Home Blog Page 830

“MADHANAM” Trailar launched by Sukumar

శ్రీనివాస సాయి హీరోగా భావన రావు హీరోయిన్ గా అజయ్ మణికందన్ దర్శకత్వంలో కాశీ ప్రొడక్షన్స్ పతాకంపై దివ్యప్రసాద్, అశోక్ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం “మథనం”. రియలిస్టిక్ కథాంశంతో లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఇండియాలో రిలీజ్ అవకుండా ఫస్ట్ టైం యు ఎస్ లో డిసెంబర్ 6న విడుదల కావడం విశేషం..ఆ తర్వాత ఇండియాలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.  కాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిధిగా హాజరై మథనం ట్రైలర్ ని లాంచ్ చేశారు.. ఈ కార్యక్రమంలో సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి, హీరో  శ్రీనివాస సాయి, హీరోయిన్ భావన రావు, నటులు అజయ్ గోష్, రవి ప్రకాష్, సుభాష్, దువ్వాసి మోహన్, నటి హేమ, నిర్మాత దివ్య ప్రసాద్, దీప, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరామెన్ పిజి విందా, లిరిక్ రైటర్ పూర్ణచారి, తానా ప్రెసిడెంట్ సతీష్ వేముల, సెక్రటరీ రవిపోతుల, చిత్ర నిర్మాత అశోక్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.. 

బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ… అశోక్ ప్రసాద్ ప్యాషన్ ఉన్న ఎన్ ఆర్ ఐ ప్రొడ్యూసర్. ట్రయిలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. హీరో శ్రీనివాస్ సాయి ఐస్  ఎక్స్ ప్రెషన్స్ బాగున్నాయి. ఈ సినిమా యు ఎస్ లో విడుదల కావడం చాలా హ్యాపీగా ఉంది. నా సినిమా “వన్ నేనొక్కడినే” యు.ఎస్ లో బాగా ఆడింది. లేకపోతే నా కెరియర్ వేరేలా ఉండేది. కంటెంట్ బాగుంటే యు..ఎస్ ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారు.. ఈ సినిమా రియలిస్టిక్ లవ్ స్టోరీతో వస్తోంది.. మంచి సినిమా ఎప్పుడు ఫెయిల్ కాలేదు. కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది.. నిర్మాతలు దివ్య, అశోక్ ప్రసాద్ కి పెద్ద సక్సెస్ రావాలి.. అన్నారు. 

సూపర్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 15 ఏళ్ల క్రితం అశోక్ ఇండస్ట్రీలో నే ఉండేవాడు. అమెరికా వెళ్లి జాబ్ చేస్తూ.. డబ్బులు సంపాదించి ఈ సినిమా తీశాడు. సినిమా అంటే అతనికి పిచ్చి. దాంతోనే తన ఫ్రెండ్ ని డైరెక్టర్ని చేస్తూ ఒక మంచి సినిమా చేశాడు.  కొత్త పాయింట్తో ఒక మంచి ప్రయత్నం చేశారు. ఫస్ట్ టైం ఈ చిత్రం యు.ఎస్ లో రిలీజ్ కావడం విశేషం.. అన్నారు. 

తానా ప్రెసిడెంట్ సతీష్ వేమన మాట్లాడుతూ.. యు.ఎస్ లో సెటిల్ అయిన ఎన్ ఆర్ ఐస్  మన తెలుగువారు నవీన్ ఎర్నేని, అనిల్ సుంకర మంచి హిట్ చిత్రాలు తీసి సక్సెస్ ఫుల్ నిర్మాతలు అయ్యారు. వారిలాగే అశోక్ ప్రసాద్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను.. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది.. డిసెంబర్ 6న యు.ఎస్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి మా సపోర్ట్ ఉంటుంది. అక్కడ చిత్రం సెలబ్రేషన్స్ ని ఘనంగా జరపనున్నాం.. అన్నారు. 

