TFJA Diary, Insurance, and ID Cards Launched by Megastar Chiranjeevi

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.

ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది.

అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు. ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది.

తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ ₹5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here