‘TFCC-Nandi South India Film Awards 2020-22’ in collaboration with Telangana Government

సినీ పరిశ్రమకు కొత్త వారిని పరిచయం చేస్తూ… టాలెంట్‌ ఉన్న వారికి గుర్తింపునివ్వడంలో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఎప్పుడూ ముందుంటుంది. సినీ పరిశ్రమలోని నటీ నటులతోపాటు వివిధ శాఖలలో పనిచేసే ప్రతిభావంతులకు ‘టీఎఫ్‌సీసీ- నంది అవార్డ్స్‌’ ద్వారా గుర్తింపును ఇవ్వనుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా 10,000 మంది సభ్యులతో టీఎఫ్‌సీసీ కొనసాగుతుంది. టిఎఫ్‌సీసీ నిర్వహించే ‘టీ ఎఫ్‌సీసీ-నంది అవార్డ్స్‌’ కార్యక్రమం వచ్చే ఉగాది పండుగ రోజున భారీ స్థాయిలో నిర్వహించనుంది.

ఈ సందర్భంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైౖర్మన్‌ డా॥ పతాని రామకృష్ణగౌడ్‌ మాట్లాడుతూ..‘  తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ -నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22’ ఉగాది రోజున నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి సంబంధించి బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌,   మలయాళం హీరో మోహన్‌లాల్‌, కన్నడ స్టార్‌, హీరో యష్‌ మరియు మెగాస్టార్‌ చిరంజీవి గార్లను కలిసి ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై,  ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. టీఎఫ్‌సీసీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ వంతు సహకారాన్ని అందజేస్తామని వారు చెప్పారు.   విశేష ఆధరణ పొందిన తెలుగు, తమిళ్‌, మలయాళం మరియు కన్నడ భాషా చిత్రాలకు ఈ అవార్డ్స్‌ అందజేయడం జరుగుతంది. టీఎఫ్‌సీసీ నిర్వహిస్తున్న ‘టీఎఫ్‌సీసీ-నంది సౌత్‌ ఇండియా ఫిలిం అవార్డ్స్‌ 2020-22’ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం సహకారం మరియ మరింత తోడ్పాటును అందజేయాలని ఇటీవల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరు కావాలని కోరడం జరిగింది. టీఎఫ్‌సీసీ ఎప్పడూ  తెలుగు చిత్రపరిశ్రమకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. చిత్ర పరిశ్రమలో విశిష్ఠ సేవలందించే వారిని సత్కరించుకుంటుందని’ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here