హీరో శ్రీనివాస్ సాయి మాట్లాడుతూ.. నేను యాక్టింగ్ ఎక్కడ నేర్చుకోలేదు. అజయ్ మాస్టర్ డాన్స్ ఇనిస్టిట్యూట్ లో మిర్రర్స్ చూసుకుంటూ ఎక్స్ ప్రెషన్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకున్నాను. అప్పట్నుంచి అజయ్ గారితో పరిచయం ఉంది. కథ వినగానే చాలా ఎక్సయిట్ అయ్యాను. మేకప్ లేకుండా నాచురల్ గా ఈ చిత్రంలో నటించాం. పిజి విందా అద్భుతమైన విజువల్స్ తో ఈ చిత్రాన్ని  పిక్చరైజ్ చేశారు. అశోక్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు..సినిమా గ్యారెంటీగా హిట్ అవుతుందని మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం.. అన్నారు. 

దర్శకుడు అజయ్ మణికంధన్ మాట్లాడుతూ.. కేరళ లో పుట్టి, చెన్నైలో పెరిగి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమా తీయడం చాలా హ్యాపీగా ఉంది. నిజ జీవితంలో జరిగిన ఒక విషయాన్ని ఇన్ స్పైర్ అయి కథ రాశాను. అశోక్, దివ్యలకు స్టోరీ చెప్పాను. వారికి బాగా నచ్చింది. అప్పట్నుంచి వారిని వదలకుండా సినిమా పూర్తి చేశాను. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. అందరం కలిసి జెన్యున్ గా మంచి సినిమా చేశాం… అన్నారు. 

నిర్మాత అశోక్ ప్రసాద్ మాట్లాడుతూ.. అజయ్ ఆరేళ్లుగా ఈ కథపై వర్క్ చేశాడు. డిసెంబర్ 6న మథనం చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.  తెలుగు సినిమా హిస్టరిలో తొలిసారిగా మా సినిమాని ఇండియాలో రిలీజ్ చేయకుండా యు.ఎస్ లో విడుదల చేస్తున్నాం.  ఆ తర్వాత తెలుగు రిలీజ్ ఇండియాలో  ప్లాన్ చేస్తాం.. కోటగిరి చంటి గారి ఎడిటింగ్, పిజి విందా కెమెరా విజువల్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ గా నిలుస్తాయి.. హీరో శ్రీనివాస్, హీరోయిన్ భావన రావ్ పోటా పోటీగా నటించారు. బడ్జెట్ కి వెనకాడకుండా మంచి క్వాలిటీతో ఈ చిత్రాన్ని నిర్మించాం. అన్నారు.

Samajavaragamana from Allu Arjun’s Ala Vaikunthapurramloo garners 100 million views

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తోన్న ‘అల వైకుంఠపురంలో’ని మొదటిపాట ‘సామజవరగమన’ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటకు ఇప్పటివరకు యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. సౌత్ ఇండియాలో ఒక పాటకు ఇన్ని వ్యూస్ రావడం ఇదే ప్రథమం. రికార్డ్ స్థాయి వ్యూస్ సాధించిన తెలుగు పాటకు నెటిజన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ పాటకు లక్షల్లో టిక్ టాక్ లు చేసి ఈ పాటను భారీ హిట్ చేశారు. సుప్రసిద్ధ గేయ రచయిత శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు రచించిన ఈ గీతానికి తమన్ అద్భుతమైన ట్యూన్ అందించారు. గాయకుడు సిద్ శ్రీరామ్ పాడిన ఈ పాట ఇప్పటికీ విశేష ఆదరణకు నోచుకుంటోంది.

ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే రికార్డ్ స్థాయిలో
మిలియన్స్ లో వ్యూస్ , లక్షల్లో లైక్స్ రావడం విశేషం.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోంది.

