Home Blog Page 831

Kethireddy Jagadishwara reddy about k.a.paul and rgv press release and related court orders

కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చాలా రోజుల ముందే ఈ “కమ్మ రాజ్యాం లో కడప రేడ్లు”” అనే సినిమా టైటిల్ వలన రీలీజ్ వివాదంలో      చిక్కుకు0టు0దని ..కేవలం పబ్లిసిటీ హైప్ కొరకు టైటిల్ అప్పటి వరుకు  ఉపయోగపడుతుందని …..సెన్సార్ కులాల పేరుతో కమ్మ ,రెడ్డి లతో ఉన్న టైటిల్ ఇవ్వరని ఇటీవల వచ్చిన “వాల్మీకి “అందుకు ఉదాహరణనని,వర్మ వాల్మీకి లాగా ఒక రోజు ముందు టైటిల్ మార్చి ఉంటే సినిమా రీలిజ్ అయ్యివుండేదని,ఒక డిస్క్లైమార్ తో సరిపోయేదని ,సెన్సార్ యాక్ట్ సెక్షన్ 21 ప్రకారం కోర్టు నందు వివాదం ఉంటే సినిమా కి సర్టిఫికెట్ ఇవ్వకూడదు అని రూలు చైపుతుందని ,ఆ రూలుకి విరుద్ధంగా “సైరా”సెన్సార్  అప్పుడు అధికారులు నడుచుకోవటం జరిగింది కాబట్టి మేము ఈ విషయం ను కోర్ట్ మరియు ముంబై సెన్సార్ కేంద్ర కార్యాలయంతో పాటు,సి.బి.ఇ. అధికారుల దుష్టికి కూడా తీసుకురావటం జరిగిందని. అప్పటినుంచి ఇప్పుడు కచ్చితంగా అధికారి ఆ చట్టాన్ని  పాటించుచున్నారని…ఇది ఒక సామాజిక అంశం గా తీసుకుని సెన్సార్ “”అమ్మ రాజ్యాంలో కడప బిడ్డలు “” టైటిల్ సెన్సార్ మార్చినప్పటికి..కోర్టు ఆదేశాలు లేకుండ సెన్సార్ ఆ చిత్రం ను చూడడం జరగదని,వర్మ కోర్ట్ లో ఒక నా సినిమాలో ప్రపంచ శాంతి దూత కె.ఏ .పాల్ పాత్ర లేదని ఒక డిక్లరేషన్ ద్వారా తెలిపితే రిలీజ్ అయ్యిపొయ్యేదని , ఇప్పుడు   కె.ఏ. పాల్ కేస్ తుది తీర్పు వచ్చు వరకు సెన్సార్ చూసిన కూడ  సర్టిఫికెట్ హోల్డ్ లో పెట్టుకోవటం తప్పనిసరి అని,కాలం గడిచేకొద్దీ పోస్టర్స్ రోడ్ మీద వేశారు కాబట్టి సగటు ప్రేక్షకుడు దుష్టిలో ఇది ఒక వచ్చి పోయిన సినిమా అని అనుకొనే ప్రమాదం ఉందని ,అసలే రాజకీయ వేడి లేనప్పుడు రిలీజ్ అవ్వుతున్న సినిమా కదా..ఈ సినిమా రీలిజ్  కాకుండా  ఉండాలని (చంద్రబాబు రూపంలో) కోరుకొంటు దీని వెనుక సినీరంగంలోనీ కొందరు పెద్దలు బాగా పనిచేయుచున్నారని .కె.ఏ
పాల్ సమస్య చాలా చిన్న సమస్య అని కేతిరెడ్డి తెలిపారు ,కె.ఏ.పాల్ ఆరోపణ లకు  సంభందించి కొన్ని రీసెంట్ జడ్జిమెంట్స్ “”లక్మిస్ ఎన్టీఆర్..ల్లక్మిస్ వీరగ్రంధం ..సైరా నరసింహా రెడ్డి లలో తెలంగాణ కోర్ట్ ఇచ్చిన  జడ్జిమెంట్స్  దీనికి ఆధారమని.ఓక సినిమా సెన్సార్ అయ్యిన ఆపు హక్కు ఒక్క రాష్ట్ర ప్రభుత్వల చేతిలో ఉంటుంది శాంతిభద్రతలు, ఇరు కులాల మధ్య ,మతాల మధ్య ఘర్షణ లు వస్తాయి అని అనిపిస్తే చిత్ర విడుదల తరువాత కానీ ముందు అనుమానం ఉంటే పోలీస్ చూసే వరకు విడుదల కష్టం, కాకపోతే కోర్ట్  కె.ఏ.పాల్ కి సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత తననూ కించపరిచే విధంగా ఉంటే ఈ కోర్ట్ కి తీరిగిరావచ్చు అని తెలపటం జరుగుతుందని.లేకపొతే పరువునష్టం దావా వేసుకోవచ్చుని.సినిమా అనేది ఖర్చు పెట్టి తీసుతారు కాబట్టి ..అంతే కాకుండా దర్శకుడు కి భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుందని,మన రాజ్యాంగ0 అది కళలకు ఇచ్చిన స్వేచ్ఛ ని  కె.ఏ. పాల్  గాని ఇతరులు ఎవ్వరెన కానీ ప్రస్తుతానికి రీలిజ్  డిలే చేయవచ్చు కానీ ఇప్పుడు పాల్.వర్మ  నాలుగు రోజులు టి.వి లలో డిబేట్ ల పేరుతో పబ్లిసిటీ పొందుటకు మరియు టీవీ వారికి ఒక గంట ,రెండు గంటల సందడికి కారకులు అవ్వుతారు,అసలే వార్తలు లేక టి.ఆర్.పి లు తగ్గిన నేపథ్యనికి ఉపయోగపడే ఒక వేదిక ప్రస్తుతనికి ఈ సినిమా  ఆనీ  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తెలిపారు.

