 కి మార్చుకున్నాం. పూర్తిగా కొత్త కథ కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించే కమెర్షియల్, ఎంటర్టైనింగ్ మరియు ఎమోషనల్ అంశాలతో రాబోతుంది. మా బ్యానర్ కి పేరు తెచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం `RX100` ని మించిన హిట్ అవుతుందని మా ప్రగాఢ నమ్మకం’’ అని చెప్పారు.

పాట‌లు: చ‌ంద్ర‌బోస్‌, కెమెరా:  జె.యువ‌రాజ్‌, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖ‌ర్‌, ఆర్ట్: జీఎం శేఖ‌ర్‌, ఫైట్స్:  వెంక‌ట్‌.

Directer Sukumar launched “Play Black” Trailer

కవిత పెద్దినేని సమర్పణలో ప్రసాద్ రావు పెద్దినేని నిర్మాతగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ప్లే బ్యాక్. ఈ చిత్ర టీజర్ లాంచ్ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ…
చిన్న సినిమాలు బాగా ఆడుతున్న రోజులివి. ఈ సినిమాలో పనిచేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలువుతున్నాను. కమ్రాన్ మ్యూజిక్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది. కెమెరామెన్ బుజ్జి తక్కువ టైమ్ లో బాగా తీశాడు. నేను చెయ్యలనున్న కథ ఈ ప్లే బ్యాక్, చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. హిట్ ఆయే ఎలిమెంట్స్ అన్ని ఈ సినిమాలో ఉన్నాయి. హరిప్రసాద్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుంది అన్నారు.

డైరెక్టర్ హరి ప్రసాద్ మాట్లాడుతూ…
హీరో దినేష్ తేజ్ కష్టపడి చేశాడు, అనన్య కథ విని వెంటనే ఒప్పుకుంది. డిఫరెంట్ వెరీయేషన్స్ లో ఈ అమ్మాయి నటించింది. పెద్ద కథను కేవలం 35 రోజుల్లో పూర్తి చేశాను, అందుకు కారణం కెమెరామెన్ బుజ్జి. ఎడిటర్ నాగేశ్వర్ రెడ్డి బొంతల ఈ సినిమాను అర్థం చేసుకొని బాగా కట్ చేశాడు. టీవీ 5 మూర్తి మా సినిమాలో మంచి పాత్ర చేశాడు. సుకుమార్ నాకు తమ్ముడు, నేను సుకుమార్ 25 ఏళ్లుగా ఫ్రెండ్స్. మీడియా సపోర్ట్ తో ఈ సినిమా మరింత ఎక్కువ ప్రేక్షకులకు చేరువవుతుంది అనుకుంటున్నట్లు తెలిపారు.

టివి5 మూర్తి మాట్లాడుతూ…
నాకు హరి ప్రసాద్ చెప్పిన కథ విని థ్రిల్ ఫీల్ అయ్యాను. కొత్త కాన్సెప్గ్ తో హరి గారు మీ ముందుకు వస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని ఇలాంటి కాన్సెప్ట్స్ తోనే సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. ఆడియన్స్ ఈ పాయింట్ కు కనెక్ట్ అవుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్న అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ డీజె.రాజు మాట్లాడుతూ…
మీడియా వారికి, సుకుమార్ గారికి థాంక్స్. అందరికీ కనెక్ట్ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. మా సినిమా టీజర్ నచ్చితే మీరందరూ సపోర్ట్ చెయ్యండి. డైరెక్టర్ హరి రాసుకున్న థ్రిల్లింగ్ పాయింట్ ను కెమెరామెన్ బుజ్జి అందంగా తెరమీద చూపించారు. అనన్య, అర్జున్ కళ్యాణ్, స్పందన, ఐశ్వర్య పాండే, దీప్తి, టీవీ 5 మూర్తి, ఆనంద చక్రపాణి బాగా నటించారు. ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి బాగా కట్ చేసాడు, టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను హరి ప్రసాద్ గారు చక్కగా చూపించారన్నారు.

డైరెక్టర్ సూర్యప్రతాప్ మాట్లాడుతూ..
చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఆడుతున్నాయి. అందుకు కారణం మీడియా. అలాగే ప్లే బ్యాక్ సినిమాను కూడా మీడియా సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్న. టీజర్ బాగుంది, సినిమా అంతకంటే బాగుంటుందని నమ్ముతున్నాను. నిర్మాత ధనుంజయ్ గారికి, డైరెక్టర్ హరి ప్రసాద్ గారికి ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అన్నారు.

హీరోయిన్ అనన్య మాట్లాడుతూ…
ప్లే బ్యాక్ కథ విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు ఈ సినిమా గుర్తుండి పోతుంది. మల్లేశం సినిమా తరువాత డైరెక్టర్ హరి గారు నన్ను నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. టీజర్ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మా సినిమాకు పని చేసిన ప్రతిఒక్కరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.

హీరో దినేష్ తేజ్ మాట్లాడుతూ…
మా సినిమా టీజర్ ఫంక్షన్ కు సుకుమార్ గారు రావడం సంతోషం. నాకు డైరెక్టర్ ఫస్ట్ నరేషన్ ఇచ్చినప్పుడే నచ్చింది. నా కెరీర్ కు ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అవుతుంది అనుకుంటున్నాను. మా చిత్రంలో నటించిన అందరూ నటీనటులు, టెక్నీషియన్స్ కు థాంక్స్ తెలుపుతున్నాను. మా సినిమాకు ఆడియన్స్ సపోర్ట్ కావాలని కోరారు.

హీరో అర్జున్ కళ్యాణ్ మాట్లాడుతూ…
మా ప్లే బ్యాక్ చిత్ర టీజర్ లాంచ్ చెయ్యడానికి వచ్చిన  సుకుమార్ గారికి థాంక్స్, కొత్త కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నానని తెలిపారు.