నటీనటులు :
సౌత్ ఇండియన్ క్రేజీ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే, టబు, రాజేంద్రప్రసాద్, సచిన్ ఖేడ్ కర్, తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, సముద్ర ఖని, జయరాం, సునీల్, నవదీప్, సుశాంత్, నివేతా పేతురాజ్, గోవిందా పద్మసూర్య, కల్యాణి నటరాజన్, రోహిణి, ఈశ్వరీ రావు, శిరీష, బ్రహ్మాజీ, హర్షవర్ధన్, అజయ్, రాహుల్ రామకృష్ణ, పమ్మి సాయి నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు :
డి.ఓ.పి: పి.ఎస్.వినోద్,
సంగీతం: థమన్.ఎస్,
ఎడిటర్: నవీన్ నూలి:
ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్,
ఫైట్స్: రామ్ – లక్ష్మణ్
పీఆర్వో : లక్ష్మి వేణుగోపాల్, ఏలూరు శ్రీను
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పి.డి.వి.ప్రసాద్
నిర్మాతలు: అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు)

“ MISMATCH” cinema song released by Power Star Pavan Kalyan

‘అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న’మిస్ మ్యాచ్’ విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ ను పొందిందీ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు తెలిపారు.

‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ‘ఈ..మనసే’ పాట ను ఈరోజు విడుదల చేసారు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ ఈ సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…నా అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ గారు ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ‘ఈ మనసే’ గీతాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. నా మొదటి సినిమా ‘ఆట కదరా శివ’ సినిమా లోని గీతాన్ని గతంలో పవన్మ కళ్యాణ్ గారు విడుదల చేసి ఆశీర్వదించారు. ఆ చిత్రం నటుడుగా నాకుగుర్తింపును తెచ్చింది. ఆయన నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం ఆరోజుల్లో ఎంతో ఘనవిజయం సాధించింది. ఆ చిత్రంలోని ‘ఈ మనసే’ పాటను ఈ ‘మిస్ మ్యాచ్’ లో నాపై చిత్రీకరించటం ఎంతో సంతోషంగా ఉంది. ఒకటే షాట్ గా ఈ పాట చిత్రీకరించటం మరో విశేషం. అలాంటి ఈ గీతం పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా విడుదల అవటం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.

నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సాంగ్ రిలీజ్ చెయ్యడం హ్యాపీ గా ఉంది. ఆడియన్స్ కోరుకుంటున్న అన్ని అంశాలు సినిమాలో ఉంటాయి. సినిమా బాగా వచ్చింది. డైరెక్టర్ ఎన్.వి.నిర్మల్ బాగా తీశారు. ఉదయ్ శంకర్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ చక్కగా నటించారు. డిసెంబర్ ఆరున చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతోంది.

మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ…సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ పాట విడుదలవ్వడం సంతోషం. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.

ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: గిఫ్టన్ ఇలియాస్, కధ: భూపతి రాజా, మాటలు: రాజేంద్రకుమార్, మధు; ఛాయా గ్రహణం: గణేష్ చంద్ర; పాటలు: సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ; కళా దర్శకుడు: మణి వాసగం
దర్శకుడు. ఎన్.వి.నిర్మల్ కుమార్ .
నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్

“Entha Manchivaadavuraa”1st Single

The first single from Nandamuri Kalyanram and Satish Vegesna’s ‘Entha Manchivaadavuraa’ will be out on December 6th. Music by Gopisundar. Produced by Umesh Gupta under Aditya Music (India Pvt Ltd) & presented by Sivalenka Krishna Prasad under Sridevi Movies Banner.

“Ksheera Sagara Madhanam” First look launch

”క్షీరసాగరమథనం’ అనే అచ్చ తెలుగు పేరుతొ రూపొందిన చిత్రం మెల్లగా సందడి చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రముఖ యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేయగా- ఇప్పుడు తాజాగా… వరుస విజయాలతో దూసుకుపోతున్న మరో యువ కథానాయకుడు అడివి శేష్ ‘క్షీరసాగరమథనం’ పోస్టర్ ను లాంచ్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.