”KALIYUGA” Pre release Event

రాజ్, స్వాతి దీక్షిత్ జంటగా, తిరుపతి దర్శకత్వంలో.. బాలాజీ సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై, నటుడు సూర్య (పింగ్ పాంగ్) నిర్మించిన సినిమా ‘కలియుగ’. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హీరో సూర్య మాట్లాడుతూ…
కలియుగ సినిమాలో యాక్షన్, లవ్, సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి. నన్ను సపోర్ట్ చేస్తున్న రవీందర్ గారికి, శాస్త్రి గారికి థాంక్స్. అలాగే నన్ను వెనక ఉండి నడిపిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారికి ధన్యవాదాలు. 24 శాఖల వారు నన్ను సపోర్ట్ చేశారు. సామాన్య ప్రేక్షకులను ఆలోచింపజేసే సినిమా కలియుగ. సినిమా మీ అందరికి నచ్చుతుందని, తప్పకుండా సినిమా థియేటర్ లో చూడమని తెలిపారు.

హీరో సత్యదేవ్ మాట్లాడుతూ…

ఈ సినిమాలో పనిచేసిన ప్రతివక్కరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమాను తీసిన సూర్యకు అభినందనలు. సూర్య భవిషత్తులో ఇలాంటి మరెన్నో సినిమాలు నిర్మించాలని కోరుకుంటున్న. మ్యూజిక్ డైరెక్టర్ సునిల్ కశ్యప్ మంచి పాటలు ఇచ్చాడు. డిసెంబర్ 6న విడుదల కానున్న ఈ సినిమాను మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని భావిస్తున్నానని తెలిపారు.

హీరో రాజ్ మాట్లాడుతూ..

ఈరోజు మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చి మమ్మల్ని సపోర్టు చేస్తున్న మీ అందరికి థాంక్స్. సూర్య భవిషత్తులో ఇలాంటి సినిమాలు మరిన్ని చెయ్యాలి. విశ్వ, శాంతి బాగా నటించారు. డైరెక్టర్ గోపి గణేష్ గారి సహకారం మరువలేనిది. డైరెక్టర్ తిరుపతి గారు సినిమాను బాగా తీసాడు అన్నారు.

తాగుబోతు రమేష్ మాట్లాడుతూ…

సూర్య కథను నమ్మి ఈ సినిమా తీశాడు. కచ్చితంగా ఈ సినిమా పేరుతో పాటు మంచి డబ్బు తెచ్చిపెడుతోంది. అందరూ టెక్నీషియన్స్ , ఆర్టిస్ట్స్ కష్టబడి ఈ సినిమా చేశారు. మంచి సినిమాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను అన్నారు.

డైరెక్టర్ తిరుపతి మాట్లాడుతూ…

అందరికి నమస్కారం. రెగ్యులర్ కథలు పక్కన పెట్టి సమాజంలో జరుగుతున్న సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథ రాసుకున్నాను. సినిమా చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఈ మూవీకి కనెక్ట్ అవుతారు. షూటింగ్ సమయంలో సూర్య సపోర్ట్ మరువలేనిది. మా చిత్ర సాంగ్ ను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. మా చిత్రానికి పనిచేసిన అందరూ సాంకేతిక నిపుణులకు థాంక్స్. శశి, స్వాతి ఈ సినిమాలో బాగా నటించారన్నారు.

Anup Rubens interview

ఇష్క్‌’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘మనం’ వంటి చిత్రాలతో సంగీత దర్శకుడిగా తనకంటూ ఓ గుర్తింపు సాధించుకున్నారు అనూప్‌ రూబెన్స్.కార్తికేయ క్రియేటివ్ వ‌ర్స్  బ్యాన‌ర్‌లో ‌ యంగ్ హీరో కార్తికేయ, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు యెర్రా శేఖర్ రెడ్డి దర్శకత్వం వ‌హిస్తున్నారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాత‌గా లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 90 ఎం.ఎల్..  డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా  సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మీడియాతో మాట్లాడారు

ఈ చిత్రంలో మొత్తం ఎన్ని పాటలున్నాయి.?

6 పాటలు, ఒక బిట్ సాంగ్ ఉన్నాయి. అన్నీ మాస్ సాంగ్స్ ఉంటాయి, కార్తికేయ బయట ఎలా ఉంటాడో దర్శకుడు శేఖర్ రెడ్డి ఈ చిత్రంలో అలాగే చూపించారు.

ఈ చిత్రంలో సంగీతానికి మంచి స్కోప్ ఉందా. ?