ఎడిటర్ బొంతల నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
కొత్త కాన్సెప్ట్స్ తో సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఆ వరుసలో ప్లే బ్యాక్ సినిమా ఉంటుంది. ఎడిటర్ గా నాకు ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని భావిస్తున్నాను, నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

మ్యూజిక్ డైరెక్టర్ కమ్రాన్ మాట్లాడుతూ…
నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ హరిప్రసాద్ గారికి ధన్యవాదాలు. మ్యూజిక్ కి మంచి స్కోప్ ఉన్న సినిమా ఇది. ముఖ్యంగా రీ రికార్డింగ్ బాగా వచ్చింది. కొత్త కథ, కథనాలతో వస్తున్న ఈ సినిమా అందరికి నచ్చుతుంది అనుకుంటున్న అన్నారు.

Music Directer S.S.Thaman interview about “Venky mama”

విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న వెంకీమామ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ తమన్ మీడియాతో మాట్లాడారు.

వెంకీమామ అల వైకుంఠ పురం లో మొత్తం మీదే నడుస్తున్నట్టుంది?
… .నాదేమీ లేదు బ్రదర్ మంచి స్క్రిప్ట్ మంచి పాటలు తీసుకుంతుంది అంతే నేను చేస్తున్నావని చాలా మంచి స్క్రిప్ట్ లు.తొలిప్రేమ సినిమా తర్వాత నుంచి మీ కెరియర్ చాలా ఫాస్ట్ గా వెళుతుంది….మహానుభావుడు నుండి బ్రదర్ సరైనోడు తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది, క్రికెట్ ఆడాను,ట్రావలింగ్ చేసాను.
ఆ తరువాత చల్ మోహన్ రంగ,భాగమతి,అరవిందసమేత అలా…..

క్రిటిసిసం మీరు ఎలా తీసుకుంటారు.?
……బ్యాలన్స్ చేసుకుంటా, ట్విటర్ లో అందరికి అందుబాటులో ఉంటా,అమ్మ తిడితేనే కదా మనకు మంచి పేరు వస్తుంది. వాళ్ళ ట్వీట్ అయితే ఊరికే వెయ్యరు కదా,వాళ్ళను మ్యూజిక్ సంతృప్తి పరుస్తాను.

ఆ ట్వీట్స్ వలన మంచి మ్యూజిక్ వస్తుంది అంటారా.?
…..మంచి స్క్రిప్ట్స్ వలన మంచి మ్యూజిక్ వస్తోంది, ప్రతిరోజు పండగ రోజు,అల వైకుంఠ పురంలో,వెంకీ మామ ఇవన్నీ మంచి స్క్రిప్ట్ లు బ్రదర్.

వెంకీమామ ఎలాంటి స్క్రిప్ట్.?
…..వెంకీమామ వెరీ ఏమోషనల్ ఫిల్మ్ అండి,ఎడిటింగ్ రూమ్ లో చూసినప్పుడు నా కంట్లో తడి వచ్చింది.దాన్ని తీసుకెళ్లి నేను రీ రికార్డింగ్ చేసాను.

మీరు ఎప్పుడైనా కథలో ఇక్కడ సాంగ్ ఉండాలని డైరెక్టర్ కు చెప్తారా.?
…..మేము చెప్పం ఇలాంటి వాటికి డైరెక్టర్ నే ఫాలో అవుతాం,డైరెక్టర్ మాటను అలా ఫాలో అయిపోవడమే మంచిది.

యాక్షన్ ఎపిసోడ్ గురించి ఒక పోస్ట్ పెట్టారు?
…. యాక్షన్ ఎపిసోడ్ అయితే వెంకీ గారు కుమ్మేశారు, ఇద్దరూ అలానే చేశారు,మామా అల్లుళ్లు ఒకరితో ఒకరు పోటీపడి చేశారు,బాబీ కూడా అలానే తీసాడు.

మీరో సాంగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారా.?
….ఐ లవ్ రెట్రో సాంగ్స్ డిస్కో రాజా లో కూడా ఒక రెట్రో సాంగ్ చేసాము,బాలు గారు పాడారు.

సాంగ్ కంపోస్ చేసినప్పుడు మీకు తెలుస్తుందా ఇది హిట్ అవుతుందా లేదా అని.?
… 8000 స్టేజి షోస్ చేసాం, స్టేజి లో ఒక్క సాంగ్ కూడా బ్యాడ్ సాంగ్ పాడరు, ఈ స్టేజి కి వెళ్లిన సరే ముప్పై హిట్ పాటలే పాడుతారు, ఆ స్టేజి లో నుండి నేర్చుకుందే ఒక పాట బోరకొట్టకుండా జనాలకు ఎలా వినిపించాలి అని,అది హిట్ అవుతుందా,అవ్వదా అని అక్కడే డిసైడ్ అవుతోంది.

ఈ సినిమాలో ఎంత ఆర్టిస్టిక్ ఉంది, ఎంత కమర్షియల్ ఉంది.?
…..ఇది ఎమోషనల్ ఫిల్మ్ బ్రదర్
ఇది ఒక ఎమోషనల్ హిట్ సినిమా చూసిన వాళ్ళ అందరిని కదిలిస్తోందా.

రీమేక్ సాంగ్స్ ఈ మధ్య దూరంగా ఉన్నారు.?
…..మనకెందుకు అండి,ఆ మ్యూజిక్ డైరెక్టర్ తిట్టుకుంటాడు, లిరిక్ రైటర్ తిట్టుకుంటాడు, సింగర్ తిట్టుకుంటారు, బాలు గారు ఫోన్ చేసి మరీ తిడతారు.

ఇప్పుడు సంక్రాంతి సీజన్ స్టార్ట్ అవుతుంది అందులో మీ సినిమాలు కూడా ఉన్నాయి ఆ హీట్ ఉందా .?
……లేదు క్లైమెట్ లానే కెరియర్ కూడా చాలా కూల్ గా ఉంది కరెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాం అంతే.