శేఖర్ కమ్ముల మొదలుకుని గౌతమ్ తిన్ననూరి వరకు పలువురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ టర్న్ డ్ ఫేమస్ డైరెక్టర్స్ లా.. సినిమా రంగంలో తనదైన ముద్ర వేయాలనే వజ్ర సంకల్పం కలిగిన ఐ.టి.రంగ నిపుణులు ‘అనిల్ పంగులూరి’ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గుండెల్నిమెలిపెట్టే గాఢమైన అనుభూతుల్నిపంచి.. పలు రకాల భావోద్వేగాలతో మనసుల్ని రంజింపచేసి.. చాలా రోజుల తరువాత మరో మంచి సినిమా చూశామనే సంతృప్తిని మిగిల్చే చిత్రాన్ని అందించనున్నామనే నమ్మకం, గర్వం మాకుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ‘క్షీరసాగరమథనం’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసి అభినందించిన అడివి శేష్ కు కృతజ్ఞతలు తెలిపారు
ఝలక్, గ్రీన్ సిగ్నల్, ప్రేమికుడు సోడా గోలిసోడా వంటి చిత్రాలలో హీరోగా నటించి తన ప్రతిభను ప్రకటించుకున్న మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అక్షిత సొనవనే హీరోయిన్. ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు.
చరిష్మా శ్రీకర్, ప్రియాంత్, గౌతమ్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న
ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్. వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసడ, ఛాయాగ్రహణం: సంతోష్ షనమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

“90 ml” Pre Release event

కార్తికేయ క్రియేటివ్ వ‌ర్స్  బ్యాన‌ర్‌లో ‌ యంగ్ హీరో  Rx100 మూవీ ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా,నేహా సోలంకి హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాత‌గా లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న “90 ml”చిత్రం రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో అజయ్ భూపతి, సందీప్ కిషన్ ముఖ్య అతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా

డైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ….

కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నాకొసమే పుట్టింది.కార్తికేయ పవర్ ఏంటో నాకు మాత్రమే తెలుసు,rx100 ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మీ హీరో నా సినిమాకి బాగా సెట్ అవుతాడని శేఖర్ రెడ్డి నాకు కాల్ చేసాడు,వెంటనే కార్తికేయ తో కలిపించి కథ వినిపించగానే ఈ కథ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు,అప్పటినుండి ఇప్పటివరకు అదే మాట మీద ఉన్నారు,అలా చాలా తక్కువ మంది ఉంటారు,శేఖర్ రెడ్డి కీ ఈ చిత్రం మంచి పేరు తీసుకు రావాలి. క్వాటర్ థియేటర్ కి తీసుకెళ్లకండి సినిమా చూసి ఇంటికొచ్చి తాగండి.డిసెంబర్ 5 రిలీజ్ అయ్యే సినిమా తప్పకుండా చూడండి అని అన్నారు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ…..

ముందుగా ఈ విషయం మాట్లాడుతున్నందుకు ఏమి అనుకోకండి నిన్న జరిగిన ప్రియాంక రెడ్డి సంఘటన నాకు నిజంగా భయం వేసింది,
ట్విట్టర్ లో ట్విట్ చేయడం తప్ప ఏమీ చేయలేమా అని బాధ పడ్డాను,ఈ రోజు టీవీ లో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గరకి వెళ్లి పోరాడిన వారిని చూసిన వెంటనే గర్వంగా అనిపించింది వాళ్లకు అభినందనలు తెలిపారు.కార్తికేయ నిజంగా ఒక తమ్ముడు లాంటి వాడు,నేను ఒకవేళ డైరెక్టర్ అయితే కార్తికేయ లాంటి హీరో తో సినిమా చేస్తాను,ఒక హీరో జనాల్లోకి వెళ్లడం కష్టం కానీ కార్తికేయ జనాల్లోకి వెళ్ళాడు. ప్రస్థానం తర్వాత నాకు ఫస్ట్ టైం కథ చెప్పిన వ్యక్తి డైరెక్టర్ శేఖర్ రెడ్డి ఆయనకి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.

రాహుల్ సిప్లిగంజ్ మాట్లాడుతూ….

ఆడియో ఫంక్షన్ లో సింగర్ కి ఇంత వాల్యూ దొరకడం హ్యాపీగా ఉంది,అనూప్ సార్ మంచి మ్యూజిక్ ఇచ్చారు,ఒక సింగర్ ఇలా స్టేజ్ పై మాట్లాడతానని ఎప్పుడు అనుకోలేదు,
ఈ సినిమా పెద్ద హిట్ అయి మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నాను.