ఈ సినిమాలో సాంగ్స్ కి స్కోప్ చాలా ఉంది అలాగని పాటల నిడివి ఎక్కువ ఉండదు, దర్శకుడు కథని అలా మలిచారు. నేను రెండు మూడు మాస్ సినిమాలు చేసాను కానీ ఇది దానికి పూర్తి భిన్నంగా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.

ఈమధ్యలో మీ కెరీర్?

ఈమధ్య కాలంలో నేను అనుకున్నవి కొన్ని జరగలేదు, పెద్ద ప్రాజెక్ట్స్ కొన్ని అనుకున్నట్టుగా అవ్వలేదు కానీ నా చేతిలో ఏమి లేదు, సమయం వచ్చినపుడు ఏది అలా జరగాలో అది జరుగుతుంది అని నమ్ముతున్నాను.

దర్శకుడు పూరి గారి తో మీ జర్నీ ఎలా ఉంది?

ఆయన తో నాకు ముందునుండి మంచి అనుబంధం ఉంది, రెగ్యులర్ గా మాట్లాడటమే కాక అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఆయన ఒక డైరెక్టర్ గా కంటే మంచి వ్యక్తి గా నాకు బాగా ఇష్టం, పరిచయం.

వెబ్ సిరీస్ కి ఏమైనా పని చేస్తున్నారా.?

ప్రస్తుతానికి ఎలాంటి వెబ్ సిరీస్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏదైనా ఆసక్తికరమైన ప్రాజెక్ట్ వస్తే తప్పకుండా చేస్తాను.

నితిన్ తో కొత్త చిత్రం ఏమైనా చేస్తున్నారా.?

హీరో నితిన్ తో చిత్రం ఉంటుంది, త్వరలోనే అనౌన్స్ చేస్తాను.

ఒక చిత్రానికి పని చేసేటప్పుడు కథని దృష్టిలో పెట్టుకుంటారా? హీరోని దృష్టిలో పెట్టుకుంటారా?

ముందుగా కథని ఆ తరువాత హీరోని దృష్టిలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎక్కువసార్లు హీరోని బట్టి అతనికున్న క్రేజ్ ని బట్టి కూడా సంగీతం మార్చేయాల్సి ఉంటుంది.

సంగీత దర్శకుల మీద మీద రెండు ఫిర్యాదులుంటాయి, ఒకటి విదేశీ మ్యూజిక్ కాపీ కొడతారని, అలాగే కొట్టిన ట్యూన్లే మళ్ళీ మళ్ళీ కొడతారని, మీరేమంటారు ?

ప్రతీ సంగీత దర్శకుడిలో ఒక స్టైల్ ఉంటుంది. మేము ఇచ్చిన ఒక 100 ట్యూన్స్ లో ఐదు ట్యూన్ లు ఎక్కడో టచ్ అవుతాయి అది కాపీ కాదు, మక్కీ కి మక్కీ దించడం తప్పు.
అలా దించడంలో అసలు మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభ ఏముంటుంది.

ప్రస్తుతం ఇంకేవైనా సినిమాలు చేస్తున్నారా?

కన్నడ లో ఒక సినిమా చేస్తున్న, తెలుగులో కొన్ని డిస్కషన్ లు జరుగుతున్నయి. త్వరలోనే పూర్తి సమాచారం అందిస్తాను.

ఈ సినిమాకి ప్లస్ లు చెప్పండి?

నేను చేసాను అని కాదు గాని సంగీతంతో పాటు వైవిధ్యమైన కథ, కార్తికేయ డాన్సులు, కామెడీ ఈ చిత్రానికి బాగా ప్లస్ అవుతాయి అనుకుంటున్నాను.

“ARJUN SURAVARAM” Sucess Meet

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. బి.మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ..
అర్జున్ సురవరం సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. మొదటి ఆటనుండి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మా చిత్ర యూనిట్ అందరూ ఈ సక్సెస్ తో హ్యాపీగా ఉన్నాము. నిర్మాత  ఠాగూర్ మధు గారు, రాజ్ కుమార్ గారు రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, సంతోష్ టేకింగ్ ఇలా అందరి ఎఫర్ట్ తో సినిమా అన్ని ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తోంది. కొంత గ్యాప్ తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చినా సరే ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. సినిమాలో ఉన్న మెసేజ్ కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మెయిన్ హైలెట్ అయ్యింది. లావణ్య ఈ సినిమాలో మరో మంచి రోల్ చేసింది. ఈ క్యారెక్టర్ ను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆమెకు థాంక్స్, సినిమా చూడనివారు చూడండి, మిమ్మల్ని అర్జున్ సురవరం తప్పకుండా ఎంటర్టైన్ చేస్తాడన్నారు.

చిత్ర నిర్మాత రాజ్‌కుమార్‌ అకెళ్ల మాట్లాడుతూ…
చాలా సమస్యలను అధిగమించి ఈ సినిమాను రిలీజ్ చేశాము. సినిమా బాగుందని అందరూ అంటున్నారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కు ధన్యవాదాలు. ఈ సక్సెస్ నాకు మరిన్ని సినిమాలు చెయ్యడానికి బూస్టప్ ఇచ్చిందని అన్నారు.