సినిమా మీరు చూసి రీ-రికార్డు చేశారు కదా ఫస్ట్ హాఫ్ బాగుంటుందా, సెకండాఫ్ బాగుంటుందా.?
……మొత్తం సినిమాగా బాగుంటుంది,ఫస్ట్ ఎంటర్టైనమెంట్,సెకండాఫ్ ఏమోషన్ అంతే.

అన్ని సినిమాలు ఒకేసారి వస్తున్నాయి కదా ఏమైనా ఒత్తిడి ఫీల్ అయ్యారా.?
…… ఏమి లేదు బ్రదర్ చాలా హ్యాపీ గా ఉన్న కావలంటే నా బీపీ చెక్ చేసుకోండి.అన్ని కరెక్ట్ ప్లానింగ్ లో చేసుకున్నా.

“Mamangam” Trailer launch

భారతదేశం సంస్కృతి, సంప్రదాయాలకు పెట్టింది పేరు. మన చారిత్రిక కథలు, పురాణ గాధలు ప్రపంచం మొత్తాన్ని అబ్బుర పరుస్తూ ఉంటాయి. అలాంటి ఒక విభిన్నమైన కథ ‘మామాంగం’తోప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మ‌ళ‌యాల సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి. జమోరిన్ పాలనలో చావెరుక్కల్‌ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారిక‌ల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపిస్తున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మ‌ల‌యాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో డిసెంబర్12న విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని గీతా ఫిలిం డిస్ట్రీబ్యూట‌ర్స్ ద్వారా గ్రాండ్ గా విడుద‌ల‌వుతుంది. తాజాగా డిసెంబ‌ర్ 3న హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగిన విలేఖ‌రుల స‌మావేశంలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ విడుదల చేశారు…

ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ మాట్లాడుతూ… చ‌రిత్రలో క‌నిపించ‌ని హీరోలు ఎంద‌రో ఉన్నారు. సైరా చిత్రం కూడా అలాంటి పోరాట యోధుడి జీవిత గాధే. ఇప్పుడు వ‌చ్చే `మామాంగం` కూడా అలాంటి ఒక పోరాట యోధుడి చ‌రిత్రే. ఆయ‌న పోరు కూడా ఒక స్వాతంత్య్ర పోరాటం లాంటిదే. నిర్మాత‌లు ఎంతో వ్య‌య‌ప్ర‌యాస‌లు కూర్చి ఇంత చ‌క్క‌టి చారిత్రాత్మ‌క చిత్రం చేయ‌డం చాలా గొప్ప‌విష‌యం. ఈ చిత్రం కోసం దాదాపుగా 50కోట్లు ఖ‌ర్చు చేశార‌ని నేనే విన్నాను. న‌న్ను ఈ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేయ‌మ‌ని కోర‌గానే చాలా ఆనంద‌ప‌డ్డాను. మ‌మ్ముట్టి గురించి మీకొక విష‌యం చెప్పాలి. స్వాతి కిర‌ణం చిత్రంలో మ‌ల‌యాళ న‌టుడుని తీసుకున్న‌ప్పుడు మ‌న ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతాడు అనుకున్నాను. ఇలా తీసుకున్నారేంటి అని ఆశ్చ‌ర్య‌పోయాను. కానీ సినిమా విడుద‌ల‌య్యాక థియేట‌ర్‌లో క‌నీసం లేచి నిల‌బ‌డ‌లేక‌పోయాం అంత గొప్ప‌గా న‌టించారు. అంత గొప్ప న‌టుడాయ‌న‌. ఓ ప‌దేళ్ళ త‌ర్వాత నేను ఆయ‌న‌కు ఒక సంద‌ర్భంలో కాల్ చేశాను. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చిత్రం ఓ విల‌న్ పాత్ర ఉంది చేయ‌మ‌న్నాను దానికి ఆయ‌నఇదే మాట చిరంజీవిని అడుగుతావా అన్నారు. నేను అడ‌గ‌న‌న్నాను మ‌రి న‌న్నెందుకు అడుగుతున్నావ్ అన్నారు. ద‌ర్శ‌కుడు చాలా చ‌క్క‌గా తీశారు. ఇన్యా, ప్రాచీతెహ్లాన్ చాలా బాగా న‌టించారు. వండ‌ర్ బాయ్ అచ్యూత‌న్‌ ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా కేర‌ళ‌లోని క‌ల‌రీ అనే విద్య‌ను ప్ర‌త్యేకంగా నేర్చుకుని చాలా చ‌క్క‌గా చేశాడు. ఇంకా ఈ చిత్ర యూనిట్ అంద‌రికీ ఆల్ ద బెస్ట్“ అన్నారు.

ద‌ర్శ‌కుడు మ‌హి.వి. రాఘ‌వ‌ మాట్లాడుతూ – “ మ‌మ్ముట్టిగారు దాదాపు 400పైగా చిత్రాల్లో న‌టించారు. ఆయ‌న చిత్రాల్లో ఆయ‌న క‌నిపించ‌డు కేవ‌లం ఆయ‌న పోషించిన పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. ఆయ‌న నాతో స‌హా దాదాపుగా 80-90 మంది కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం క‌ల్పించారు. అందుకు వారంద‌రి త‌ర‌పున ఆయ‌న‌కు నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ద‌ర్శ‌కుడు ప‌ద్మాక‌ర్‌గారు ఈ చిత్రాన్ని చాలా చ‌క్క‌గా తెర‌కెక్కించారు“అన్నారు.

