Cinemarangam.com
రివ్యూ రేటింగ్ : 3 /5
బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా
టైటిల్ : “వేయి శుభములు కలుగు నీకు”
నిర్మాత : తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్
నటినటులు : విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు.
కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి
కెమెరా : కె బుజ్జి
సంగీతం : గ్యాని
ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్
కో డైరెక్టర్ : ప్రకాష్
కాస్ట్యూమ్ : ఎల్ . కిశోరె కుమార్
ఎడిటర్ :వినోద్
పి.ఆర్.ఓ : హర్ష
జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నూతన సంవత్సర శుభా కాంక్షలు తో జనవరి 7న ఎంతో గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఎంటర్ టైన్ చేసిందో రివ్యూలో చూద్దాం పదండి

కథ
నారాయణది (శివాజీ రాజా) సాధారణ మధ్య తరగతి కుటుంబం. తన కొడుకు చైతన్య కృష్ణ (విజయ్ రాజా)ను చదివిస్తూ కిరాయి ఇంట్లో ఉంటాడు. నారాయణ కు సొంత ఇంట్లో ఉండాలి అనేది కల. నారాయణ ఫ్రెండ్స్ అందరూ కలసి చైతన్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసే టైం లో ఇంటి ఓనర్ వచ్చి కిరాయి కట్టలేదని గొడవ పడతాడు.ఈ గొడవలో ఇంటి ఓనర్ నారాయణను ఇంట్లో నుండి గెంటేయగా నారాయణకు హార్ట్ అటాక్ వస్తుంది. నారాయణ నువ్వు సొంత ఇల్లు కొన్న తర్వాతే పెళ్లి చేసుకోవాలని చైతన్య దగ్గర మాట తీసుకుని చనిపోతాడు. చైతన్య కృష్ణ (విజయ్ రాజా) పెద్ద అయిన తరువాత ఒక చానల్ లో ఫియర్ ఫీయర్ ప్రోగ్రామ్స్ లో డైరెక్టర్ గా వర్క్ చేస్తూ తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం తన దాచుకున్న డబ్బుతో హైదరాబాద్ ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తుంటాడు. .మరో వైపు దివ్య (తమన్నా వ్యాస్),చైతన్యలు ప్రేమలో వుంటారు.దివ్య తల్లి తండ్రులు శ్రీకాంత్ అయంగార్, మీనా కుమారిలు దివ్యకు పెళ్లి చేయాలని ఎన్ని సంబంధాలు చూసినా రిజెక్ట్ చేస్తూ..త్వరగా పెళ్లి చేసుకుందామని చైతన్య ను అడుగుతుంది. అయితే చైతన్య మాత్రం ఇల్లు తర్వాతే పెళ్లి అని చెప్తాడు. చైతన్య ఇల్లు కొంటాడు. అయితే కొందరు నువ్వు కొన్న ఆ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పినా తను నమ్మడు. కానీ.. ఇల్లు కొన్న మరుసటి రోజు నుండే చైతన్యను కష్టాలు మొదలవుతాయి.ఆ ఇంట్లో ఉన్న అదృశ్య శక్తి ఇల్లు నాది ఈ ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మని బయపెడుతూ ఇంటికొచ్చిన ఫ్రెండ్స్ ను కొడుతూ భయపెడుతోంది.దీంతో ఎంతో ఇష్టంగా కొన్న ఇంటిని అమ్మకానికి పెడతాడు. అసలు ఆ ఇంటిలో ఉన్న అదృశ్య శక్తి ఎవరు ? ఎందుకు ఆ ఇంటిని ఖాళీ చేయమంటుంది. ఆ ఇంట్లో ఉన్నది దెయ్యమేనా.. తన ఇంటి కల కలగా మిగిలిపోయిందా..చైతన్యను వచ్చిన ప్రొబ్లెంస్ నుండి బయట పడ్డాడా.. ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు
చైతన్య కృష్ణ (విజయ్ రాజా) పాత్రలో క్యారెక్టర్ కు కావాల్సిన ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో లవర్ బాయ్ పాత్రలోనూ డ్యాన్స్, ఫైట్స్ అన్ని కూడా సీనియర్ నటుడులా చక్కగా నటించి మెప్పించాడు కీలక సన్నివేశాల్లో తన ఎమోషన్స్ కి తగ్గట్లుగా సహజమైన నటనతో ఆకట్టు కున్నాడు.హీరోయిన్ తమన్నా వ్యాస్ దివ్య క్యారెక్టర్ లో చాలా మంచి పెర్ఫార్మన్స్ చేసింది.నటి జ్ఞాన ప్రియా సరయు పాత్రలో దెయ్యం గా నటించి అందరినీ బయపెట్టింది.నెగిటివ్ క్యారక్టర్ లో కధ కీలక మలుపు తిరిగే ఉదయ్ పాత్ర లో (వెంకట్ నారాయణ)చాలా మంచి క్యారక్టర్ చేసాడు, సీనియర్ నటులు షాయాజి షిండే రియల్ ఎస్టేట్ బిల్డర్ పాత్రలో, దివ్య తల్లి తండ్రులుగా శ్రీకాంత్ అయంగార్, మీనాకునారి బాగా నటించారు.అలాగే హీరో ఫ్రెండ్ గా నటించిన సత్యం రాజేష్ కామెడీ, మరియు జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ కామెడీ బాగుంది. ఇంకా ఈ చిత్రంలో నటించిన తదితర నటీ నటులంతా వారికిచ్చిన పాత్రలలో నటించి మెప్పించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు
దర్శకుడు రామ్స్ రాథోడ్ సెలెక్ట్ చేసుకున్న ఈ కథ రెగ్యూలర్ స్టోరీ అయినా కొత్తగా ప్రజెంట్ చేశాడు. కొత్త దర్శకుడైనా అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తెరకెక్కించారు. హీరో కారెక్టర్ బాగా రాసుకుని విజయ్ రాజాను కొత్తగా చూపించాడు. లవ్, ఎమోషనల్ సీన్స్ సినిమాకి ప్లస్ పాయింట్స్.. హార్రర్, థ్రిల్లర్స్ తెలుగులో చాలానే వచ్చాయి కాబట్టి అదే ఛాయలు ఇందులో కనిపించాయి. కథలో ట్విస్టులు బావున్నాయి డైరెక్టర్ అనుకున్న పాయింట్ ని ప్రేక్షకుడికి రీచ్ అయ్యేలా పకడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకుని.. కథ.. కథనాలను నడిపించి విజయం సాధించాడు.సంగీత దర్శకుడు గ్యాని మ్యూజిక్ బాగుంది. “నువ్వు సూపరే నేను సూపరే నువ్వు నేను ఒక్కటైతే ఇంక సూపరే” అనే పాట హైలెట్ గా నిలుస్తుంది. బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. సినిమాటో గ్రాఫర్ కె.బుజ్జి పనితీరు బాగుంది. సీన్స్ రిచ్‌గా అనిపిస్తాయి. జయ దుర్గ దేవి మల్టీ మీడియా బ్యానర్ పై ఈ సినిమాను ఏక్కడా రాజీపడకుండా నిర్మాత తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు లు నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.ఈ “వేయి శుభములు కలుగు నీకు” సినిమాను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేయచ్చు.
Cinemarangam.com..Rating.. 3/5