చిత్ర దర్శకుడు టి.సంతోష్‌ మాట్లాడుతూ..
తెలుగులో నా తొలి చిత్రమిది. మమ్మల్ని సపోర్ట్‌ చేస్తున్న ఆడియన్స్ కు థ్యాంక్స్‌. చాలా మంది నన్ను అడిగారు అర్జున్ సురవరం అంటే ఏంటి? అని అర్జున్ అంటే క్లీన్. ఈ సినిమాలో అర్జున్ క్యారెక్టర్ క్లీన్, ప్యూర్ రిపోర్టర్. సురవరం అనేది సీనియర్ జర్నలిస్ట్ సురవరం ప్రతాప రెడ్డి గారి ఇన్స్పిరేషన్ తో తీసుకోవడం జరిగింది. అలాగే మా నిర్మాతలు మధు, రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు, షూటింగ్ సమయంలో వారి హెల్ప్ సపోర్ట్ మరువలేనిది. నిఖిల్, లావణ్య సినిమాకు మెయిన్ హైలెట్. నిఖిల్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మర్చిపోలేనిదన్నారు.

హీరోయిన్ లావణ్యా త్రిపాఠి మాట్లాడుతూ..
సినిమా బాగుందని అందరూ అంటుంటే హ్యాపీగా ఉంది.  ఈ ఏడాది విడుదలవుతున్న నా మొదటి తెలుగు సినిమా ఇంత సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నేను మూవీలో పార్ట్ అయినందుకు ముందుగా నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులందరికి అభినందనలు తెలిపారు.

న‌టీన‌టులు:
నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి, వెన్నెల‌కిషోర్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, త‌రుణ్ అరోరా, నాగినీడు, స‌త్య‌, విద్యుల్లేఖా రామ‌న్ త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: టి.సంతోష్‌
స‌మ‌ర్ప‌ణ‌: ఠాగూర్ మ‌ధు
నిర్మాత‌: రాజ్‌కుమార్ అకెళ్ల‌,
సంగీతం: సామ్ సి.ఎస్‌,
సినిమాటోగ్ర‌ఫీ: సూర్య‌,
ఎడిట‌ర్: న‌వీన్ నూలి.

“CHEEMA -PREMA MADHYALO BHAAMA! Audio launch

సృష్టి లోని ఒకానొక అత్యంత అల్ప ప్రాణి అయిన చీమ మనిషిగా మారాలని మనసు పడుతుంది! అంత వరకు బాగానే ఉంది – మరి అది సాధ్యమా ? ఏం జరుగుతుంది ? అసలు ఆ భావన ఎలా ఉంటుంది ? పైగా దానికి ప్రేమ, శృంగారం తోడైతే… అది ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలే “చీమ – ప్రేమ మధ్యలో భామ! ” సినిమా. మాగ్నమ్ ఓపస్ (Magnum Opus ) ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకం పై శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు దర్శకత్వం లో ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న చిత్రం “చీమ – ప్రేమ మధ్యలో భామ !”. అమిత్ మరియు ఇందు హీరో హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్ ప‌నులు పూర్తి చేసుకుని ఈ రోజు ఆడియోని ఫిలింఛాంబ‌ర్‌లో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో…

దర్శకుడు శ్రీకాంత్ “శ్రీ” అప్పల రాజు మాట్లాడుతూ ” చీమ – ప్రేమ మధ్యలో భామ!” ఈ సినిమా గురించి ఎంత చెప్పినా త‌క్కువే. మా సినిమాకి చీమే క‌థ‌. జ‌గ‌మంతా రామ‌మ‌యం మా సినిమా అంతా చీమ మ‌యం. ఈ సినిమాలోని పాట‌లు అన్నీ చాలా బాగా వ‌చ్చాయి. ఇక్క‌డ‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికి నా కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

నిర్మాత ఎస్ ఎన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ” మా చిత్రం లో చీమ ప్రధాన ఆకర్షణ. గ్రాఫిక్స్ చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా కొత్తవాళ్లతో చిత్రీకరించినా ఖర్చుకి వెనకాడకుండా నిర్మించాము. రవి వర్మ గారు అందించిన సంగీతం మరియు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం, గీతా మాధురి గార్లు పాడిన పాటలు చాలా బాగున్నాయి. మంచి సంగీతంతో పాటు సాహిత్యాన్ని కూడా చూడ‌వ‌చ్చు. ద‌ర్శకుడు కొత్త‌వారైనా సినిమాని ఎలా చెప్పారో అలానే తెర‌కెక్కించారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు, సింగ‌ర్ ర‌వివ‌ర్మ మాట్లాడుతూ ” మా గురువుగారు ఎస్‌.పి. బాలుగారు ఆయ‌న ఇన్‌స్పిరేష‌న్‌తోనే నేను సింగ‌ర్‌ని అయ్యాను.  ఈ సినిమా చేస్తుండ‌గా నాకు మా ద‌ర్శ‌కుడు సంగీత నిరంకుశ అని బిరుదును కూడా ఇచ్చారు. హైమ‌త్ కూడా ఒక పాట‌ను రాశారు. చాలా బాగా రాశారు. మిగ‌తా లిరిసిస్ట్‌లంద‌రూ కూడా చాలా బాగా రాశారు. చిన్న సినిమా అంద‌రూ త‌ప్ప‌కుండా చూసి ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