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ వివేక్ మాట్లాడుతూ… కావ్య ఫిలిం కంపెని త‌ర‌పున నేనిక్క‌డికి రావ‌డం జ‌రిగింది. డిసెంబర్12న నాలుగు భాష‌ల్లో ఈ చిత్రం విడుద‌ల‌వుతుంది. కేర‌ళ చ‌రిత్ర అంటే మొత్తం భార‌త‌దేశానికి చ‌రిత్ర అన్న‌ట్లే. మా చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేస్తున్నందుకు వాసుగారికి, గీత ఆర్ట్స్‌కి నా ధ‌న్య‌వాదాలు. ఈ చిత్రానికి కీర‌వాణి గారు చాలా త‌క్కువ స‌మ‌యంలో చాలా చ‌క్క‌టి సంగీతాన్ని స‌మ‌కూర్చారు“అన్నారు.

వండ‌ర్ బాయ్ అచ్యూత‌న్ మాట్లాడుతూ… నేను ఈ చిత్రం కోసం ప్ర‌త్యేకంగా క‌ల‌రి అనే విద్య‌ను నేర్చుకున్నాను. ఈ చిత్ర షూటింగ్ కోసం దాదాపుగా నేను రెండు సంవ‌త్స‌రాలు స్కుల్‌కి కూడా వెళ్ళ‌లేదు. కేవ‌లం ఎగ్జామ్స్ టైం లో మాత్ర‌మే వెళ్లి ఎగ్జామ్స్ రాసి వ‌చ్చేవాడిని. ఇది నా మొద‌టి చిత్రం. నా మొద‌టి చిత్ర‌మే మ‌మ్ముట్టి గారి లాంటి లెజెండ‌రి యాక్ట‌ర్ తో చెయ్య‌డం చాలా ఆనందంగా ఉంది. నాకు ఎంతో స‌పోర్ట్‌ని అందించిన మ‌మ్ముట్టిగారికి ప్రొడ్యూస‌ర్‌, డైరెక్ట‌ర్‌గారికి నా ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు. ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క‌రు న‌న్ను ఒక త‌మ్ముడిలా చాలా బాగా చూసుకున్నారు“అన్నారు.

నటుడు ఉన్ని ముకుందన్ మాట్లాడుతూ – ” నా కెరీర్ మమ్ముట్టి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఆయనతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. తెలుగులో ‘జనతా గ్యారేజ్’ ‘భాగమతి’ చిత్రాల్లో నటించాను. ఈ సినిమాతో మరోసారి మీ ముందుకు వస్తున్నందుకు హ్యాపీ గా ఉంది” అన్నారు.

న‌టి ప్రాచి తెహ్లాన్ మాట్లాడుతూ – “ నా డెబ్యూ మూవీ నాలుగు భాషలలో విడుదలవడం సంతోషంగా ఉంది. అలాగే మొదటి సినిమాలోనే మమ్ముట్టి గారితో నటించడం నా అదృష్టం. నాకు క్లాసికల్ డాన్స్ రాదు. కానీ ఈ సినిమా కోసం నేర్చుకొని చేయడం జరిగింది. ఈ సినిమా మొత్తం ఒక బ్యూటిఫుల్ జర్నీ” అన్నారు.

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి మాట్లాడుతూ… ఈ చిత్రం నాకు మాట‌ల్లో చెప్ప‌లేని అనుభ‌వం. ఇదొక మ్యాజిక్‌లా జ‌రిగిపోయింది. అంద‌రం చాలా ఫ‌న్నీగా షూట్ చేశాం. అంద‌రం చాలా స‌ర‌దాగా ఎంజాయ్ చేశాం. ఇదొక మంచి అనుభ‌వం. మామాంగం కేవ‌లం కేర‌ళకే మ‌హోత్స‌వం మాత్ర‌మే కాదు. మ‌న దేశం మొత్తానికి మ‌హోత్స‌వం లాంటిది. 16, 18శ‌తాబ్ధాల్లోదీన్ని ఒక పెద్ద ఉత్స‌వంలా జ‌రిపేవారు. ఎన్నో భావోద్యేగాల‌తో నిండిన‌ క‌థ ఇది. చ‌రిత్ర‌ను ఎంతో వాస్త‌వికంగా క‌ళ్ళ‌ముందు క‌ట్టిన‌ట్టు తీసుకొచ్చారు. సీజీ చాలా త‌క్కువ ఉంటుంది. ఎక్కువ‌గా సెట్ ల పైనే దీన్ని తీశారు. ఇది ప్ర‌తి భార‌తీయుడు తెలుసుకోవ‌ల‌సిన క‌థ‌. ఈ చిత్రంలోని వేసిన సెట్‌లు ఏవీ మీకు ఎక్క‌డా కూడా ఆర్టిఫిష‌య‌ల్ అనిపించ‌వు. వాస్త‌వికానికి ద‌గ్గ‌ర‌గా ఉంటాయి అన్నారు.

మమ్ముట్టి, ప్రాచి తెహ్లాన్‌,ఉన్ని ముకుందన్,మోహన్ శర్మ,అను సితార,ప్రాచీ దేశాయ్,మాళవికా మీనన్, అభిరాం అయ్యర్ తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి అడాప్టెడ్ స్క్రీన్ ప్లే : శంకర్ రామకృష్ణన్, డైలాగ్స్ : కిరణ్, డి.ఓ.పి: మనోజ్ పిళ్ళై, యాక్షన్: శామ్ కౌశల్, వి.ఎఫ్.ఎక్స్: ఆర్.సి. కమలకన్నన్, ప్రొడక్షన్ డిజైనర్: మోహన్ దాస్, ఎడిటర్: రాజా మొహమ్మద్, మ్యూజిక్: ఎం. జయచంద్రన్, బి.జి.ఎం: సంచిత్ బల్హారా & అంకిత్ బల్హారా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: వివేక్ రామదేవన్, ఆయుజో ఆంటోనీ, ప్రొడ్యూసర్: వేణు కున్నపిళ్లి, డైరెక్టర్: ఎం. పద్మకుమార్.