డైరెక్టర్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ….

నేను ఇక్కడ నిలబడటానికి ముఖ్య కారణం అజయ్ భూపతి, కార్తికేయ ను దగ్గర ఉండి కథను వినిపించేలా చేసాడు,అనూప్ రూబెన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు,5 రోజుల్లోనే సాంగ్స్ అన్ని ఇచ్చేసాడు అనూప్.చంద్రబోస్ గారు ఈ సినిమాకి రంగస్థలం తర్వాత సింగిల్ కార్డ్ లిరిక్స్ రాసారు.డైరెక్షన్ టీమ్ మంచి హెల్ప్  చేసింది.పాటలు హిట్ అయినట్లే సినిమా కూడా మంచి హిట్ అవుతుంది.ఈ కథను కార్తికేయ విన్నప్పటినుండి నేను ఉన్నాను అని మంచి ధైర్యం ఇచ్చారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ…..

ఆడియో ఫంక్షన్ కి వచ్చినట్లు లేదు ఒక ఫామిలీ ఫంక్షన్ కి వచ్చినట్లు ఉంది.డైరెక్టర్ ఈ కథ కంటే ముందు వేరే ఫ్యామిలీ కథ చెప్పడానికి వచ్చారు,ఇంకొక కథ ఉందని ఉదయం,మధ్యాహ్నం,రాత్రి ఇలా మూడు సార్లు 90 వేస్తేనే బతికే డీసీజ్ ఉన్న  వ్యక్తి కథ అని చిన్న లైన్ చెప్పాడు,హీరోయిన్ ఫాదర్ ఇంట్లో మొక్కలు నాటి పక్కింటి లో నుండి మందు వాసన కూడా రాకుండా ఇంటిని చూసుకుంటూ ఉండే క్యారెక్టర్ ఆయన కూతురితో సాగె లవ్ స్టోరీ చెప్పేసరికి నాకు బాగా నచ్చి చెప్పమన్నాను ఆయన ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పారు బాగా కొన్ని రోజులు తర్వాత కంప్లీట్ కథను విన్న తరువాత నవ్వి నవ్వి కళ్ళలో నుండి నీళ్ళు వచ్చాయి.ఇది పెద్ద హీరోలు చేయాల్సిన స్టోరీని నేను చెయ్యడం చాలా హ్యాపీ గా ఉంది.మా ఫామిలీ నేను బాగుపడాలనే నాకోసం Rx100 సినిమా తీశారు,దాని తరువాత ఈ కథ నచ్చి చేస్తున్నారు.శేఖర్ రెడ్డి గారికి 12 ఇయర్స్ బ్యాక్ నుంచి ఆయనకు ఛాన్స్ వచ్చి పోయాయి ఇప్పుడు కూడా స్టార్టింగ్ లో చాలా ఇబ్బందులు వచ్చాయి ఇప్పుడు ఫైనల్ గా సెట్అయింది.నాతోపాటు శేఖర్ రెడ్డి గారికి మంచి హిట్ రావాలి.అందరూ మనస్ఫూర్తిగా ఈ సినిమా కోసం కష్టపడ్డారు,వాళ్లందరూ కష్టపడుతూ ఫైనల్ గా సినిమా హిట్ అయితే కార్తికేయ హిట్ కొట్టాడు అంటారు.నేను ఏ కేరెక్టర్ చేసిన ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు థాంక్యూ,మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి.ఈ సినిమా ఆల్కహాల్ సపోర్ట్ చేస్తుందా అని అందరికి డౌట్ ఉంది,అలా ఏమీ ఉండదు అండి, ఈ సినిమా వలన ఆల్కహాల్ తీసుకునే వారు తగ్గుతారు.హీరోయిన్ నేహా కొన్ని సీన్స్ లో భూమిక లా కనిపిస్తోంది, కొన్ని ఫ్రేమ్స్ లో ఒక్కడు,ఖుషి లో భూమిక లా ఉంటుంది,ఆమె లానే పెద్ద హీరోహిన్ అవ్వాలని కోరుకుంటున్నా మా సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