సింగ‌ర్ గీతామాధురి మాట్లాడుతూ… ఈ సినిమాలో పాడేందుకు నాకు ఇంత మంచి అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌కనిర్మాత‌ల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు. వ‌ర్మ‌గారు నాకు ఇన్స్‌పిరేష‌న్‌. నేను ఈ చిత్రంలో పాడిన పాట చాలా క్యాచీగా ఉంటుంది. ఈ చిత్రంలో పాడిన మిగిలిన సింగ‌ర్స్ కూడా చాలా బాగా పాడారు. అలాగే నిన్న‌టి నుంచి నాకు చాలా డిస్ట్ర‌బింగ్ గా ఉంది. ప్రియాంక‌రెడ్డి ఇష్యూ అంద‌రి మ‌న‌సుల‌ను క‌ల‌చివేసింది. ఒక ఆడ‌పిల్ల‌గా చాలా బాధ‌గా ఉంది. అంతే కాక ఒక ఆడ‌పిల్ల త‌ల్లిగా భ‌యంగా కూడా ఉంది. ద‌య‌చేసి ఆడ‌పిల్ల‌లు ఏమ‌న్నా సేఫ్టీగా మార్ష‌ల్ ఆర్ట్స్ లాంటివి నేర్చుకోవాలి. అస‌లు సేఫ్టీగా ఉండాల‌న్న‌ది మ‌న భార‌త‌దేశంలో ఉండ‌కూడ‌ద‌న్న‌ది నా ఆశ అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో డిస్ట్రిబ్యూట‌ర్ బాపినీడు. డిఒపి సింగ‌ర్స్ చిత్ర యూనిట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

“RAJAVAARU RANIGAARU” Heart touching movie

Movie name:-”RAJAVAARU RANIGAARU”
Release:-Suresh Productions
Banner:-Sl entertainment
Starring :-kiran abbavaram,Rahasya Gorakh,Rajkumar kasi reddy,yazurvedam gurram.
Director : Ravikiran kola
Producer :-Manovikas.d
Music Director : Jaykrish
Cinematography:-Amar deep,Vidya sager.

ఎస్ఎల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై డి. మ‌నోవికాస్ నిర్మిస్తున్న చిత్రం రాజావారు రాణిగారు. ర‌వికిర‌ణ్ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోకిర‌ణ్ అబ్బావ‌ర‌మ్‌, ర‌హ‌స్య‌గోర‌క్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 29న సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ ద్వారా విడుద‌ల‌వుతుంది.

ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను విడుదల చేస్తుందంటే అటు ప్రేక్షకులకు మంచి వినోదంతోపాటు,ఇటు దర్శక,నిర్మాతలకు,మంచి వసూళ్లను, మంచి పేరుని తీసుకొస్తుంది అని చెప్పొచ్చు,అలాంటి సినిమానే ఈ రాజావారు-రాణిగారు

కథ:
రాజా (కిరణ్ అబ్బవరపు) అనే ఒక మాములు కుర్రాడు, నిజ జీవితంలో అందరి కుర్రాళ్లు లాగానే రాణి (రహస్య గోరక్) అనే అమ్మాయి తో ప్రేమలో పడతాడు.కానీ తన ప్రేమను రాణి తో చెప్పడానికి లోలోపల ఒక రకమైన భయంతో ఉంటాడు.తన ప్రేమను రాణి తో చెప్పే టైం కి ఊరు విడిచి వెళ్ళిపోతుంది,మళ్ళీ రాణి ఊరు వచ్చిందా.?
తనని ఊరు రప్పించడానికి రాజా ఎటువంటి ప్రయత్నం చేసాడు.?
వీటన్నింటి మధ్యలో నాయుడు,చౌదరి అనే ఇద్దరు స్నేహితులు రాజా ప్రేమ విషయంలో ఎటువంటి సాయం చేశారు.?
రాజా తన ప్రేమను రాణి కి చెప్పడానికి ఎలా ప్రయత్నించాడు.?
రాజా ప్రేమ విషయంలో అతని తండ్రి ఎలాంటి సపోర్ట్ చేసాడు.?
రాణి అసలు రాజా ప్రేమని ఒప్పుకుంటుందా.?
ఇలాంటి విషయాలు అన్నింటినీ సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:—-
దర్శకుడు ఒక మాములు కథను తీసుకుని మనసుకి హత్తుకునేలా తీసాడు,సినిమాని చూస్తున్నంతసేపు మన బాల్య జ్ఞాపకాల లోనికి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు,మన స్నేహితులు,మన చుట్టూ ఉండే మనుషులు,మనం చూసిన ప్రేమలు,మనం దాటొచ్చిన రోజులు,మనం మర్చిపోలేని అనుభూతులు వీటన్నింటినీ ఒక మూట లా కట్టి వెండితెరపై పరిచేసాడు.సినిమాని చూస్తున్నంతసేపు థియేటర్ లో కూర్చున్నాం అనే ఫీలింగ్ రాకుండా ఆ ఊరి మధ్యలో కూర్చోబెట్టేస్తాడు,సినిమాలో చేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తుండే పాత్రలను రాసాడు దర్శకుడు రవికిరణ్,నాయుడు,చౌదరి పాత్రలు అయితే మనకు కితకితలు పెడుతూ సినిమాలో రాజా కి మాత్రం మేము ఉన్నాం అనే భరోసా ఇస్తాయి.ఈ సినిమా సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడితే విద్యాసాగర్,అమర్ దీప్ నిజంగా ఒక విలేజ్ ఎక్సపీరియన్స్ ని క్రియేట్ చేశారు.ప్రతీ సీన్ ని ప్రతీ షాట్ ని చాలా అందంగా తీర్చిదిద్దారు,ఈ సినిమా కి సంగీతం ఊపిరిపోసింది అని చెప్పొచ్చు జై క్రిష్ అద్భుతమైన పాటలు తో పాటు,అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు.నటీనటులు పెరఫార్మన్స్ విషయానికి వస్తే పాత్రలో జీవించారు అని చెప్పోచ్చు.మొత్తానికి ఇది ఫ్యామిలీ తో అందరూ కలిసి చూసి ఎంజాయ్ చెయ్యాల్సిన చిత్రం.