“Choosi choodangaane” Movie Trailer launched by D.Suresh babu

శివ కందుకూరి హీరోగా రూపొందుతోన్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ `చూసీ చూడంగానే`. ఈ చిత్రంలో శివ కందుకూరి సరసన వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫిలిమ్‌ఫేర్, జాతీయ అవార్డులను దక్కించుకుని తెలుగు సినిమాల ఘనతను చాటిన కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు `పెళ్ళిచూపులు`, `మెంటల్ మదిలో`లను నిర్మించిన టేస్ట్‌ఫుల్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి.. తనయుడు శివ కందుకూరిని హీరోగా పరిచయం చేస్తూ ధర్మపథ క్రియేషన్స్ పతాకంపై శేష సింధురావు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజ్ కందుకూరి గ‌త చిత్రాల్లాగానే ఈ చిత్రం కూడా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ అసోసియేష‌న్‌లో విడుద‌ల‌వుతుంది.

నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ గోపీసుంద‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి `మెంట‌ల్ మ‌దిలో` కెమెరా మెన్ వేద రామ‌న్ సినిమాటోగ్ర‌ఫీని అందిస్తున్నారు. డిసెంబర్ నెలలొ చివరి వారంలొ ఈ చిత్రం విడుదల కాబొతొంది.

న‌టీన‌టులు:
శివ కందుకూరి, వ‌ర్ష బొల్ల‌మ్మ, మాళవిక సతీశన్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:
డైరెక్ట‌ర్: శేష సింధు రావు

నిర్మాత: రాజ్ కందుకూరి

బ్యాన‌ర్‌: థ‌ర్మప‌థ క్రియేష‌న్స్‌

విడుదల -సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌

సంగీతం: గోపీ సుంద‌ర్‌

సినిమాటోగ్ర‌ఫీ: వేద రామ‌న్‌

డైలాగ్స్‌: ప‌ద్మావ‌తి విశ్వేశ్వ‌ర్‌

ఎడిట‌ర్: ర‌వితేజ గిరిజాల

“Iddari Lokam Okkate” Release Date

యంగ్ హీరో రాజ్‌తరుణ్, షాలిని పాండే జంట‌గా రూపొందుతోన్నల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా రూపొందుతున్న చిత్రం `ఇద్ద‌రి లోకం ఒక‌టే`. జీఆర్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది.  డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ – “మా బ్యాన‌ర్‌లో రాజ్‌తరుణ్ హీరోగా న‌టిస్తోన్న రెండో చిత్ర‌మిది. క్యూట్ ల‌వ్ స్టోరీ. యూత్‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా సినిమాను డైరెక్ట‌ర్ కృష్ణ తెర‌కెక్కించారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు పాట‌ల‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. త్వ‌ర‌లోనే మిగిలిన పాట‌లు, ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. సినిమా సెన్సార్ పూర్తయ్యింది. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 25న సినిమాను విడుద‌ల చేస్తున్నాం“ అన్నారు.
న‌టీన‌టులు:
రాజ్ త‌రుణ్‌, షాలిని పాండే, నాజ‌ర్‌, పృథ్వీ, రోహిణి, భ‌ర‌త్‌, సిజ్జు, అంబ‌రీష్‌, క‌ల్ప ల‌త త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  జీఆర్‌.కృష్ణ‌
స‌మ‌ర్ప‌ణ‌:  దిల్‌రాజు
నిర్మాత‌:  శిరీష్‌
కెమెరా:  స‌మీర్ రెడ్డి
మ్యూజిక్‌:  మిక్కీ జె.మేయ‌ర్‌
ఎడిటింగ్‌:  తమ్మి రాజు
డైలాగ్స్‌:  అబ్బూరి ర‌వి

Comedian Srinivasreddy interview about ”Bagyanagara Veedullo Gammattu”

ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబ‌ర్ 6న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌క నిర్మాత శ్రీనివాస‌రెడ్డితో ఇంట‌ర్వ్యూ…

ద‌ర్శ‌కుడిగా ఎలా? ఎందుకు మారారు?
– – త‌క్కువ బ‌డ్జెట్‌లో ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీని ప్రొడ్యూస్ చేయాల‌ని చాలా రోజులుగా అనుకునేవాడిని. అలాంటి స‌మ‌యంలో నేను చేయాల్సిన ఓ సినిమా 20 రోజుల పాటు వాయిదా ప‌డింది. ఆ స‌మ‌యంలో నాతో జ‌యమ్ము నిశ్చ‌య‌మ్మురా సినిమా చేసిన ప‌రం చెప్పిన పాయింట్ మీద క‌థ‌ను డెవ‌ల‌ప్ చేశాం. క‌థ చాలా బాగా వ‌చ్చింది. దాంతో సినిమా మా క‌మెడియ‌న్స్ గ్రూప్ ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ బ్యాన‌ర్‌లో ప్రొడ్యూస్ చేయాల‌ని అనుకున్నాను. అయితే చాలా మంది క‌మెడియ‌న్స్ వ‌స్తే కొత్త ద‌ర్శ‌కుడు హ్యాండిల్ చేస్తాడో లేదోన‌నిపించింది. అందుక‌నే నేనే సినిమాను డైరెక్ట్ చేయాల‌ని అనుకున్నాను. నేను ద‌ర్శ‌క నిర్మాత‌గా చేయ‌బోయే సినిమా గురించి మా ఆర్టిస్టుల‌కు చెప్పగానే త‌మ నుండి ఎలాంటి సాయం కావాల‌న్నా చేస్తామ‌ని అన్నారు. నేను వారికి ఎలాంటి రెమ్యున‌రేష‌న్స్ ఇవ్వ‌లేదు. ఓన్ రిలీజ్ చేస్తుండ‌టం వ‌ల్ల రిలీజ్ త‌ర్వాతే డ‌బ్బులు తీసుకుంటామ‌ని అంద‌రూ అన్నారు. అలా నేను `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు` సినిమాకు డైరెక్ట‌ర్‌గా మారాను.