Hero tanish New movie “maha prasthanam”

తనీష్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా మహాప్రస్థానం. జర్నీఆఫ్ ఆన్ ఎమోషనల్ కిల్లర్ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. అంతకుమించి లాంటి హారర్ థ్రిల్లర్ చిత్రాన్ని రూపొందించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకులు జాని, తన రెండో చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఓంకారేశ్వర క్రియేషన్స్ మహాప్రస్థానం చిత్రాన్ని నిర్మిస్తోంది. కబీర్ దుహాన్ సింగ్, అమిత్, గగన్ విహారి, కంచెరపాలెం రాజు తదితర ప్రముఖ నటీనటులు ఇతర పాత్రల్లో నటించనున్నారు. క్రైమ్ నేపథ్యంలో హృదయానికి హత్తుకునే ప్రేమకథతో మహాప్రస్థానం సినిమా తెరకెక్కనుంది. డిసెంబర్ తొలివారం నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనుందీ సినిమా. 

         ఈ చిత్రం గురించి దర్శకుడు జాని మాట్లాడుతూ…ఇదొక యాక్షన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. కథానాయకుడి కోణంలో కథ సాగుతుంది. ఈ భావోద్వేగ ప్రేమ కథకు తనీష్ సరిగ్గా సరిపోతారు. కథానాయకుడి ప్రేమ, బాధ, కోపం సినిమా చూస్తున్న ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కథలో మనల్ని లీనం చేస్తుంది. డిసెంబర్ తొలివారం నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం. నిరవధికంగా షూటింగ్ చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాం. అన్నారు.

ఈ చిత్రానికి మాటలు – వసంత కిరణ్, యానాల శివ, పాటలు – ప్రణవం.., ఫైట్స్ – శివ ప్రేమ్,  సంగీతం – సునీల్ కశ్యప్, సిినిమాటోగ్రఫీ – MN బాల, కథా కథనం దర్శకత్వం – జాని

The Live Legends Concert Show at the Lbstadium was filled with crowds

ఈ కార్యకమానికి ముఖ్య అదితి గా తెలంగాణ గవర్నర్ తమిలిసాయి సౌదరరాజన్, IPS శిఖా గోయల్, IAS జయశ్ రంజన్, సింగర్ సునీతా మరియు పలురు సినీ గాయ‌కులు వచ్చారు.

కె.జె.ఏసుదాసు సంగీత దాసుడు. సుస్వారాల బాలుడు బాల‌సుబ్ర‌మ‌ణ్యం. తీపి రాగాల కోయిల కె.ఎస్.చిత్ర సినీ వినీలాకాశంలో ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఆ ముగ్గురు దేదీప్య‌మానంగా వెలిగే తార‌లు. ఈ ముగ్గురి అపురూప క‌ల‌యిక‌లో ఎల్‌బి స్టేడియంలో జరిగిన సంగీతం సంగ్రామం తో మారుమ్రోగింది…

ఈ కార్య‌క్ర‌మానికి వేరే వేరే రాష్ట్రాల‌నుంచి 20 మంది వాద్య బృందం పాల్గొన్నారు.

ఈ ముగ్గురు కలయికలో ఇండియా లోనే మొట్ట మొదటి సంగీతం లైవ్ కాన్ సర్ట్ కావడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు
గవర్నర్ మాట్లాడుతూ నాకు ఈ పాటలు అంటే చాలా ఇష్టం నాకంటే మా నాన్న గారికి ఇంకా ఇష్టం ఏసుదాస్ గారు సంగీతానికి దేవుడు ఇచ్చిన వరం, బాలు గారి పాటలు ఏ గాత్రం లోనియనే చాలా బాగుంటాయి, చిత్ర గారి గాత్రం మాత్రం గాన కోకిలా ఉటుంది అన్ని అన్నారు