Rating:-Cinemarangam.com: 3/5

Veerashastha “AYYAPPA KATAKSHAM” AUDIO LAUNCH

“ఇద్దరు కిలాడీలు”చిత్రం తో తెలుగు తెరకు పరిచయమై గతనాలుగు,దశాబ్దాలుగా,తెలుగు,తమిళ్,కన్నడ,మలయాళం భాషల్లో నటుడిగా,హీరో గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఎవర్ గ్రీన్ హీరో సుమన్. “వీర శాస్త్ర అయ్యప్ప కటాక్షం”  చిత్రం తో తను 100 వ సినిమా పూర్తి చేసుకొంటున్నారు.100 క్రోర్స్ అకాడమీ-వరాంగి మూవీస్ సంయుక్తంగా ఎవర్ గ్రీన్ హీరో సుమన్ హీరోగా ఏ.జ్యోతి, రమాప్రభ, ఆకెళ్ళ, చలపతి, మాస్టర్ హరీంద్ర, అశోక్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో రుద్రాభట్ల వేణుగోపాల్ దర్సకత్వంలో ప్రముఖ రచయిత,ఆధ్యాత్మికవేత్త,వి.ఎస్.పి.తెన్నేటి ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు సమకూర్చడంతో పాటు టి.ఎస్. బద్రీష్ రామ్ తో కలిసి నిర్మిస్తున్న చిత్రం “వీర శాస్త్ర అయ్యప్ప కటాక్షం” ఈ చిత్రం యొక్క అడియో లాంచ్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా నిర్మాతలు లగడపాటి శ్రీధర్,రాజ్ కందుకూరి,సి.కళ్యాణ్ మరియు చిత్ర యూనిట్ పాల్గొన్నారు.అనంతరం

నిర్మాత సి..కళ్యాణ్ మాట్లాడుతూ….

నేను ఆయన ఫస్ట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాను.,వాళ్ళ అమ్మ గారు శాలరీస్ తో పూర్ స్టూడెంట్స్ ఫీజ్ లు కట్టేవారు,ఆయనకి ఆమె మంచి వ్యక్తిత్వమే వచ్చింది.నేను 39 సార్లు శబరిమలై వెళ్ళాను,సుమన్ గారి 100 వ సినిమాకి ట్రైలర్ లంచ్ చేయడం నాకు అయ్యప్ప స్వామి నాకు ఇచ్చిన అదృష్టం.ఇప్పుడు హీరో గా ఆయన చేసిన 100 వ సినిమాకు ఆయనతో కలిసి ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది,ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు.

నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ…

సుమన్ గారు 100 వ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది,డైరెక్టర్ గారు మంచి మ్యూజిక్ అందించారు,టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ చెబుతూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని అన్నారు.

నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ…..

లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక గుడిలోనికి వచ్చిన ఫీలింగ్ కలిగింది,సుమన్ గారు 100 వ సినిమా చేయడం ఆయన అదృష్టం, నేను ఇక్కడికి రావడం నా అదృష్టం.సుమన్ గారిది మంచి హెల్పింగ్ నేచర్ నేను గౌతమ్ బుద్ధ సినిమా చేస్తున్నప్పుడు ఒక రోల్ చేయాలి అని అడిగినప్పుడు వెంటనే చేసారు,ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు

వి.యస్.పి తెన్నేటి మాట్లాడుతూ…..

నేను 37 వ సారి ఈ మాలను ధరించాను,ఈ సినిమా ద్వారా చెప్తున్న విషయం ఏంటి అంటే శుభం పలకమని,నేను కథ,స్క్రీన్ ప్లే,మాటలు,పాటలు రాశాను అంటే నాకు రుద్రాభట్ల వేణుగోపాల్ అనే గొప్ప దర్శకుడు ఉండటం వలనే,నాకు సుమన్ గారితో నాకు 15 ఏళ్ల అనుబంధం ఉంది,నా ఫోన్ లో మై స్వీట్ హీరో అని సుమన్ గారి పేరు ఉంటుంది.ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు.