మీరే ద‌ర్శ‌క నిర్మాత అన్నారుగా విమ‌ర్శ‌లు వ‌స్తాయేమోన‌ని అనుకోలేదా?
– – సినిమా ఎలాగో ఉంటుంద‌ని అనుకుని చేయ‌లేదు. ముందుగా నాకున్న నాలెడ్జ్‌లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌గ‌ల‌మ‌ని భావించి రాసుకున్న క‌థ‌. ప్రీ వ‌ర్క్ బాగా చేశాం. నేను, ప‌టేల్ అనే రైట‌ర్, ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌బ్జెక్ట్‌పై న‌మ్మ‌కంగా ఉన్నాం. ఈ క‌థ‌ను విన్న‌వాళ్లెవ‌రూ ఎందుకులే అన్నా! క‌థ‌లో అంత ద‌మ్ములేదు అనలేదు. ఇంట్లోవాళ్లకి కూడా క‌థ వినిపించాను. అనిల్ రావిపూడిగారికి కూడా క‌థ వినిపించాను. ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. జాగ్ర‌త్త‌గా చేసుకుంటే బావుంటుంద‌నే స‌ల‌హా ఇచ్చారంద‌రూ. మ‌న విజువ‌లైజేష‌న్ వేరుగా ఉంటుంది. ప్రాక్టికల్‌గా వేరుగా ఉంటుంది. అన్ని ఓ ప్రాసెస్‌లా నేర్చుకుంటూ వ‌చ్చాను. దిల్‌రాజుగారు, ట్రైల‌ర్ క‌ట్ చేసిన స‌ల‌హాలు నాకు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంత ఆర్టిస్టుల‌తో ప్రేక్ష‌కుల‌ను క‌థ‌లోకి తీసుకెళ్లడం అంత సుల‌భ‌మైన విష‌యం కాదు. ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లోగ‌మ్మ‌త్తు` చిత్రాన్ని ప్ర‌తి ఒక్క‌రూ ఎంజాయ్ చేస్తారు..ఆసాంతం ప్రేక్ష‌కులు క‌డుపుబ్బా న‌వ్వుతారు.

మెయిన్ పాయింట్ ఏంటి?
– – స‌ర్వైవ‌ల్ ప్రాబ్ల‌మ్ ఒక‌రికి, మ‌రొక‌రికి లాట‌రీ టికెట్స్ పిచ్చి ఉంటుంది. ఇలా ఎంట‌ర్‌టైనింగ్‌గా సినిమా సాగుతుంది. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన‌ చాలా విష‌యాల‌ను మా సినిమాలో ఎంట‌ర్‌టైనింగ్ వేలో చెప్పాం. ఉదాహ‌ర‌ణ‌కి శివాజీగారి ఆప‌రేష‌న్ గ‌రుడ‌వేగ ఉంది. దాన్ని శివాజీగారు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం బావుంది. దాన్ని మా సినిమాలో ఉప‌యోగించుకున్నాం. ఓంకార్‌గారి వ‌న్ మినిట్ సీన్‌ ఉంది. సృజ‌న‌, ప్రియాప్ర‌కాష్, బ్ర‌తుకు ఎడ్ల‌బ‌డ్ల‌లాంటి సీన్‌, ర‌స‌గుల్లాలాంటి సీన్స్ ఇలా ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తాయి. ఒక‌రోజులో జ‌రిగే క‌థ ఇది. దేన్ని మిస్ చేయ‌కూడ‌ద‌ని తొలి స‌న్నివేశాన్ని మా నాన్న‌గారిపై తీశాను. సినిమాను పూర్తి చేసిన త‌ర్వాత ఆయ‌న క‌న్నుమూశారు. మా ఆయ‌న‌కు డ‌బ్బింగ్‌ను మ‌హ‌ర్షి సినిమాలో రైతు పాత్ర చేసిన గురుస్వామిగారు చెప్పారు. మాద‌క ద్ర‌వ్యాల ముఠాను ఓ పోలీస్ ఆఫీస‌ర్ ప‌ట్టుకోవాల‌నుకుంటే దాంట్లోకి మేం ఎలా ఇరుక్కున్నామ‌నేదే క‌థ‌. నేను, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధానంగా న‌టించాం.

అంత మంది న‌టీన‌టుల‌ను ఎలా హ్యాండిల్ చేశారు?
– – అంద‌రూ నా స్నేహితులే కావ‌డంతో ఓ స‌న్నివేశంలో న‌టించారు. వాళ్లు కూడా కొన్ని ఇంప్ర‌వైజేష‌న్స్ చెప్పారు. అవి న‌చ్చితే చేసుకుంటూ వెళ్లాం. షాట్ డివిజ‌న్ కూడా చేశాం. హైద‌రాబాద్ సిటీలోనే ఎక్కువ షూటింగ్ చేశాం. ఓ ద‌శ‌లో ఈ క‌థలోని క్యారెక్ట‌ర్స్ రోడ్ల పైకి వ‌చ్చేస్తాయి.

ఈ క‌థ‌కు ఇన్‌స్పిరేష‌న్ ఉందా?
– – ప‌ర్టికుల‌ర్ ఇన్‌స్పిరేష‌న్ అంటూ ఏమీ లేదు. ఉదాహ‌ర‌ణ‌కు రాంగోపాల్ వ‌ర్మ‌గారి క్యారెక్ట‌ర్‌ను వెన్నెల కిషోర్‌గారికి ఇంప్లిమెంట్ చేశాం.