హీరో సుమన్ మాట్లాడుతూ….

ఈ డిసెంబర్ వస్తే సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 సవంత్సరాలు అవుతుంది,8 భాషల్లో సినిమాలు చేసాను,తమిళ్ నుంచి నేను తెలుగు సినీ పరిశ్రమకి రావడానికి కారణం నా మిత్రుడు భానుచందర్ ముఖ్య కారణం,హీరో గా 99 సినిమాలు చేసాను అక్కడితో ఆగింది,తర్వాత రాఘవేంద్రరావు గారు గంగోత్రి సినిమాలో తండ్రి కేరెక్టర్ ఇచ్చారు,ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసాను,నేను హీరోగా 99 సినిమాలు చేయడమే గొప్ప అనుకుంటే ఇప్పుడు 100 వ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది.సుమన్ అయిపోయాడు అనుకున్న ప్రతిసారీ మళ్ళీ బ్యాక్ అయ్యాను అంతా ఆ దేవుడి ఆశీర్వదాం,ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది,సుమన్ 100 వ సినిమా అంటే ఎవరు మర్చిపోనీ విదంగా ఉంటుంది. చాలా విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి ఇక్కడికి వచ్చిన సి.కళ్యాణ్ గారికి మిగతా ప్రముఖులుకు కృతజ్ఞతలు.

దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ మాట్లాడుతూ…..

వి.యస్.పి తెన్నేటి గారు మార్గ దర్శకత్వంలో నేను దర్శకత్వం చేసాను,తెన్నేటి గారు ప్రజలకు గుర్తుండిపోయే లిరిక్స్ ని అందించారు,మ్యూజిక్ డైరెక్టర్ వి.యస్.యల్ జయ్ కుమార్ అధ్బుతమైన స్వరాలు అందించారు,ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది.సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ, కృతజ్ఞతలు అని తెలిపారు.

“Prathi Roju Pandaage” Song Coverage

సుప్రీం హీరో సాయి తేజ్ హీరోగా, మారుతి దర్శకుడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాస్ నిర్మాతగా, గ్లామర్ డాల్ రాశి ఖన్నా హీరోయిన్ గా రూపొందిస్తున్న భారీ చిత్రం “ప్రతిరోజు పండగే” ఈ చిత్రాన్ని డిసెంబర్ 20న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని మైండ్ బ్లోయింగ్ డాన్స్ నెంబర్ సాంగ్ అన్నపూర్ణ స్థూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్లో చిత్రీకరణజరుపుకుంటోంది . ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ అద్భుతమైన థీమ్, కలర్ ప్యాట్రన్ లో సెట్ వేశారు. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమంచిన ఈ ఎనెర్జిటిక్ సాంగ్ కోసం సెన్సేషనల్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నృత్య రీతులు సమకూరుస్తున్నారు. శ్రీ జో ఈ పాటకు సాహిత్యం అందించారు. నవంబర్ 30 రాశి ఖన్నా పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…

నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ :-గీతాఆర్ట్స్, యూవీ క్రియేషన్స్ కలిసి గతంలో ‘భలే భలే మొగాడివోయ్’ సినిమా తీశాం. అది బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది. దాని తర్వాత మళ్ళీ అదే టీమ్ కలిసి చేస్తోన్న చిత్రం ‘ప్రతి రోజు పండగే’. దర్శకుడు మారుతికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ఒక సినిమాని ఎక్కడా బోర్ కొట్టకుండా తీసుకెళ్లే నేర్పరి తనం ఉండే బహుకొద్ది మందిలో మారుతి ప్రధమ శ్రేణిలో ఉంటారు. ఈ సినిమా కథ ముఖ్యంగా ఎన్ ఆర్ ఐ గురించి చెప్పిన స్టోరీ. ఇక్కడ ఉన్న వారితో కనెక్ట్ కాకుండా ఎలాఇబ్బందిపడుతున్నారు అనేది ఈ సినిమాలో చూపించారు. చాలా కాలం నుండి సాయితో సినిమా చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు కుదిరింది. అలాగే రాశితో కూడా అలానే కుదిరింది. రాశి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. తనతో 2020 లో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాం” అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – ” భలే భలే మొగాడివోయ్ చిత్రంతో ఈ రెండు బేనర్స్ ని కలిపాను. అరవింద్ గారి ప్రొడక్షన్ లో సినిమా తీస్తున్నప్పుడు ప్రతి షాట్ కి ఇది అరవింద్ గారి సినిమా వొళ్ళు దగ్గర పెట్టుకొని తీయాలి అనే భాద్యత అరవింద్ గారు మాకు కనపడక పోయినా ఆయన ఇన్ఫ్లుయన్స్ మాత్రం మా అందరిలో ఉంటుంది. నాకు వొచ్చిన ఒక థాట్ ను అరవింద్ గారు ఇచ్చిన నమ్మకంతో ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్లగలిగాను. గీతా ఆర్ట్స్ లో ఎన్నో మంచి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వచ్చాయి. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ ఫిలిం ప్రతి రోజు పండగే. ఈ సినిమాకి సత్యరాజ్ గారు ప్రాణం పోశారు అని చెప్పొచ్చు. అలాగే రవిశంకర్ గారు ఈ సినిమాని ప్రేమించి సత్యరాజ్ గారికి వాయిస్ ఇవ్వడం జరిగింది. ప్రతి టెక్నీషియన్ ఈ సినిమాను ఓన్ చేసుకొని వర్క్ చేశారు. వంశి, వాసు పర్ఫెక్ట్ గా నన్ను జడ్జ్ చేస్తూ వచ్చారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు.
జయ కుమార్ విజువల్ కొత్తగా ఉంటాయి. రాశి సింపుల్ గా ఉండే బబ్లీ అమ్మాయి క్యారెక్టర్ ప్రతి ఒక్కరికీ ఆమె క్యారెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఈరోజు తో సాంగ్ పూర్తియింది. డిసెంబర్ 20 న సినిమా రిలీజ్ అవుతుంది. అన్ని ఏజ్ గ్రూప్ ల వారు ఎంజాయ్ చేస్తారు. ఫుల్ మీల్స్ భోజనం లా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ గా ఉంటూనే మంచి మెసేజ్ కూడా ఉంటుంది” అన్నారు.