మీ మేన‌ల్లుడు పాత్ర ఎలా ఉంటుంది?
– – మా మేన‌ల్లుడు సుజిత్‌, ఇందులో మంచి పాత్ర‌లో క‌న‌ప‌డ‌తాడు. డ‌గ్స్ర్‌కి బానిసైన యువ‌కుడిగా క‌న‌ప‌డ‌తాడు. యూత్‌కు వెళ్లాల్సిన మెసేజ్ త‌న ద్వారానే వెళుతుంది.

ద‌ర్శ‌క నిర్మాత‌గా చేయ‌డం వ‌ల్ల మీరు సినిమాలు మిస్ అయ్యార‌ని అనుకుంటున్నారా?
– – ఆర్టిస్ట్‌, ద‌ర్శ‌కుడు, నిర్మాత రోల్స్‌లో నాకు ఆర్టిస్ట్‌గా ఉండ‌టమే ఇష్టం. ఈ సినిమా కోసం ద‌ర్శ‌క నిర్మాత‌గా మారడం వ‌ల్ల స‌రిలేరు నీకెవ్వ‌రు చేయ‌లేక‌పోయాను. అయితే మ‌హ‌ర్షి సినిమా కోసం గ్యాప్ తీసుకెళ్ళి న‌టించాను. ఆర్టిస్ట్‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఎంజాయ్ చేశాను. డైరెక్ట‌ర్‌గా నేనేం చేశాన‌నేది నాకు తెలుసు. ఆర్టిస్ట్‌గా ఎక్క‌డా ఆగే స‌మ‌స్య లేదు. ఆల్ రెడీ న‌టుడిగా నాలుగైదు సినిమాల‌ను క‌మిట్ అయ్యాను.

ప్ర‌స్తుతం న‌టుడిగా చేస్తున్న సినిమాలేవీ?
– – బాల‌కృష్ణ‌గారి `రూల‌ర్‌`లో న‌టించాను. క‌ల్యాణ్‌రామ్‌, మ‌ల్లిడి వేణు కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమాలో న‌టించ‌బోతున్నాను. మ‌రికొన్ని డిస్క‌ష‌న్స్ ఉన్నాయి. ఇక డైరెక్ట‌ర్‌గా చూస్తే.. నేను బేసిగ్గా క‌మెడియ‌న్‌ని కాబ‌ట్టి డైరెక్ట‌ర్‌గా కూడా ఆడియెన్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికే ప్ర‌య‌త్నిస్తాను.

సినిమా మేకింగ్‌లో ఎలాంటి స‌పోర్ట్ ల‌భించింది.. ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది?
– – సినిమా తెర‌కెక్కించిన త‌ర్వాతే కాదు..ముందు నుండి చాలా కాన్ఫిడెంట్‌గానే ముందుకెళ్లాం. అంద‌రూ త‌మ వంతు స‌పోర్ట్ చేశారు. ట్రైల‌ర్ చూసి రాజ‌మౌళిగారు ట్వీట్ చేయ‌డం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ట్రైల‌ర్ విడుద‌ల చేసిన వ‌రుణ్ తేజ్‌గారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమా పూర్త‌యిన త‌ర్వాత దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, మా కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఈ సినిమాను చూశారు. అంద‌రికీ సినిమా బాగా న‌చ్చింది.

Popular Hollywood Studio ,Abbey Road Studios begins political,Emotional movie“Johaar”

ధర్మ సూర్య పిక్చర్స్ పతాకంపై తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ‘జోహార్’ నిర్మాణానంతర కార్యక్రమాలలో భాగంగా అవెంజర్స్, లార్డ్ అఫ్ ది రింగ్స్, హ్యారీ పాటర్ లాంటి హాలీవుడ్ చిత్రాల రీరికార్డింగ్ జరిగిన అబ్బే రోడ్ స్టూడియోస్ లో ఈ చిత్ర మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి.

భాను సందీప్ మార్ని నిర్మిస్తున్న ఈ  చిత్ర ప్రీ లుక్ మరియు క్యారెక్టర్ పోస్టర్లకు మంచి స్పందన లభించగా, పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

 

దర్శకుడు తేజ మార్ని మాట్లాడుతూ ‘‘నేను ప్రముఖ  డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మగారి వద్ద ‘వంగవీటి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. అలాగే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌గారి వద్ద రచనా విభాగంలో పనిచేశాను. డైరెక్టర్ గా  నా తొలి చిత్రమిది.‘జోహార్’ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా రూపొందుతోన్న ఎమోషనల్ డ్రామా. షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా ప్రధానంగా ఐదు పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఐదు పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. వారణాసి, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ ప్రాంతాల్లో సినిమాను చిత్రీకరించాం ‘భైరవగీత’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన సిద్ధార్థ్ ఈ చిత్రానికి ఎడిటర్‌గా పనిచేశారు. త్రిష ‘నాయకి’,‘భైరవగీత’ చిత్రాలకు వర్క్ చేసిన జగదీశ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. చైతన్యప్రసాద్ పాటలు రాశారు. ‘రాక్షసుడు’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలకు పనిచేసిన గాంధీ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేశారు’’ అన్నారు. 

  ‘దృశ్యం’ చిత్రంలో వెంకటేశ్ కూతురిగా నటించిన ఈస్తర్ అనిల్, ‘వంగవీటి’ ఫేమ్ నైనా గంగూలీ, ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఈశ్వరీరావు, రోహిణి, శుభలేఖ సుధాకర్, చైతన్యకృష్ణ తదితరులు ఇందులో ప్రధానతారాగణం .


దర్శకుడు: తేజ మార్ని
నిర్మాత: భాను సందీప్ మార్ని
సంగీతం: ప్రియదర్శన్

ఎడిటర్: సిద్ధార్థ్
సినిమాటోగ్రఫీ: జగదీశ్
పాటలు: చైతన్యప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్‌: గాంధీ

“90 ml” Pre Release event Held Grandly in Karimnagar

ఆర్ఎక్స్ 100’ సినిమాతో హీరోగా యువతలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ ఇప్పుడు 90ML తో మనముందుకు రాబోతున్నాడు. నేహా సోలంకి హిరోయిన్ గా కొత్త దర్శకుడు  శేఖర్ రెడ్డి యర్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మించారు.