థమన్ మాట్లాడుతూ – ” చాలా హార్ట్ టచింగ్ స్క్రిప్ట్. మారుతి ఈ సినిమాతో వెరీ బిగ్ హిట్ ఇవ్వబోతున్నాడు. సినిమా మంచి మ్యూజిక్ కోసం హంగ్రీ గా ఉంది. సినిమా బాగుంటే కానీ మంచి మ్యూజిక్ అడగదు. అలాగే మంచి ఆర్ ఆర్ కుదిరింది. మారుతి ఈ కథ చెప్పనప్పుడే మమ్ములనందరిని కదిలించింది. మారుతి ఈ సినిమా ద్వారా తేజ్ కి నాకు పెద్ద సక్సెస్ ఇవ్వబోతున్నందుకు హ్యాపీ గా ఉంది. అందరిని ఎమోషనల్ గా కదిలిస్తుంది సినిమా. ఈ అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, మారుతి గారికి ధన్యవాదాలు” అన్నారు.

రాశి ఖన్నా మాట్లాడుతూ – ” ఈరోజుతో షూటింగ్ పూర్తయింది. ప్రతి సినిమా షూటింగ్ అయిపోగానే అందరం బాధపడతాం. కానీ ఈ సినిమాకి అందరం హ్యాపీ మోడ్ లో ఉన్నాం. ఈ సినిమా నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. యూవీ లో జిల్ సినిమా చేశాను. చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. అలాగే ఎప్పటినుండో గీతా ఆర్ట్స్ లో వర్క్ చేయాలి అనుకుంటున్నా ఇప్పుడు కుదిరింది. మారుతి గారు చాలా క్లారిటీ తో తీశారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరికి కనెక్ట్ అవుతుంది. సాయి నైస్ కో స్థార్” అన్నారు.

సాయి తేజ్ మాట్లాడుతూ – “గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో ఎప్పటినుండో సినిమా చేయాలి అనేది నా కోరిక. వారిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ‘ప్రతి రోజు పండగే’. అరవింద్ గారు నేను ఇండస్ట్రీ కి వచ్చినప్పటినుండి సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. చాలా మంచి సినిమా. ప్రతి ఒక్కరూ నా క్యారెక్టర్ తో కనెక్ట్ అవుతారు. అలాగే సత్యరాజ్ గారి క్యారెక్టర్ కూడా మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. థమన్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. రాశి క్యారెక్టర్ ఫన్నీ గాఉంటుంది. మారుతి గారి స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ జయ కుమార్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. ఇంతమంది ఆర్టిసులని కలిపి ఒక మంచి సినిమా తీసిన మారుతి గారికి థాంక్స్. రేపు మా సినిమా నుండి మూడో పాట విడుదలవుతుంది. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నా” అన్నారు.

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ – ” భలే భలే మొగాడివోయ్ తర్వాత గీతా ఆర్ట్స్ , యువి క్రియేషన్స్ లో నేను చేస్తున్న సినిమా. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకి థాంక్యూ” అన్నారు.

నటీనటులు:

సాయి తేజ్, రాశి ఖన్నా, సత్యరాజ్, విజయ కుమార్, రావ్ రమేష్, మురళీ శర్మ, అజయ్, ప్రవీణ్, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, సత్య శ్రీనివాస్, సుభాష్, భరత్ రెడ్డి, గాయత్రీ భార్గవి, హరితేజ, మహేష్, సుహాస్ తదితరులు

సాంకేతిక వర్గం

రచన, దర్శకత్వం – మారుతి
సమర్పణ – అల్లు అరవింద్
ప్రొడ్యూసర్ – బన్నీ వాస్
కో ప్రొడ్యూసర్ – ఎస్.కె.ఎన్
మ్యూజిక్ డైరెక్టర్ – తమన్ .ఎస్
ఎడిటర్ – కోటగిరి వెంకటేశ్వర రావ్ (చంటి)
ఆర్ట్ డైరెక్టర్ – రవీందర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ – బాబు
డిఓపి – జయ కుమార్
పీఆర్ఓ – ఏలూరు శ్రీను
పబ్లిసిటీ డిజైనర్ – అనిల్ భాను