డిసెంబర్ 5న గ్రాండ్ గా విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కరీంనగర్లో ఏర్పాటు చేయగా, భారీ జనసందోహం మధ్య జే మీడియా అధినేత నరేంద్ర గారు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తదితర రాజకీయనాయకులు ముఖ్య అతిధులుగా విచ్చేయగా, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, రోల్ రైడ మరియు ఆట సందీప్ వంటి వారు ఆటలు, డాన్సులు, పాటలతో అందరినీ అలరించారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ “డాన్సులు, ప్రేమ, ఎమోషన్స్ మరియు పాటలు అన్ని అనుకున్నట్టుగా తీయడానికి సహకరించి నన్నెంతగానో సపోర్ట్ చేసిన నా హీరో కార్తికేయకి ధన్యవాదాలు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు మీకు ఎంత నచ్చాయో అర్ధమవుతుంది అందుకు కారణం, అద్భుతమైన లిరిక్స్ ని అందించిన చంద్రబోస్ గారు ట్యూన్స్ అందించిన అనూప్ రూబెన్స్ గారు. అలాగే డిసెంబర్ 5 న విడుదలయ్యే మా చిత్రం కూడా మీకు కచ్చితంగా నచ్చుతుందని నమ్ముతున్నాను” అన్నారు.

సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ “డిసెంబర్ 5 న విడుదలవ్వబోతున్న 90ML పాటలని ఎంత పెద్ద హిట్ చేశారో సినిమాని అంతకంటే పెద్ద హిట్ చేస్తారని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో చాలా హైలైట్స్ ఉన్నాయి, ముఖ్యంగా కార్తికేయ డాన్స్ ఇరగదీసాడు. కార్తికేయ అంత బాగా బాగా చేస్తాడని నాక్కూడా తెలియదు, మీరు కూడా ఇప్పటి వరకు చూసుండరు. నేహా సోలంకి ఈ చిత్రంలో హీరోయిన్ గా అద్భుతంగా నటించింది. కార్తికేయకి తనకి మధ్యన చిత్రంలో నడిచే ప్రేమ సన్నివేశాలు చాలా కొత్తగానూ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. ఫైట్స్, కామెడీతో పాటు మంచి ఎమోషనల్ సన్నివేశాలతో 90ML పూర్తి కమర్షియల్ ఎంటెర్టైనర్గా రాబోతుంది. దర్శకుడు శేఖర్ రెడ్డి గారు కథ చాలా అద్బుతంగా ప్రజెంట్ చేశారు. నిర్మాత అశోక్ రెడ్డి గారు మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు” అంటూ చాలు చాలు పాత పాడి అందరినీ అలరించారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ ” RX100 తరువాత గుణ 369, గ్యాంగ్ లీడర్ చేసాను ఇప్పుడు 90ML చేస్తున్నాను. నేను ఎన్ని క్యారెక్టర్స్ చేసినా మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం అందుకు తగ్గట్టుగా మీరు నన్ను ఆదరిస్తూ వచ్చారు అందుకు ధన్యవాదాలు. కరీంనగర్ లో ఇప్పటివరకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదన్నారు కానీ తెలంగాణాలో అతి పెద్ద ఈవెంట్ ఇక్కడే మొదలైంది, ఇక్కడే తెలంగాణా ఉద్యమం పుట్టింది. కరీంనగర్లో మొదలైన ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని నమ్ముతూ ఈ రోజు మేమిక్కడికి వచ్చాము. ఈరోజుతో మాకు పూర్తి నమ్మకమొచ్చింది, మన రాష్ట్రంలాగే మా చిత్రం కూడా విజయం సాధిస్తుంది” అని అంటూ హీరోయిన్ నేహా సోలంకి తో తెలుగులో తెలంగాణ యాసలో మాట్లాడించారు.

నేహా సోలంకి మాట్లాడుతూ ” అందరూ మంచిగున్నారా, ఫామిలీ గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అందరూ మంచిగున్నారా? 90ML ట్రైలర్ చూసిన్రా, మంచిగుందా? పాటలు ఇన్నారా, మంచిగున్నాయా, డాన్సులు మంచిగున్నాయా? నేను మంచిగున్నానా, నచ్చిననా మీకు? 90ML సినిమా RX100 కన్నా కూడా ధూంధాం ఉంటది. డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ అవుతుంది అందరూ చుస్తున్నారా, ఇంట్లో అందరినీ తీస్కపోవాలె” ఆంటూ హీరో చెప్పే తెలంగాణ వాక్యాలకి ఇంకొన్ని సరదా మాటలు కలిపి అందరినీ ఆకట్టుకున్నారు.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ “90ML ప్రమోషన్స్ లో భాగంగా మన కరీంనగర్ కి రావడం చాలా సంతోషంగా ఉంది. హీరో కార్తికేయ అన్నకి ఈ సినిమాలో రెండు పాటలు నాతో పాడించిన అనూప్ రూబెన్స్ గారికి ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత అశోక్ గారికి నా కృతజ్ఞతలు. ఈ చిత్రం ఆల్కహాల్ ని ఎంకరేజ్ చేయదు, మంచి కథ, మాటలు, కామెడీ, పాటలు మరియు ఫైట్స్ తో మాస్ మరియు క్లాస్ ప్రేక్షకులని అలరించే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. డిసెంబరు 5 న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నానంటూ” అంటూ తను చిత్రంలో పాడిన రెండు పాటలని పాడి వినిపించడమే కాక కార్తికేయతో కలిసి డాన్స్ కూడా చేశారు.